ఎవరు అశుద్ధులు

| సాహిత్యం | క‌విత్వం

ఎవరు అశుద్ధులు

- గీతాంజ‌లి | 04.10.2016 11:12:24pm

ఓరీ అశుద్దుడా..
కాశ్మీర్ నుంచి తెలంగాణ భూమి దాకా...
యుగాలూగా... ఖండాలు.. తీరాలు స‌ముద్రాలూ
దాటుతూ నీ మ‌లాన్ని నెత్తికెత్తుకున్నా
బుక్కెడు మెతుకుల కోసం
నీ మ‌లాన్ని బువ్వ తినే వేళ్ల‌తో ఎత్తాను

మ‌నిషిగా నీ లాగే భూమ్మీద ప‌డ్డ‌వాణ్ణి
కానీ పుట్టాక ముందే నేను నీ మ‌లాన్ని
ఎత్తాల‌ని నిర్ణ‌యం జ‌రిగిపోయింది

అందుకే నువ్వు మ‌మ్మ‌ల్ని దోచుకుని
అన్నం తింటుంటే దిగులైంది
నీ బోన పొట్ట మ‌లం త‌ట్ట‌లా క‌న‌ప‌డి భ‌య‌మైంది

నీకు తెలీదు, నా పుట్టుక నాలోకి
ప‌రిమ‌ళాన్నే ఒంపింది
అమ్మ గ‌ర్భంలోని ప‌రిమళ స‌ర‌స్సులో
మునిగి న‌న్ను నేను శుద్ధి చేసుకునే పుట్టాను
పుట్టిన‌ప్ప‌ట్నించీ నిన్ను శుద్ధి చేస్తూనే వ‌చ్చాను
నీ వెన‌క నిల‌బ‌డి, మ‌లం త‌ట్ట మోస్తూ వ‌చ్చాను

ఓరీ అశుద్ధుడా...!

నీకు తెలీదు..
నిన్ను శుద్ధి చేస్తూకూడా
మాన‌వీయ ప‌రిమ‌ళం న‌న్ను మ‌రింత ఆవ‌హించింది
కానీ, నీ నుంచి మాత్రం దుర్గంధ‌మే వ్యాపించింది

నిన్ను మ‌నిషిగానే చూశాను
నువ్వు మాత్రం న‌న్ను మ‌ల ప‌దార్థంగానే చూశావు
నీ మ‌లాన్ని ఎత్తిన ప్ర‌తిసారీ నేనెంతో ఎదిగిపోయాను
నువ్వు మ‌రింత మ‌రుగుజ్జు అవుతూ వ‌చ్చావు
నువ్వు మాత్రం నీలోప‌ల మ‌లాన్ని నింపుకొని న‌న్ను అశుద్ధుడిగా మార్చావు
ఇప్పుడు చ‌రిత్ర పున‌రావృతం కాదిక‌
ఓరీ అశుద్ధుడా... నీ పియ్యి త‌ట్ట‌ను నువ్వే ఎత్తుకోరా..





No. of visitors : 1033
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నేనొక అర‌ణ్య స్వ‌ప్నం

గీతాంజ‌లి | 16.08.2016 09:11:44am

నిదుర‌లోని స్వ‌ప్నాల్లో మెల‌కువ‌లోని సంభాష‌ణ‌ల్లో నాచూపుల‌కందే దృశ్యాల‌లో నా శ్వాస‌కు చేరే ప‌రిమ‌ళాల్లో ఒక్క నువ్వే అందుతావు ఎందుకు ?...
...ఇంకా చదవండి

క‌విత్వం రాయడానికి ఓ రోజు కావాలా?

గీతాంజలి | 22.03.2018 12:45:25am

ఎవరో కడలి అట ఎంత బాగా రాస్తుందో ప్రేమ గురించి ముఖ పుస్తకంలో ...!! ఇప్పుడిప్పుడే, దేహంలో- మనసులో వసంతాలు విచ్చుకుంటున్న అమ్మాయి! ఇక ఒక్క క్షణం కూడా నటించను...
...ఇంకా చదవండి

పడవలైపోదాం

గీతాంజ‌లి | 04.03.2017 09:28:58am

నది ధుఃఖాన్ని ఈడ్చుకెళ్తున్న పడవలను లేదా నదిని మోస్తున్న పడవలను ఎన్నడు తీరం చేరని తనాన్ని నదిని వీడలేని తనాన్ని నది మధ్యలొ నిలిచిపోయి నదుల సామూహిక...
...ఇంకా చదవండి

అమ్మ ఒక పని మనిషా?

గీతాంజలి | 19.05.2018 03:54:37pm

నీకు రేపొచ్చే ఇరవై ఆరెళ్లకి.. నీవు కూడా అమ్మ అనే పని యంత్రంలా మారక ముందే.. నా స్థితి ఇంకా అధ్వాన్నం కాక ముందే.. నేనో నువ్వో.. ఇద్దరి లో ఎవరిమో.. మరి ఇద్దర ...
...ఇంకా చదవండి

గోడ ఒక ఆయుధం

గీతాంజ‌లి | 04.04.2018 06:21:40pm

గోడ నువ్వు కత్తిరిస్తున్న నా రెక్కల చప్పుడు వినే శ్రోత!! నువ్వు నొక్కేస్తున్న నా నగారా పిలుపుని వెలివాడల నుంచీ అరణ్యాల దాకా ప్రతిధ్వనించే గుంపు ...
...ఇంకా చదవండి

నీడ ఒక అంతర్ మానవి !

గీతాంజలి | 03.08.2018 11:31:48am

పోనీ...నువ్వు ఎప్పుడైనా మృత వీరుడి స్తూపపు నీడ పడ్డ భూమి.. ఎఱ్ఱెరని విత్తనమై మొలకెత్తడం చూసావా?? రా... నీడలు చెప్పిన రహస్యాలను .. మనం చేయాల్సిన యుద్ధాలను.....
...ఇంకా చదవండి

వదిలి వెళ్లకు...!

గీతాంజలి | 21.12.2018 07:53:43pm

నన్ను నీళ్లు లేని సముద్రం లోకి.. సముద్రం లేని భూమి మీదకి. వదిలి వెళ్ళకు .. వదిలి వెళ్ళకు.. ఎలా ఉండాలి నీవు లేక... ఎలా చేరాలి నీ దాకా? నిన్ను చేరాలంటే.. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జూలై - 2019

    చారిత్రక పత్రం
    రచయితలకు సవాల్ !
    మూడు తరాల, యాభై వసంతాల విరసం
    వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
    రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
    తిరిగి వ‌స్తావ‌ని
    నన్నెక్కనివ్వండి బోను
    కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
    సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
    సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •