ఈ రోజుతో అటోఇటో తేలిపోవాలి
ముఖమో, ముమ్మారులా
విసర్జించే అద్దమో పగిలిపోవాలి
తెల్ల గడ్డంలోని నల్ల వెంట్రుక
ఎదురుపడిన రేబాండ్ చూపు
మాట వరసకు ఊడిన
గుండీలోంచి బయటపడ్డ బోసి ఛాతి
ఏదో ఒకటి మంట పెట్టక మానదు
మండిన చోట గోళ్లతో కాదు
గొడ్డళ్లతో గోక్కోకా తప్పదు
నచ్చనివాళ్లు వోండ్రూ అనండి
ముచ్చటేస్తే మీరూ గాండ్రు పెట్టండి.. మీ ఇష్టం!
ఇంకెంత కాలం.. ఇంకెంత దూరం..
అటో ఇటో వేటో పోటో పడిపోవాల్సిందే!
పాలకులంతా ప్రజాస్వామికవాదులై
ప్రజలేమో నియంతలైతే ఏమి చేస్తాం?
అన్నాలొద్దూ, సున్నాలొద్దూ
అవతలోడి గట్లో కాలేట్టేసి, ఆడి కూట్లో
మన్ను కొట్టేయమంటుంటే ఏమిచేస్తాం?
పాలూపెరుగూ, పెన్షనూ పరకా యేట్లో పడనీ..
చింకిపాతలను సర్రున చింపేసి..జెండా కర్రలెత్తి
మాపైకే దండెత్తి వస్తుంటే ఏమి చేస్తాం?
గణతంత్రమాయే!
జనమంటే జనమే, రణమంటే రణమే..
ఊరి మీదకు పొగమేఘాలూ
నేలంతా వణికించే శీతల జ్వరాలూ తప్ప
పిచ్చుక రెక్కలకంటిన చినుకుల పాటలుగానీ,
గసపెట్టే వరి మోపు పనల గోసలు గానీ
వినం పోమ్మంటుంటే, వీరంగాలేస్తుంటే
ఎంతటోడికైనా ఏమిటీ దిక్కు?
గిట్టనోళ్లు గిల్లనీ గిచ్చనీ
సూటూకోటూ అంటూ గాము పట్టించనీ..
మాల్యా కొట్టిన గోల్ఫ్ బంతికీ, గరిక నాభికీ
నడిమి దూరమెంతంటారా..అననీ!
సరిహద్దుల్లో తొడగొట్టే మొనగాడా..
అంబానీల బావుల్లోకి తొంగి చూడగలవా అంటారా..అడగనీ!
బస్ బస్... అబ్తో జ్యాదా హోగయా
మీ ఏడ్పులు ఎప్పుడూ ఉండేవేగానీ..
స్వాతంత్ర్యం వచ్చాక దేశం చిరునవ్వడమిదే.. తెలుసా!
వెతికీ వెతికీ ఆడీడి పుట్టల్లో
కుసాల్గా వేలెట్టింది మొదట మేమే.. నమ్మండి!
అప్పుడెప్పుడో కురుక్షేత్రం తరువాత మళ్లీ
జాతి జాతంతా కేరు కేరుమంటున్నదిప్పుడే.. వినపడుతుందా?
13.10.16
Type in English and Press Space to Convert in Telugu |
మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన : రివేరా9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన పై రివేరా ఉపన్యాసం....... |
చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..పుస్తకాల సంచిని గిరాటేసి
రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం
వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు
స్నేహితుల భుజాలపైనుంచి
నవ్వుతూ చూడటమే చివరిచూపు....... |
ఏప్రిల్ పండు II రివేరాపిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,... |
సాయంకాలం వాన!దుప్పటి కింద, దిండు అడుగున
పిల్లలు చూడకుంటా కప్పెట్టుకొన్న
వరదగూడుని మెలిపెడతావేమో... |
సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరావిప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే....... |
రెప్పని కప్పని నిద్దురఒకే రాత్రిని కప్పుకొన్న మనకి
ఒక్క నిద్దుర చాలదా?
చుక్క కలని పొదువుకోడానికి
ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?... |
ఈ రాక్షస గీతి వింటారా?మనం నిలబడిపోయిన చోట నుంచే
మన నడకలను మోసుకెళుతున్నారు
మనం ఆపేసిన రాగాలనే
తీగలుగా సాగిపోతున్నారు
మన గొంతునీ, మన వంతునీ
మనక్కిచ్చేసి వెళుతు... |
భయం చుట్టూ భయం..వీళ్లెక్కడ చంపుకుతింటారోనని ఆడవాళ్లకు భయం
భయంలేని ఆడవాళ్లంటే మగవాళ్లకు మహా భయం
దొంగలంటే భయం, పోలీసులన్నా మరి భయమే
తాళాలు లేని తలుపులంటే భ... |
నో, ఐ డోన్ట్ లైక్ టమాటటమాట రంగు సరే,
రసాలూరే సరస్సులేమీ..
కొంచెం కరిచిపట్టుకొన్న
మిలమిలా మీనాలేమీ..
పైకి కిందకి మునకలేసే
గత్తరబిత్తర గోళాలేమీ....... |
యంత్ర భూతమైన ప్రేమలు పత్ర హరితాలు కావాలని..సామాన్యులను అసామాన్య కథానాయకులను చేస్తున్న కాలం ఇది. ఇరాక్, నికరుగువా, పాలస్థీనాల్లో పాల ఫ్యాక్టరీలపై బాంబులు వేస్తున్నవాడినీ, మన గిన్నెల్లో విష క్షీరాలన... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |