ప్రజల పై యుద్ధం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ప్రజల పై యుద్ధం

- సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

దండకారణ్యంలో ఉన్న ప్రకృతి వనరులను, ఖనిజ సంపదను పెట్టుబడిదారుల పరం చేయడానికి భారత పాలకవర్గాలు అక్కడి ఆదివాసులపై సాగిస్తున్న దమనకాండను ʹవికల్ప్ ʹ "గ్రీన్‌హంట్ ఆపరేషన్ - మూడవ దశ -మిషన్ 2016" రచనలో వివరించారు . దీనిని శ్రామికవర్గ ప్రచురణలు గ్రీన్‌హంట్ ఆపరేషన్ - ప్రజలపై యుద్ధం అనే పుస్తకంగా ప్రచురించింది . దండకారణ్య ప్రాంతంలో ప్రధానంగా బస్తర్ ప్రాంతంలో జరుగుతున్న హక్కుల హననాన్ని , భారత దోపిడీ పాలకవర్గాలు అమలుచేస్తున్న రాజ్యహింసను మనం ఈ పుస్తకంలో చూడవచ్చు .

2014లో మోదీ అధికారంలోకి వచ్చాక ʹమేక్ ఇన్ ఇండియాʹ, ʹడిజిటల్ ఇండియాʹ వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రవేటీకరణను వేగవంతం చేస్తూ ప్రకృతి సంపదను వేదాంత ,టాటా ,ఎస్సార్ ,జిందాల్ వంటి బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తూన్నాడు . ఈ వనరుల దోపిడీని అడ్డుకుంటున్న ఆదివాసులను , మావోయిస్టు పార్టీ పై పోలీసు , అర్థ సైనిక బలగాలను ఉపయోగించి దాడులు చేయిస్తున్నాడు . 2009లో మొదలైన ఈ ఆపరేషన్ గ్రీన్‌హంట్ దాడి నానాటికి తీవ్రతరం అవుతూ నేడు భారత ప్రభుత్వం ఈ దేశ ప్రజలపై వైమానిక దాడులను , మిలిటరీను ప్రయోగిస్తూ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడటానికి తహతహలాడుతుంది .

ఈ ఉద్యమానికి మద్దతు తెల్పుతున్న ప్రజాస్వామిక వాదులపైనా , అక్కడ జరుగుతున్న వాస్తవ సంఘటనలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టల మీద ప్రభుత్వం తన నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది . సోని సోరి మీద దాడి, మాలిని సుబ్రమణ్యం, బీ .బీ .సి . రిపోర్టర్ ఆలోకపుతుల్ ,సామజిక కార్యకర్త శాలినిగోరే సంఘటనలు ఇందుకు ఉదాహరణలు . ఇక ఆదివాసుల మీద సాగిస్తున్న దాడి గురుంచి దానిలోని నిజనిజాలు బయటి సమాజానికి ఎప్పటికి తెలుస్తాయో తెలియని స్థితి . హిడ్మే సంఘటనే అందుకు ఉదాహరణ. ఒక్క హిడ్మే సంఘటన అనే కాదు ఎంతో మంది ఆదివాసీ యువతీ,యువకులను పట్టుకోని అత్యాచారం చేయడం, ఎన్కౌంటర్ పేర మావోయిస్టులని కాల్చి చంపడం పరిపాటైపోయింది. దీనిలోని వాస్తవాలు తెలియడానికి ఒకసారి వారం పది రోజులపడితే ,కొన్ని సార్లు నెలలు గడిచిన తెలియని పరిస్థితి. ఇక బస్తర్ ఐ.జి కల్లూరి అయితే సల్వాజుడుంని సమర్దించడం మొదలు నేడు ʹఆక్షన్ గ్రూప్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రిటీʹ (AGNI) దాకా కూడా వివిధ రూపాలలో ఆదివాసులపై హింసను ప్రయోగిస్తూ దళారీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడటానికి తన వంతు సాయం చేస్తున్నాడు .

2016 నాటికి దండకారణ్య ఉద్యమాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం పనిచేస్తుంది. దీనిలో భాగంగానే ఆంధ్ర ,తెలంగాణ ,ఒడిస్సా ,చత్తిస్గఢ్ ,మహారాష్ట్ర డి.జె.పి లు విశాఖపట్నంలో సమావేశమై ఆంధ్ర - ఒడిస్సా , తెలంగాణ - చత్తిస్గఢ్, తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రణాళికలు రూపొందించారు . ఈ సమావేశం తరువాత ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముగ్గురు ఆదివాసీ మహిళలను ఎన్కౌంటర్ పేర కాల్చి చంపి దీనిని తమ సమావేశం యొక్క విజయంగా ఒడిస్సా డి.జె.పి ప్రకటించడాన్ని చూస్తే ఈ రాజ్య స్వభావం అర్ధమవుతుంది.మొత్తంగా భారత పాలకవర్గాలు పెట్టుబడిదారులకు ఈ దేశ ప్రకృతి వనరులను ,ఖనిజ సంపదనలను వారి పరం చేయడాన్ని అడ్డుకుంటున్న ఆదివాసులను, మావోయిస్టు పార్టీ ని నిర్మూలించడానికి అమలు చేస్తున్న రాజ్యహింసను మనం ఈ పుస్తకములో చూడవచ్చు .

బ‌య‌టి సమాజంలో ఉన్న మేధావులు,ప్రజాస్వామికవాదులు, ప్ర‌జ‌లు, విలేక‌రులు, సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది .

No. of visitors : 775
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.

సాగర్ | 16.04.2019 12:13:15am

అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు......
...ఇంకా చదవండి

వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

సాగర్ | 17.03.2019 10:35:13pm

తమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు......
...ఇంకా చదవండి

హిందూ రాజ్యం దిశగా

సాగర్ | 17.11.2019 10:20:58am

ʹఒకే ప్రజ, ఒకే భాష, ఒకే సంస్కృతి,ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడుʹ అనే సంఘ్ పరివార్ రాజకీయ లక్ష్యానికి ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ తీర్పు మరో విస్తరణలాంటిదే....
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి

చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

సాగర్ | 01.04.2019 01:47:11pm

చంద్రబాబు చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అ.....
...ఇంకా చదవండి

యూనియన్లు ఏం చేయగలవో దొరకు బాగా తెలుసు

సాగర్ | 02.12.2019 09:10:25pm

యూనియన్లు ఏం చేయగలవో కెసిఆర్ కు బాగా తెలుసు. పోరాటాలు విజయం సాధించొచ్చు, ఓడిపోవచ్చు. సంఘాలు కార్మికులకు గొంతునిస్తాయి. మళ్ళీ మళ్ళీ పోరాడే ధైర్యాన్నిస్తాయి. ...
...ఇంకా చదవండి

నిర్బంధ ప్రయోగశాల

సాగర్ | 04.02.2020 02:23:41pm

కేసీఆర్‌ సీఎం పదవి కోరుకుంటే వీరు ప్రజాస్వామిక తెలంగాణను కోరుకున్నారు. కేసీఆర్‌కు కావాల్సింది కేసీఆర్‌కు దక్కింది. కానీ ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •