ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

- కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ʹIn the dark times
Will there also be singing?
Yes, there will also be singing.
About the dark times.ʹBertoltBrecht (German Dramatist and Poet 1898-1956)

దేశంలో ఇప్పుడు రెండే ధోరణులున్నాయి. ఒకటి దేశమంతా కమ్ముకున్న అసహనం వుందన్న సత్యాన్ని ఒప్పుకొన్నది. రెండోది అదేమీ లేదన్న మాయకప్పుకున్నతనం. ఒకవైపు ప్రజలంతా ఏదో ముప్పు పొంచివుందన్న భయాందోళనలోకి నెట్టివేయబడుతున్న తీరుకళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా అబ్బే ఇదేమీలేదు ఒక జియోసిమ్తీసుకుంటే రాత్రింబవళ్ళు హాయిగా గడిపేయొచ్చు అన్నవర్గం ఎక్కువగా ముందుకు వస్తున్నకాలం వైపు అంతా పరుగులెడుతున్నతీరు.

యూనివర్శిటీలోనే తన కులం కారణంగా వెలివాడలో బతకాల్సిన యువతరం ఒకవైపు అదే రీతిలో తమ కులం కారణంగా ఆధిపత్యాన్ని నియంత్రణను తమచేతుల్లోకి తీసుకున్న మరొక తరం వెర్రిగా ఇదంతా ఫాల్స్ అని అరిచే అవకాశాన్ని వాడుకున్నభావజాలాన్నిఅధికార దర్పంతో పార్లమెంటులో గొంతు వినిపించిన భారీతనాన్నిచూసాం.

కానీ తనకున్న శక్తియుక్తులను కేంద్రీకరించుకొని అలుపెరుగని పోరాటం చేసిన అమ్మతనం కూడా మనకు ఎరుకలోకి వచ్చిందీ కాలంలోనే. తమ హేతువాద దృక్పధంతో ఎదిరించి నిలబడ్డవాళ్ళని హత్యచేసి కూడా ఏమీ ఎరగనట్టు నంగనాచిలా నటించిన రాజ్యాన్ని చూస్తూనే వున్నాం. ఇదంతా జరుగుతుండగానే ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మరో ప్రపంచానికి నమూనాగా అంచెలంచెలుగా తమపై అమలవుతున్న తీవ్ర నిర్బంధాన్నెదుర్కుంటూనే ఈ దేశ ఆదిమ వారసత్వాన్ని, సహజ వనరులను కాపాడుకుంటూ తమ ఉనికితోపాటు ఈ దేశ సార్వభౌమత్వాన్ని ఆత్మాభిమానాన్ని నిలబెట్టే ప్రత్యామ్నాయ జనతనసర్కారు ఏర్పాటు మధ్య భారతం కేంద్ర స్థానంగా బలమైన ప్రజా సైనిక శక్తితో తయారవుతోంది. ఇదంతా చూస్తూ వింటూ వున్న ఒక మారుమూల పాఠశాల ఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్ని భరించలేక ఈ ఉక్కపోతను ధిక్కరిస్తూ తనచుట్టూ వున్నఆకుకదలని తనాన్ని కవిత్వంగా మనముందు ఆవిష్కరించినదే ఈ సంకలనం. తను చెప్పదలచుకున్న దానిపట్ల తనగాఢమైన నమ్మకాన్నినిక్కచ్చితనాన్నినిబ్బరాన్నిఎక్కడా సడలకుండా చెప్పడం అది ఒక కొత్త అభివ్యక్తిలోఆవిష్కరించడం ఈ కవితాసంకలనంలో బాలసుధార్ మౌళి సాధించారు.

తన నిరంతర అధ్యయనం సమాజం పట్ల వున్నతన ప్రేమ, పసి పాపలాంటి తన మనసులోంచి వచ్చిన ప్రతి పదంలోను చిత్రించారు. ఈ సంకలనం ఆవిష్కరణ సమయంలో తనంకితమిచ్చిన గురువుగారు శివారెడ్డిగారు ఇందులో ఏ కవితనైనా తీసుకొని చదవండి కవిత్వమే వర్షిస్తుందన్న మాట అక్షరసత్యం. అది సాధనద్వారా మరింతగా చేరువ కావాలని ఆశిస్తూ తనకవిత్వంలోకి మిమ్మల్నాహ్వానిస్తూ..

ఈ సంకలనంలో మొదటి కవితలోనే తన పద్య నేపథ్యాన్నిమనకు ఇలా తెలియచేస్తారు మౌళి.

పద్యం ఎక్కడోలేదు
మనమధ్యే పద్యం సంచరిస్తుంది
ఇద్దరు మనుషుల మధ్య
మాటల్లేని వేళ
పద్యం
లోగొంతుకతో కొట్లాడుతుంది
రెండు ప్రాంతాల మధ్య
సందేహాల సంఘర్షణల మిద్దెమీద నిల్చొని
పద్యం
విలవిలలాడుతున్న దృశ్యం
కలవరపెడుతుంది (పద్యంగురించికాస్తామాట్లాడుతా)

విశాఖ మన్యంలో గత ఇరవైఏళ్ళుగా బాక్సైట్ఖనిజాన్ని అప్పనంగా తవ్వుకు పోవడానికి విదేశీకంపెనీలకు అనుమతుల ద్వారా తమ సొంత ఖజానాలను నింపుకోవడానికి రకరకాల జిత్తులమారితనాన్ని ప్రవేశపెడ్తూ రాజ్యం ఆడుతున్ననాటకాన్నిఅలాగే ఆదివాసుల సహజమైన జీవనవిధానాన్నివారి పోరాట మన:స్తత్వాన్నితన చిన్నికవిత ʹకొండమేకʹ లో హెచ్చరిస్తూ ఇలాచెప్తారు..

చలొస్తే వొణుకుతుంది
వానొస్తే తడుస్తుంది
ఎండకాస్తే నీడలోకివెళ్తుంది
ఆకలేస్తే తింటుంది
ఆదమరచి నిద్రిస్తుంది
కాళ్ళకిందనేలని
కళ్ళముందే కుళ్ళబొడుస్తుంటే
భయం భయంతో
పరుగు తీస్తుంది

కొండమేక
వొక్కసారి ఆగ్రహిస్తే
నేలకేసి కుమ్ముతుంది.

రాత్రిని తమ కవితలో వర్ణించని కవివుండరేమో! కానీ మౌళి తన విప్పారిన నేత్రాలతో చూస్తున్నసుదూరంగా వున్నఆకుపచ్చని రాత్రి వేరుగావుండి తనతో పాటు మనల్నిమోహించేలా చేస్తుంది.

రాత్రి. ఎన్నితరాలను చూసిన రాత్రో. ఎన్నితరాల ఆనందాలను,
ఆక్రందనలను మౌనంగా ఆలకించినరాత్రో.
....

రాత్రి ఆకుపచ్చని అడవి వాసనవేస్తుంది. రాత్రి నిషేధిత మనుషుల వాసనవేస్తుంది.
రాత్రి నిషేధిత మనుషుల మహాస్వప్నం వాసనవేస్తుంది.

ఈ రాత్రి – ఈ సరిహద్ధు మీద నిలబడి రేపటి ఉషోదయాన్నికాంక్షిస్తున్నాను.
ఎదురుగా వరుసలు వరుసలుగా కనిపిస్తున్న
కొండల్లోంచి మోహపూరితమైన పిలుపు వినిపిస్తోంది.

ఈ రాత్రిని – కళ్ళతోనూ హృదయంతోణు మోహిస్తున్నాను.

ఒకవైపు జనం పల్లెల నుండి పట్టణాలకు పరుగులెడుతున్నారు. ఇదిఅభివృద్ధి మంత్రదండం ద్వారానే సాధ్యమవుతోంది. కాబట్టి ఇంక పారిశ్రామికంగా బహుముఖ అభివృద్ధిని సాధిస్తామని చెప్తూ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్గో దావరీ కృష్ణాడెల్టా ప్రాంతాన్నిఒకేదెబ్బతో కాంక్రీట్ది బ్బలుగా మార్చి ఒక మాయా లోకాన్నిసృష్టించ చూస్తున్న పాలకవర్గాన్ని అసలు దేశమంటే నగరాలు భవనాలు ఆప్టికల్ఫై బర్గ్రిడ్లు కాదంటూ ఇలా మనమేం కలగనాలో చెప్తున్నారు.

ఇటుక ఇటుకవేసి
గోడకడుతున్నప్పుడే
ఇల్లుని కలగంటాం
ఇల్లు ఇల్లుకలిసి
వీధి రూపొందుతున్నప్పుడే
ఊరిని కలగంటాం
ఊరూ ఊరుకలిసి
మనిషిని అల్లుతున్నప్పుడే
దేశాన్ని కలగంటాం

ఇప్పుడు ఇళ్ళులేని, ఊళ్ళులేని
మనుషులేలేని
రాజధానిని
నిర్మించాలనుకుంటున్నప్పుడే
యుద్ధాన్నేకలగంటాం (దేన్నికలగంటాం?) అని సూటిగా చెప్తారు.

ఇంకా ఈ కవితా సంకలనంలోని కవితనేది తీసుకున్నా మొత్తం కోట్చేయాలనిపిస్తుంది. ఇందులో తను చూసిన ప్రాంతాన్ని నదులను సముద్ర తీరప్రాంతాన్ని మత్స్యకారుల జీవితాన్ని తన విద్యార్థుల పసిమనసును అలాగే రచయితగా తనపై తానేనిషేధాన్నివిధించుకున్నపెరుమాళ్మురుగన్పైనా, కలిబుర్గిపైనా, దారుణ హింసా అత్యాచారానికి గురైన గిరిజన అధ్యాపకురాలు సోనీసోరిపైనా, చిత్రకారుడు అక్బర్పైనా రాసిన కవితలతో పాటు అనువాద కవితలూవున్నాయి. కవిత్వం ఒక్కొక్కరికి ఒక్కోలా ఇంకి ఇగురుతుంది కాబట్టి మీరూ తప్పక త్వరగా చదివి ఆస్వాదించాలని ఆశిస్తూ చివరిగా తన సహజత్వాన్ని సున్నితత్వాన్ని తెలియచేసే కవితా పాదాలతో ముగిస్తూ తను మరింత అధ్యయనం సాధన ద్వారా తనపై వున్నప్రభావాల నుండి బయటపడుతూ సొంత ముద్రను అందుకోవాలని స్నేహంగా దగ్గరకు తీసుకుంటు ముగిస్తాను.

కాళ్ళకి చెప్పుల్లేనిజీవితం
కాళ్ళకింద సముద్రాన్ని – నిద్రలేపుతుంది.





No. of visitors : 986
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

ఒంటరి వెన్నెల

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.05.2016 08:29:33am

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది తూరుపింకా తెలవారక నీ పేరు తలుస్తూ పొలమారుతొంది...
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి

వాళ్ళేడుగురు..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 05.03.2018 07:53:11am

ఆ ఏడుగురూ ఈ నేలకు హామీపడిన వాగ్దానం నీకూ నాకూ తోవ చూపే సప్త వర్ణాల పతాకం నీలో నాలో సుళ్ళు తిరిగే దుఃఖం...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
    అరుణతార నవంబర్ - 2018
    International Seminar on Nationality Question
    రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
    ప్రభుత్వమే అసలైన కుట్రదారు
    సూర్యాక్షరం
    శ్వాసిస్తున్న స్వ‌ప్నం
    చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
    వెలిసిన రంగులు
    అతనేం చేసిండు?
    సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
    ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •