పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

- | 20.10.2016 03:21:04pm

మ‌ధ్య భార‌తం ఇప్పుడు దేశ స‌రిహ‌ద్దుల‌ను త‌ల‌పిస్తోంది. సామాన్య ప్ర‌జ‌ల‌కు సైతం అక్క‌డ ర‌క్ష‌ణ క‌రువ‌వుతోంది. ఎప్పుడు.. ఎవ‌రు.. ఎందుకు.. ఎలా.. ఎక్‌కౌంట‌ర్ అవుతారో అర్థం కాని స్థితి. ప‌సిపిల్ల‌లు, రోజు కూలీలు, తాపీ మేస్త్రీలు, పాత్రికేయులు, న్యాయ‌వాదులు ఎవ‌రైనా స‌రే... రాత్రికి రాత్రి మావోయిస్టులుగా మారిపోయి.. శ‌వాలుగా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. ఎడ‌తెరిపిలేని హింస‌కు బ‌స్త‌ర్ ఇప్పుడు నెల‌వుగా మారుతోంది. మావోయిస్టుల నిర్మూలన పేరుతో జ‌రుగుతున్న ఈ హింస అమాయ‌క ప్రజ‌ల‌ను బ‌లిగొంటోంది. దేశాన్ని ర‌క్షిస్తున్నామంటున్న పోలీసులే.. దేశ ప్ర‌జ‌ల‌పై యుద్ధం చేస్తున్నారు. తాజాగా కుంట‌లో జ‌రిగిన బూట‌క‌పు ఎన్‌కౌంట‌రే అందుకు ఉదాహ‌ర‌ణ‌.

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంటలో 17వ తేది జరిగిన "ఎన్‌కౌంటర్" ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కుంటలో భెర్జి బేస్ క్యాంపు సమీపంలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం బుర్కనకోటకు చెందిన సోయం మనోహర్(26) అనే మావోయిస్టు మృతి చెందినట్లుగా కుంట పోలీసులు ప్ర‌క‌టించారు. మనోహర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం బుధవారం బుర్కనకోటకు తరలించారు. కాగా మనోహర్‌కు మావోయిస్టులతో సంబంధాలు లేవని వ్యవసాయంతో పాటు తాపీపని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడని అతని కుటుంబ సభ్యులు స్ప‌ష్టం చేస్తున్నారు. మావోయిస్టులతో కలసి కుంటలో దాడికి రాగా తాము జరిపిన కాల్పుల్లో మనోహర్ మృతిచెందాడని, అతని వద్ద తుపాకీ కూడా లభ్యమైందని పోలీసులు చెబుతున్నదంతా క‌ట్టుక‌థేన‌ని మ‌నోహ‌ర్ భార్య తిరుప‌త‌మ్మ అంటున్నారు. తన భర్త మూడ్రోజుల క్రితం తాపీ పని నిమిత్తం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్లు ఆమె తెలిపింది. బుర్కనకోటలో ఉంటూ తన భర్త వ్యవసాయంతోపాటు తాపీ పని చేసుకుంటున్నాడని ఆమె తెలిపింది. కాగా మనోహర్ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు పోలీసు రికార్డుల్లో లేదని చింతూరు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఎన్‌కౌంటర్ వార్త అనంతరం అతను బుర్కనకోటకు చెందిన వ్యక్తిగా తేలిందన్నారు.





No. of visitors : 1734
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మోటారు వాహ‌నాల‌తో తొక్కిస్తాడ‌ట‌

సంఘ‌ర్ష్‌ | 04.03.2017 12:26:49pm

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను రోడ్డు మీద వాహ‌నాల‌తో తొక్కించాలంటూ వ్యాఖ్యానించ‌డం హంత‌క రాజ్యం న‌గ్నంగా ఊరేగుతోంద‌న‌డానికి నిద‌ర్శ‌నం. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
    ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
    అరుణతార నవంబర్ 2019
    నరʹసింహం!ʹ
    విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
    ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
    గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
    వెల్తుర్ధ్వని - మెహమూద్
    జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
    In memory of comrade Pratap (Uday Kumar)
    పాలపుంతల దారిలో..
    టార్చిలైటు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •