మానవ హననంగా మారిన రాజ్యహింస

| సంపాద‌కీయం

మానవ హననంగా మారిన రాజ్యహింస

- పాణి | 02.11.2016 08:47:26am

హింసా హింసలు, ఎన్‌కౌంటర్లు-బూటకపు ఎన్‌కౌంటర్లు, గాలింపులు-ఏరివేతలు చాలా దూరం వెళ్లిపోయాయి. ఎంత దూరమంటే.. సామూహిక మానవ హననానికి రాజ్యం బరితెగించింది. ఇంతగా తెగపడ్డం కొత్తేమీ కాకపోయినా భారత విప్లవోద్యమ చరిత్రలోనే బెజ్జంకి మారణకాండ అతి పెద్ద నష్టం. 2009లో ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో ఆలౌట్‌ వార్‌ ప్రకటించాక జరిగిన నష్టాల్లో కూడా ఇది చాలా పెద్దది. మంద్రస్థాయి యుద్ధం ఇక తీవ్ర దశకు చేరుకున్నదని చెప్పవచ్చు. ఇప్పటికి మూడు దశలను దాటుకొని వచ్చిన గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ వాస్తవ రూపం మనకు బెజ్జంకి మారణకాండలో కనిపిస్తోంది. అందువల్ల మృతుల సంఖ్య రీత్యానేగాక ఇంకా అనేక కోణాల్లో ఈ ఘటన చాలా లోతైనది. ఇప్పటికి 36 మందిని చంపేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భాగంగా తమ ఆధీనంలో ఉన్న మావోయిస్టులను, ఆదివాసులను ఇంకెంత మందిని చంపేస్తారో చెప్పలేని పరిస్థితి. మావోయిస్టు పార్టీ తరపున చర్చలకు వచ్చిన ముగ్గురు నాయకులు సమాజం మీద చాలా ప్రభావం వేశారు. అందులో ఒకరైన ఆర్కేను హత్య చేయడానికి ఆయన పేరు మీదనే ఆపరేషన్‌ ఆర్కే అనే మానవ హనన కార్యక్రమానికి ప్రభుత్వం నిస్సిగ్గుగా సిద్ధపడింది.

మావోయిస్టులు చర్చలకు రావడం వల్ల జరిగిన లాభ నష్టాల గురించి ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నా ఒక గొప్ప మేలు జరిగింది. మావోయిస్టుల వ్యవహార శైలి, మాట తీరు, విశ్లేషణ పద్ధతులు ఎలా ఉంటాయో బహిరంగంగా ప్రజలు తెలుసుకున్నారు. అందులోనూ ఆ ముగ్గురి టీం లీడర్‌గా కూడా ఆర్కే సుతిమెత్తని మాటలు, ఆలోచనాత్మక సంభాషణ, పదునైన భావనల వల్ల ఆయన తెలుగు సమాజాల్లో జనరంజక గుర్తింపు పొందారు. ఆ రకంగా ఆయన మావోయిస్టు నిర్మాణానికేకాక, విప్లవ భావజాలానికే ప్రతినిధిగా సమాజంలో గుర్తింపు వచ్చింది. ఆయన ప్రత్యక్ష నేతృత్వంలో సాగుతున్న ఏవోబీ విప్లవోద్యమం మీద, అక్కడి ఆదివాసుల మీద జరిగి ఈ భయానక దాడికి సమాజ ప్రతిస్పందనలో ఈ గుర్తింపు విలువను మనం గమనించవచ్చు. నిజానికి ఇది ఎంత కానికాలమని అనుకున్నా..ఎనిమిది రోజులుగా ఆ నాయకుడి ఆచూకీ కోసం సమాజం ఎంత ఆరాటపడుతున్నదో తెలుసుకోగలం. అది నేరుగా రాజకీయ ప్రతిస్పందన కావచ్చు, కాకపోవచ్చు. కానీ సమాజాన్ని మార్చడమే తొలి తుది అవధిగా ఉన్న మావోయిస్టు ఉద్యమంపట్ల అదంతా ప్రజల మానవీయ స్పందనే అనుకున్నా అది తక్కువేమీ కాదు. చాలా ఎక్కువే. ఎందుకంటే మానవీయ విలువల ప్రతిష్ఠాపనకే మావోయిస్టుల ఆచరణ సాగుతున్నదనే ఎరుక అందులో ఉన్నది. దోపిడీ పీడనలు రద్దు చేసే రాజకీయ కార్యక్రమాన్ని మామూలు జనం తమకు తెలిసిన, తాము కోరుకుంటున్న మానవీయత వైపు నుంచి కూడా ఇలా అర్థం చేసుకుంటున్నారని ఈ వారం రోజుల వాళ్ల ఆరాటంలో వ్యక్తమవుతున్నది.

రాజకీయాల కొనసాగింపే యుద్ధమనే లెనిన్‌ సూత్రీకరణ అందరికీ తెలిసిందే. ఇంత మానవీయ రాజకీయాలొక వైపు, పరమ విధ్వంసకరమైన పాలక రాజకీయాలొక వైపు ఎదురుబొదురుగా నిలబడి యాభై ఏళ్లుగా కొట్లాడుకుంటున్నాయి. దాని కొనసాగింపుగానే ఇవాళ యుద్ధం జరుగుతున్నది. అది మంద్రస్థాయి యుద్ధంగా మొదలై కొనసాగుతున్నది. ఏడేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధం ఇవాళ బలిమెలలో తీవ్ర స్థాయికి చేరుకున్నది. నవంబర్‌ అనేక కుట్రలతో, దొంగ దెబ్బలతో ఏక పక్షంగా దాడి చేసి సామూహిక హత్యాకాండకు పాల్పడ్డ ఆంధ్రపద్రేశ్‌ డీజీపీ మాటలు యుద్ధానంతర ʹవిజేతʹల ప్రకటనలని ఎవరికైనా అనిపిస్తాయి. యుద్ధంలో ముప్పై ఆరు మంది విలువైన సహచరులను కోల్పోయిన దు:ఖంలో ఉండి కూడా, అగ్ర నాయకుడి వివరాలు తెలియని సందిగ్ధంలో ఉండి కూడా తమ విధానానికి వ్యతిరేకంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడతామనే ఓ అంగతక వార్త రాగానే అది తమ విధానం కాదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. యుద్ధ విధానాలపట్ల మావోయిస్టుల నిబద్ధత అది. వాళ్లది అంత పారదర్శకత.

కానీ ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఈ ఘటనపై ఆ రోజు ఉదయం నుంచి ఇప్పటి దాకా ప్రతి అక్షరం అబద్ధమే మాట్లాడుతున్నాడు. ఎన్‌కౌంటర్‌ జరిగిందనడానికి తన మాటల్లో ఒక్క వాక్యమూ నిలబడదని తెలిసినా పొంతన లేని ప్రకటనలతో నెట్టుకొస్తున్నాడు. చివరికి ఈ ఎన్‌కౌంటర్లో అబుబకర్‌ అనే సీనియర్‌ కమాండో మావోయిస్టుల తూటాలకు బలయ్యాడని చెప్పాడు కానీ అతని శరీరం మీద ఒక్క గాయం కూడా లేదని పత్రికల్లోనే వచ్చింది. ఆ తర్వాత కొంచెం మాట మార్చి ఆ పోలీసు మావోయిస్టులతో వీరోచితంగా పోరాడుతూ నీటి గుంటలో పొరబాటునపడిపోయాడని ఇంకో అబద్ధం చెప్పాడు.

దీనికంతా కారణం ఏమంటే అక్కడ ఎన్‌కౌంటర్‌ జరగనే లేదు. ఆపరేషన్‌ ఆర్కేలో భాగంగా చుట్టుముట్టి కాల్పులు జరిపి ఇంత మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ పథక రచన ఏపీ మార్గదర్శకత్వంలో ఒడిషా పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి చేశాయి. కోవర్ట్‌ కుట్రకు ఎప్పటి నుంచో సన్నాహాలు చేసి ఈ మారణకాండకు పాల్పడ్డాయి. ఎన్‌కౌంటర్‌ గురించి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మాత్రమే మాట్లాడుతున్నారు. ఒడిషా పోలీసులు మృతదేహాల గురించి తప్ప ఎన్‌కౌంటర్‌ గురించి ఇప్పటికీ నోరు విప్పలేదు. అన్నిటి కంటే విచిత్రమేమంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఎన్‌కౌంటర్‌ గురించి కానీ, ఆర్కే మిస్సింగ్‌ గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదంతా ఆపరేషన్‌ ఆర్కే వ్యూహంలో భాగం. ఆర్కే మిస్సింగ్‌ విషయంలో ఏపీ హైకోర్టు తీవ్ర ప్రతిస్పందన పట్ల కూడా పోలీసు అధికారులుగాని, ముఖ్యమంత్రి కానీ మాట్లాలేదు.

అధికారం, కుట్రలు కలిసి ఈ యుద్ధంలో పాలక రాజకీయాలే పై చేయి సాధిస్తూ ఉండవచ్చు, ప్రజా రాజకీయాలను ఎప్పటికప్పుడు దెబ్జ తీస్తూనే రావచ్చు. కానీ జన మానసంలో మావోయిస్టు రాజకీయాల ప్రతిష్టను రాజ్యం తుడిచేయలేకపోతున్నది.

ప్రభుత్వం మైనింగ్‌ మాఫియా మనసు గెలుచుకోవడంలో భాగంగా ఈ మానవ హననానికి పాల్పడింది. ఆదివాసుల పక్షాన మావోయిస్టులు, కార్పొరేట్ల పక్షాన పాలకవర్గాలు బరిలోకి దిగిన యుద్ధమిది. నిజానికి కార్పొరేట్ల పక్షాన అనే మాట కూడా అంత సరైంది కాదు. కార్పొరేట్లు వెనుక ఉండి తమ ప్రయోజనాలకు అనుగుణమైన రాజకీయశక్తులను నిర్దేశించే దశ దాటుకొని నేరుగా వాళ్లే మంత్రి పదవుల్లోకి వస్తున్నారు. చాలా తేటతెల్లంగా, అందరికీ చప్పున తెలిసిపోయేలా విద్య, వైద్య రంగాల్లో బలిసిన నారాయణ, కామినేని హటాత్తుగా మంత్రులైపోయారు. ఇక బాక్సైట్‌ తొవ్వకాల కోసం దశాబ్దాలుగా ఏవోబీలో మావోయిస్టుల ప్రతిఘటన ఎదుర్కొంటున్న కార్పొరేట్లు ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో నియంత్రించగలవో, తామే రాజ్యాన్ని నడపగలవో ఊహించుకోవచ్చు. ప్రభుత్వమే మాఫియాగా మారిపోయిన కాలమిది. అందువల్లే రాజ్యాంగబద్ధ విలువలను, పద్ధతులను చంద్రబాబునాయుడు ఏ మాత్రం పాటించదల్చుకోవడం లేదు.

అనేక కారణాల వల్ల ప్రతిఘటన లేకుండా కేవలం లబ్ధిదారులుగా ఉన్న ప్రజలతోనే చంద్రబాబు నాయుడు సంభాషించగలడు. అడుగడుగునా వాళ్లను మోసం చేసి, ప్రలోభపెట్టి.. విధ్వంసంలోకి తోసేయగలడు. దాన్నే అభివృద్ధి అని బుకాయించగలడు. అలాంటి ప్రాంతాల్లోనే ప్రజలు క్రమంగా తమ నిరసన, అసమ్మతి తెలియజేస్తున్నారు. అదే మావోయిస్టుల నాయకత్వం దొరికిన చోట ఆదివాసీ ప్రాంతాల్లో కార్పొరేట్ల చొరబాటును సాయుధంగా ప్రతిఘటిస్తున్నారు. ఏవోబీ ప్రాంతంలో ఆర్కే తదితరుల నాయకత్వంలో బాక్సైట్‌, కాఫీ తోటల విషయంలో ప్రజలు సమశీల పోరాటాలు చేస్తున్నారు. ఆపరేషన్‌ ఆర్కే అనే మాటకు ఇంకో అర్థం ఏవోబీలోని బాక్సైట్‌ గనులు కార్పొరేట్లకు అప్పగించడం. మైనింగ్‌ మాఫియాకు అటవీ సంపద ధారదత్తం చేయడం. దానికి మావోయిస్టు పార్టీ అడ్డంగా ఉన్నది. దాదాపు పదిహేనేళ్లుగా కామ్రేడ్‌ ఆర్కే నాయకత్వంలో ఏవోబీలోని ఆదివాసులు పెట్టుబడి వ్యతిరేక ఉద్యమం నడుపుతున్నారు.

అక్కడ విప్లవోద్యమం ఉన్నంత వరకు మైనింగ్‌ మాఫియాకు బాక్సైట్‌ దోపిడీకి అవకాశం లేదు. ప్రభుత్వాల, మైనింగ్‌ శక్తుల ప్రయోజనం ఒక్కటే. ప్రజలు తమ కనీస అవసరాల కోసం చేసే పోరాటాలను సహితం అణిచివేస్తున్న పాలకవర్గానికి మావోయిస్టు ఉద్యమం ఒక సవాల్‌గా మారింది. ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం. దేశంలోని అన్ని పోరాటాలకు విప్లవ శక్తిని అందించే మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ మారణకాండ జరిగింది. దీంతో విప్లవోద్యమం తీవ్రంగా నష్టపోయి ఉండవచ్చుగాని వెనకడుగు వేయదు. అమరుల త్యాగాలను స్మరించుకోవడమంటే.. అన్ని జీవన రంగాల్లో మావోయిస్టు విలువలను, రాజకీయాలను శక్తివంతం చేసి ప్రజా యుద్ధం తీవ్రం కావడానికి సాయం చేయడమే. అదే మనందరి కర్తవ్యం.


No. of visitors : 1254
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి

రోహిత్‌.. ఉప్పొంగే నినాదం

పాణి | 18.01.2017 10:34:19pm

రోహిత్‌ మరణం తర్వాత సంఘపరివార్‌ భావజాలం మన సమాజంలో ఎన్నెన్ని రూపాల్లో, ఎక్కెడెక్కడ ఎలా వ్యాప్తిలోకి వస్తుందో, ఉనికిలో ఉంటుందో తెలుసుకోవడంపట్ల అందర్నీ అప్ర...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •