సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

| క‌ర‌ప‌త్రం

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

- విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగుబాట్లలో రక్త తర్పణ చేసిన కష్ట జీవులు మొట్ట మొదటిసారి తమ విముక్తి కోసం, తమ రాజ్యం కోసం చేసిన విప్లవం అది. అందుకే తొట్టతొలి కార్మిక వర్గ విప్లవమది. అంతక ముందు ప్యారిస్‌ కమ్యూన్‌ అనుభవమున్నప్పటికీ.. రష్యా కార్మిక వర్గం విప్లవాన్ని విజయవంతం చేయడమేగాక విప్లవకర నియంతృత్వాన్ని అమలు చేసింది. దాని నీడలో సోషలిస్టు నిర్మాణ ప్రయత్నం చేసింది. అత్యంత ఊహాశాలి అయిన మనిషి వేల ఏళ్ల నుంచి తన సమస్త కల్పనాశక్తులను వెచ్చించి కూడా ఒక కలగానైనా కనలేని అద్భుతం బోల్షివిక్‌ విప్లవంలో జరిగింది. బానిస సమాజం నుంచి ఎన్నో చారిత్రక అగడ్తలను దాటుకుంటూ వచ్చిన మనిషి సాధించిన విజయం అది. రష్యన్‌ విప్లవమూ, విప్లవానంతరం కార్మిక వర్గ రాజ్యస్థాపన, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నం రోమాంచితాలు. మనుషులు ఇంత శక్తి సంపన్నులు ఎలా అయ్యారని నూరేళ్ల తర్వాత కూడా ప్రతి తరం కాల్పనికావేశానికి గురయ్యే చారిత్రక అనుభవం అది.

అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో పొడసూపిన శుష్క పితృదేశ భక్తిని తిరస్కరించి మన మహోపాధ్యాయుడు కామ్రేడ్‌ లెనిన్‌ నాయకత్వంలో యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి రష్యన్‌ ప్రజలు నవంబర్‌ విప్లవాన్ని విజయవంతం చేశారు. తాము నిర్మించుకుంటున్న సోషలిజాన్నేగాక మానవజాతి భవితవ్యాన్ని కాపాడటానికి రెండో ప్రపంచ సంగ్రామంలో మన ప్రియతమ నాయకుడు కామ్రేడ్‌ స్టాలిన్‌ నేతృత్వంలో మూడు కోట్ల మంది రక్త తర్పణ చేసి కమ్యూనిస్టు త్యాగ నిరతిని చాటి చెప్పారు.

రాజకీయ, సైనిక పంథాలను మేళవించి విప్లవాన్ని విజయవంతం చేయడమేగాక సకల జీవన రంగాలను విప్లవీకరించే మహత్తర ప్రజా ఆచరణ సోవియట్‌ యూనియన్‌లో సాగింది. మానవ సంబంధాలను, సంస్పందనలను, విలువలను, విశ్వాసాలను సోషలిస్టు రాజకీయార్థిక వ్యవస్థకు తగినట్లు పునర్నిర్మించే ప్రయత్నం జరిగింది. అది బోల్షివిక్‌ విప్లవానికి ముందు, ఆ తర్వాత కూడా ఒక్క చైనా అనుభవంలో తప్ప మరెన్నడూ, మరెక్కడా జరగని మానవీయ ప్రక్రియ. అది ఏకంగా మనిషినే పునర్నిర్మించడం. మానవత, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అనే సార్వజనీన విలువల ప్రాతిపదిక మీద సాగిన సామూహిక ఆచరణ కాబట్టే ఆ వెలుగులో వచ్చిన అప్పటిి రష్యన్‌ సాహిత్యం ఎల్లకాలాలకు కాంతి బావుటాలను ఎత్తిపడుతోంది. రష్యన్‌ విప్లవం, సోషలిస్టు ప్రయత్నం వలెనే ఈ నూరేళ్లుగా అక్కడి సాహిత్యం పోరాట శక్తుల మేధస్సుపై, అంతరంగాలపై వెలుగు రేఖలను పూయిస్తూనే ఉంది. రష్యన్‌ ప్రజల సామూహిక అనుభవాల పొరల్లోపలికి వెళ్లి వాటి చారిత్రక అర్థాలను కాల్పనీకరించిన ప్రతిభావంతమైన రచయితలు, మేధావులు ఎందరో ఆ విప్లవంలో పురుడుపోసుకున్నారు. నవంబర్‌ విప్లవ పూర్వ రంగంలోంచి.. సోషలిస్టు ఆచరణ కొనసాగినంత కాలం అలాంటి రచయితలను మనం చూస్తాం. కమ్యూనిస్టు పార్టీతో, విప్లవోద్యమంతో సాహిత్యకారులు ఎలా ఉండాలో తానే ఉదాహరణగా కామ్రేడ్‌ మాగ్జిమ్‌ గోర్కీ నిలిచిపోయాడు.

ఇరవయ్యో శతాబ్దంలో బలహీనమైన పెట్టుబడిదారీ విధానమున్న వ్యవసాయక రష్యాలో బోల్షివిక్‌ విప్లవం జరిగితే.. అత్యంత వెనుబడిన వ్యవసాయక చైనాలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైంది. పెట్టుబడిదారీ విధానపు తీవ్ర సంక్షోభంలోంచి పెట్టుబడికి శతృవు అయిన కార్మిక వర్గం సంఘటితమై విప్లవాల వెల్లువ సృష్టిస్తుందనే మార్క్స్‌, ఎంగెల్స్‌ సాధారణ సూత్రానికి భిన్నంగా అనేక చారిత్రక ప్రత్యేకతల్లోంచి, స్థానిక సమాజాల సంక్షోభాల నుంచి ఈ విప్లవాలు విజయవంతమయ్యాయి. దీనికి అక్కడి నాయకత్వ పాత్రతోపాటు విప్లవం రాగల దేశీయ పరిస్థితుల వల్ల కూడా ప్రజలు విజయం సాధించారు. వలస దేశాల్లో విప్లవాల గురించి లెనిన్‌, స్టాలిన్‌ల అవగాహనలను విస్తరించి కామ్రేడ్‌ మావో సే టుంగ్‌ చైనాలో నూతన ప్రజాస్వామిక విప్లవ దశను ప్రతిపాదించాడు.

విప్లవానంతరం సోషలిస్టు నిర్మాణ ప్రయత్నంలో చైనా రైతులు, కార్మికులు ఎన్నో అద్భుత ప్రయోగాలు చేశారు. అయినా సమాజంలోనేగాక కమ్యూనిస్టుపార్టీ కేంద్రంలోనే పెట్టుబడిదారీ శక్తులు పెచ్చరిల్లడంతో 1966 మే 16న మావో మహత్తర శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవానికి పిలుపు ఇచ్చాడు. ఈ ఏడాది మే నెల నుంచే 50 ఏళ్ల సాంస్కృతిక విప్లవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇరవయ్యో శతాబ్దంలో బోల్షివిక్‌ విప్లవం, చైనా నూతన ప్రజాస్వామిక విప్లవం వలె చైనా సాంస్కృతిక విప్లవానికీ అత్యంత ప్రాధాన్యత ఉన్నది.

కమ్యూనిజంలోకి వెళ్లడానికి సోషలిజం ఒక మధ్యంతర దశ. ఆ దశ ముగిసే వరకు వర్గాలు ఉంటాయి... వర్గాలు ఉన్నంత కాలం వర్గపోరాటం జరగాల్సిందే అనే మావో ఆలోచనకు ఆచరణ రూపమే సాంస్కృతిక విప్లవం. విప్లవ రాజ్యాధికారం పెట్టుబడిదారీశక్తుల బారినపడుతోంటే తిరిగి వర్గపోరాటం ద్వారా చైనా కార్మిక వర్గం తన అధికారాన్ని నిలబెట్టుకోడానికి చేసిన రెండో రాజకీయ విప్లవమే సాంస్కృతిక విప్లవం. అది కేవలం రాజకీయాధికారం కోసమే గాక విప్లవం తర్వాత కూడా అన్ని జీవన రంగాల్లో పాతుకపోయిన భూస్వామ్య విలువలను, విధానాలను, కొత్తగా పెచ్చరిల్లిపోతున్న పెట్టుబడిదారీ శక్తులను, వాటికి రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలోని రివిజనిస్టులను ధ్వంసం చేయడానికి సాగిన సాంస్కృతిక, భావజాల విప్లవం కూడా. అద నూతన మానవులను ఆవిష్కరించిన ప్రక్రియ. కృశ్చేవ్‌ నాయకత్వంలో సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన వర్గ సామరస్య విధానానికి వ్యతిరేకంగా మావో నాయకత్వంలో పదేళ్లపాటు గ్రేట్‌ డిబేట్‌ జరిగింది. ఈ ప్రేరణతో ప్రపంచ వ్యాప్తంగా 80 మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత చైనాలో శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో రివిజనిజాన్ని ఓడిస్తూ 1967 మే 23న నక్సల్బరీ ప్రజ్వలన భారత విప్లవోద్యమ పంథాను అందించింది. అది వర్గపోరాట మార్గం. దాని వెలుగులో దేశ ప్రజలు నూతన ప్రజాస్వామిక విప్లవంలో కొనసాగుతున్నారు.

రష్యా, చైనా విప్లవ విజయాల వలె విప్లవానంతరం ఈ రెండు సమాజాల్లో జరిగిన సోషలిస్టు ప్రయత్నాలు, వాటికి లోపల.. బైటా ఎదురైన సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న తీరు అంతే స్ఫూర్తిదాయకం. మానవజాతిని కొత్త చారిత్రక ఆవరణలోకి తీసికెళ్లిన ఈ విప్లవాలు, సోషలిజాలు అనేక కారణాల వల్ల తర్వాత్తర్వాత చరిత్రలో భాగమైపోయి ఉండవచ్చు. అవి ఉనికిలో ఉన్నప్పుడు, ఆ తర్వాత లోపలా, బైటా ఎన్నో విమర్శలకు గురై ఉండవచ్చు. కానీ అప్పుడూ, ఇప్పుడూ ఆ విప్లవాల వారసులు మహోపాధ్యాయులు లెనిన్‌, స్టాలిన్‌, మావోల పక్షాన నిలిచి.. వాళ్ల నాయకత్వంలో ప్రజలు సాధించిన విజయాలను గానం చేస్తునే ఉన్నారు. ఆ విప్లవాలు జరిగిన సమాజాల ప్రత్యేకతలను సహితం పరిగణలోకి తీసుకొని వాటి విశిష్టతలను విశ్లేషిస్తునే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగానే విప్లవ శక్తులు గత అనుభవాల నుంచి నేర్చుకుంటూ 21వ శతాబ్దంలో సోషలిస్టు నిర్మాణానికి ఆలోచనా, ఆచరణ తలాల్లో సంఘర్షిస్తున్నారు.

నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం నుంచి, చైనా విప్లవం(1949) నుంచి, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవం నుంచి ప్రపంచవ్యాప్తంగా పోరాటకారులు ఉత్తేజం పొందుతున్నారు. వలసానంతర సామ్రాజ్యవాద దశను పరిగణలోకి తీసుకొని ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో విప్లవాలకు కృషి చేస్తున్నారు. ఈ నూతన చారిత్రక రాజకీయార్థిక సాంఘిక ప్రపంచంలో విప్లవాలను విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గత విప్లవాల కంటే చాలా భిన్నంగా పరుచుకొని ఉన్న సాంఘిక జగత్తును పరిగణలోకి తీసుకొని ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనికి తప్పక రష్యా బోల్షివిక్‌ విప్లవం, చైనా సాంస్కృతిక విప్లవాలు ఉత్తేజాన్ని ఇస్తాయి. విప్లవ లక్ష్యంలేని రివిజనిస్టులకు కేవలం ఇవి సంబరాలు చేసుకునే సందర్భాలే. నేల మీద నిలబడి, ప్రజల మధ్య జీవిస్తూ చరిత్రను తమ చేతుల్లోకి తీసుకొని దాన్ని కొత్త పునాదులపై పునర్నిర్మించాలనుకుంటున్న విప్లవశక్తులకు ఇవి వర్గపోరాట చర్చా సందర్భాÛలు. మార్క్సిస్టు లెనినిస్టు మావోయిస్టు సిద్ధాంత ప్రజ్వలనానికి మరోసారి కలిసి వచ్చిన అవకాశాలు.

నక్సల్బరీ పంథా వెలుగులో భారత నిర్దిష్ట రాజకీయార్థిక సాంఘిక సాంస్కృతిక రంగాలకు చారిత్రక భౌతికవాదాన్ని అన్వయిస్తూ సాగించాల్సిన సిద్ధాంత కృషికి రష్యా విప్లవం, చైనా సాంస్కృతిక విప్లవం ప్రేరణనిస్తాయి. భారత దళారీ వ్యవస్థ అనేక సంక్షోభాల మధ్యే విస్తరిస్తూ మరింత పాశవికంగా మారుతున్న తరుణంలో నక్సల్బరీ పంథాయే ప్రత్యామ్నాయమని చెప్పడానికి కూడా ఈ సందర్భాలనే వాడుకోవాలి. అదనపు విలువ దోపిడీ రద్దుకావాలన్నా, పీడిత సమూహాలు సాంఘిక విముక్తి సాధించాలన్నా మార్క్సిజం వెలుగులో రాజకీయ, సామాజిక కార్యక్రమాన్ని రూపొందించుకొని ఉద్యమించాల్సిందే అని ఎలుగెత్తి చాటాలి. సోషలిస్టు శిబిరం పతనమయ్యాక ఇక ప్రపంచ వ్యాప్తంగా తమకు అడ్డం లేదని విర్రవీగుతున్న పెట్టుబడిదారీ శక్తులను నిలువరించాల్సి ఉన్నది. సోషలిజమే ప్రత్యామ్నాయమని భూగోళమంతా వినిపించేలా ప్రపంచ విప్లవ శక్తులు ప్రకటించాల్సి ఉన్నది. చరిత్రలో కలిసిపోయిన సోషలిజాలను చూపిి విప్లవం అవుట్‌ డేటెడ్‌ పొలిటికల్‌ ప్రోగ్రాం అనే వెర్రి ప్రేలాపనలకు దీటుగా 21వ శతాబ్దపు విప్లవాలు, సోషలిజాలు ఎలా ఉండబోతున్నాయో జనరంజకంగా ప్రచారంలో పెట్టాలి. రాబోయే నాలుగేళ్లలో చైనా సాంస్కృతిక విప్లవం, బోల్షివిక్‌ విప్లవం, చైనా విప్లవానికి 70 ఏళ్లు, నక్సల్బరీకి 50ఏళు, మార్క్స్‌ 200 జయంతి, లెనిన్‌ 150 జయంతి, విరసం 50 ఏళ్ల విరసం వంటి చారిత్రక సందర్భాలుగా రాబోతున్నాయి. సమకాలీన పరిస్థితుల్లో వీటన్నిటి అంతస్సూత్రంగా సోషలిజమే ప్రత్యామ్నాయం అనే నినాదాన్ని విరసం ఇప్పటికే ప్రచారంలోకి తీసుకొని వచ్చింది. చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లే కర్తవ్యాన్ని యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవాలతో విరసం ప్రారంభిస్తోంది. రచయితల సంఘంగా సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిపట్టడానికి ఈ సభను నిర్వహిస్తోంది. అందరికీ ఇదే స్వాగతం.

విరసం సభ
నవంబర్‌ 7, సాయంకాలం 5.00 గంటలకు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌

అధ్యక్షత : వరలక్ష్మి

అక్టోబర్‌ విప్లవ చరిత
ఎన్‌.వి.ఎస్‌ నాగభూషణ్‌

తెలుగు సాహిత్యంపై రష్యన్‌ విప్లవ పభ్రావం
బి. అనూరాధ

సాంస్కృతిక విప్లవం లేవనెత్తిన మౌలిక అంశాలు
వరవరరావు
ప్ర‌జా క‌ళామండ‌లి సాంస్కృతిక కార్య‌క్ర‌మాలుంటాయి


No. of visitors : 2463
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం

| 19.03.2018 03:20:51pm

కామ్రేడ్ మారోజు వీరన్న ప్రభావశీలమైన విద్యార్థి నాయకుడు. ఈ దేశ విప్లవం కోసం కలగన్నాడు. ముఖ్యంగా వర్గపోరాటంలో దళిత బహుజన పీడిత సమూహాల విముక్తి కోసం అనేక ఆలో.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •