బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

| క‌ర‌ప‌త్రం

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

- విరసం | 02.11.2016 11:43:24am

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగుబాట్లలో రక్త తర్పణ చేసిన కష్ట జీవులు మొట్ట మొదటిసారి తమ విముక్తి కోసం, తమ రాజ్యం కోసం చేసిన విప్లవం అది. అందుకే తొట్టతొలి కార్మిక వర్గ విప్లవమది. అంతక ముందు ప్యారిస్‌ కమ్యూన్‌ అనుభవమున్నప్పటికీ.. రష్యా కార్మిక వర్గం విప్లవాన్ని విజయవంతం చేయడమేగాక విప్లవకర నియంతృత్వాన్ని అమలు చేసింది. దాని నీడలో సోషలిస్టు నిర్మాణ ప్రయత్నం చేసింది. అత్యంత ఊహాశాలి అయిన మనిషి వేల ఏళ్ల నుంచి తన సమస్త కల్పనాశక్తులను వెచ్చించి కూడా ఒక కలగానైనా కనలేని అద్భుతం బోల్షివిక్‌ విప్లవంలో జరిగింది. బానిస సమాజం నుంచి ఎన్నో చారిత్రక అగడ్తలను దాటుకుంటూ వచ్చిన మనిషి సాధించిన విజయం అది. రష్యన్‌ విప్లవమూ, విప్లవానంతరం కార్మిక వర్గ రాజ్యస్థాపన, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నం రోమాంచితాలు. మనుషులు ఇంత శక్తి సంపన్నులు ఎలా అయ్యారని నూరేళ్ల తర్వాత కూడా ప్రతి తరం కాల్పనికావేశానికి గురయ్యే చారిత్రక అనుభవం అది.

కమ్యూనిజంలోకి వెళ్లడానికి సోషలిజం ఒక మధ్యంతర దశ. ఆ దశ ముగిసే వరకు వర్గాలు ఉంటాయి... వర్గాలు ఉన్నంత కాలం వర్గపోరాటం జరగాల్సిందే అనే మావో ఆలోచనకు ఆచరణ రూపమే చైనా సాంస్కృతిక విప్లవం. విప్లవ రాజ్యాధికారం పెట్టుబడిదారీశక్తుల బారినపడుతోంటే తిరిగి వర్గపోరాటం ద్వారా చైనా కార్మిక వర్గం తన అధికారాన్ని నిలబెట్టుకోడానికి చేసిన రెండో రాజకీయ విప్లవమే సాంస్కృతిక విప్లవం. అది కేవలం రాజకీయాధికారం కోసమే గాక విప్లవం తర్వాత కూడా అన్ని జీవన రంగాల్లో పాతుకపోయిన భూస్వామ్య విలువలను, విధానాలను, కొత్తగా పెచ్చరిల్లిపోతున్న పెట్టుబడిదారీ శక్తులను, వాటికి రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలోని రివిజనిస్టులను ధ్వంసం చేయడానికి సాగిన సాంస్కృతిక, భావజాల విప్లవం కూడా. అది నూతన మానవులను ఆవిష్కరించిన ప్రక్రియ. కృశ్చేవ్‌ నాయకత్వంలో సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన వర్గ సామరస్య విధానానికి వ్యతిరేకంగా మావో నాయకత్వంలో పదేళ్లపాటు గ్రేట్‌ డిబేట్‌ జరిగింది. ఈ ప్రేరణతో ప్రపంచ వ్యాప్తంగా 80 మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత చైనాలో శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో రివిజనిజాన్ని ఓడిస్తూ 1967 మే 23న నక్సల్బరీ ప్రజ్వలనం భారత విప్లవోద్యమ పంథాను అందించింది. అది వర్గపోరాట మార్గం. దాని వెలుగులో దేశ ప్రజలు నూతన ప్రజాస్వామిక విప్లవంలో కొనసాగుతున్నారు.

దేశంలోని సకల ప్రజల విముక్తి కోసం, దోపిడీ నిర్మూలన కోసం సాగుతున్న విప్లవోద్యమాన్ని దెబ్బతీయడానికి భారత పాలకవర్గాలు ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మూడో దశను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగమే అక్టోబర్‌ 23వ తేదీ ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలోని బెజ్జంకి మారణకాండ. కోవర్డ్‌ ఆపరేషన్‌ ద్వారా వేలాది బలగాలు చుట్టు ముట్టి ఏకపక్షంగా కాల్పులు జరిపి 31 మంది విప్లవకారులను కాల్చేశారు. అదుపులోకి తీసుకున్న వాళ్లలో ఇప్పటికి ముగ్గురిని ఒకసారి, ఇద్దరిని ఒకసారి కాల్చేశారు. గ్రేహౌండ్స్‌ కూంబింగ్‌ ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నది. ఆ పేరుతో తమ ఆధీనంలో ఉన్న మావోయిస్టు కార్యకర్తలను, ఆదివాసీ గూడేల వాళ్లను కాల్చేస్తున్నారు. అమరులైన వాళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, చత్తీస్‌ఘడ్‌, పశ్చిమ బెంగాల్‌ కామ్రేడ్స్‌ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పాతికేళ్లలోపు యువతీ యువకులే. ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంత కమిటీ సభ్యులు, డివిజన్‌ కమిటీ సభ్యులు, పిఎల్‌జీఏ విభాగం బాధ్యులు, ప్రజా మిలీషియా సభ్యులు, సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. పోలీసు అధికారులు ఎన్‌కౌంటర్‌ అని చెప్పుకుంటున్న ఈ ఘటన సామూహిక మానవ హననం. కుట్ర పూరితంగా, ఏక పక్షంగా దాడి చేసి విప్లవకారులను దారుణ హింసలకు గురి చేసి హత్య చేశారు. అత్యున్నత న్యాయస్థాన మార్గదర్శకాలను తుంగల్లో తొక్కి మృతదేహాలను చెక్క పెట్టెల్లో కుక్కి మల్కాన్‌గిరి ఎస్పీ ఆఫీసు ఆవరణలో పడేశారు. మృతదేహాల్లో ఒక మహిళా కామ్రేడ్‌కు శిరస్సు లేదు. ఇద్దరు మహిళల వక్షోజాలు కోసేశారు. ప్రజా కళాకారుడు కా. ప్రభాకర్‌, ఏవోబీ కమిటీ సభ్యుడు కా. దయ, కా. మున్నా శరీరాలను ఛిద్రం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాశవిక స్వభావానికి ఇది పరాకాష్ట. దాదాపుగా ఈ మారణకాండలో అమరులైన వాళ్లందరినీ దారుణంగా హింసించి హత్య చేశారని తెలుస్తోంది. భారత విప్లవోద్యమ చరిత్రలో ఇదే అతి పెద్ద నష్టం. ఏవోబీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలను మావోయిస్టుల నాయకత్వంలో ఆదివాసులు చాలా కాలంగా సాయుధంగా ప్రతిఘటిస్తున్నారు. అడవిలోని సహజ సంపదను దోచుకోడానికి కార్పొరేట్‌ శక్తులు మోహరించాయి. అంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతమంతా ఈ విధ్వంసం సాగుతున్నది. దీన్ని మావోయిస్టు ఉద్యమం ప్రతిఘటించి ప్రజల స్వావలంబన, స్వయం పాలన దిశగా ఏవోబీలో పురోగమిస్తున్నది. దీన్ని దెబ్బ తీయడానికి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ కలిసి బెజ్జంకి మారణకాండకు పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు తన విధ్వంస అభివృద్ధి నమూనాకు ప్రత్యామ్నాయం మావోయిస్టుల దగ్గర ఉన్నందుకే ఈ మానవహననం చేశాడు. ఇలాంటి నష్టాలను అధిగమించి ప్రజా ఉద్యమాలు తప్పక పురోగమిస్తాయి.

ఈ అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజం కోసం తమ ప్రాణాలు అర్పించారు. విప్లవోద్యమాలు ఇలాంటి అటుపోట్ల మధ్యనే విజయం సాధిస్తాయని గత విప్లవాల చరిత్రలో నిర్ధారణ అయింది. సోవియట్‌ యూనియన్‌లో దారుణ నిర్బంధం మధ్యే రాజకీయ, సైనిక పంథాలను మేళవించి విప్లవాన్ని ప్రజలు జయవంతం చేశారు. అది సకల జీవన రంగాలను విప్లవీకరించే మహత్తర ప్రజా ఆచరణ. మానవ సంబంధాలను, సంస్పందనలను, విలువలను, విశ్వాసాలను సోషలిస్టు రాజకీయార్థిక వ్యవస్థకు తగినట్లు పునర్నిర్మించే ప్రయత్నం జరిగింది. అది బోల్షివిక్‌ విప్లవానికి ముందు, ఆ తర్వాత కూడా ఒక్క చైనా అనుభవంలో తప్ప మరెన్నడూ, మరెక్కడా జరగని మానవీయ ప్రక్రియ. అది ఏకంగా మనిషినే పునర్నిర్మించడం. మానవత, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అనే సార్వజనీన విలువల ప్రాతిపదిక మీద సాగిన సామూహిక ఆచరణ కాబట్టే ఆ వెలుగులో వచ్చిన అప్పటిి రష్యన్‌ సాహిత్యం ఎల్లకాలాలకు కాంతి బావుటాలను ఎత్తిపడుతోంది. రష్యన్‌ విప్లవం, సోషలిస్టు ప్రయత్నం వలెనే ఈ నూరేళ్లుగా అక్కడి సాహిత్యం పోరాట శక్తుల మేధస్సుపై, అంతరంగాలపై వెలుగు రేఖలను పూయిస్తూనే ఉంది. రష్యన్‌ ప్రజల సామూహిక అనుభవాల పొరల్లోపలికి వెళ్లి వాటి చారిత్రక అర్థాలను కాల్పనీకరించిన ప్రతిభావంతమైన రచయితలు, మేధావులు ఎందరో ఆ విప్లవంలో పురుడుపోసుకున్నారు. నవంబర్‌ విప్లవ పూర్వ రంగంలోంచి.. సోషలిస్టు ఆచరణ కొనసాగినంత కాలం అలాంటి రచయితలను మనం చూస్తాం. కమ్యూనిస్టు పార్టీతో, విప్లవోద్యమంతో సాహిత్యకారులు ఎలా ఉండాలో తానే ఉదాహరణగా కామ్రేడ్‌ మాగ్జిమ్‌ గోర్కీ నిలిచిపోయాడు.

రష్యా, చైనా విప్లవ విజయాల వలె విప్లవానంతరం ఈ రెండు సమాజాల్లో జరిగిన సోషలిస్టు ప్రయత్నాలు, వాటికి లోపల.. బైటా ఎదురైన సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న తీరు అంతే స్ఫూర్తిదాయకం. మానవజాతిని కొత్త చారిత్రక ఆవరణలోకి తీసికెళ్లిన ఈ విప్లవాలు, సోషలిజాలు అనేక కారణాల వల్ల తర్వాత్తర్వాత చరిత్రలో భాగమైపోయి ఉండవచ్చు. అవి ఉనికిలో ఉన్నప్పుడు, ఆ తర్వాత లోపలా, బైటా ఎన్నో విమర్శలకు గురై ఉండవచ్చు. కానీ అప్పుడూ, ఇప్పుడూ ఆ విప్లవాల వారసులు మహోపాధ్యాయులు లెనిన్‌, స్టాలిన్‌, మావోల పక్షాన నిలిచి.. వాళ్ల నాయకత్వంలో ప్రజలు సాధించిన విజయాలను గానం చేస్తునే ఉన్నారు. ఆ విప్లవాలు జరిగిన సమాజాల ప్రత్యేకతలను సహితం పరిగణలోకి తీసుకొని వాటి విశిష్టతలను విశ్లేషిస్తునే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగానే విప్లవ శక్తులు గత అనుభవాల నుంచి నేర్చుకుంటూ 21వ శతాబ్దంలో సోషలిస్టు నిర్మాణానికి ఆలోచనా, ఆచరణ తలాల్లో సంఘర్షిస్తున్నారు.

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం గొప్ప చారిత్రక సందర్భాలు. బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిపట్టడానికి విరసం ఈ సభను నిర్వహిస్తోంది. అందరికీ ఇదే స్వాగతం.

విరసం సభ


నవంబర్‌ 7, మధ్యాహ్నం 2.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల దాకా
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌

2.00 గంటలకు

బెజ్జెంకి అమరుల త్యాగాలు ఎత్తిపడదాం


అధ్యక్షత : గీతాంజలి

బెజ్జెంకి మారణకాండ
పద్మకుమారి, దేవేంద్ర, దేవేందర్‌

విప్లవోద్యమంలో ఆటుపోట్లు-పజ్రల విజయం
పాణి

విప్లవోద్యమంలో కవులు, కళాకారులు - కా. పభ్రాకర్‌ ఆదర్శం
కాశీం
***

సాయంత్రం 5.00గంటల నుంచి

నూరేళ్ల బోల్షవిక్‌ విప్లవం, యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం


అధ్యక్షత : వరలక్ష్మి

అక్టోబర్‌ విప్లవ చరిత
ఎన్‌.వి.ఎస్‌ నాగభూషణ్‌

తెలుగు నేల‌పై ర‌ష్య‌న్ సాహిత్య ప్ర‌భావం
బి. అనూరాధ

సాంస్కృతిక విప్లవం లేవనెత్తిన మౌలిక అంశాలు
వరవరరావు

ప్రజా కళా మండలి సాంస్కృతిక కార్యక్రమాలు





No. of visitors : 940
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఔగుస్ట్ ‌బేబెల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 27.12.2016 10:24:05pm

19వ శతాబ్ది చివర్లోనూ, 20వ శతాబ్ది మొదట్లోనూ కార్మికవర్గ ఉద్యమం వెల్లువలా సాగుతున్న పరిస్థితుల్లో, సామూహిక రాజకీయ సమ్మెల...... ...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
    ఇక యాక్షన్‌ ప్లాన్‌ 2018

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •