మనకాలపు సాహిత్య కృషీవలుడు చిలుకూరి దేవపుత్రకి నివాళి

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

మనకాలపు సాహిత్య కృషీవలుడు చిలుకూరి దేవపుత్రకి నివాళి

- విర‌సం | 18.10.2016 10:51:34pm

ప్రముఖ కథా రచయిత, నవలాకారుడు చిలుకూరి దేవపుత్ర గారు (1952-2016) ఈ ఉదయం అనంతపురంలో గుండెపోటుతో మరణించారని తెలిసింది. ఆయన హఠాన్మరణం తెలుగు సాహితీలోకాన్ని విషాదంలో ముంచివేసింది. ఆయన రచనలు దళిత జీవిత చిత్రాన్ని గొప్పగా ఆవిష్కరించాయి. కరువు నేపథ్యం నుండి రాయలసీమ సమాజాన్ని లోతుగా చిత్రీకరించాయి. మానవ సమాజపు ఎన్నో భిన్న పార్శ్వాలను తడిమిన ఆయన రచనలు ఎంత సున్నితంగా ఉంటాయో అంటే సూటిగా, సరళంగా ఉంటాయి. అయిదు నవలలు, వంద కథలు ప్రచురిచిన దేవపుత్ర రచనలు మొత్తం ఇటీవలే పునర్ముద్రణ అయ్యాయి. వంకర టింకర ఓ, ఆరు గ్లాసులు, ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ అనే ఆరు కథా సంకలనాలుగా ఆయన కథలు వెలువడ్డాయి. అద్దంలో చందమామ, పంచమం, చీకటి పూలు, కక్షశిల ఆయన నవలలు. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ నవలగా ʹపంచమంʹ ఎన్నో ముద్రణలు పొందింది. ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, కన్నడ, ఒరియా భాషల్లోకి ఆయన రచనలు అనువాదమాయ్యాయి. ఆయన రచన నిండా జనజీవనమూ, ఆయన దృక్పథం ప్రజాపక్షం. దేవపుత్ర గారు విరసం సభ్యులెందరికో ఆత్మీయ మిత్రులు. ఇంకా ఎన్నో రచనలు చేయవలసిన ఆ కలం ఆగిపోవడం విషాదం. తెలుగు సాహిత్యానికి తీర్చలేని లోటు. చిలుకూరి దేవపుత్ర గారికి విప్లవ రచయితల సంఘం వినమ్రంగా నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నది.





No. of visitors : 700
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


హంతకులను కాపాడే వ్యవస్థను ప్రజాస్వామ్యం అనలేము.

విరసం | 03.04.2017 08:43:24am

నిందితులు అధికార పక్షానికి దగ్గరివారు కావడమే కాదు, రాజ్య స్వభావంలో కులవ్యవస్థను కాపాడే లక్షణం ఉండటం కూడా ఇందుకు కారణం. ఇటువంటి ఉదాహరణలు దేశవ్యాప్తంగా......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •