స్మార‌క స్థూపం మీది పేర్లు - విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

స్మార‌క స్థూపం మీది పేర్లు - విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్

- ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 16.10.2016 04:32:30am

విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్
(1826-1900)

రాజీలు ససేమిరా వద్దు!

విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్ ‌రాసిన ʹʹరాజీలు ససేమిరా వద్దు, ఎన్నికల ఒప్పందాలు ససేమిరా వద్దు!ʹʹ అనే పుస్తకపు రష్యన్‌ అనువాదానికి తను రాసిన ముందుమాటలో లెనిన్‌ ఇలా రాసాడు: ʹʹఉమ్మడి శత్రువుకి వ్యతిరేకంగా ఒక ʹపొత్తుదారునిʹ (పొత్తుదారు అనడేవాడిని) సంపాదించుకునే దృష్ట్యా బూర్జువా ప్రతిపక్ష పార్టీలతో ఒప్పందాలు ʹఉపయోగకరంʹ అనడాన్ని లీబ్‌క్నెఖ్ట్ ఎం‌తమాత్రం కాదనడు. అయితే కాకలుతీరిన ఈ జర్మన్‌ ‌సోషలిస్టు సిసలైన రాజకీయ వివేకమూ, అచంచలమైన సోషల్‌ ‌డెమోక్రటిజమూ ఆయన తనని తాను ఈ ఆలోచనలకే పరిమితం చేసుకోకపోవడం బట్టి వెల్లడయ్యాయి. ఆ ʹపొత్తుదారుʹ ఎవరిని మన శ్రేణుల్లోకి తీసుకోవడం ప్రత్యేకించి ప్రమాదకరమో అలాంటి ప్రచ్ఛన్న శత్రువా, కాదా; ఉమ్మడి శత్రువుకి వ్యతిరేకంగా అతను ప్రత్యఓంగా అసలు పోరాడుతాడా, పోరాడితే ఏ పద్ధతిలో పోరాడుతాడు; ఈ ఒప్పందాలు పార్లమెంటులో మరింత పెద్ద సంఖ్యలో సీట్లు సంపాదించుకునే సాధనంగా ఉపయోగిస్తూన్నప్పటకీ శ్రామికవర్గ పార్టీ యొక్క మరింత దీర్ఘకాలికమూ, మరింత ప్రగాఢమూ అయిన లక్ష్యాలకు భంగకరం కావా అనే ప్రశ్నలకు ఆయన సమాధానాన్ని వెదుకుతాడు.....ʹʹ లెనిన్‌ ఇం‌కా ఇలా కొనసాగించాడు: ʹʹసోషల్‌ ‌డెమోక్రట్‌ ‌బూర్జువా శిబిరంలోని ప్రతి ఒక పొత్తుదారు ప్రమాదకర పార్శ్వాలనూ బహిర్గతం చేయాలి గాని, వాటిని దాచకూడదు అని లీబ్‌క్నెఖ్ట్ ‌మనకి బోధిస్తాడుʹʹ.

విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్ 1826 ‌మార్చి 29న గీసెన్‌ ‌పట్టణంలో పుట్టాడు. ఆయన తండ్రి ఒక ఉద్యోగి. విల్‌హెల్మ్‌కి ఐదేళ్ళ వయస్సులో తల్లి, మరుసటి సంవత్సరంలో తండ్రి మరణించారు. హైస్కూలు చదువులో లీబ్‌క్నెఖ్ట్ ‌తన ప్రతిభను నిరూపించుకున్నాడు. సోషలిస్టు సెంట్‌ ‌సైమన్‌ ‌రచనలతో బాటు విస్తృతంగా గ్రంథాలు పఠించేవాడు. పదహారవ ఏట గీసెన్‌ ‌విశ్వవిద్యాలయంలో ప్రవేశించాడు. అటు తర్వాత బెర్లిన్‌కి మారాడు. అక్కడ ఆయన తత్వశాస్త్రం, భాషా శాస్త్రం, మతతత్వ శాస్త్రం అభ్యసించాడు. విశ్వవిద్యాలయాల్లో ఉన్న కాలంలో లీబ్‌క్నెఖ్ట్ ‌క్రీస్తుమత సారాంశం గురించీ, శ్రమ వ్యవస్థీకరణ గురించీ, భావి సమాజపు స్వభావం గురించీ విద్యార్థుల మధ్య జరిగే చర్చల్లో చురుకుగా పాల్గొనేవాడు. బెర్లిన్‌లో తన చదువు ముగించుకొని గీసెన్‌కి వెళ్ళేటప్పుడు ఆయన స్విస్‌ ‌సాక్సనీకీ, అప్పట్లో ఆస్ట్రియన్‌ ‌సామ్రాజ్యంలో భాగమైన బొహీమియాకీ చేరుకున్నాడు. కానైతే, ఆయన క్రాకొన్‌ ‌తిరుగుబాటులో పాల్గొన్నాడని అనుమానించి, ఆయన్ని అధికారులు దేశం నుంచి బహిష్కరించారు. జీవితంలో ఆయన ఎదుర్కొన్న దేశ బహిష్కారాల, పోలీసు నిర్బంధాల పంపరలో అదే మొదటిది.

1840 దశకపు మధ్య సంవత్సరాలు అసలైన వృత్తి కోసం అన్వేషణలో గడిచాయి. ఒకప్పుడు ఆయన తన జీవితాన్ని విజ్ఞానశాస్త్ర అధ్యయనానికి అంకితం చేయాలని కలలు కన్నాడు. కాని దేశపు అనేక విశ్వవిద్యాలయాల్లో ఉన్న బ్యురాక్రటిక్‌ ‌క్రమశిక్షణనూ, హోదా ఆరాధననూ, దారుణమైన రెట్‌టేపునూ చూసిన మీదట తన సూత్రాలకు తిలోదకాలు ఇచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని అర్థం చేసుకున్నాడు.

లీబ్‌క్నెఖ్ట్ నానాటికీ అధికంగా రాజకీయ కార్యకలాపాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన వివిధ రాజకీయ బృందాలను సన్నిహితంగా పరిశీలించి, నాటి కార్యక్రమాలను తెలుసుకున్నాడు. స్వయంగా వేలెత్తి చూపరాని నిజయితీపరుడూ, సామాన్య శ్రామిక జనం పట్ల సానుభూతి కలవాడూ అయిన లీబ్‌క్నెఖ్ట్ ‌లిబరల్సూ, అంతకంటే అధ్వానం పాలకవర్గాలూ జనానికి స్వేచ్ఛాయుత జీవితాన్ని తీసుకురాజాలరన్న నిర్ధారణకు వచ్చాడు. ఆయనే చెప్పనదాన్ని బట్టి ఆయన 1846లో కమ్యూనిస్టు అయాడు. లీబ్‌క్నెఖ్ట్ ‌సోషలిజం పట్ల ఆకర్షితుడవడంలో సాహిత్య పఠనం, అందునా ప్రత్యేకించి మార్కస్, ఎం‌గెల్సుల రచనల పఠనం ఒక ముఖ్యపాత్ర వహించింది.

1847 వేసవిలో లీబ్‌క్నెఖ్ట్ ‌స్విట్జర్లండులో ఉన్నాడు. అక్కడ ఆయన కార్ల్ ‌ప్రక్షబెల్‌ ‌ప్రైవేట్‌ ‌స్కూల్లో టీచరుగా పనిచెయ్యనారంభించాడు. అదిగో అక్కడే ఆయన మొట్టమొదటి సారి పత్రికా రచనలో తన సత్తాను పరీక్షించుకున్నాడు. 1847 సెప్టెంబరులో ఆయన ప్రతిపక్ష జర్మన్‌ ‌వార్తాపత్రిక ʹʹమాన్‌హైమెర్‌ అబెండ్‌సైటుంగ్‌ʹʹ (ʹʹ‌మాన్‌హైమ్‌ ‌సాయంకాల పత్రికʹʹ) కి విలేకరి అయాడు. బాగా ప్రతిభావంతుడైన పత్రికా రచయితగా వెంటనే పేరు పొందాడు. తదుపరి ఆర్నెలల్లో అత్యంత వైవిధ్యపూరిత అంశాలమీద ఆయన రాసిన సూమారు వంద వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. ఆయన ప్రతిభను గుర్తించి, ఒక జూరిహ్‌ ‌వార్తాపత్రిక సంపాదక పదవి ఇచ్చారు.

కాని ఆయన సంపాదక ఉద్యోగానికి అకస్మాత్తుగా విరామం ఏర్పడింది. 1848 ఫిబ్రవరి నాటికి ఆయన అప్పుడే విప్లవకర పారిస్‌లో ఉన్నాడు. పారిస్‌ ‌స్వేచ్ఛా వాయువులకు పారిస్‌వాసుల తలలు మాత్రమే కాక ఇతరుల తలలు కూడా తిరిగిపోయాయి. జర్మనీకి విప్లవాన్ని ఎగుమతి చేసే ఒక దళాన్ని ఏర్పాటు చెయ్యాలని జర్మన్‌ ‌రాజకీయ ప్రవాసులు అనుకున్నారు. ఆ దళంలో స్వచ్ఛందంగా చేరేందుకు ముందుకొచ్చిన మొదటివాళ్ళలో లీబ్‌క్నెఖ్ట్ ఒకడు. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ దళం ఇంకా ఏర్పడక ముందే విచ్ఛిన్నమైపోయింది. లీబ్‌క్నెఖ్ట్ ‌వ్యాధితో చాలా రోజులు మంచం పట్టాడు. ఆయన తన ఆరోగ్యం కొలుకొని, ఫిబ్రవరి ఘటనలకు జర్మనీ ఎలా ప్రతిస్పందిస్తుందో చూసేందుకు నిరీక్షించవలసి వచ్చింది. జర్మనీ ప్రతిస్పందించింది.

1848 వసంతంలో దేశంలో విప్లవం ప్రజ్వరిల్లింది. లీబ్‌క్నెఖ్ట్ ‌దానిలో వెంటనే పాల్గోలేకపోయాడు. ఆయన వ్యాధి తరుపరి పరిణామాలు ఆయ్ని నీరసపెట్టాయి. ఆకురాలు కాలంలో మాత్రమే తన ఇద్దరు మిత్రులతో పాటు బూర్జువా డెమోక్రట్‌ ‌గుస్టావ్‌ ‌స్త్రూవె నాయకత్వంలో జరిగే తిరగుబాటులో చేరేందుకు ఆయన బాడెన్‌కి వెళ్ళాలని ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం జయప్రదం కాలేదు. లీబ్‌క్నెఖ్ట్, ఆయన సహచరులూ ప్రభుత్వ సైనికుల చేతికి చిక్కారు.

తన విడుదల అనంతరం లీబ్‌క్నెఖ్ట్ ‌వెంటనే బాడెన్‌ ‌ఘటనలకు కేంద్రమూ, సంస్థానపు రాజధానీ అయిన కార్లస్‌రూయెకి వెళ్ళాడు. అక్కడ ఆయన అంతకు ఒక ఏడాది ముందు తను కలవలేకపోయిన స్త్రూవెకి అడ్జుటెంట్‌ అయాడు. కాని బాడెన్‌ ‌తిరుగుబాటు అణచివెయ్యబడింది. 1849 జూన్‌ 5‌న లీబ్‌క్నెఖ్ట్ ‌మరోసారి అరెస్టు చేయబడి, రష్టాడ్‌ ‌జైలుకి తరలింపబడ్డాడు. జైలులో ఆయన చేసిన రాజకీయ ప్రచార పర్యవసానంగా మనస్సు మారిన సైనికుల చేత మూడు రోజుల తర్వాత ఆయన వదిలివేయబడ్డాడు. అటు తర్వాత ఆయన ప్రష్యన్‌ ‌సేనలకు వ్యతిరేకంగా జరిగిన చివరి పోరాటాల్లో పాల్గొని, రిపబ్లికన్‌ ‌సైన్య శేష భాగాలతో కలిసి సరిహద్దుల వెంట పారిపోయి, స్విట్జర్లాండుకి చేకున్నాడు. జర్మనీ ప్రవేశం ఆయనకి మరోసారి మూతబడింది. అయితే ఈసారి అది దీర్ఘ కాలం పాటు, అంటే పదమూడేళ్ళపాటు మూతబడింది.

జెనీవాలో స్థిరపడిన లీబ్‌క్నెఖ్ట్ ‌యువ ప్రవాసుల బృందానికి సన్నిహితుడయ్యాడు. 1849 వేసవిలో ఆయన మొదటిసారి ఎంగెల్సును కలిసాడు. అప్పటికి ఎంగెల్స్ ‌కూడా స్విట్జర్లండులోనే నివసిస్తున్నాడు. ఎంగెల్స్‌తో విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్ ‌పరిచయం ఆయన తదుపరి కార్యకలాపాల మీద సఫల ప్రభావం జరిపింది. 1849 ఆగస్టులో ఆయన జెనీవాలోని జర్మన్‌ ‌కార్మికుల సంఘంలో చేరాడు. ఆయన త్వరలోనే దాని అధ్యక్షడుగా ఎన్నుకోబడ్డాడు. 1850 ఫిబ్రవరిలో జరగవలసి ఉన్న ఆ సంఘపు మహాసభను అధికారులు నిషేధించారు. పలువురు ప్రతినిధులతో బాటు లీబ్‌క్నెఖ్ట్ అరెస్టు చెయ్యబడి, సుమారు రెండు నెలల పాటు విడి ఖైదు కొట్టులో నిర్బంధింపబడ్డాడు. అటు దరిమిలా స్విట్జర్లండు నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఆ రోజుల్లో ప్రవాసులకు ఆశ్రయంగా ఉంటూ వచ్చిన ఇంగ్లండుకు పోవడం కంటే ఆయనకి మరో గత్యంతరం లేకపోయింది. అక్కడ లండన్‌లో ఆయన మార్క్పును కలుసుకొని, అతి త్వరలోనే ఆయన కుటుంబ మిత్రుడయ్యాడు. అప్పుడే లీబ్‌క్నెఖ్ట్ ‌లీగులో సభ్యుడుగా చేరాడు.

మార్కస్‌తో మైత్రి లీబ్‌క్నెఖ్ట్ ‌మీద చాలా లాభదాయకమైన ప్రభావం బరపింది. లండన్‌ ‌ప్రవాస వర్గాలను కుదిపి వేస్తున్న రాజకీయోద్రేకాల సుడిగుండంలో శ్రామికవర్గ విప్లవోద్యమాన్ని సంఘటితం చేసేందుకు సరిగా ఏమి చెయ్యాలో ఒక్క మార్కస్, ఎం‌గెల్సులకు మాత్రమే తెలుసు. మార్కస్ ‌లీబ్‌క్నెఖ్ట్ ‌కి రాజకీయ గురువు అయ్యాడు. మార్కస్ ‌మూలంగానే లీబ్‌క్నెఖ్ట్ ‌పెటీబూర్జువా సోషలిజపు చివరి అవశేషాలను విసర్జించి, మార్క్సిస్టు శాస్త్రీయ సిద్ధాంత ధోరణిలో ఆలోచించగలిగాడు.

1862లో లీబ్‌క్నెఖ్ట్ ‌జర్మనీకి తిరిగి వెళ్ళాడు. అప్పటికే అక్కడ మహత్తరమైన ఘటనలు సంభవిస్తున్నాయి. త1863 మేలో ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌ ‌లైప్జిగ్‌ ‌నగరంలో అఖిల జర్మన్‌ ‌కార్మిక సంఘాన్ని నెలకొల్పాడు. మొదట్లో లీబ్‌క్నెఖ్ట్ ఈ ‌సంఘం నుంచి దూరంగా ఉండిపోయాడు. అయితే 1863 ఆకురాలు కాలంలో తన ఉపన్యాసాల్లో ట్రేడ్‌ ‌యూనియన్లను విస్తమీతం, పటిష్ఠం చెయ్యాలని ఉద్బోధించాడు. మార్కస్, ఎం‌గెల్సుల రచనలను కార్మికులకు పరిచయం చేసాడు. ఆయన లాసాల్‌ని కూడా కలుసుకొన్నాడు. అందరూ చిత్రించినంతటి అభివృద్ధి నిరోధకుడు కాడని ఆయన్ని ఒప్పించేందుకు లాసాల్‌ ‌ప్రయత్నించాడు. అయితే అలాంటి భావాలు అప్పటికే లీబ్‌క్నెఖ్ట్‌కి అనామోదయోగ్యకరంగా తయారయ్యాయి. 1865 ఫిబ్రవరి 28న బెర్లిన్‌ ‌ప్రెస్‌ ‌కార్మికులకు ఇచ్చిన ఉపన్యాసంలో పోగ్రెసిస్ట్ ‌పార్టీ గాని, ప్రష్యన్‌ ‌ప్రభుత్వం గాని కార్మికుల సాంఘిక డిమాండ్లను తీర్చజాలదని లీబ్‌క్నెఖ్ట్ ‌పేర్కొన్నాడు. ప్రభుత్వ సహాయానికి సంబంధించిన కబుర్లన్నీ దగా అనీ, బూర్జువా రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసినప్పుడు మాత్రమే కార్మికులకు నిజమైన మేలు జరుగుతుందనీ ఆయన చెప్పాడు.

లీబ్‌క్నెఖ్ట్ ‌కార్యకలాపాలు పోలీసుల దృష్టిని ఆకర్షించాయి. 1865 వేసవిలో ʹʹరాజ్య భద్రతకి ముప్పుʹʹ తెస్తున్న వ్యక్తి పేరిట బెర్లిన్‌ ‌నుంచీ, ప్రష్యా నుంచీ ఆయన బహిష్కరించబడ్డాడు. ఆయన సాక్సనీ రాజధాని లైప్జిగ్‌లో స్థిరపడ్డాడు. అక్కడే ఆయనకు యువ లేదు కార్మికుడూ, వర్కర్స్ ఎడ్యుకేషనల్‌ ‌సొసైటీ అధ్యక్షడూ అయిన ఔగుస్ట్ ‌బేబెల్‌తో పరిచయమైంది. లీబ్‌క్నెఖ్ట్‌తో తన పరిచయం సోషలిస్టుగా తను మారడాన్ని త్వరితం చేసిందని బేబెల్‌ ‌పేర్కొన్నాడు. లెనిన్‌ ఇలా రాసాడు: ʹʹబేబెల్‌ ‌తను ఏది కోరుకుంటున్నాడో సరిగా అది-మార్కస్ 1848‌లో చేసిన మహత్తర కృషితో సజీవ సంబంధం, అప్పట్లో నెలకొల్పబడిన చిన్నదే అయినప్పటికీ, నికరంగా శ్రామిక వర్గపుదైన పార్టీతో సంబంధం, మార్క్సిస్టు అభిప్రాయాల, మార్క్సిస్టు సంప్రదాయాల సజీవ ప్రతినిధి-లీబ్‌క్నెఖ్ట్‌లో లభించిందిʹʹ

లీబ్‌క్నెఖ్ట్ ‌తన కృషిని జర్మన్‌ ‌కార్మికవర్గానికి మాత్రమే పరిమితం చేసుకోలేదు. సిసలైన అంతర్జాతీయవాది అయిన లీబ్‌క్నెఖ్ట్ ‌మొదటి ఇంటర్నేషనల్‌ ‌వ్యవస్థీకరణలో పాల్గొన్నాడు. లండన్‌లో జరిగిన సంస్థాపక మహాసభకి మార్కస్ ‌స్వయంగా ఆహ్వానించినప్పటికీ, దురదృష్టవశాత్తూ, ఆయన హాజరు కాలేకపోయాడు. జర్మన్‌ ‌కార్మికవర్గ ఉద్యమ పరిస్థితిని గురించిన లిఖిత నివేదిక పంపడంతో ఆయన సరిపెట్టుకో వలసివచ్చింది. లైప్జిగ్‌లో ఇంటర్నేషనల్‌ ‌తరఫున ఆయన తన ప్రచార కృషిని కొనసాగించాడు. ఆ కృషి కచ్ఛితమైన ఫలితాలను ఇచ్చింది : 1866 మొదట్లో లైప్జిగ్‌ ఎడ్యుకేషనల్‌ ‌సొసైటీ కమిటీ సభ్యుల్లో పన్నెండు మంది అంతర్జాతీయ కార్మిక సంఘంలో చేరారు.

1866లో జరిగిన ఆస్ట్రో-ప్రష్యన్‌ ‌యుద్ధ ఫలితంగా జర్మనీలో ప్రష్యన్‌ ఆధిపత్యాన్ని నెలకొల్పిన ఉత్తర జర్మన్‌ ‌సమాఖ్య ఏర్పడింది. ʹʹపైనుంచిʹʹ జర్మన్‌ ఏకీకరణ కృషి పూర్తి కాసాగింది. ఘటనలు లీబ్‌క్నెఖ్ట్, ‌బేబెల్‌లు ఊహించనట్లు పరిణమించలేదు. అయినా కూడా, అమల్లో ఉన్న వ్యవస్థను విప్లవం ద్వారా కూలదోయం, దేశాన్ని ప్రజాస్వామికంగా ఐక్యం చెయ్యడం అనే తమ పంథా నుంచి వాళ్ళు బెసకలేదు. ప్రష్యన్‌ ‌నిరంకుశత్వానికి తమ విధానాన్ని సరిపుచ్చుకొన కోరని విప్లవకారులు అనుసరించగల సంభావ్య పంథా అదొక్కటే.

లీబ్‌క్నెఖ్ట్ 1867 ఆగస్టులో ఉత్తర జర్మన్‌ ‌సమాఖ్య నుంచి జర్మన్‌ ‌పార్లమెంటు రైహ్‌స్టాగ్‌కి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడు. బేబెల్‌ ‌సహకారంతో దానిలో పనిచేసాడు. మార్కస్, ఎం‌గెల్స్‌ల సూచనలను అనుసరించి పార్లమెంటరీ వేదికను ప్రష్యన్‌ ‌భూస్వాముల అభివృద్ధి నిరోధక దేశాంగ, విదేశాంగ విధానాలనీ, సైనికతత్వాన్నీ బట్టబయలు చేసి ఖండించేదుకు నేర్పుగా వినియోగించుకున్నారు. 1870-1871 ఫ్రెంచి-ప్రష్యన్‌ ‌యుద్ధ కాలంలో బేబెల్‌తో బాటు లీబ్‌క్నెఖ్ట్ ‌భూస్వాముల, బూర్జువాల దురాక్రమణపర పథకాలను వ్యతిరేకించి, అంతర్జాతీయ వాద వైఖరి తీసుకున్నాడు.

1868లో జరిగిన న్యూరెన్‌బెర్గ్ ‌మహాసభలో లీబ్‌క్నెఖ్ట్, ‌బేబెల్‌ల నాయకత్వంలో ఉన్న కార్మి సంఘాలు బూర్జువా ప్రజాస్వామిక ధోరణుల నుంచి వేరుపడ్డాయి. ఆ మహాసభ చేసిన నిర్ణయాల్లోకెల్లా, అతి ముఖ్యమైనది అంతర్జాతీయ కార్మిక సంఘపు కార్యక్రమాన్ని ఆమోదించడం. లాసాల్‌ ‌నాయకత్వంలో ఉన్న అఖిల జర్మన్‌ ‌కార్మిక సంఘంలోని వామపక్ష శక్తులతో 1868లో ఏర్పడిన కార్మిక సంఘాల న్యూరెన్‌బెర్గ్ ‌సమాఖ్య సంలీనం పర్యవసానంగా 1869లో ఐసెనాఖ్‌లో జరిగిన మహాసభలో జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌కార్మిక పార్టీ (ఐసెనాఖర్లు) నెలకొల్పబడింది. ఇదే జర్మన్‌ ‌కార్మిక వర్గపు విప్లవ సంఘానికి పునాది అయింది.

జర్మన్‌ ‌శ్రామికవర్గపు అభివృద్ధిలో ఐసెనాఖ్‌ ‌మహాసభ ఒక మూల మలుపు అయింది. జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌కార్మిక పార్టీ స్థాపన జర్మన్‌ ‌కార్మికోద్యమంలో మాత్రమే కాక, అంతర్జాతీయ కార్మిక వర్గ ఉద్యమం అంతట్లోనూ అత్యంత ప్రముఖమైన సంఘటన. అలాంటి పార్టీని స్థాపించిన ఘనత విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్ ‌కి చెందుతుంది.

1869లో లీబ్‌క్నెఖ్ట్, ‌బేబెల్‌ ‌నాయకత్వంలో ʹʹఫోక్‌స్టాట్‌ʹʹ (ʹʹ‌ప్రజారాజ్యంʹʹ) అనే వార్తాపత్రిక ప్రారంభించబడింది. అధికారికంగా అది సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌కార్మిక పార్టీ, అంతర్జాతీయ ట్రేడ్‌ ‌యూనియన్ల పత్రిక. కాని వాస్తవంలో అది జర్మనీలో ఇంటర్నేషనల్‌ ‌పత్రిక కూడా. అది అంతర్జాతీయ కార్మిక సంఘపు జనరల్‌ ‌కౌన్సిల్‌, ‌విభాగాల కార్యకలాపాలను గురించిన సమాచారాన్ని క్రమబద్ధంగా ప్రచురిస్తూ వచ్చింది. 1869 సెప్టెంబరులో బాసెల్‌లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంఘపు మహాసభకి లీబ్‌క్నెఖ్ట్ ‌జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌కార్మిక పార్టీ ప్రతినిధిగా హాజరయాడు. ఆ మహాసభ భూమిపై స్వామ్యం, వారసత్వ హక్కులు, ట్రేడ్‌ ‌యూనియన్ల పాత్ర సమస్యలపై చర్చలు జరిపింది.

జర్మనీకి తిరిగి వచ్చిన మొదట్లో భూమిపై వ్యక్తిగత స్వామ్యాన్ని రద్దు చేయడాన్ని గురించిన బాసెల్‌ ‌నిర్ణయం సరికాదేమోనని శంకించాడు. కాని అనుభవం ఆ నిర్ణయం సరైనదన్న విషయాన్ని తిరుగు లేకుండా నిరూపించింది. మార్చిలో పలు పట్టణాల్లో వ్యవసాయ సమస్యపై ఆయన ఉపన్యాసాలు ఇచ్చాడు. వాటిలో ఆయన బాసెల్‌ ‌తార్మానాన్ని బేషరతుగా సమర్థించాడు. 1870 జూన్‌లో ష్టుట్‌గార్ట్‌లో జరిగిన పార్టీ మహాసభలో సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ రాజకీయ వైఖరి గురించి ప్రసంగించాడు. ఈ సమస్య మీద చర్చకు విశేషమైన ఆచరణాత్మక ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే, రైహ్‌స్టాగ్‌ ఎన్నికలు ఆగస్టులో జరగవలసి ఉన్నాయి. కాగా, వాటి పట్ల పార్టీ వైఖరిని నిర్ధరించవలసి ఉంది. లీబ్‌క్నెఖ్ట్ ‌ప్రచారం నిమిత్తం ఎన్నికలను వినియోగించుకొనే లక్ష్యంతో వాటిలో పాల్గొనడానికి అనుకూలుడే. కాని బూర్జువా పార్టీలతో అన్ని రకాల ఎన్నికల ఒప్పందాలనూ ఆయన తిరస్కరించాడు.

1870 జూలై 19న ఫ్రాన్సు ప్రష్యా మీద యుద్ధం ప్రకటించింది. జూలై 21న రైహ్‌స్టాగ్‌ ‌సమావేశం జరిగింది. దానిలో సైనిక వ్యయం నిమిత్తం 12 కోట్ల డాలర్లను కేటాయించే సమస్యపై చర్చ జరిగింది. ఓటింగు జరిగినప్పుడు ఇద్దరు ప్రతినిధులు-విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్, ఔగుస్ట్ ‌బేబెల్‌ - ‌మాత్రమే ʹʹదేశభక్తియుతʹʹ ప్రతినాధుల కోపపూరితమైన కేకల మధ్య, తిరస్కారపూరితమైన పిల్లి కూతల మధ్య ప్రష్యన్‌ ‌ప్రభుత్వానికి సైనిక రుణాలకు వ్యతిరేకంగా ఓటు చేసారు. వాళ్ళ సాహసిక చర్య జర్మనీలో సంచహోనాన్ని కలిగించింది. నవంబరు మాసాంతంలో ప్రభుత్వం మరోసారి నిధుల కోసం అభ్యర్థించింది. లీబ్‌క్నెఖ్ట్, ‌బేబెల్‌లు అప్పుడు కూడా వ్యతిరేకంగా ఓటు చేసారు. సహజంగానే, బిస్మార్క్ అభివృద్ధి నిరోధక ప్రభుత్వం వామపక్ష ప్రతినిధుల ఈ పరివర్తనను క్షమించలేకపోయింది. ఆల్సేస్‌, ‌తూర్పు లొరైన్‌ల దురాక్రమణను వ్యతిరేకించినందుకు గాను ʹʹదేశద్రోహʹʹ నేరారోపణ మీద వాళ్ళు కోర్టులో హాజరు పరచబడ్డారు. అదే సమయంలో లీబ్‌క్నెఖ్ట్ ‌మీద ʹʹఘనత వహించిన ప్రభువు గారినిʹʹ అవమానపరిచాడన్న నేరం ఆరోపించబడింది. అపారమైన ఆసక్తిని రేకెత్తించిన ఆ కేసు విచారణ 1872 మార్చి 11న లైప్జిగ్‌లోని జిల్లా కోర్టులో ప్రారంభమై, పధ్నాలుగు రోజుల పాటు సాగింది. జర్మన్‌ ‌పత్రికలన్నింటి ప్రతినిధులతో కోర్టు హాలు నిండిపోయింది. వాళ్ళు పంపిన కోర్టు విచారణ వివరాలు పత్రికల్లో బోలెడు స్థలాన్ని ఆక్రమించాయి. కానైతే, నేరం ఆరోపింపబడిన వారి పేరు మాదుగా సోషలిజం మీదా, విప్లవకర కార్మికవర్గ ఉద్యమం మీదా నేరం చేసినట్లు తీర్పు చెప్పి, జర్మన్‌ ‌కార్మిక పార్టీకి నాయకులు లేకుండా చెయ్యాలన్న ప్రయత్నం విఫలమైంది. బేబెల్‌, ‌లీబ్‌క్నెఖ్ట్‌లు కోర్టు హాలును విప్లవకర శ్రామికవర్గ ప్రచారానికి ఒక వేదికను చేసుకున్నారు. రెండు వారాల పాటు సాగిన కోర్టు విచారణను సోషలిస్టు ప్రపంచ దృక్పథాన్నీ, విప్లవకర విధానాన్నీ వివరించేందుకు వాళ్ళు వినియోగించుకున్నారు. 8-4 మెజారిటీతో కోర్టు లీబ్‌క్నెఖ్ట్, ‌బేబెల్‌లు ʹʹదేశద్రోహానికిʹʹ సన్నాహాలు జరిపారన్న నేరారోపణపై వాళ్ళను ఒక దుర్గంలో రెండేళ్ళపాటు నిర్బంధించాలని తీర్పు చెప్పింది.

కోర్టులో బేబెల్‌, ‌లీబ్‌క్నెఖ్ట్‌ల సాహసిక ప్రవర్తన సోషలిజం, ప్రజాస్వామ్యాల కోసం పోరాడే ప్రముఖ యోధులుగా వారి ప్రతిష్ఠను జర్మనీలోనే కాకుండా సూదూర విదేశాల్లో సైతం ఇనుమడింప చేసింది. లీబ్‌క్నెఖ్ట్ ‌బంధువులూ, మిత్రలూ ఆయన్ని జైల్లో క్రమం వారీగా కలుసుకొని, కార్మికవర్గ ఉద్యమ పరిస్థితిని ఆయనకి చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా, కొన్ని సందర్భాల్లో చట్ట విరుద్ధమైన పద్ధతుల ద్వారా తెలియజేస్తూ ఉండేవారు. పార్టీకి ఎదురైన ముఖ్యమైన ఏ ఒక్క సమస్యా ఆయన దృష్టిని తప్పించుకోలేదు. జైలు నుంచి ఆయన మార్కస్, ఎం‌గెల్సులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు.

(ఇంకా ఉంది)

No. of visitors : 947
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  అరుణతార మార్చి - 2020
  ఉన్నావో సీత
  ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
  విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
  బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
  అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
  సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
  ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
  మూడో తరానికి...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •