ఈ రాక్ష‌స గీతి వింటారా?

| సాహిత్యం | క‌విత్వం

ఈ రాక్ష‌స గీతి వింటారా?

- రివేరా | 02.11.2016 10:23:06am

కాలంలోని కాంతి వాళ్లు
ఆ కాంతిలో కాలుతున్న నా,నీ
పోనీ మ‌నంద‌రి చితులు వాళ్లు

కాసేపు గాలిని ఆపేసి వింటావా?
కాసేపు క‌రిచే మంచుని క‌ర‌గేసి వింటావా?
కాసేపు గుర్రాల స‌కిలింపుని క‌ట్టేసి వింటావా?
కాసేపు ఆ కొండెక్కి
నొచ్చే కాళ్ల‌ని వొత్తుకొంటూ వింటావా?
కాసేపు అలా న‌దివొడ్డుకొచ్చి
కొట్టుకొచ్చే ప్రేమ‌లేఖ‌ల‌ను వింటావా?
కాసేపూ.. కాసేపూ..

గిర్నేమే, మ‌ర్నేమే జియా దిల్‌
జీనేకే, జీత్‌నేకే న‌యా దౌర్‌
ఇంకానా.. ఆపైనా..

అయినా..
ఇవేమైనా పిల్ల‌ల ఆట‌లా ?
మేఘాల మీద దిగొచ్చి
వ‌సంతాల‌ను మ‌ర‌చిన‌ట్టు
ఎక్క‌డి వాళ్లు అక్క‌డే..

తెరిచిన క‌న్ను తెరిచిన‌ట్టే
వేసిన గుట‌క వేసిన‌ట్టే
పాడే కంఠం పాడుతున్న‌ట్టే
కూటికొచ్చిన పిట్ట‌లూ, సెంట్రీ కాసే వెన్నెల‌లూ
అలాగే.. అలాగే...

దే ఆర్ మెల్టింగ్ ద హార్డ్ టైమ్స్ ఇన్‌టూ ద హండ్రెడ్ పెట‌ల్స్‌
దే ఆర్ బ‌ర్నింగ్ అవ‌ర్ సోల్స్ ఇన్‌టూ ద స్మూత్ ల‌వ్ సాంగ్స్‌

మ‌నం నిల‌బ‌డిపోయిన చోట నుంచే
మ‌న న‌డ‌క‌ల‌ను మోసుకెళుతున్నారు
మ‌నం ఆపేసిన రాగాల‌నే
తీగ‌లుగా సాగిపోతున్నారు
మ‌న గొంతునీ, మ‌న వంతునీ
మ‌న‌క్కిచ్చేసి వెళుతున్నారు
మ‌న ఓట‌మి తాపాల‌కు
రుజువుగా రుతువ‌ల్లే వ‌ర్ధిల్లుతున్నారు

వేట‌గాళ్ల గుంపులోంచి
సూరీడిని ఈడ్చుకొస్తున్న చేతులు
వేకువ రెప్ప‌ల్లోంచి విసురుగా
మెలుకువ‌ల‌ను ఎగ‌రేస్తున్న దిక్కులు

అనుకొంటాం గానీ
పోలిక‌లెక్క‌డా ఉండ‌వు
కాదు.. కాదు.. అని స‌ర్దిచెప్పుకొన్నా
మ‌న‌కి మ‌నమెక్క‌డా తార‌స‌ప‌డం
జేబులోని ఏ మ‌డ‌త‌లోనో
ముఖాన్ని దాచుకోవ‌చ్చు
క‌ళ్ల‌లో కాక‌పోతే కాళ్ల‌లో
భ‌యాన్ని క‌ప్పుకోవ‌చ్చు
కానీ పారే యేరునీ, ప‌చ్చిక‌బైళ్ల‌నీ ఏమ‌ర్చ‌లేం
క‌టిక ఆత్మ‌ల అడుగున‌
వోళ‌పెడుతున్న రాక్ష‌స గీతిని మోస‌పుచ్చ‌లేం
ఇంకా.. ఇంకా..
వాళ్ల అంగాంగాల‌పై చెక్కుతున్న‌
అంద‌మైన మ‌న ప్ర‌పంచాల నుంచి
ఏ నాటికీ ముఖం తిప్పుకోలేం.





No. of visitors : 943
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న : రివేరా

రివేరా | 10.06.2016 01:10:40am

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న పై రివేరా ఉప‌న్యాసం.......
...ఇంకా చదవండి

చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..

రివేరా | 16.07.2016 11:50:45am

పుస్తకాల సంచిని గిరాటేసి రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు స్నేహితుల భుజాలపైనుంచి నవ్వుతూ చూడటమే చివరిచూపు.......
...ఇంకా చదవండి

ఏప్రిల్ పండు II రివేరా

రివేరా | 24.04.2016 11:08:03pm

పిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,...
...ఇంకా చదవండి

సాయంకాలం వాన‌!

రివేరా | 20.12.2016 11:48:01pm

దుప్ప‌టి కింద‌, దిండు అడుగున‌ పిల్ల‌లు చూడ‌కుంటా క‌ప్పెట్టుకొన్న వ‌ర‌ద‌గూడుని మెలిపెడ‌తావేమో...
...ఇంకా చదవండి

భ‌యం చుట్టూ భ‌యం..

ఎడార్డో గెల‌నో | 04.02.2017 01:18:19am

వీళ్లెక్క‌డ చంపుకుతింటారోన‌ని ఆడ‌వాళ్ల‌కు భ‌యం భ‌యంలేని ఆడ‌వాళ్లంటే మ‌గ‌వాళ్ల‌కు మ‌హా భ‌యం దొంగ‌లంటే భ‌యం, పోలీసుల‌న్నా మ‌రి భ‌య‌మే తాళాలు లేని త‌లుపులంటే భ...
...ఇంకా చదవండి

రెప్పని కప్పని నిద్దుర

రివేరా | 16.08.2016 09:26:54am

ఒకే రాత్రిని కప్పుకొన్న మనకి ఒక్క నిద్దుర చాలదా? చుక్క కలని పొదువుకోడానికి ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?...
...ఇంకా చదవండి

నో, ఐ డోన్ట్‌ లైక్‌ టమాట

రివేరా | 17.09.2016 10:14:09am

టమాట రంగు సరే, రసాలూరే సరస్సులేమీ.. కొంచెం కరిచిపట్టుకొన్న మిలమిలా మీనాలేమీ.. పైకి కిందకి మునకలేసే గత్తరబిత్తర గోళాలేమీ.......
...ఇంకా చదవండి

అద్గ‌దీ...

రివేరా | 20.10.2016 12:13:15am

అటో ఇటో వేటో పోటో ప‌డిపోవాల్సిందే! పాల‌కులంతా ప్ర‌జాస్వామిక‌వాదులై ప్రజ‌లేమో నియంత‌లైతే ఏమి చేస్తాం?...
...ఇంకా చదవండి

సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరా

మహమూద్ | 04.05.2017 10:49:39am

విప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే.......
...ఇంకా చదవండి

యంత్ర భూతమైన ప్రేమలు పత్ర హరితాలు కావాలని..

రివేరా | 02.11.2016 11:01:00am

సామాన్యులను అసామాన్య కథానాయకులను చేస్తున్న కాలం ఇది. ఇరాక్‌, నికరుగువా, పాలస్థీనాల్లో పాల ఫ్యాక్టరీలపై బాంబులు వేస్తున్నవాడినీ, మన గిన్నెల్లో విష క్షీరాలన...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
    నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
    చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
    అరుణతార మార్చి - 2020
    ఉన్నావో సీత
    ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
    విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
    బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
    అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
    సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
    ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
    మూడో తరానికి...

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •