స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

- ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

రెండ‌వ భాగం

ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్
(1820 - 1895)

ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల మీద ఎంగెల్స్ ‌చేసిన కృషి ఆయన సాధించిన అత్యున్నత సృజనాత్మక విజయం, స్నేహం పేరిట విజ్ఞాన శాస్త్రం పేరిట అన్ని దేశాల కార్మికవర్గ ప్రయోజనాల సాధన కోసం ఆయన చేసిన వీరోచిత కార్యం.

ఎంగెల్స్ ‌రచించిన ʹʹలుడ్విగ్‌ ‌పాయోర్‌బాఖ్‌, ‌సాంప్రదాయిక జర్మన్‌ ‌తత్వశాస్త్ర పరిసమాప్తిʹʹ అనే పుస్తకం అంతర్జాతీయ విప్లవోద్యమ అభివృద్ధిలో ఒక ముఖ్య పాత్ర వహించింది. 1880 దశకంలో యూరప్‌లో నయా కాంటియనిజం అనే ఫేషనబుల్‌ ‌బూర్జువా తత్వశాస్త్ర ధోరణి వ్యాప్తి ఇలాంటి రచనను అవసరం చేసింది. సాంప్రదాయిక జర్మన్‌ ‌తత్వశాస్త్రపు అభివృద్ధి నిరోధక పునరంచనాయే ఈ ధోరణి లక్ష్యం. ఈ పుస్తకంలో ఎంగెల్స్ ‌శాస్త్రీయ కమ్యూనిజపు తాత్విక మూలాధారాలను సవిమర్శకంగా పరిశీలించి, గతితార్కిక చింతన అభివృద్ధిలో హేగెల్‌, ‌భైతికవాదపు అభివృద్ధిలో ఫాయెర్‌బాఖ్‌ ‌చేసిన కృషి ప్రాముఖ్యాన్ని పేర్కొన్నాడు. మార్క్సిస్టు తత్వశాస్త్రాన్ని సృష్టించే క్రమంలో హేగెల్‌ ‌భావవాద గతితర్కమూ, ఫాయెర్‌బాఖ్‌ అధిభౌతికవాద భౌతికవాదమూ కూడా అధిగమింపబడ్డాయనీ, తత్ఫలితంగా గతితార్కిక భౌతికవాదం సృజింపబడిందనీ ఆయన తన రచనలో నిరూపించాడు.

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా నిరూపించాడు. కార్మికవర్గ ఉద్యమానికి సంబంధించినంతవరకు, రెండు తత్వశాస్త్రాల మధ్య సైద్ధాంతిక పోరాటంలో ఈ సమస్య పట్ల భౌతికవాద వైఖరే ప్రధానమైన గీటురాయి. బూర్జువా సైద్ధాంతికులతో తాత్విక చర్చలు సుసంగతంగా జరపడాన్ని ఈ వైఖరి సాధ్యం చేస్తుంది.

ఈ పుస్తకంలోని ముగింపు భాగం సామాజికాభివృద్దిని శాసించే నియమాలకు కేటాయింపబడింది. అందులో ఆయన భౌతికవాద గతితర్కపు ఆవిష్కరణ తనూ, మార్క్సూ ఫొయెర్‌బాఖ్‌ ‌కంటె ముందుకు వెళ్ళడాన్ని ఎలా సాధ్యం చేసిందో వివరించాడు. ప్రకృతి, సమాజ, ప్రజ్ఞానాల అభివృద్ధిని శాసించే నియమాలను గురించిన అభిప్రాయాల్లో వాళ్ళు తెచ్చిన విప్లవాత్మక పరివర్తన పాఠాంశాన్ని వెల్లడించాడు.

ʹʹలుడ్విగ్‌ ‌ఫాయెర్‌బాఖ్‌, ‌సాంప్రదాయిక జర్మన్‌ ‌తత్వశాస్త్ర పరిసమాప్తిʹʹ అనే ఎంగెల్స్ ‌రచన బూర్జువా తత్వశాస్త్రానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ విప్లవోద్యమం చేసే పోరాటంలో దానికి అద్భుతమైన సైద్ధాంతిక సహాయకారిగా ఉపయోగపడుతుంది. ఆ పుస్తకం సోషలిస్టులకు తమ శ్రేణుల్లోని భావవాద తత్వశాస్త్ర సమర్థకులను బహిర్గతంచేసేందుకూ, వాళ్ళకి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం సాగించేందుకూ తోడ్పడుతుంది.

ఎంగెల్స్ ‌తన రచనల్లో చాలా వాటిని వివిధ దేశాల్లోని సోషలిస్టుల అభ్యర్థన మేరకు చేసాడు. మొత్తం మీద చూసుకుంటే, అవి పూర్తిగా ప్రత్యక్ష ఆవశ్యకత కారణంగా రచింప•డ్డాయి. ఉదాహరణకు వ్యవసాయ సమస్య మీద అవకాశవాద ఊగిసలాటలను అధిగమించడంలో ఫ్రెంచి సోషలిస్టులకు తోడ్పడేందుకూ, మార్క్సిజం మౌలిక సూత్రీకరణలను వివరించేందుకూ 1894లో ఎంగల్స్ ʹʹ‌ఫ్రాన్సు, జర్మనీలలో రైతు సమస్యʹʹ అనే శీర్షికతో ఒక వ్యాసం రాసాడు. ఈ రచన రైతు సమస్య మీద మార్క్సిస్టు సిద్ధాంత అభివృద్ధిలో ఒక పెద్ద ముందంజ. శ్రామిక వర్గ పార్టీ రైతాంగంలో ఆందోళనను పెంపొందించి, గ్రామీణ ప్రాంతంలో బలంగా ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాధికారాన్ని సంపాదించుకోగలదని గ్రంథకర్త నిరూపించాడు. చిన్న తరహా వ్యవసాయం నుంచి సమష్టి ఉత్పత్తికి, సంఘాలకు మారడం మాత్రమే రైతు జీవితంలో మౌలికమైన మార్పు తెచ్చే మార్గమనీ, కాగా దీన్ని బలప్రయోగం ద్వారా కాక ఆదర్శం నెలకొల్పడం ద్వారానే అమలు జరపాలనీ ఎంగెల్స్ ‌వక్కాణించాడు. భారీ బూర్జువా భూస్వామ్యం పట్ల శ్రామికవర్గ రాజ్య విధానం పూర్తి భిన్నంగా ఉండాలి. విజయవంతమైన శ్రామికవర్గం పారిశ్రామికవేత్తల ఆస్తిని వశం చేసుకున్నట్లే భూస్వాముల ఆస్తిని కూడా వశం చేసుకోవాలి. అదే సమయంలో ఎంగెల్స్ ‌నష్టపరిహారపు చెల్లింపు సంభావ్యత గురించి ఇలా రాసాడు : ʹʹఈ ఆస్తిహరణం జరిగినప్పుడు నష్ట పరిహారం ఇవ్వాలా, ఇవ్వక్కర్లేదా అన్నది మనపైన కాక, మనం ఎటువంటి పరిస్థితుల్లో అధికారం పొందామన్నదానిపైనా, ప్రత్యేకించి...బడా భూస్వాములు స్వయంగా ఎటువంటి వైఖరి వహించారన్న దానిపైననే చాలావరకు ఆధారపడుతుంది. ఏ సందర్భంలోనూ కూడా నష్టపరిహారం పనికి రాదని మనం చెప్పం. తన అభిప్రయంలో, వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించెయ్యగలిగితే మిక్కిలి చౌకగా బయటపడినవాళ్ళమవుతాం అని మార్కస్ ‌నాతో (ఎన్నిసార్లో!) అన్నాడుʹʹ.

ఎంగెల్స్ ‌రష్యాలోని విప్లవోద్యమాన్ని శ్రద్ధగా అనుసరించాడు. చాలా మంది రష్యన్‌ ‌ప్రగతిశీల ప్రముఖులతో చురుకుగా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు. జర్మనీ, ఫ్రాన్సు, అమెరికా, రష్యాలలోని కార్మికోద్యమాన్ని విశ్లేషించి, తన అభిప్రాయంలో రష్యా సమీప భవిష్యత్తులో అతి ముఖ్యమైన పాత్ర వహించబోతున్నదని ఎంగెల్స్ ‌పేర్కొన్నాడు. కార్ల్ ‌మార్కస్ ‌విశ్వసనీయ మిత్రుడుగా, సహయోధుడుగా ఎంగెల్స్ ‌పేరు రష్యాలో సుపరిచితమైనది. మార్కస్ ‌మరణించిన సందర్భంగా ఆయనకి సానుభూతి సూచకంగా అనేక లేఖలూ, టెలిగ్రాములూ పంపబడ్డాయి. మాస్కోలోని పెత్రోవ్‌స్కయా అకాడెమీ విద్యార్థులు ఎంగెల్సుకి పంపిన టెలిగ్రాంలో మార్కస్ ‌శవపేటిక మీద ఈ కింది సందేశం కట్టిన పుష్పహారం ఉంచవలసిందిగా అభ్యర్థించారు : ʹʹసిద్ధాంతంలో శ్రమ హక్కుల సమర్థకుడికి, ఆచరణలో వాటిని సాధించేందుకు పోరాడిన యోధుడికి - మాస్కోలోని పెత్రోవ్‌స్కయా వ్యవసాయ అకాడెమీ విద్యార్థుల నుంచిʹʹ ఎంగెల్స్ ఆమరణాంతం ముమ్మరంగా కృషి చేసాడు. తన మరణానికి రెండేళ్లకు ముందు ʹʹయూరప్‌ ‌నిరాయుధం కాగలదా?ʹʹ అనే చిన్న పుస్తకం రాసాడు. అందులో ఆయన ఈ కింది నిర్ధారణ చేసాడు : ʹʹయూరప్‌ అం‌తటా స్థాయీ సైన్యాల వ్యవస్థ ఎంత దూరం పోయిందంటే, ప్రజల సార్వత్రిక ఆయుధీకరణ ప్రాతిపదిక మీద స్థాయీ సైన్యాలు సకాలంలో మిలీషియాగా మార్చబడితే గానీ, ఆయా దేశాల ప్రజలు మిలిటరీ ఖర్చుల భారాన్ని మోయలేక ఆర్థికంగా దివాళా తీస్తారు. లేకపోతే అది సర్వతోముఖమైన వినాశకరమైన యుద్దానికైనా దారితీస్తుందిʹʹ6. ఎంగెల్స్ ‌నిరయుధీకరణ- తత్పర్యవసానంగా శాంతికి హామీ- సాధ్యమని సూచించాడు. శాంతి పరిరక్షణ సాధ్యమని ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్ ‌చేసిన ఈ ప్రతిపాదనను ఈనాటి కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రత్యక్ష కార్యకలాపాల్లో అనుసరిస్తున్నాయి. శాంతిని గురించిన ఉత్తరువే సోవియట్‌ అధికారపు తొలి శాసనం. అంతర్జాతీయ రంగంలో తరుణ సోషలిస్టు రాజ్యపు తొలి చర్యలు మంచి ఇరుగుపొరుగు సంబంధాల స్థాపన, సహకారాలను సాధ్యం చేసే, యుద్ధాలనూ, ఆయుధాల పోటీనీ అంతం చేసే దిశగా ఉన్ముఖం చేయబడ్డాయి. సోవియట్‌ ‌రాజ్య అవతరణతో కొత్త యుద్ధాల నివారణ కోసం జరిగే పోరాటం చరిత్రలో మొట్టమొదటి సారి భౌతిక ప్రాతిపదికను సంతరించుకొని, ఒక రాజకీయ వాస్తవం అయింది.

తన జీవితపు చివరి సంవత్సరాల్లో ఎంగెల్స్ అం‌తర్జాతీయ కార్మిక వర్గ ఉద్యమపు ఏకైక సైద్ధాంతిక నాయకుడయ్యాడు. వెనక మార్కస్‌తో పంచుకొంటూ వచ్చిన ఉద్యమ నాయకత్వ భారాలన్నీ ఇప్పుడు పూర్తిగా ఆయన భుజస్కంధాల మీద పడ్డాయి. లండన్‌లోని ఆయన ఇల్లు విప్లవకారులకు ఒక మాదిరి అంతర్జాతీయ కేంద్ర కార్యాలయంగా తయారైంది. అక్కణ్ణుంచి ఆయన బ్రిటన్‌, ‌జర్మనీ, ఫ్రాన్సు, రష్యా, అమెరికా, తదితర దేశాల్లోని సోషలిస్టులతో సంబంధాలు కొనసాగించాడు. సోషలిస్టు, కార్మిక సంఘాల నుంచి ప్రపంచపు అనేక భాషల్లో ఆ ఇంటికి ఉత్తరాలు వస్తూండేవి. అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమపు అభివృద్ధి నూతన కీలక దశలో దాన్ని పటిష్ఠం చేసే పథకాలు ఆ ఇంట్లో రూపొందించబడ్డాయి. విప్లవ కార్యాచరణల విషయంలో కార్మిక వర్గపు చొరవకు అక్కడ ప్రోత్సాహ ప్రోద్బలాలు లభించాయి.

ఒక కొత్త సోషలిస్టు ఇంటర్నేషనల్‌ ‌స్థాపనకు తన అతి ముఖ్య కర్తవ్యాల్లో ఒకటిగా ఎంగెల్స్ ‌పరిగణించాడు. 1880 దశకం నాటికి అధిక సంఖ్యాక యూరపియన్‌ ‌రాజ్యాల్లో స్వతంత్రమైన శ్రామికవర్గ సంఘాలు ఉన్నాయి. వాటి మధ్య సంఘీభావాన్ని దృఢతరం చేసే కర్తవ్యం నానాటికీ అధికతర ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటూ వచ్చింది. 1880 దశాబ్ది అంతంలో యూరపియన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీలు ఒక సంస్థాపక మహాసభ కోసం సన్నాహాలు జరుపుతూ వచ్చాయి. ఎంగెల్స్ ఈ ‌కొత్త అంతర్జాతీయ సంఘం సుదృఢమైన మార్క్సిస్టు పునాదుల మీద నెలకొల్పబడేందుకు తన సమస్త శక్తియుక్తులనూ కేంద్రీకరించి కృషి చేసాడు. ఆయన కృషి వ్యర్థం కాలేదు.

22 దేశాలకు ప్రాతినిధ్యం వహించే 407 మంది ప్రతినిధులు 1889 జూలై 14న పారిస్‌లో సమావేశమయ్యారు. అదే మార్క్సిస్టుల మొదటి మహాసభ. ఆ మహాసభా ప్రాంగణాల్లో ఈ కింది నినాదాలు గల బేనర్లు వేలాడదీయబడ్డాయి. ʹʹసకల దేశాల కార్మికులారా, ఏకంకండి!ʹʹ, ʹʹపెట్టుబడిదారీ వర్గపు రాజకీయ, ఆర్తిక ఆస్తిహరణా, ఉత్పత్తి సాధనాల సమష్టీకరణ జరగాలి!ʹʹ. ఆ మహాసభ శ్రామిక చట్టాలకు సంబంధించిన కొన్ని డిమాండ్లను రూపొందించి, ఎనిమిది గంటల పని దినాన్నీ, అంతర్జాతీయ కార్మికవర్గ సంఘీభావాన్ని సాధించుకొనేందుకోసం ఏటా మే 1 న ప్రదర్శనలు జరపాలని సూచించింది. 1890 మే 1వ తేదీన పాటింపబడిన శ్రామిక ప్రజల సంఘీభావ ఉత్సవం కార్మికవర్గ ఉద్యమంలో పటిష్టం చేయబడిన ఐక్యతకు తిరుగులేని సాక్ష్యం. శ్రామికవర్గ శక్తుల పెరుగుదలకు అదొక నిదర్శనం. రెండవ ఇంటర్నేషనల్‌ ‌తన శ్రద్ధను వేర్వేరు దేశాల్లోని సామూహిక శ్రామికవర్గ పార్టీల సంఘాల అభివృద్ధిపైన కేంద్రీకరించింది. అంతర్జాతీయ కార్మికవర్గాన్ని శ్రామికవర్గ విప్లవానికి సన్నద్ధం చెయ్యడమే అప్పట్లో దాని కర్తవ్యం.

1893లో తన వయస్సు మళ్ళుతూ, అనారోగ్యంగా ఉన్నప్పటికీ, ఎంగెల్స్ ‌పలు యూరపియన్‌ ‌దేశాల్లో చురుకుగా విప్లవాత్మక మార్క్సిస్టు ప్రచార కృషి సాగిస్తూ పర్యటించాడు. ఆయన ఆగస్టు 12న జూరిహ్‌ ‌చేరుకొని, అంతర్జాతీయ సోషలిస్టు మహాసభకు హాజరయాడు. ఆ మహాసభలో ఈ కింది అంశాలు చర్చించబడ్డాయి : సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ఉద్యమపు రాజకీయ ఎత్తుగడలు, ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటం, ట్రేడ్‌ ‌యూనియన్లలో కృషి, వ్యవసాయ సమస్య. ఆయనకి అన్ని చోట్లా చెవులు హోరెత్తేలాగ కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పారు.

ఎంగెల్స్ ‌తన ప్రసంగంలో మహాసభ చర్చల్లో కేంద్ర స్థానం ఆక్రమించిన అరాజకవాదాన్ని నిశితంగా విమర్శించాడు. శ్రామికవర్గపు వ్యూహాన్నీ, ఎత్తుగడలనూ తిరస్కరించడం ద్వారా, పార్టీ నాయక పాత్రను నిరాకరించడం ద్వారా అరాజకవాదులు కార్మికవర్గాన్ని పక్కదోవ పట్టించి, దాని ప్రయోజనాలకు ద్రోహం చేస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. కేవలం ఎన్నికల ద్వారానే సోషలిజాన్ని సాధించడం సంభవమని అమాయకంగా భావించే అవకాశవాదులను ఎంగెల్స్ ‌గట్టిగా విమర్శించాడు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిపే పోరాటంలో అన్ని పరిస్థితుల్లోనూ విప్లవాత్మక ఐక్యతను కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసాడు.

సెప్టెంబరు మొదట్లో ఔగుస్ట్ ‌బేబెల్‌తో కలిసి ఎంగెల్స్ ‌జూరిహ్‌ ‌నుంచి మ్యూనిచ్‌, ‌సాల్జ్‌బుర్గ్‌ల మీదుగా వియన్నాకు వెళ్ళాడు. తిరిగి అక్కడ కూడా సోషల్‌ ‌డెమోక్రట్ల నుంచి ఆయనకి స్వాగతాలూ, ఆ పొగడ్తలను తప్పించుకొనేందుకు ఎంగెల్స్ ‌ప్రయత్నాలూ సాగాయి. అక్కడ కూడా కార్మికవర్గ పార్టీల కర్తవ్యాలను గురించి వాళ్ళకి ఆయన జ్ఞాపకం చేసాడు.

వియన్నా నుంచి జర్మనీ గుండా ఆయన లండన్‌కి చేరుకున్నాడు. ఈ ప్రయాణం శాస్త్రీయ కమ్యూనిజం భావాల సిసలైన జైత్రయాత్రగా పరిణమించింది. ఆస్ట్రియా, జర్మనీల సోషల్‌ ‌డెమోక్రట్లతో సమావేశాల అనంతరం శాస్త్రీయ కమ్యూనిజం సిద్ధాంతం కార్మికవర్గపు విప్లవాత్మక విభాగం చేతుల్లో ఆయుధం అయిందన్న ప్రగాఢ విశ్వాసం ఎంగెల్సుకి కలిగింది. ఎంగెల్స్‌ను దర్శించి, ఆయన ఉపన్యాసాలు వినే సద్భాగ్యం కలిగిన కార్మికులు తమ కార్మికవర్గ నాయకుడి విప్లవోత్తేజాన్నీ, సూత్రబ్ధమైన దృఢ వైఖరినీ, హృదయపూర్వకమైన ఆర్ధ్రతనీ, నమ్రతనీ చూసి అబ్బురపడేవారు.

అయితే వయస్సూ, విప్లవకారుడి క్లిష్ట జీవితమూ, శారీరక బలహీనతా ఎంగెల్స్ ‌ధైర్యాన్ని సడలింపజేయలేకపోయినప్పటికీ తమ తిరుగు లేని ప్రభావాన్ని ప్రసరింపజేసాయి. ఆయన శారీరక బలహీనతను స్వయం క్రమశిక్షణతోనూ, బాధ్యతా భావంతోనూ ఎదుర్కొన్నాడు. ఆయన ఆత్మనిబ్బరం చెక్కు చెదరలేదు. 1895 మార్చిలో ఆయన అస్వస్థత తిరగబెట్టింది. 1895 ఆగస్టు 5న రాత్రి పదిన్నర గంటలకి ప్రముఖ పండిత విప్లవకారుడూ, శాస్త్రీయ కమ్యూనిజం మూల పురుషుల్లో ఒకడూ అయిన ఎంగెల్స్ ‌హృదయ స్పందనం శాశ్వతంగా నిలిచిపోయింది. అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమం తన మహా యోధుణ్ణీ, చింతనాపరుణ్ణీ కోల్పోయింది. ఆయన ఆదేశం మేరకు ఆయన అత్యంత సిన్నహిత మిత్రులూ, శిష్యులూ, సహచరులూ మాత్రమే ఆగస్టు 10న జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ʹʹఇక్కడ కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ కొద్దిమందీ కోట్లమందికీ, యావత్రప్పంచానికీ ప్రాతినిధ్యం వహిస్తారు...వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థ అంత్యక్రియలకి సన్నాహాలు జరుపుతారు. ఎంగెల్స్ ‌మనందరికీ మార్గం చూపాడు, ఆ బాటలో ఆయన మనకి మార్గదర్శకుడు, ఆయన ఒక నాయకుడు, యోధుడు, సిద్ధాంత, ఆచరణలు ఆయనలో సమైక్యమయాయిʹʹ అని విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్ అన్నాడు.

No. of visitors : 1169
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 24.11.2016 09:43:08pm

లాసాల్‌ ‌చెప్పేదాని ప్రకారం, కార్మిక సంఘాలు ఉత్పత్తి నిర్వహణను క్రమంగా తమ చేతుల్లోకి తీసుకుంటాయి. సార్వజనిక ఓటు హక్కును ప్రవేశపెట్టిన ఫలితంగా రాజ్యం ʹʹ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •