అడ్డూ అదుపూ లేని అధికారాలు ఎంతకైనా తెగిస్తాయి. రాజ్యం చేతిలో ఆయుధంగా మారిన ఏ వ్యవస్థైనా ప్రజలకు వ్యతిరేకంగానే నిలబడుతుంది. అలాంటి లక్ష్యంతో ఆవిర్భవించిన ప్రైవేటు సాయుధ ముఠాయే సాల్వాజుడుం. విప్లవోద్యమానికి వ్యతిరేకంగా రాజ్యం సృష్టించిన ఈ హంతకముఠా... దశాబ్ధ కాలంపైగా చత్తీస్‌ఘడ్‌లో విచ్చల విడి హింసకు పాల్పడింది. చివరకు ప్రజాగ్రహానికి గురికాక తప్పలేదు.
కానీ ఇంతకాలం తరువాత సాల్వాజుడుం సాగించిన హింసా ధ్వంసపు వాస్తవాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఐదున్నర సంవత్సరాల తరువాత.. అలాంటి ఓ వాస్తవం బట్టబయలైంది. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 160 ఇళ్లను తగలబెట్టారు. నెపం నక్సలైట్లపై నెట్టారు. 2011 మార్చిలో చత్తీస్‌ఘడ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జరిగిన మారణహోమం పోలీసుల పనే అని సీబీఐ తేల్చిచెప్పింది.
ఈ కేసులో... ఎనిమిది మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లపై చార్జి షీటు కూడా దాఖలు చేసింది సీబీఐ. తాడిమెట్ల ఘటన జరిగిన రెండు వారాల తరువాత సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై జరిగిన దాడికి కారణంగా పేర్కొంటూ సాల్వాజుడుంకి చెందిన మరో 26 మంది పేర్లను చార్జిషీట్లో పేర్కొంది సీబీఐ.
విప్లవకారులను ఎదుర్కొనేందుకు యాంటీ ఇన్సర్జెన్సీ ఆపరేషన్‌లో భాగంగా చత్తీస్ఘడ్ ప్రభుత్వం సాల్వాజుడుం (శాంతి యాత్ర )ను ప్రవేశపెట్టింది. స్థానిక ఆదివాసీ యువకులకు ఆయుధాలు ఇచ్చి విప్లవకారులకు వ్యతిరేకంగా వారిని పురిగొల్పింది. ప్రత్యేక అధికారాలను కల్పిస్తూ విచ్చలవిడి హింసను ప్రోత్సహించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో వాళ్లు గ్రామాలపై పడి గృహ దహనాలు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడ్డారు. వందల సంఖ్యలో ఇలాంటి ఘటనలు జరిగినా... ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం.
200 జూలై 5న సుప్రీం కోర్టు సాల్వాజుడుంను రాజ్యాంగ విరుద్దమైన మూకగా పేర్కొన్నది. ప్రభుత్వం సాల్వాజుడుంను విరమించుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందిని సుందర్ వేసిన కేసులో సుప్రీం కోర్టు సాల్వాజుడుంతో పాటు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు సైతం చట్ట విరుద్దమైన నిర్మాణంగా పేర్కొంది. 2011 నుంచి 16 మధ్య కాలంలో మోరపల్లి, తాడిమెట్ల, తిమ్మపురం గ్రామాల్లో దాదాపు 250 గ్రామాలను సాల్వాజుడుం ధ్వంసం చేసిందని, సాల్వాజుడుం కార్యకర్తలు ముగ్గురిని చంపడంతో పాటు ముగ్గురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని నందినీ సుందర్ వాదన.
2011లో కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. కాగా తాడిమెట్ల గ్రామంలో 160 గృహాలను పూర్తిగా సాల్వాజుడుం దగ్ధం చేసిందని సీబీఐ విచారణలో తేలింది. గతంలో స్పెషల్ పోలీసులుగా పనిచేసి ప్రస్థుతం పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మడ్కం భీమ, వంజం దేవ, తెలం నంద, తెలం కోష తదితరులు తమను కొట్టి హింసించారని, తమ ఇళ్లను తగలబెట్టారని గ్రామస్థులు విచారణలో వెల్లడించారు. తాజాగా సీబీఐ తన నివేదికను కోర్టుకు సమర్పించింది. ఇంకా తేలాల్సిన విషయాలున్నాయని, తదనంతర విచారణ కొనసాగుతోందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది.
ఈ నివేదిక వెలుగులోకి రావడంతో.. చత్తీస్ఘడ్ పోలీసులు ఆగ్రహావేశాల్ని ప్రదర్శించారు. ప్రజా ఉద్యమాల అణచివేయడమే లక్ష్యంగా పనిచేసే పోలీసులు ఇప్పుడు ప్రతిఘాతుక ఉద్యమాలకు తెరతీశారు. మావోయిస్టు ఉద్యమానికి ఎదురు ఆదివాసీలను నిలబెట్టినట్లే... ఇప్పుడు ఉద్యమకారులపై విష ప్రచారానికి పూనుకున్నారు. చత్తీస్ఘడ్ రాష్ట్రంలో మనీస్ కుంజం, సోనీసూరి, నందినీ సుందర్, స్వామి అగ్నివేష్, బేలా బాటియా, హిమాంశు కుమార్ తదితర సామాజిక కార్యకర్తల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. మానవ హక్కల పరిరక్షణ పేరిట మావోయిస్టులను సమర్థిస్తున్నారని, పోలీసులకు వ్యతిరేకంగా పనిచేస్తన్నారని వాళ్ల ఆరోపిస్తూ... చిలుకపలుకులు పలుకుతున్నారు.
సాల్వాజుండుం కథ ముగిసిన తరువాత చత్తీస్ఘడ్ ప్రభుత్వం తాజాగా అగ్ని పేరుతో మరో రాజ్యాంగేతర సంస్థకు పురుడుపోసింది. మిషన్ 2016 పేరుతో మావోయిస్టు నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం అందుకు... విచ్చలవిడి అధికార దుర్వినియోగానికి పాల్పడతోంది. ఇలాంటి దశలో సాల్వాజుడుం అకృత్యాలు సీబీఐ బయటపెట్టడంతో ఇప్పుడు కొత్త దాడికి దిగుతోంది. ఇంతకాలం మావోయిస్టులను హింసా వాదులుగా చిత్రీకరించిన పోలీసులు తమను తాము కాపాడుకునేందుకు ఇప్పుడు ఎదురు దాడికి దిగుతున్నారు.
బస్తర్‌లో అడవీ సంపదను బహుళజాతి సంస్థలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వం ఆదివాసీలను అడవి నుంచి గెంటివేయాలనుకుంటోంది. ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఆదివాసీల పక్షాన నిలబడిన హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, పాత్రికేయులపై సైతం దాడులకు పాల్పడుతూ భయోత్సాతాన్ని సృష్టిస్తోంది.
Type in English and Press Space to Convert in Telugu |
అక్కడ డేనియల్ ఉన్నాడుఅక్కడ బాల్యం భయంలో... యవ్వనం నిర్బంధంలో గడిచిపోతుంది. ఇంటి నుంచి బయటకెళ్లిన పిల్లలు తిరిగి వస్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక... |
బోధనా హక్కు కోసం మరో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్.సాయిబాబా1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట... |
దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజంసామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........ |
మరో ఆదివాసీ యువకుడు...17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువకుడిగా తప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జవాన్లు చనిపోవడానికి కారణమైన అంబులెన్స్ ........ |
పొట్టకూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారుతాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్టయ్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన మనోహర్ శవమై తిరిగి వచ్చాడు. "ఎన్కౌంటర్" కథ రిపీట్ అయ్యింది.... |
వెలివాడే తొలిపొద్దై పుస్తకావిష్కరణరోహిత్ వేముల స్మృతిలో విప్లవ రచయితల సంఘం వెలువరించిన వెలివాడే తొలిపొద్దై పుస్తకాన్ని రోహిత్ తల్లి వేముల రాధిక ఆవిష్కరించారు. మార్చి ... |
సంతకు వెళ్లిన వాళ్లు.. శవాలై వచ్చారుఏకంగా ఇరవై రోజుల నుంచి మృత దేహాలను ఖననం చేయకుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఈ విషయంలో స్పందించకపోవ... |
అధికారం నీడలో.... అంతులేని హింస మోదీ ప్రభుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ సహజ వనరులను వేదాంత, ఎస్సార్, టాటా, జిందాల్ వంటి బహుళజాతి సంస్థలకు కట్టబెడుతోంది. అందుకు...... |
ఆ చెట్టుకు నోరుంటే ..ఆటపాటల్లో మురిసిపోయే పసివాడు ఉట్టన్నట్టుండి నక్సలైటయ్యాడు. కసిగా గుచ్చుకున్న బయోనెట్ మొన వాడి మొర ఆలకించలేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల... |
హక్కుల కార్యకర్తలను మోటారు వాహనాలతో తొక్కిస్తాడట హక్కుల కార్యకర్తలను రోడ్డు మీద వాహనాలతో తొక్కించాలంటూ వ్యాఖ్యానించడం హంతక రాజ్యం నగ్నంగా ఊరేగుతోందనడానికి నిదర్శనం. ... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |