చంద్ర‌బాబుకు బహిరంగ‌లేఖ‌

| సాహిత్యం | వ్యాసాలు

చంద్ర‌బాబుకు బహిరంగ‌లేఖ‌

- పౌర హ‌క్కుల సంఘం | 02.11.2016 09:45:50am

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి,
ప్రతి రోజు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి మాట్లాడే మీరు ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్‌ హత్యల పరంపర గురించి మౌనంగా ఎందుకు ఉన్నారు. మీ సహచర మంత్రులు మీ అనుమతి లేకుండా ఏమీ మాట్లాడరు. హోం మంత్రి గారు కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. డిజీపీ సాంబశివరావు గారు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవాలను మరుగున పరిచి మావోయిస్టు హత్యలపై గందరగోళం సృష్టిస్తున్నారు. 24వ తేదీన 18గా ఉన్న మృతుల సంఖ్య ఈ రోజుకు 30కి తేలింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెబుతూనే హ‌త్య‌ల‌ పరంపర కొనసాగుతూ ఉంది. అసలు ప్రభుత్వం టార్గెట్ ఎంత? ఇందులో మావోయిస్టులతో పాటు ఎంతమంది సాధారణ ఆదివాసీలను చంపాలనుకుంటున్నారు. న‌క్స‌లైట్ ఉద్య‌మం కారణంగా మన రాష్ట్రంలోకి పెట్టుబడులు రావుʹ అని మీ సహచర మంత్రులలో ఒకరు మాటాడటం చూస్తే భారీ సంఖ్యలోనే మావోయిస్టులను, ఆదివాసీలను చంపాలనే ನಿర్ణ‌యం తీసుకున్న‌ట్లుంది.

మీరు, మీ మంత్రులు రాజ్యాంగంపై ప్రమాణం చేసారు. ప్రభుత్వ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తిని దాని విలువలను, చట్టాన్ని గౌరవిస్తామనీ, ఆచరిస్తామ‌నీ ప్రజలకు వాగ్హానం చేశారు. కానీ రాజ్యాంగంలోని మౌళిక ప్రమాణాలైన సమానత్వం, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం కల్పించే దిశగా మీ పరిపాలన లేదనిపిస్తుంది. ప్రాధమిక హక్కులలో మౌళికమైన జీవించే హక్కుపట్ల గౌరవం లేద‌నిపిస్తోంది. శేషాచలం ఎన్‌కౌంట‌ర్‌ సంఘటనలో 21 మంది కూలీలను (మీ దృష్టిలో స్మ‌గ్ల‌ర్లు ) హతమార్చారు. ఎర్రచందనాన్ని స్మ‌గ్లింగ్ చేసిన వాళ్లంతా వివిధ పార్టీల‌ రాజకీయ నాయకుల అనుచ‌రులు, లేదా ఎన్నికల్లో గెలవడానికి రించిన వారే. వారిని అరెస్టు చేస్తున్నారు త‌ప్ప‌, ఎన్‌కౌంట‌ర్ పేరుతో హత్యచేయడం లేదు. వీరిని చంపమని చెప్పటం మా ఉద్దేశ్యం కాదు. నేరం చేసిన ఎవరినైనా చట్టబద్ధంగా అరెస్టుచేసి విచారణ జరిపి శిక్షించాలని అంటున్నాం. నేరస్తులు... దొంగలైనా, తీవ్ర‌వాదులైనా, ఉగ్ర‌వాదులైనా చ‌ట్టం అంద‌రికీ స‌మానంగా వ‌ర్తించాల‌ని చెబుతున్నాం. అలాగే నిషేధించ‌బ‌డిన రాజ‌కీయ పార్టీల స‌భ్యుల‌ను చంపే అధికారం ఏ ప్ర‌భుత్వాల‌కూ లేదు.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని చెప్పే నాయకుల్లో మీరు ఒకరు. చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకొని కోర్టుల విచారణ నుండి బయటపడే వారిలో మీకు మించినవారు లేరు. సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తుల‌తో చనువుగా మెలిగే, తిరిగే మీరు ఎన్ కౌంటర్ హ‌త్య‌ల‌పై ఉన్న‌త‌ న్యాయస్థానాల‌ అభిప్రాయాలను గౌరవిస్తారా? మావోయిస్టు పార్టీ ప్రముఖ నాయకుడు ఆజాద్ (రాజకుమార్) బూటకపు ఎన్‌కౌంట‌ర్ విచారణ సందర్భంగా స్తుప్రీం కోర్టు ఏం చెప్పిందో గుర్తు తెచ్చుకోండి. "భారత"రిపబ్లిక్ తన పిల్లలను తానే చంపకుంటుందా?" అలాగే మరొక సందర్భంలో ʹఎన్ కౌంటర్ ఫిలాసఫీ క్రిమినల్‌ ఫిలాసఫీ అని వాఖ్యానించింది. పై అధికారుల ఆదేశాల ప్రకారమే ఎన్‌కౌంట‌ర్ హ‌త్య‌లు చేస్తామ‌ని
కింది స్థాయి పోలీసులు, సాయుధ బ‌ల‌గాలు స‌మ‌ర్థించుకోవ‌డానికి వీలులేద‌ని వారు కూడా శిక్షార్హులే అని చెప్పింది. ఈ సందర్భంగా సుప్రీం కో్ర్టు మాజీ యుద్ధ ఖైదీల విచారణను గుర్తు చేస్తూ ఆదేశాలంటే ఆదేశాలే వాటిని పాటించాల్సిందే అన్న వీరి వాదనను న్యూవన్ బ‌ర్గ్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. రాజకీయ నిర్ణయం లేకుండా ఉన్నత స్థాయి పోలీసు అధికారులు మావోయిస్టుల, లేదా మ‌రొక‌రి హ‌త్య‌కు శ్రీకారం చుట్ట‌రు. అందుకే మీరు ఇన్ని రోజులైనా ఏఓబీ ఎన్‌కౌంట‌ర్‌ సంఘటనపై నోరు విప్పటం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటనా చేయటం లేదు. రాష్ట్ర డిజి.పి. సాంబశివరావు గారు ఒక్కరే మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో మీ సహచర మంత్రులు కూడా మౌనం పాటిస్తున్నారు. నిజంగా జూన్ 28, 2008లో బ‌లిమెల రిజర్వాయర్ ప్రాంతంలో 38 జవాన్లను మావోయిస్టు చంపారు. దీనికి ప్రతీకారంగా ఇప్పడు 76 మందిని చంపాలనుకుంటున్నారా?

ప్రతీకారం తీర్చుకోవడం నాగరిక ప్రభుత్వాలు, సమాజం ఒప్పకోదు. మన క్రిమినల్ న్యాయ వ్య‌వ‌స్థ‌లో (Criminal Judicial system) ప్ర‌తీకారానికి ప్ర‌భుత్వాలు పాల్పడకూడదు. ఈ విషయాలన్నింటిని గురించి చ‌ట్టంలో స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం మావోయిస్టుల‌పై యుద్ధం ప్ర‌క‌టించ‌డం, మావోయిస్టుల‌ను శ‌త్రువులుగా భావించి అంత‌మొందించింద‌ని సమర్ధించుకున్నా అంత‌ర్జాతీయ‌ మానవీయ మరియు హక్కుల సంఘాలు ఒప్పకొవు. యుద్ధ భావాలు ప్రాణాల‌కు హాని త‌ల‌పెట్ట‌కూడ‌దంటారు. కానీ 24న‌ మొదలైన"యుద్ధంʹ గాలింపు చర్యల పేరుతో కొనసాగిస్తు పోలీసు, సాయుధ బ‌ల‌గాల అదుపులో వున్న ఒక్కొక్కరిని చంపటం ఏ చట్టాలు ఒప్పకోవు. కానీ మీరు ఉద్దేశ్యపూర్వకంగానే మౌనంగా ఉన్నారు. మావోయిస్టుల, ఆదివాసుల హ‌త్య‌ల‌కు ఆమోదం తెలుపుతున్నారు. మీ ప్రభుత్వపాలనలో, పారదర్శకత, జవాబుదారీతనం తప్పక పాటించాలని కోరుతున్నాం.

- ఆంధ్ర-ఒరిస్నా సరిహద్దు ప్రాంతంలో వెంటనే గాలింపు చర్యలను, గాలింపు పేరిట జ‌రుగుతున్న మార‌ణ‌కాండ‌ని నిలిపివేయాలి.
- బూటకపు ఎన్ కౌంటర్ హత్యల విధానాలను విరమించుకోవాలి,
- మావోయిస్టుల ఉద్యమంతో రాజకీయంగా, ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా వ్యవహరించాలి.
- శవాలను గౌరవించి, భద్రపరచి బంధువులకు అప్పచెప్పడం మృతి చెందిన వారిహక్కు అని గ్రహించాలి.


శేష‌య్య‌
(కో-ఆర్డినేటర్ సీఎల్‌సీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ‌)

వి. చిట్టిబాబు,
( సి.ఎల్.సి. ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్)

చిలకా చంద్రశేఖర్
(పౌరహక్కమ‌ుల సంఘం జనరల్ సెక్రటరీ)

జి. ల‌క్ష్మ‌ణ్‌
(సీఎల్‌సీ తెలంగాణ అధ్య‌క్షులు)

ఎన్. నారాయణరావు
( సి.ఎల్.సి. జనరల్ సెక్రటరీ, తెలంగాణ)

No. of visitors : 934
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కూలీల‌ను కాల్చిచంపి.. మావోయిస్టుల ముద్ర‌వేశారు

గుముడుమహా ఎన్‌కౌంటర్‌ పై clc నిజ నిర్దారణ | 20.07.2016 06:43:38pm

కూలీలు ఆటోను ఎక్కబోతుండగా రోడ్డుకు ఎడమ ప్రక్క చెట్ల పొదల్లో మాటు వేసి కూర్చున్న పోలీసు బలగాలు ఒక్కసారిగా వారి మీదకు కాల్పులు జరిపారు. 5 మంది కూలీలు.......
...ఇంకా చదవండి

పొలం ప‌ని చేసుకుంటున్నోళ్ల‌ను కాల్చిచంపారు

పావురిగూడెం ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ నివేదిక | 15.08.2016 10:53:46pm

పొలం పనులు ముగించుకుని పక్కనే పారుతున్న వాగులోకి స్నానానికి బయలుదేరి పోతున్న న‌లుగురు యువ‌కులను ఉన్న‌ప‌ళంగా చుట్టుముట్టిన పోలీసులు వారిని నిర్థాక్షిణ్యంగా.....
...ఇంకా చదవండి

నిషేదాలు, నిర్భందానికి వ్య‌తిరేకంగా ఢిల్లీలో స‌ద‌స్సు

| 09.09.2016 09:38:48am

రాజ‌కీయ, సామాజిక‌, సాంస్కృతిక నిషేదాల‌కు వ్య‌తిరేకంగా; హ‌క్కులు, స్వేచ్ఛా న్యాయాలు క‌లిగిన ప్ర‌జాస్వామ్య పున‌రుద్ధ‌ర‌ణ‌కై ఢిల్లీలో ధ‌ర్నా, స‌ద‌స్సు.........
...ఇంకా చదవండి

పౌర ప్రజాస్వామిక హక్కుల అమలుకై రాజకీయనాయకులను నిలదీయండి

పౌరహక్కుల సంఘం | 06.12.2018 12:20:39am

ఈ విధమైన భయానక వాతావరణంలో, పోలీసుల డేగకన్నుల పహారాలో మహిళలు పోలింగు బూతులవరకు నడవడం ఎట్లా? క్యూలో గంటల తరబడి ఎందుకు నిలబడాలి? ఈ యుద్ద వాతావరణాన్ని తలపించే.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •