ఇపుడు దండకారణ్య సందర్భం ఎఒబి- ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు. దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష నుంచి పాలకవర్గ, మీడియా పదకోశాల్లో కూడా భాష వచ్చి చేరింది. అది బలిమెల. అది కటాఫ్ ఏరియా. అది మల్కన్ గిరి,ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా సరిహద్దు. అది ఎఒబి ప్రత్యేక గెరిల్లా జోన్. అది మూడువైపుల నీరు. ఒకవైపు నేల ఉన్న బెజ్జంగి, రామ గూడ ప్రాంతం. అది మావోయిస్టు పార్టీ సేఫ్ జోన్. మాడ్ వలె. పాలకవర్గాలకు నిన్నటి వరకు అబూజ్ మాడ్ వలె.
అక్కడ బలిమెల రిజర్వాయర్ నిర్మాణమైంది. బలిమెల పేరెట్లా వచ్చింది. ఆ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఆదివాసులు రోజొక్క మనిషిని బలి ఇవ్వాలన్న ఒడ్డె విశ్వాసం. మనుషులు లేకుంటే ..వాళ్ల వెట్టి చాకిరీలేకుంటే నిర్మాణమెట్లా.. అని ఒక సాధారణ భౌతిక వివేకానికి తల ఒగ్గి రోజొక్క జంతు బలితో సాధ్యమైందని అక్కడి స్థల గాధ.
ఇవ్వాళ మాత్రం పాడేరు నుంచి బలిమెలదాకా,చింతపల్లి నుంచి సీలేరు దాకా బాక్సైట్ తవ్వకాలకోసం ఆధునిక విశ్వాసం. అదే పెట్టుబడి విశ్వాసం. నూతన ఆర్థిక విధాన విశ్వాసం. ప్రజాయుద్ధ భాషలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధ్వంసకర అభివృద్ధి నమూనా భాషలో మైనింగ్ తవ్వకాలకోసం ఆదివాసీల బలి కోరుతున్నది. ఆదివాసుల మధ్యన నీటిలో చేపలవలె మసులుతున్న మావోయిస్టుల బలికోరుతున్నది.
అమెరికాలో రూజ్వెల్టు కాలంలో ప్రారంభమైన ఈ పత్రహరిత వేట.గ్రీన్‌హంట్ ఆపరేషన్ పేరుతో ప్రజల మీద యుద్ధంగా తూర్పు మధ్య భారతాల్లోకి 2009 లో ప్రవేశించింది. మూడుదశలు దాటి ఇప్పుడది బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు భావజాలం ఇచ్చిన బలంతో మిషన్ 2016 అయింది.
2000సంవత్సరంనుంచి అది మిషన్ బాక్సైట్.ఇప్పుడది ఈ అక్టోబర్ 24 న ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లోకి ఆపరేషన్ ఆర్కేగా ప్రవేశించింది.బూడిద రంగు తోడేళ్లుగా ప్రవేశించింది. కేంద్ర అర్థ సైనిక బలగాల రూపంలో ప్రవేశించింది. ద్రోహ్కాల్ జిపిఎస్ ఆధునిక సమాచార సాంకేతిక కోవర్టులతో హెలికాప్టర్లసర్వేతో ఆటోమిషన్ల వేటతో ఒక్కసారి పద్నాలుగో పద్దెనిమిది మందో తెలతెలవారుతుండగా నేలరాలడంతో మొదలై ఇరవై ఒకటి, ఇరవైనాలుగు, ఇరవై ఎనిమిది,ముప్పై,ముప్పైరెండు, ముప్పై నాలుగు, ఏమో ముప్పైతొమ్మిది. రిజర్వాయర్ నీటి మట్టం ప్రమాదస్థాయి ఎంతమందిని బలికోరుతుందో తెలియదు. వ్యక్తిగత ఆస్తికి కావలసింది సంచయం కదా.. అక్యుమిలేషన్..నీళ్లే కాదు,ఆదివాసుల చెమట ఖర్చయి,నెత్తురు ఖర్చయిసమకూరేసంపద. ఆదివాసి నెత్తుటి అదనపు విలువను గుర్తింపజేసి వర్గపోరాట చైతన్యమిచ్చిన అగ్రగామి కార్మిక వర్గపు నెత్తురు. ఈ ముప్పై తొమ్మిది మందిలో 27గురు పార్టీ సభ్యులున్నారు. పార్టీ సభ్యుల స్థాయినుంచి రాష్ట్ర కమిటీ స్థాయి వరకు. ఇంకా శత్రు చక్ర బంధంలో గాయపడిన కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే ఉన్నారు. తొమ్మిదిమంది ఆదివాసులున్నారు.అమరులైన 27 మంది పార్టీ సభ్యులలో ఆదివాసులున్నారు. ఇరవై ఎనిమిది గుర్తించ బడిన మృతదేహాలలో పదిహేనుమంది మహిళలున్నారు. ఇది ఇప్పటి ఎఒబి పోరాట చైతన్యానికి స్పందనకు నిదర్శనమైన నిష్పత్తి.
ఇది పోరాట ఆకాశంలో సగం పంచుకున్న మహిళా చైతన్యం. మనముందున్న ఈ వర్గ దేశ సరిహద్దుల్లో మనం ఈ బలిమెల రిజర్వాయర్ ఒడ్డున నిలబడి కటాఫ్ ప్రాంతంలోని నూటా నలభై రెండు ఇళ్లల్లో ఎక్కడో గాయపడి దాక్కున్న ఆర్కేను, మరోతొమ్మిది మంది ఆదివాసులను బతికించుకోగలమా.. కాపాడుకోగలమా... ఆర్ ఎంపిలను పోలీసుల నిఘా కను రెప్పలు బంధించాయి. మెడికల్ షాప్‌ల ముందు తుపాకి పహారా. ఇది 1972 జులై 28 కి ముందు ఒక వారం రోజులు కలకత్తా లాల్ బజార్ పోలీస్ స్టేషన్ అవుతుందా.. ఆ నగరానికీ, ఈ అడవికీ తేడాలేదా? 1972 కి 2016కి కాలమేమీ కదలలేదా? నగరాలనుంచి అడవికి చాలా దూరం.. జనతన సర్కార్ దాకా గుణాత్మక ప్రయాణం చేసింది కదా కాలం..
తప్పకుండా మనం కోల్పోయిన ఈ అమరుల త్యాగాల ఉత్తేజంతోనే గాయపడిన ఆర్కేను, తొమ్మిది మంది ఆదివాసులను కాపాడుకుంటాం.. కాపాడుకుందాం...
Type in English and Press Space to Convert in Telugu |
నయీం ఎన్కౌంటర్... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యంహతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే... |
వర్గ సమాజం ఉన్నంత కాలం వర్గ పోరాటం ఉంటుందిమహత్తర శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవానికి యాబై నిండిన సందర్భంగా ... కామ్రేడ్ వరవరరావు సాంస్కృతిక విప్లవం లేవనెత్తిన మౌళిక అంశాలను విశ్లేషిస్తు... |
సోషలిజమే ప్రత్యామ్నాయం : వరవరరావుఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్రపంచానికి సోషలిజమే ప్రత్యామ్నాయమని మరోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవసరముంది................. |
చెరసాలలో చామంతులు - 2అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద...... |
దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటుతెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను... |
Condemn the Nilambur Fake Encounter : RDFRDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the... |
ప్రభాకరుడే గంగాధరుడుప్రభాకర్ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్ఫర్మేషన్)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ... |
యాభై వసంతాల దారి మేఘంఅంబేద్కర్ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ... |
Bhoomaiah, Kishta Goud, Bhabani Da and Sumanta - Down Memory LaneOn 25th December early morning hours before unlocking the cells and barracks, the news spread that in the wee hours of 26th December, Bhoomaiah and Kishta G... |
ఎస్సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదికఎస్సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |