డ్రాక్యులా నీడ

| సాహిత్యం | క‌విత్వం

డ్రాక్యులా నీడ

- మహమూద్ | 20.10.2016 02:01:40am

రోతి హుయీ దెహ్లీజ్
ఖులా దర్వాజా
టూట్కే బిఖ్రా హువా సప్నోంకే ఘర్ కా కోనా కోనా
~

ఒకరి గుండెలింకొకరిలో కొట్టుకుంటుంటాయి
ఒకరి చూపులింకాకరి చూపులో ధైర్యం కోసం వెతుకుతాయి

మాటలు మూగబోయిన భాష
పొగలాగా వీధుల్లో పిచ్చిదౌతుంది

శిధిలాల్లోంచి చివరిశ్వాసలు తగలబడుతున్న
జాతి అంగుళీకాలను చూపిస్తాయి

దశాబ్దాల దాహపు రెక్కలు విచ్చుకొని
ఎడారి దేహం
ఒయాసిస్సుల తడి కోసం
వెదుకులాడుతుంది

ఇసుక పరదాల మధ్య స్వప్న కళేబరాల విస్ఫోటన ఉక్కపోతలో జీవితం ఉడికిపోతుంది

అస్తిత్వ పోరాట నిట్టూర్పులు ఇటుకలుగా
నిలబడ్డ ఆకారాల శైథిల్య తపనల తన్లాటను ఏ దిక్కూ అక్కున చేర్చుకోదు

పెదవి చిట్లిన నెత్తుటి ఊహ
విషాద సంగీతమై ఊరూరు తిరుగుతుంది

మరణించని అంతరాత్మల్లో దహించబడిన కాంక్షల ఠారింపు
నిరంతర యుధ్ధంలో మందుగుండు నీళ్ళోసుకుంటాయిట కలల కనుపాపలు

జంతూత్వాన్ని లొంగదీసుకూన్న
సూఫి సంస్కృతి జాబిలై చల్లబడిన నేల
మూగరోదనలను మోస్తున్న గాయాల పల్లకి

ఇసుకరేణువుల్లోంచి తోడిన
జలం జమ్జమ్ అయి అధములను అంబరానికెత్తింది
ప్రపంచానికొక వినూత్న సంస్కృతి నేర్పింది

శాంతి కాముకుల యుధ్ధకాంక్ష కింద
పడి చిట్లుతున్న ఎముకల ఆర్తనాదాలే
అల్లాహుక్బర్ గా ఆజా పలుకుతున్న
ఎమన్ సిరియా

నిత్యపుండ్లు స్రవిస్తున్న నెత్తుటి నిప్పుల మధ్య
మోసెస్ జీసస్ ప్రవక్త పాదాల ఆనవాలు మాయమై
సైన్యం బూట్ల గురుతులు గుండె లయను అదుపు చేస్తున్నాయి

అగ్రరాజ్యాల అపరిచితపాదాల రక్తదాహ నడకలో
ఎర్రగా కందింది అరేబియా జీవిక

చుట్టూ ఏ అలికిడి కదలిక విచ్చుకున్నా
చీల్చుకుపోయే లోహగద్దల నిప్పుల విసర్జనల కింద
పిప్పిగా మిగులుతోంది మిడిల్ ఈస్ట్
తెల్ల తలకవచాల కరచాలనం ఒక్కటే అక్కడ
స్నేహవాత్సల్యమై తిరగాడుతున్నది
మరణాలను లెక్కిస్తున్నది
తెగిన చర్మాలకూ ఆత్మలచీలికలకూ కుట్లేస్తున్నది

ఒకప్పటి చల్లయుధ్ధం ఇప్పుడు మళ్ళీ లోహకౌగిలైంది
వైమానిక భీకర వాయుశబ్దాల మధ్య
చిక్కబడిపోయింది అలెప్పో
కళ్ళ ముందర పేకమేడై కూలుతోంది

ఆధునిక బ్రూటస్ ల డెమోక్రసీ ఓ ప్రేలాపన పేలుళ్ళ సాక్షిగా విధ్వంసమౌతున్నది శతాబ్దాల శ్రమ నిర్మిత నాగరికత

నెలవంక నీడనీ
జుర్రేసుకుంటున్న రాకాసినాలుకలకు
తెలియనిదేం కాదు
అక్కడి భూగర్భం నిండా
లిక్విడ్ డాలర్ ప్రవాహం

పెట్రోలమృతం కదా కొన్ని డ్రాక్యులా శరీరాలకి...

జమ్జమ్ - శతాబ్దాలుగా మక్కాకు మంచినీటి వనరు.
అలెప్పో - రష్యా వైమానికి దాడులకు నాశనమైపోతున్న సిరియా నగరం
తెల్లతలకవచాలు- వైట్ హెల్మెట్సు అనే సిరియా స్థానిక సంస్థ యుధ్ధ క్షతగాత్రులను ఆదుకుంటోంది.

No. of visitors : 750
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తలపుల తోవలోకి స్వాగతం

మహమూద్ | 03.01.2017 12:14:11am

ఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన. ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితం...
...ఇంకా చదవండి

అలుగు నేత్రం

మహమూద్ | 03.07.2016 01:40:43am

ఒకరి కన్నుల తడి ఇంకొకరి కన్ను మోస్తున్న ఈ దివ్య సందర్భం కంటున్న కల ఒకటి కావడం ఎంత కాకతాళీయం...
...ఇంకా చదవండి

వారిద్దరూ

మహమూద్ | 01.06.2016 11:40:00am

కాలాన్ని మండించాలి లేదా మనమే మంటలమవ్వాలి...
...ఇంకా చదవండి

సజీవ జ్ఞాపకమై…

మహమూద్ | 17.04.2017 11:25:45am

వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన గాలి...
...ఇంకా చదవండి

చూపులు

మహమూద్ | 20.01.2018 01:04:56am

ఒక సామూహికత ఎర్రజెండాల ఎగరేసుకొని ఒకవిప్లవాన్ని నా చూపు కలగా ధరించింది ...
...ఇంకా చదవండి

వెల్తుర్ధ్వని

మహమూద్ | 21.12.2018 07:42:29pm

నీవెపుడూ నాకు దూరం కావు నీ కంటిరెప్పలు గీసిచ్చిన అరణ్య కవాతులు నీ సాంగత్యాన్ని గుర్తు చేసే స్నేహవీచికలు…....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •