1970 ల తొలి రోజుల్లో విడుదలైన అంకుర్‌కు సినిమా. ఆపిల్లవాడు దొరగడీమీదికి ఎంతో ఆగ్రహంతో ఒక రాయి విసరడంతో ముగుస్తుంది. ఐదారేళ్ల పసి వయసుకే ఆపిల్లవాడు ఆవూళ్లో చాలా అత్యాచారాలు,అఘాయిత్యాలు చూసాడు. తానటువంటి సంతానమని తనకు తెలుసా?ఎందుకంత వేదన,ఎందుకంత ఆగ్రహం? ఏమంత వయసని?
1970లకు ముందు సికిందరాబాద్ కంటోన్మెంట్ వాతావరణం అది. అల్వాల్ ,వెంకటాపురం, లాల్ బజార్ ,బొలారం, యాప్రాల వంటి ఎన్నో గ్రామాలను మింగిన సైనిక పటాల కొండచిలువ కంటోన్మెంట్.అక్కడ రెండు ప్రపంచాలు. దేశమంతా ప్రతీనగరం ప్రవేశాల్లో కనిపించే ఇంగ్లీష్ పాలన కాలపు కంటోన్మెంట్లు సికిందరాబాదు భాషలోనైతే లష్కర్లు. ఆ లష్కర్లో ఆ పేరుపెట్టుకొని పిలిచే లష్కరుబోనాలు. కల్లు కాంపౌండులు. రక్తంతో తొక్కేరిక్షాలు. సిరుమల్లె సెట్టుకింద సినబోయి కూచున్న లచ్చుమమ్మలు. ఎక్కువ మంది దళితులు. అప్పటికి ఆ ఊరికి దత్తత వచ్చిన దొరతప్ప అందరూ బడుగు వర్గాలు. కష్టం చేసుకుని బతికే వాళ్లు. 1970ల ఆ జీవితాన్ని అప్పుడే కుతకుత ఉడుకుతున్న తిరుగుబాటును ,వాళ్ల కళ్ల నుంచి చూసి, వాళ్ల జానపద బాసలో వినాలంటే శ్యాం బెనగల్ అంకుర్ చూసి తీరాల్సిందే.
అక్కడ పుట్టింది ఆర్ట్ లవర్స్ .ఆర్ట్ లవర్స్ విస్ఫోటనమై జననాట్యమండలి అయింది. బీదలపాట్లు ప్రదర్శించి ఊరుకోలేదు. పాటను, మాటను తూటాగా మార్చింది. దృశ్యం మారిపోయింది. ఈ ముప్పై ఆరేళ్లలో ఆ ఊళ్లనుంచి ఎందరెందరు విప్లవకారులు దేశవ్యాప్తంగా నక్సలైటు ఉద్యమంలోకి వెళ్లారో ఎందరు అమరులయ్యారో. కనీసం నలుభై అయిదుగురు. సుభాష్ నగర్‌లోని అమరుల స్థూపం నిలువెత్తు సాక్ష్యం.
ఆ జానపద, ప్రజా సాంప్రదాయం నుంచి వచ్చి మావోయిస్టు విప్లవకారుడుగా అమరుడయ్యాడు ప్రభాకర్. ఆయన కళల్లో కళ్లు తెరిచేనాటకిే కంటోన్మెంట్‌లోనే కాదు ఒక విప్లవ కుగ్రామంగా యాప్రాల్ గ్లోబల్ సంగ్రామంలో భాగమైంది. తలిదండ్రుల నుంచి పరిసరాలనుంచి ఉగ్గుబాలతో అబ్బిన కళలు జననాట్యమండలి ప్రభావంతో క్రాంతి కళా కాంతులైనవి. డోలక్ దయగా జననాట్యమండలిలో ప్రసిద్ధుడై అమరుడైన తన ముందు వరుస కళాకారుడు ఆప్రాంతం వాడే. అయితే ఇంక ప్రభాకర్‌కు ప్రాంతమేమిటి. యాప్రాలనుంచి తన గాత్రంతో, వాద్యంతో నేకాదు నిర్మాణ శక్తిగా తెలుగునేలంతా దేశమంతా విస్తరించాడు. రెండు దశాబ్దాల క్రితమే సామ్రాజ్యవాద ,భూస్వామ్య సంస్కఋతిని ప్రతిఘటించే కళాసాంస్కృతిక సంస్థ ప్రజాకళా మండలి సంస్థాపనలో ఒకడయ్యాడు. తానెప్పుడూ తబలాపై తరగలవలె ఎగసి పడే చేతులతో సైడ్ కర్టెన్ లలోనే . ఎప్పుడోగానీ మైకుముందుకురాడు. వస్తే ఆ కంఠం ఆ స్టామినా (దమ్ము) జననాట్యమండలి సంజీవ్నుతలపింప చేసేది. ఆ చిరునవ్వు ఆ హాస్యం ఆ వ్యంగ్యం, ఆ పలకరింపు, ఆ ఆప్యాయత, ఆ ఆత్మీయత. ముందటి పళ్ల కింద పళ్లతో కళ్లల్లో వెలుగుతో ఆనిలువెత్తు శ్యామలాకారం. ఆ గాత్రం కంఠంగా కాదు.. కరచరణాలు కావు. ఒక దేహంగా ఒక ఆత్మగా, ఒక వ్యక్తిత్వంగా ఇవ్వాళ ఆయన తెలిసిన ఎవరి హృదయపేటికలైనా తెరిచిచూడండి. అచ్చుగా అదే దఋశ్యం.
1997 డిసెంబరన 28,29 తేదీల్లో అఖిల భారత ప్రజాప్రతిఘటనావేదిక వరంగల్‌లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సు నిర్వహించింది. రెండువేల మంది ప్రతినిధుల సదస్సుతో, రెండున్నర లక్షల మంది ప్రజలు పాల్గొన్న బహిరంగ సభ అది.
ఆ సదస్సులో ప్రజాకళా మండలి లొల్లి ఆడియో క్యాసెట్ విడుదల చేసింంది. అన్ని పాటలు ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ డిమాండ్ చేసే మిలిటెంట్ స్వరాలు. నందిని సిధా రెడ్డి నాగేటి చాళ్లల్లో నాతెలంగాణ అందులోదే. అప్పటిదే. అక్కడినుంచి 2014 లో తెలంగాణ ఏర్పడేదాకా ప్రజాకళామండలి ప్రభాకర్ ఎన్ని వలే ల ప్రదర్శనల్లో తెలంగాణ లోనే కాదు , ప్రజాస్వామిక తెలంగాణ స్వరాన్ని వినిపిస్తూ తెలుగునేలంతా దేశమంతా తిరిగాడు. ఎన్నో ప్రజాసంఘాలకు సాంస్కృతిక శిక్షణా శిబిరాలు నిర్వహించాడు. ఎన్ని విరసం సభల్లో ఒక వాద్యమయ్యాడో,ఒక గాత్రమయ్యాడో.ఎప్పుడూ ఒంటరిగాకాదు,సోలోగాకాదు,బృందంగా తబలా ఒక్కటే ఊగిపోయే మనిషి,మోదే రెండుచేతులు.. కళ్లల్లోంచి విద్యుత్ వెలుగులు. పెదాలమీంచి చిరునవ్వులు.కోపావేశాల కోరస్.సందర్భాన్ని బట్టి.. అవసరాన్ని బట్టి..
మళ్లీ మీరంతా విన్నారు గదా.. సోషల్ మీడియాలో.. లగడపాటిపై పాటలో దిశ వేదిక మీంచి ఆయన స్వరంతోనూ, శరీరంతోనూ పలికించిన వ్యంగ్యం..
అంత మాత్రమే అయితే ప్రభాకర్ గురించి పికెఎంప్రభాకర్ గురించి, ఎందుకు మాట్లాడుకుంటాం. స్వరమే పోరాటమైతే మాట్లాడుకోమని కాదు. ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక పోరాటంలో ప్రజాకళామండలి కన్వీనర్లు గా ముందువరుసలో పదిహేడు ముక్కలైన బెల్లి లలిత గురించి పద్మాక్షమ్మ గుట్ట కు ఎన్ కౌంటర్ అయిన ఐలన్న గురించి పాటకున్న మందుపాతర శక్తి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రజాగాయకుడు గద్దర్ దేహంలోకి దూసుకుపోయిన తుపాకిగుండ్లగురించి ,ఊపిరితిత్తుల్లో మిగిలిన తూటా గురించి అది తెలంగాణ పాటయై తిరిగి వచ్చిన వైనంగురించీ మాట్లాడుకుంటూనే వున్నాం.
ప్రభాకర్ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్ఫర్మేషన్)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత పులులనుంచి చంద్రవంక దళమైన ఏసువలె. జననాట్యమండలినుంచి పీపుల్స్‌వార్ నలగొండ జిల్లా కార్యదర్శిగా ఎదిగిన దివాకర్ వలె. ప్రభాకర్ ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రజాపోరాట ప్రవాహ గంగాధరుడయ్యాడు. ఆదివాసీ సమాజ సాయుధ సాంస్కృతిక యోధుడయ్యాడు. ఆయన గాత్రానికొక ఆకుపచ్చని విప్లవ ఆహార్యమొచ్చింది. చేతుల్లో తబ్లా స్థానంలో తుపాకీ వచ్చింది. భుజానికి వేళాడిన వాయిద్యం వలె పోరాట సాధనమొచ్చింది. ఆయన ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రత్యేక సాయుధ గెరిల్లా జోన్లో జిల్లా స్థాయి నాయకుడయ్యాడు. అందుకే విక్టర్ యారా గాత్రమంతా అణువణువూ ఛిద్రం చేసినా అమెరికా బహుళ జాతి రాగి పరిశ్రమ వంటి దుబాయి బాక్సైట్ కంపెనీ,నిరంతరం చింతపెల్లి అడవుల సంరక్షణ పోరాట గీతాలాలపిస్తున్న ప్రభాకర్ పేగులను తోడేసింది. మొహం ఛిద్రం చేసింది. కాళ్లు విరిచేసింది.
అక్టోబర్ 26న సహచరి దేవేంద్రతోబాటు ఆయన మృతదేహాన్ని ఎత్తిన చేతులనుంచి మాంసపుముద్దలురాలిపడినట్లు. మంచుగడ్డలు కరిగి రక్తం ప్రవించినట్లు. అవన్నీ గడ్డకట్ట వచ్చు. నల్ల బడ వచ్చు. ఆ మృత దేహం నల్లబడ వచ్చు. దహనమైబూడిద కావచ్చు. ఆ సాయుధ గాత్రం మన గుండెల్లో సదా మార్మోగుతూనే ఉంటుంది.
Type in English and Press Space to Convert in Telugu |
నయీం ఎన్కౌంటర్... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యంహతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే... |
వర్గ సమాజం ఉన్నంత కాలం వర్గ పోరాటం ఉంటుందిమహత్తర శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవానికి యాబై నిండిన సందర్భంగా ... కామ్రేడ్ వరవరరావు సాంస్కృతిక విప్లవం లేవనెత్తిన మౌళిక అంశాలను విశ్లేషిస్తు... |
సోషలిజమే ప్రత్యామ్నాయం : వరవరరావుఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్రపంచానికి సోషలిజమే ప్రత్యామ్నాయమని మరోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవసరముంది................. |
చెరసాలలో చామంతులు - 2అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద...... |
దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటుతెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను... |
ఇప్పుడు... దండకారణ్య సందర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులుదండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను... |
Condemn the Nilambur Fake Encounter : RDFRDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the... |
యాభై వసంతాల దారి మేఘంఅంబేద్కర్ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ... |
Bhoomaiah, Kishta Goud, Bhabani Da and Sumanta - Down Memory LaneOn 25th December early morning hours before unlocking the cells and barracks, the news spread that in the wee hours of 26th December, Bhoomaiah and Kishta G... |
ఎస్సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదికఎస్సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |