అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

- క్రాంతి | 05.10.2016 03:32:08pm

రాజ్య‌హింస పెరుగుతున్నాదో..
పేదోళ్ల నెత్తురు ఏరులై పారుతున్నాదో

ఒక‌నాడు.. తెలంగాణ గోడు ప్ర‌పంచానికి చాటిన పాట ఇది. ఇప్పుడు దేశం దేశమంతా ఇలాంటి గోడునే వెల్ల‌బోసుకుంటోంది. నేల నేలంతా నెత్తుటేరులే పారుతున్నాయి. కానీ ఎవ‌రికీ ఈ ముచ్చ‌ట ప‌ట్ట‌దు. ప్ర‌త్యేక అధికారాల ప‌ద‌ఘ‌ట్ట‌న‌ల కింద న‌లిగిపోతున్న జీవితాలెన్నో. భ‌ద్ర‌తా ద‌ళాల అంతులేని అకృత్యాల‌కు చిరునామాగా మారిన క‌శ్మీర్‌ ఒక‌వైపు, ఏ చ‌ట్టాల‌కూ చోటు లేని మ‌ధ్య భార‌తం మ‌రో వైపు. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు విలువ‌లేని ప్ర‌జాస్వామ్యం ఇవాళ దేశంలో వ‌ర్థిల్లుతోంది.

అవును.. బ‌స్త‌ర్‌లో, క‌శ్మీర్‌లో, ఈశాన్య రాష్ట్రాల్లో జ‌రుగుతున్న‌ద‌దే. ఏ రాత్రి ఏమ‌వుతుందో? ఏ ప‌ల్లె ఎలా తెల్ల‌వారుతుందో ఎవ‌రికీ తెలీదు. ప‌డుకున్న మ‌నిషి తెల్ల‌వారే స‌రికి మావోయిస్ట‌పోతాడు. బ‌డిపిల్ల‌లు సైతం క‌రుడుగ‌ట్టిన న‌క్స‌లైట్ల‌వుతారు. ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మ‌వుతారు. నిన్న‌టి తెలంగాణ‌లోనే కాదు.. ఇవాల్టి బ‌స్త‌ర్ ముఖ చిత్ర‌మిది. ఇప్పుడిక్క‌డ‌... ఆదివాసీలంటే మావోయిస్టులే. మావోయిస్టుల ఏరివేత పేరిట ప్ర‌భుత్వం చేస్తున్న హ‌త్య‌ల‌న్నీ అమాయ‌క ఆదివాసీల‌నే. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌క బిక్కు బిక్కున బ‌తుకులీడుస్తున్నారు ఆదివాసీ ప్ర‌జ‌లు.

విప్ల‌వోద్య‌మ నిర్మూల‌న ప్ర‌భుత్వం బ‌స్త‌ర్‌ని యుద్ధ క్షేత్రంగా మార్చివేసి గ‌డిచిన‌ 7 నెల‌ల్లో 100 మందిని బ‌లితీసుకున్నారు పోలీసులు. సెప్టెంబ‌ర్ 23న బ‌స్త‌ర్ జిల్లాలోని బుర్‌గుంలో ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఇద్ద‌రు పిల్ల‌ల హ‌త్య ఇందుకు తాజా ఉదాహ‌ణ‌. సోంకూ రామ్ త‌న మిత్రుడు సోమ్డూతో క‌లిసి ఓ విషాద వార్త‌ను మోసుకొని త‌న అత్త‌య్య ఇంటికి వెళ్లాడు. చీక‌టి ప‌డ‌డంతో రాత్రి అక్క‌డే ప‌డుకున్నారు. రాత్రికి రాత్రి ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఈ ఇద్ద‌రు పిల్ల‌ల్నిఇంట్లోంచి లాక్కెల్లి అడ‌విలో కాల్చి చంపారు. అనంత‌రం ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు చ‌నిపిపోయారంటూ ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న వెంట‌నే సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌కు ఒక ల‌క్ష రూపాయ‌లు ఇవ్వ‌నున్న‌ట్లు బస్తర్ ఐ.జి కల్లూరి ప్ర‌క‌టించారు.

ప్ర‌ధాన స్ర‌వంతి మీడియా కంటికి క‌నిపించ‌ని ఇలాంటి వాస్త‌వాల‌ను ఇప్పుడు హైకోర్టు ముందుంచారు ఇద్ద‌రు అమ్మాయిలు. బ‌స్త‌ర్‌లో పోలీసుల అకృత్యాల‌కు వ్య‌తిరేకంగా చ‌త్తీస్‌ఘ‌డ్ హైకోర్ట్‌లో పందొమ్మిదేళ్ల ఇద్ద‌రు అమ్మాయిలు కేసు వేశారు. హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, పాత్రికేయుల‌కు కూడా భ‌ద్ర‌తలేని బ‌స్త‌ర్‌లో పోలీసుల చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌డం సాధార‌ణ విష‌యం కాదు. ఆదివాసీల‌పై అమ‌ల‌వుతున్న హింస‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన నేరానికి ఆ ఇద్ద‌రు అమ్మాయిలు పోలీసుల‌కు టార్గెట్‌గా మారారు. పోలీసుల అకృత్యాల‌కు వ్య‌తిరేకంగా స్థానిక అధికారుల‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఫ‌లితం లేక‌పోయింది. చివ‌ర‌కు వాళ్లు బ‌స్త‌ర్ వీడి పారిపోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం మిగ‌లేదు. బ‌స్త‌ర్లో పోలీసుల అకృత్యాల‌ను వెలుగులోకి తీసుకురావ‌డం అవ‌స‌రం అనుకున్నారు. అలా ఆ ఇద్ద‌రు అమ్మాయిలు హైకోర్టును ఆశ్ర‌యించారు. బ‌స్త‌ర్‌లో జ‌రుగుతున్న అకృత్యాల‌ను గురించి 141 పేజీల ఫిర్యాదును హైకోర్టుకు స‌మ‌ర్పించారు. అమ్మాయిల త‌రుపున హ‌క్కుల కార్య‌క‌ర్త క‌ల్ప‌నా మెహ‌తా సైతం ముందుకు వ‌చ్చారు. ఆదివాసీ మ‌హిళ‌పై లైగింక హింస - రాజ్య నిర్భందాన్ని నిర‌సించారు. విచ‌క్ష‌ణా ర‌హిత హింస నుంచి ఆదివాసీల‌ను కాపాడాల‌ని ఆమె కోర్టును కోరింది. ప్ర‌భుత్వం మావోయిస్టుల‌ను లొంగిపోయి జ‌న జీవ‌న స్ర‌వంతిలో క‌ల‌వాలి.. అంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తుంది. కానీ అలా లొంగిపోయిన వారి జీవ‌నాకి సంబంధించి ఎవ‌రూ పట్టించుకోరు? అంటూ ఆరోపించారు.

భ‌ద్ర‌తా ద‌ళాలు గ్రామాల్లోకి వ‌స్తున్నాయ‌ని తెలిస్తే చాలు.. మ‌హిళ‌లు పిల్ల‌ల్ని తీసుకొని అడ‌విలోకి పారిపోతారు. రోజుల త‌ర‌బ‌డి బిక్కు బిక్కున తిండీ, నీళ్లు లేకుండా అడ‌విలోనే గ‌డ‌పిన సంఘ‌ట‌న‌ల‌నేకం. గ్రామంలో ఉన్న ముస‌లి వాళ్ల‌కు త‌మ పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో కూడా తెలీదు. ఎప్పుడు ఏ చేదు వార్త వినాల్సి వ‌స్తుందో అని అర‌చేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎదురు చూస్తుంటారు. ఒక వేళ పోలీసుల కంట ప‌డితే సామూహిక అత్యాచారాల‌ను పాల్ప‌డి హ‌త్య‌చేసి.. ఎన్‌కౌంట‌ర్ క‌థ వినిపిస్తారు. శ‌రీర భాగాల్ని బ‌యోనెట్‌ల‌తో పొడిచి, యాసిడ్ పోసి అత్యంత పాశ‌వికంగా హ‌త్య చేసిన సంద‌ర్భాలెన్నో ఉన్నాయి. ఇలాంటి ప‌లు సంఘ‌ట‌న వివ‌రాల‌ను సునీత‌, మున్నీలు త‌మ ఫిర్యాదులో పొందు ప‌రిచారు. పోలీసులు లొంగిపోయిన న‌క్స‌ల్స్ స‌హాయంతో గ్రామాల్లోకి చొర‌బ‌డి గ్రామ‌స్తుల‌ను ఇళ్ల‌లోంచి లాక్కొచ్చి చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తార‌ని, అడివిలోకి తీసుకెళ్లి కాల్చిచంపి, మావోయిస్టు ముద్ర‌వేస్తార‌ని పేర్కొన్నారు. ఫిర్యాదు చేయాల‌నుకున్న త‌రువాత ఏ విష‌యంలోనూ వెన‌కాడ కూడ‌దనుకున్నారు. చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకొని... బూక‌ట‌పు ఎన్‌కౌంట‌ర్‌ల‌కు చెందిన ఆధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు.

2016 నాటికి దండకారణ్య విప్ల‌వోద్య‌మాన్ని నిర్మూలిస్తామంటూ మిష‌న్ 2016 పేరుతో ముందుకు వ‌చ్చిన ప్ర‌భుత్వం... ఆదివాసీల‌పై జ‌రుగుతున్న ఈ స‌ర్జికల్ ఎటాక్స్‌కి భారీ న‌జ‌రానాలు ప్ర‌క‌టిస్తూ ప్రోత్స‌హిస్తోంది. మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు మార్గం సుల‌భం చేస్తున్న పోలీసులు గ‌తంలో సాల్వాజుడుం వంటి ప్రైవేటు సాయుధ ముఠాల‌ను ఆదివాసీల‌పైకి ఉసిగొప్పారు. ఇప్ప‌డు తాజాగా
బస్తర్ ఐ.జి కల్లూరి ʹఆక్షన్ గ్రూప్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రిటీʹ (AGNI) పేరుతో మావోయిస్టు వ్య‌తిరేఖ ప్రైవేటు సైన్యాన్ని ప్ర‌వేశ పెట్టాడు. మావోయిస్టుల నిర్మూలన పేరుతో ఆదివాసీల‌పై జ‌రుగుతున్న హింస‌కు మ‌రింత తీవ్ర‌త‌రం చేయ‌డ‌మే అగ్ని ల‌క్ష్యం. ఇంత జ‌రుగుతున్నా వాస్త‌వాలేవీ ప్ర‌పంచానికి తెలీవు. ఈ విచ‌క్ష‌ణా ర‌హిత హింస‌కు వ్య‌తిరేకంగా, ఆదివాసీలకు అండ‌గా నిల‌వాల్సిన భాద్య‌త పౌర స‌మాజంపై, మేధావులు, పాత్రికేయులు, ప్ర‌జాస్వామిక వాదుల‌పై ఉంది.





No. of visitors : 1178
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

అమ‌ర‌త్వ‌పు జాడ‌ల్లో...

ఫొటోలు : క‌్రాంతి | 22.07.2016 12:11:40pm

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ‌దినం సంద‌ర్భంగా జూలై 18న హైద‌రాబాద్‌లో జ‌రిగిన రాజ్య‌హింస వ్య‌తిరేఖ స‌భ దృశ్యాలు.......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •