స్మార‌క స్థూపం మీది పేర్లు - విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

స్మార‌క స్థూపం మీది పేర్లు - విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్

- ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 24.10.2016 01:22:31am

రెండ‌వ భాగం

విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్
(1826-1900))

1874 జనవరిలో రైహ్‌స్టాగ్‌కి కొత్తగా సార్వత్రిక ఎన్నికలు జరిగేనాటికి లీబ్‌•క్నెఖ్ట్ ఇం‌కా జైల్లోనే ఉన్నాడు. వాటిలో సోషల్‌ ‌డెమోక్రట్లు ఆరు సీట్లు గెలుచుకున్నారు. లీబ్‌క్నెఖ్ట్ ‌ష్టోల్‌బెర్గ్-‌ష్నేబెర్గ్ అనే తన సొంత నియోజక వర్గంలో మొదటి కౌంటింగులోనే ఎన్నికయ్యాడు. ఆయన ఏప్రిల్‌ 15‌న విడుదల చెయ్యబడ్డాడు. రెండేళ్ళ విరామానంతరం మొట్టమొదటి సారి 1874 జూలైలో కోబర్గ్‌లో జరిగిన పార్టీ సాధారణ మహాసభలో పాల్గొన్నాడు. ఆయన ఎంగెల్సుకి జైలై 27న రాసిన లేఖలో మహాసభ బాగా జరిగిందనీ, ప్రతినిధులు అంతకు ముందెప్పటికన్న అధికతర సైద్ధాంతిక స్పష్టతనూ, అధికతర ఉత్సాహాన్నీ ప్రదర్శించారనీ, సిసలైన పోరాట ధోరణిలో ఉన్నారనీ పేర్కొన్నాడు.

1875 మేలో గోతాలో జరిగిన మహాసభలో లాసాలియన్లు ఐసెనాఖ్‌ ‌పార్టీతో కలిసి, ఒకే కార్మికవర్గ పార్టీగా ఏర్పడ్డారు. అది అప్పుడు సోషలిస్టు కార్మిక పార్టీగా, 1890 తర్వాత జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీగా పిలవబడింది. ఈ ఏకీకరణ ద్వారా జర్మన్‌ ‌కార్మికవర్గ ఉద్యమంలో చీలిక అధిగమింపబడింది. భూస్వామ్య-బూర్జువా దోపిడిదారీ వ్యవస్థకీ, ప్రష్యన్‌ ‌సైనికవాదానికీ వ్యతిరేకంగా జరిపే పోరాటంలో శ్రామిక ప్రజలకు ఇప్పుడు మార్గాన్నీ, గమ్యాన్నీ చూపగలిగిన ఒక పార్టీ ఉంది.

అయితేనేం, గోతా మహాసభలో ఆమోదింపబడిన కార్యక్రమం మొత్తం మీద ఒక అతుకుల బొంత లాంటిది. కార్మికవర్గం అప్పటికే సాధించిన స్థాయిని అది ప్రతిబింబించలేదు. లాసాలియన్‌, ‌పెటీబూర్జువా, అవకాశవాద అభిప్రాయాలతో రాజీ కొత్త పార్టీని ప్రభావితం చెయ్యకుండా ఉండటం సాధ్యం కాలేదు. సరిగా ఈ కారణంగానే మార్కస్, ఎం‌గెల్సులు ఆ ఏకీకరణను ఒక ప్రధాన విజయంగా అంగీకరిస్తూనే, దాని ప్రతికూల పార్శ్వాలను కూడా స్పష్టంగా చూసారు. దాన్ని పటిష్ఠం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఏకీకరణకు ఆమోదించడం ద్వారా లీబ్‌క్నెఖ్ట్, ‌బేబెల్‌లు శ్రామిక ప్రజలను లాసాలియనిజం ప్రభావం నుంచి విముక్తం చెయ్యగలమని ఆశించారు, దానిలో వారు చాలా వరకు విజయం కూడా సాధించారు.

తన ప్రత్యక్ష కార్యకలాపాల్లో జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ విప్లవకర విధానాన్ని అనుసరించి, శ్రామిక జనబాహుళ్యంలో మార్కస్ ‌భావాలను వ్యాపింపజేసేందుకు తోడ్పడింది. ఈ కృషిలో అది మంచి విజయాలను సాధించింది. 1877లో రైహ్‌స్టాగ్‌కి జరిగిన ఎన్నికల్లో పార్టీ 4,93,447 ఓట్లు సంపాదించుకుంది. దీనితో ప్రభుత్వ శిబిరంలో ఠారు పుట్టింది. దేశంలో సోషలిస్టు భావాల వ్యాప్తిని ఆరికట్టేందుకు గాను 1878లో ప్రభుత్వం సోషలిస్టు వ్యతిరేక చట్టాన్ని జారీ చేసింది.

ఈ చట్టం కార్మికవర్గ ఉద్యమంలో సోషలస్టు భావాలను నిర్మూలించేందుకూ, సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీని రూపుమాపేందుకూ ఉద్దేశింపబడిన రాజకీయ, పరిపాలక, క్రిమినల్‌, ‌న్యాయశాస్త్రీయ చర్యల, ప్రభుత్వ-పోలీసు స్వభావం కలిగిన తదితర చర్యల ఒక మొత్తం వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించేదిగా ఉంది. మూడు వందల ముప్పయ్‌ ‌రెండు కేంద్ర, స్తానిక సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌సంఘాలు రద్దు చెయ్యబడ్డాయి, నిషేధింపబడ్డాయి. ప్రష్యా రాజు మొదటి విల్‌హెల్మ్ ‌ప్రభుత్వం చాలా ట్రేడ్‌ ‌యూనియన్లను, ఆస్పత్రి నిధులను, కార్మిక సంఘాలను నిషేధించింది. సభలు రద్దు చెయ్యబడ్డాయి. పుస్తకాలు, కరపత్రాలు జప్తు చెయ్యబడ్డాయి. పోలీసుల దృష్టిలో ఏ పట్టణాల్లో, ఏ జిల్లాల్లో ʹʹపౌర శాంతి భద్రతల ప్రమాదంʹʹ ఉందో అక్కడ ప్రత్యేకించి తీవ్రమైన శిక్షలు విధింపబడ్డాయి. అక్కడ ʹʹచిన్న ఎత్తు దిగ్బంధ స్థితిʹʹ ప్రకటింపబడింది.

ఈ సోషలిస్టు వ్యతిరేక చట్టం జర్మనీలో పన్నెండు కఠిన వత్సరాల పాటు అమల్లో ఉంది. లెనిన్‌ ఈ ‌పన్నుండేళ్ళను జర్మన్‌ ‌కార్మికవర్గ ఉద్యమపు వీరోచిత దశగా పరిగణించాడు. పార్టీ బహిరంగ, రహస్య కార్యకలాపాలను నేర్పుగా మేళవించింది. పార్లమెంటులోనూ, బయటా ఉపన్యాసాలు సాగాయి. పార్టీ జనబాహుళ్యంతో సంబంధాలు దృఢం చేసి, జనం మధ్య భారీ స్థాయిలో శిక్షణ కృషి నిర్వహించింది. నిషేధింపబడిన సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ఉద్యమపు పత్రిక అయిన ʹʹఫోర్‌వార్టస్ʹʹ ‌స్థానంలో ʹʹసోషల్‌ ‌డెమెక్రట్‌ʹʹ అనే ఒక కొత్త, రహస్య వార్తాపత్రిక 1879లో ప్రారంభించబడింది. అది మొదట జూరిహ్‌లోనూ, దరిమిలా లంనులోనూ ప్రచురింపబడింది. చాలా మంది కార్మికుల ప్రమాదాన్ని లక్ష్యపెట్టక, దాన్ని జర్మనీలో పంచేందుకు తోడ్పడ్డారు.
సోషలిస్టు వ్యతిరేక చట్టం ప్రవేశపెట్టబడ్డాక మొదటి పార్టీ మహాసభ 1889 ఆగస్టుతో స్విట్జర్లాండులో, జూరిహ్‌కి అనతి దూరంలో, అత్యంత రహస్య పరిస్థితుల్లో జరిగింది. ఆ మహాసభ సమావేశం గురించి ʹʹసోషల్‌ ‌డెమోక్రట్‌ʹʹ ‌పత్రికలో ప్రకటింపబడింది. అయితే, దానిలో సమావేశ స్థల, కాల వివరాలు ఇవ్వబడలేదు. అందుచేత బిస్మార్క్ ‌పోలీసులు చుట్టూ పరుగులు తీసి, మహాసభ తన పని పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే అదెక్కడ జరిగిందో తెలుసుకున్నాడు. రైహ్‌స్టాగ్‌లో సోషల్‌ ‌డెమోక్రట్ల కార్యకలాపాలను గురించి లీబ్‌క్నెఖ్ట్ ‌మహాసభకి నివేదక ఇచ్చాడు. పార్టీ రైహ్‌స్టాగ్‌ ‌విభాగం సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ అత్యున్నత ప్రతినిధిగా ʹʹసోషల్‌ ‌డెమెక్రట్‌ʹʹ ‌దాని ఏకైక అధికార పత్రికగా గుర్తింపబడ్డాయి. ఆ మహాసభ జరిగిన కొద్ది కాలం తర్వాత లీబ్‌క్నెఖ్ట్ ‌లండనుకు వెళ్ళి, మార్కస్, ఎం‌గెల్సులకు పార్టీలోని, పత్రక సంపాదకవర్గంలోని స్థితిగతులను వివరించాడు. శాస్త్రీయ కమ్యూనిజం వ్యవస్థాపకులు పత్రిక వ్యాసాలను తీవ్రంగా విమర్శించాడు. 1880 నవంబరులో లండన్‌ ‌నుంచి తిరిగి వచ్చాక, తను ఇచ్చిన ఉపన్యాసాల్లో ఒకదానికి లీబ్‌క్నెఖ్ట్ ఆరు నెలల ఖైదు శిక్షకి గురయ్యాడు.

లీబ్‌క్నెఖ్ట్ ‌విడులకు కొద్ది కాలం తర్వాత సాక్సనీ ప్రభుత్వం ʹʹపైనుంచిʹʹ వచ్చిన ఒత్తిడి మూలంగా, లైప్జిగ్‌నూ, దాని పరిసరాలనూ ʹʹచిన్న ఎత్తు దిగ్బంధ స్థితిʹʹ లో ఉన్నట్లు ప్రటించి, లీబ్‌క్నెఖ్ట్, ‌బేబెల్లతో బాటు ముప్ఫయ్‌ ‌ముగ్గురు సోషల్‌ ‌డెమోక్రట్లను ఇరవై నాలుగు గంటలలోగా నగరం విడిచిపోవలసిందిగా ఆజ్ఞ జారీ చేసింది. లీబ్‌క్నెఖ్ట్ ‌బోర్స్‌డోర్ఫ్‌కి వెళ్ళి, సోషలిస్టు వ్యతిరేక చట్టం రద్దు చెయ్యబడేదాకా అక్కడ పోలీసు నిఘాలో నివసించాడు. అత్యంత వైవిధ్యపూరితమైన సాకులపైన కొద్ది వారాలు లేక నెలల పాటు తరచు జైలు శిక్షలకు గురి అవుతున్నప్టఇకీ, సోషలిస్టు భావాలను వ్యాపింప జేసేందుకూ, పార్టీ పలుకుబడిన పెంచేందుకూ ఆయన చురుకుగా తన కార్యకలపాలను కొనసాగించాడు.

మామూలాఉగా రైహ్‌స్టాగ్‌కి జరగవలసిన ఎన్నికలు 1881 అక్టోబరులో జరిగాయి. లీబ్‌క్నెఖ్ట్ ఏకకాలంలో 17 నియోజక వర్గాల్లో పోటీ చేసాడు. ఎన్ని రకాల వేధింపులున్నప్పటికీ, ఈ ఎన్నికల్లో సోషల్‌ ‌డెమోక్రట్లకి బ్రహ్మాండమైన విజయం లభించింది. పార్టీకి 3,00,000కు పైగా ఓట్లు వచ్చాయి.

పార్టీ ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది దృష్ట్యా, అమెరికాలో ప్రచార యాత్ర జరిపి, జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రట్ల కోసం నిధులు పోగు చెయ్యాలని లీబ్‌క్నెఖ్ట్ ‌నిర్ణయించుకున్నాడు. ఆయన అమెరికాకు 1886 సెప్టెంబరులో వెళ్ళి న్యూయార్కు, ఫిలడెల్ఫియా, బోస్టన్‌, ‌డెట్రాయిట్‌, ‌చికాగో, పిట్స్‌బర్గ్, ‌వాషింగ్‌టన్‌లలోనూ మరికొన్ని ఇతర నగరాల్లోనూ పర్యటించాడు. ఆయన తన ప్రసంగాల్లో కార్మికవర్గ ఉద్యమం గురించీ, సోషలిస్టు సిద్ధాంతం గురించీ మాట్లాడాడు. అయన పర్యటన సర్వత్రా విజయవంతంగా జరిగింది. ఆయన స్వయంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం లభించింది. ఆయన 16,000 మార్కులు, అంటే జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ ఎన్నికల నిధుల్లో సగానికి పైగా మొత్తం పోగు చేసాడు. లీబ్‌క్నెఖ్ట్ అమెరికాను గురించిన తన మనోముద్రలను ʹʹనూతన ప్రపంచ రేఖామాత్ర దర్శనంʹʹ పేరిట తన యాత్రా వ్యాసాల సంపుటంగా ప్రచురించాడు. చక్కగా రచింపబడిన ఆ పుస్తకంలో ఆసక్తికరమైన అనేక వ్యాఖ్యలు ఉన్నాయి.

ఈ అన్ని సంవత్సరాల్లోనూ అనేక ఇబ్బందులను అధిగమించి, లీబ్‌క్నెఖ్ట్ ‌తన సాహిత్య కృషిని కొనసాగించాడు. వార్తాపత్రికల్లో రాసిన అనేక వ్యాసాలకు చేసిన ప్రకటనలకు తోడు ఆయన కొన్ని ప్రధాన రచనలు వెలువరచాడు. వాటిలో ఆయన కొన్ని భాగాల్లో ప్రచురించిన ʹʹఫ్రెంచి మహావిప్లవ చరిత్రʹʹ ఒకటి. ʹʹసాలీళ్ళు, ఈగలుʹʹ అనే శీర్షికతో ఆయన రచించిన అతి చక్కటి చిన్న పుస్తకం ప్రత్యేకించి విశేష విజయం సాధించి, అనేక భాషల్లోకి అనువదింపబడింది.

సోషలిస్టు భావాలను చురుకుగా ప్రచారం చెయ్యడం, బూర్జువా వ్యవస్థ దోపిడీదారీ స్వభావాన్ని బహిర్గతం చేసి ఖండించడం, వీటికి తోడు సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌నాయకులు బోలెడు సంఘటనాత్మక కృషి చెయ్యడం అద్భుతమైఏ ఫలితాలనిచ్చాయి. రహస్యంగా పని చెయ్యవలసి వచ్చినప్పటికీ, బూర్జువా-భూస్వామ్య ప్రభుత్వం చేత పన్నెండేళ్ళ పాటు అసాధారణ పాశవికత్వంతో వేధింపబడినప్పటికీ, ఎన్నికల్లో పార్టీ నానాటికీ ఎక్కువ సీట్లు సంపాదించుకొంది. కార్మికవర్గంలో దాని పలుకుబడి నానాటికీ క్రమంగా పెరిగింది.

1893లో జరిగిన ఎన్నికల్లో పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు సోషల్‌ ‌డెమోక్రట్లకు ఓటు చేసారు. సోషలిస్టు వ్యతిరేక చట్టం వంటి ఘతుకమైన చర్యలు కార్మికవర్గ ఉద్యమాన్ని అణచలేవన్న నిర్ధారణకు బూర్జువా వర్గం వచ్చింది. 1890లో ఆ చట్టాన్ని పొడిగించేందుకు రైహ్‌స్టాగ్‌ ‌నిరాకరించింది.

1890 అక్టోబరులో సోషలిస్టు వ్యతిరేక చట్టం రద్దయాక మొదటిసారి, సోషలిస్టు కార్మిక పార్టీ బహిరంగ మహాసభ హల్లెలో జరిగింది. రైహ్‌స్టాగ్‌లో సీనియర్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌సభ్యుడుగా లీబ్‌క్నెఖ్ట్ ఆ ‌మహాసభను ప్రారంభించాడు. దేశపు నలు మూలల నుంచీ నాలుగు వందల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. వారికి తోడు అనేక ఇతర యూరపియన్‌ ‌దేశాల నుంచి సౌహార్ద ప్రతినిధులు హాజరయ్యారు. మారిన పరిస్థితుల దృష్ట్యా, ఆ మహాసభలో కొత్త పార్టీ నిబంధనావళి ఆమోదింపబడింది. మౌలికంగా ఆ నిబంధనలు ప్రజాతంత్ర కేంద్రీకరణకు అనురూపంగా ఉన్నాయి. ʹʹబెర్లినర్‌ ‌ఫోక్‌బ్లాట్‌ʹʹ (ʹʹ‌బెర్లిన్‌ ‌ప్రజా పత్రికʹʹ) పార్టీ అధికార పత్రిక అయింది. 1891 జనవరి 1 నుంచీ దాని పేరు ʹʹఫోర్‌వార్టస్ ‌బెర్లినర్‌ ‌ఫోక్‌స్టాట్‌ʹʹ (ʹʹ‌ముందుకు. బెర్లిన్‌ ‌ప్రజా పత్రికʹʹ) గా మార్చబడింది. మహాసభ లీబ్‌క్నెఖ్ట్‌ను ఆ పత్రిక ప్రధాన సంపాదకుడుగా నియమించింది. లీబ్‌క్నెఖ్ట్ ‌తను చనిపోయే దాకా ఆ పదవిలో ఉన్నాడు.

1891 ఆగస్టులో లీబ్‌క్నెఖ్ట్ ‌బ్రస్సెల్సులో జరిగిన రెండవ ఇంటర్నేషనల్‌ ‌మహాసభలో పాల్గొన్నాడు. దానిలో ఆయన సైనికతత్వం పట్ల కార్యికవర్గ వైఖరిని గురించి ప్రసంగించాడు. ఆయన శ్రామిక వర్గ అంతర్జాతీయవాదాన్ని సోషలిస్టు ఉద్యమంలో ఒక భాగంగా ప్రకటించి, కార్మికుడి శత్రుడు మరొక దేశంలోని కార్మికుడు కాడనీ, తన సొంత బూర్జువా వర్గమేననీ వక్కాణించి చెప్పాడు. బ్రస్సెల్స్ ‌మహాసభలో మార్క్సిస్టులకు ఘన విజయం లభించింది. దానిలో వాళ్ళు సంస్కరణవాద, అరాజకవాద ధోరణుల మీద గమనీయమైన విజయం పొందారు.

1895లో స్విట్జర్లండ్‌, ‌ఫ్రాన్సు, జర్మనీలకు వెళ్ళిన లెనిన్‌, ‌ప్లెహానొవ్‌ ʹʹ‌శ్రమ విమోచనʹʹ బృందంలో సంబంధాలు నెలకొల్పుకున్నాడు. బెర్లిన్‌లో చాహో కాలం ఆగి, లీబ్‌క్నెఖ్ట్‌ను కలుసుకున్నాడు.

1896లో లీబ్‌క్నెఖ్ట్ 70‌వ జన్మదినోత్సవం బెర్లిన్‌లో ఒక పండుగ మాదిరిగా జరపబడింది. ఆయన 70వ జన్మదినాన్ని జర్మన్‌ ‌కార్మికులు మాత్రమే కాకుండా, యావత్తు అంతర్జాతీయ శ్రామకవర్గమూ జరిపింది. ఆ సందర్భంగా చాలా దేశాల్లోని సోషలిస్టు పత్రికలు ప్రత్యేకానుబంధాలు ప్రచురించాయి.

తన జీవితపు చివరి సంవత్సరాల్లో లీబ్‌క్నెఖ్ట్ ‌చాలమంది సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌నాయకుల అవకాశవాద చర్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. బెర్న్‌స్టైన్‌ ʹʹ‌సైద్ధాంతిక పరిశోధనలుʹʹ ఆయన ప్రత్యేక విమర్శలకు గురయ్యాయి. ఔగుస్ట్, ‌బేబెల్‌, ‌పాల్‌ ‌సింగెర్‌, ‌క్లారా జెట్కిన్‌, ‌రోజా లుక్సెంబుర్గ్‌లతో బాటు జర్మన్‌ ‌కార్మికవర్గ ఉద్యమంలోని అత్యుత్తమ విప్లవకర శక్తుల పొత్తుతో మార్క్సిజానికి అనుకూలంగా లీబ్‌క్నెఖ్ట్ ‌పోరాడాడు. 1898లో ష్టుట్‌గార్ట్‌లో జరిగిన మహాసభ మినిట్స్, ‌లీబ్‌క్నెఖ్ట్ ‌తన ప్రసంగం చివర్లో ʹʹఉద్యమమే సర్వస్వం, అంతిమ లక్ష్యం ఏమీ కాదుʹʹ అన్న బెర్న్‌స్టైన్‌ ‌నినాదన్ని ఖండిస్తూ పెట్టుబడిదారీ సమాజాన్ని కూలదొయ్యడమే సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ఉద్యమ లక్ష్యం అని ఉద్ఘాటించనప్పుడు, మహాసభలో ఆమోద పూర్వకమైన హర్షధ్వానాలు మిన్ను ముట్టినట్లు పేర్కొన్నాయి.

లీబ్‌క్నెఖ్ట్ ‌హాజరు కాగలిగిన పార్టీ మహాసభల్లో చిట్ట చివరిదైన హన్నోవర్‌ ‌మహాసభ ఆమోదించిన ఒక తీర్మానం బూర్జువా సమాజపు యావత్తు చరిత్రా పార్టీకి ఇంతవరకు ఆ సమాజం గురించిన తన మౌలిక నిర్ధారణలను వదులుకోవలసిన లేక మార్చుకోవలసిన కారణాన్ని కల్పించలేదనీ, కాగా పార్టీ ఇంతకు ముందెప్పటిలాగే వర్గ పోరాటంలో విశ్వాసం కలిగి ఉందనీ, కార్మికవర్గ విముక్తిని తన సొంత బాధ్యతగా రాజకీయాధికారాన్ని చేజిక్కించుకోవడం కార్మికవర్గపు చారిత్రక కర్తవ్యంగా పరిగణిస్తోందనీ పేర్కొంది.

1899 ఆగస్టులో విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్ ʹʹ‌రాజీలు ససేమిరా వద్దు, ఎన్నికల ఒప్పందాలు ససేమిరా వద్దు!ʹʹ అనే తన చిన్న పుస్తకంలో సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీకి ఒక విజ్ఞప్తి చేసాడు.

లీబ్‌క్నెఖ్ట్ ‌రాజకీయ వీలునామాగా పరిణమించిన ఈ రచనలో వర్గ పోరాట ఎత్తుగవల నుంచి బెసకడం వల్ల కలిగే ప్రమాదాలను గురించి ఆయన పార్టీని హెచ్చరించాడు. కార్మికవర్గ పార్టీగా సోషలిస్టు పార్టీ పరిశుద్ధ వర్గ స్వభావాన్ని కాపాడి, కొనసాగించవలసిందిగా; ప్రచారం, శిక్షణ, సంఘటనల ద్వారా జయప్రదమైన విమోచనాత్మక పోరాటాన్ని పెంపొందించ వలసిందిగా; దేని చేతుల్లో అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ సమస్త రాజకీయ, ఆర్థిక అధికారమూ కేంద్రీకృతమై ఉందో ఆ వర్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రమబద్ధంగా పోరాడవలసిందిగా; ఈ పోరాట క్రమంలో వివిధ బూర్జువా పార్టీల మధ్య తలెత్తే విభేదాలనూ, ఘర్షణలనూ బాగా ఉపయోగించుకోవలసిందిగా పార్టీకి ఆయన విజ్ఞప్తి చేసాడు.

విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్ ‌తన జీవితపు చివరి రోజుల దాకా శ్రమపడి, ముమ్మరంగా పనిచెయ్యడం కొనసాగించాడు. ఆయన రాజకీయ జీవితంలో చురుకుగా పాల్గొన్నాడు. ఈ జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ నాయకుడు 1900 ఆగస్టు 7న మరణించాడు.

తన చివరి శ్వాస దాకా ఆయన మార్క్సిజం శత్రువుల మీద నిరంతరాయమైన పోరాటం సాగించాడు. ఆయన మరణం వల్ల విప్లవాత్మక ప్రపంచ దృక్పథపు సమర్థకుల శ్రేణుల్లో ఒక ఖాళీ ఏర్పటింది. పెట్టుబడిదారీ సామాజిక వ్యవస్థ పట్ల లీబ్‌క్నెఖ్ట్ ‌సుసంగతమైన విప్లవాత్మక వైఖరీ, కార్మికవర్గ ప్రయోజనాల పరిరక్షణార్థం ఆయన ఎడతెగకుండా ఇచ్చిన ఉపన్యాసాలూ, మార్క్సిజాన్ని చురుకుగా బోధించడమూ ప్రపంచమంతటా కార్మికుల దృష్టిలో ఆయనకి గౌరవాన్ని సంపాదించి పెట్టాయి. శ్రామికవర్గపు అనివార్య విజయం పట్లా, సోషలిస్టు సమాజం నిస్సందేహంగా ఏర్పడటం పట్లా ఆయనకి ప్రగాఢమైన నమ్మకం ఉంది.

విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్ ఏ ‌శ్రామికవర్గ విజయం కోసం పోరాటానికి తన యావజ్జీవితాన్నీ అంకితం చేసాడో, అదే లక్ష్య సాధన కోసం ఆయన కొడుకు కార్ల్ ‌లీబ్‌క్నెఖ్టట్ ‌కృషి చేసాడు. కార్ల్ ‌జర్మన్‌, అం‌తర్జాతీయ కార్మికవర్గ ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి, జర్మన్‌ ‌కమ్యూనిస్టు పార్టీ స్తాపకుల్లో ఒకడు, తన తండ్రికి తగిన వారసుడు.

No. of visitors : 850
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఆత్మీయ కలయిక
  కరవాలం చెప్పిన రహస్యం
  కాశ్మీరు మనది!
  మంచి కథ ఎప్పుడూ పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది
  అక్షర సాహసులకు చైతన్య స్ఫూర్తి విరసం
  విరసం తో నా అనుబంధం - అనుభవం
  కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •