మ‌నంద‌రి క‌ల‌లు వాళ్లు...

| సంభాషణ

మ‌నంద‌రి క‌ల‌లు వాళ్లు...

- స్వేచ్ఛ‌ | 03.11.2016 01:56:41pm

అక్కడ కూర్చున్న వాళ్ళూ .. నిల్చున్న వాళ్ళూ.. ఎక్కడికక్కడే దుఃఖం లో మునిగిపోయారు . వేదిక మీదికి ఒక్కొక్కరూ వచ్చి మాట్లాడుతున్నారు. కొద్దిసేపటికి స్టేజి మీదినుంచి ఒక ప్ర‌క‌ట‌న‌. ప్రజా కళా మండలి కళాకారులు పాట పాడతారు అని. అప్రయత్నంగానే కొంచెం జీర నింపుకున్న ఓ గంభీరమైన గొంతు వినడానికి మనసు సిద్ధమైపోయింది . కళాకారుల పాట మొదలయింది. కానీ నేను ఎదురుచూస్తున్న గొంతు వినిపించలేదు. ఇప్పుడే కాదు... ఆ గొంతు ఇక ఎప్పటికీ వినిపించదని తెలుసు. ఆ గొంతు... వేదిక మీద ఫ్రీజర్ లో ఛిద్రమైన శరీరంతో తెల్లటి పలువరుస మీద ఎర్రటి మాంసపు ముద్దలు పోగుబ‌డి మూగబోయి ఉంది . అది బెజ్జంగిఅమరుడు కామ్రేడ్ ప్రభాకర్ పార్థివ దేహం.

చుట్టూ కామ్రేడ్ ప్రభాకర్ అలియాస్ గంగాధర్ అమర్ రహే అని రాసిన బ్యాన‌ర్లు... కామ్రేడ్ ప్ర‌భాక‌ర్‌కు ఎంద‌రెంద‌రో అమ‌రుల‌కు జోహార్ల‌ర్పిస్తూ నినాదాలు. మనసొప్పట్లేదు ప్రభాకరన్న గొంతు వినపడదంటే. దుఃఖం సుడులు తిరుగుతుంది. అయినా... ఏ క్షణమైనా తొలిపొద్దు సూర్యుడోలె అన్న ఎదురొస్తాడ‌ని ఆశ. ప్రజల కోసం ప్రాణాలిచ్చిన అమరులకు కన్నీటి నివాళి సరైందో కాదో అనుకుంటుండగా .. ఒత్తుకున్నాం కంట తడిని - ఎత్తుకున్నాం ఎర్రజెండా నినాదం స్పష్టత ఇచ్చింది .


నిజమే.. పేదలు, అణగారిన వర్గాల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజా ఉద్యమపు బాట పట్టిన యోధులకోసం కన్నీరు కార్చడం సరికాదేమో. కామ్రేడ్‌ ప్రభాకర్ ఒక్కడే కాదు ఎంద‌రెంద‌రో నూత‌న స‌మాజం కోసం... వ్యక్తిగత ఆస్థిని, కుటుంబ జీవితాన్ని వదులుకొని ఉద్యమ బాట పట్టారు. ఆ దారిలో పయనించాలని నిర్ణయించుకున్నప్పుడే వాళ్ళకి తెలుసు... ఏ క్షణమైనా ప్రాణాలు పోవచ్చని. వాళ్ల‌కే కాదు... ఆ త‌ల్లికి, ఆ తండ్రికి, ఆ స‌హ‌చ‌రికీ తెలుసు. ఇది తెలిసి కూడా కుటుంబం లోని వ్యక్తిని ఉద్యమంలోకి సాగనంపిన కుటుంబాలది గొప్ప త్యాగం . ఎన్ కౌంటర్ వార్త విన‌బ‌డిన ప్ర‌తిసారీ ఆ మృతుల్లో తమవాళ్లు ఉన్నారేమో అని వెతుక్కోవడం ఎంతో కష్టం. కలిసిన ప్రతిసారీ ఇదే ఆఖరి ములాఖత్ అనుకుంటూ చిరునవ్వుతో దూరమవడం వాళ్లలో వాళ్ల క‌మిట్‌మెంట్ అర్థ‌మ‌వుతోంది.

వీళ్ళే ఎందుకు సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు? అన్నీ త్యాగం చేసి ప్రాణాలు పోగొట్టుకోవాలి ?? ఉద్యమకారులు చనిపోయినప్పుడు బాధపడి .. వారి త్యాగాలను స్మరించి .. కీర్తించి .. నాలుగు రోజులు గడవంగానే అంతా మామూలైపోతే ఆ ఆమరత్వానికి అర్థమేంటి ? సమాజం లో జరుగుతున్న‌ దోపిడీని చూడలేక .. అన్యాయాలకు చలించిపోయి . .వీలైనన్ని దారుల్లో ప్రయత్నించి ఆఖరికి సాయుధ మార్గాన్నెంచుకున్న వాడి ఖర్మ అని వదిలేయడమే అవుతుంది. నిజ‌మే... మ‌నం ఇవాళ ఒక భయంకరమైన స్తబ్దతకు అలవాటైపోయి ఉన్నాం. హింసను చూసి .. నా వరకు రాలేదు కదా ఇప్పటికైతే నేను భద్రంగానే ఉన్నాను క‌దా అనే conscious ignorance ని నిబద్దత తో అమలు చేస్తున్నాం .

ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా 31 మందిని చంపేశారు. అక్టోబ‌ర్ 24న ఆంధ్ర - ఒరిస్సా స‌రిహ‌ద్దు ప్రాంతంలో మావోయిస్టుల స్థావ‌రంపై దాడి చేసి విప్ల‌వ‌కారుల‌తోపాటు, సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను విచ‌క్ష‌ణా ర‌హితంగా హ‌త్య చేసిన సంఘ‌ట‌న అది. అత్యంత పాశ‌వికంగా జ‌రిగిన ఈ మాన‌వ హ‌ననం.. ప్ర‌జాస్వామ్య‌మ‌నే మాట‌ను బోనులో నిల‌బెట్టింది. అయినా... మ‌నం మౌనంగా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే.. అది మ‌న స‌మ‌స్యకాద‌నుకుంటున్నాం క‌నుక‌.

ఎన్ కౌంటరు కి సంతాపం ప్రకటిస్తూనే నక్సలైట్ లు జనజీవితం లోకి రావాలని పిలుపునిచ్చేరాజ‌కీయ నాయ‌కులు .. ఈ నాయకులని గుడ్డిగా అనుసరించే కుహనా మేధావులు .. వాళ్ల భ‌జ‌న ప‌రులూ.. నక్సలిజం జనజీవితం తోనే ముడిపడి ఉందన్న మూలాన్ని మరిచిపోతున్నారు. .ఇవాళ చనిపోయిన ప్రతీ కామ్రేడ్ ఒంటిమీది ప్రతీ గాయం .. ఉద్యమ బాట పట్టకముందు ఈ దోపిడీ సమాజం చేసిందే. ఒక్కో మహిళా కామ్రేడ్స్ పై జ‌రిపిన అకృత్యాల‌న్నీ ప్రజాస్వామ్యం పేరుతో జరగుతున్న అరాచకాలకు అద్దం పడుతున్నాయి. సాటి మనిషి పట్ల కనీసం మానవత్వం చూపడానికే వెనకాడుతున్న సందర్భంలో ఒక వ్యక్తి సమాజం కోసం జీవితం త్యాగం చేయడానికి సిద్దపడే పరిస్థితికి వెనక కొన్ని వందల వేల సార్లు వ్యవస్థ వైఫల్యమే ప్రధాన కారణం .

ప్రతి సందర్భం లో మ‌నం ఏమీ చేయ‌లేమ‌ని అని సర్దిచెప్పుకుంటూ పోతే ... భవిష్యత్తు లో న్యాయం అడిగే వాళ్ళు శవాలుగా మారడమే మనం చూడబోయేది . అసలీ వ్యవస్థ అంటే వాస్తవ దూరమైన పరిస్థితులన్న భావన ఎందుకు? మనమంతా ఈ వ్యవస్థ లో భాగమే అన్న ఆలోచన ఎందుకు కొరవడింది?. మనలో లోపాలే వ్యవస్థ లోపాలు అని ఎందుకు అంగీకరించట్లేదు? స‌మాజాన్ని ముక్క‌లు ముక్క‌లుగా చూడ్డం అల‌వాటు ప‌డ్డ మ‌నుషులుల‌కు, ఎవ‌రి భాద వారిదిగానే అర్థ‌మ‌వుతుంది. అది ద‌ళితుల స‌మ‌స్య‌, అది మ‌హిళ‌ల స‌మ‌స్య‌, అది ఆదివాసీల స‌మ‌స్య‌, అది ముస్లిం స‌మ‌స్య‌, అది న‌క్స‌లైట్ల స‌మ‌స్య అనుకుంటుండ‌డం అత్యంత ప్రమాద‌క‌ర‌మైన దోర‌ణి. ఒక వ‌ర్గం అణ‌చివేత‌కు గుర‌వుతున్న‌ప్పుడు మిగ‌తా వ‌ర్గాలు ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం అది పెద్ద విషాదం.

తాత్కాలిక ప్ర‌యోజ‌నాల చుట్టూ మ‌నం తిరుగుతున్నంత కాలం... అధికారం ఎవ‌రిమీదైనా ఏదైనా చేయ‌డానికి వెన‌కాడ‌దు. మ‌న ప‌రిధికి మ‌న‌మే గిరిగీసుకున్నాక‌... మ‌న‌కు తెలియ‌కుండానే మ‌నం అన్నిటికీ ఆమోదం తెలుపుతుంటాం. రాజ్యం సాగిస్తున్న మాన‌వ హ‌నాన్ని ప్ర‌శ్నించ‌కుండా మౌనం వ‌హిస్తున్నామంటే.. ఆ హ‌త్యాకాండ‌కు మ‌న ఆమోదాన్ని తెలియ‌జేస్తున్నామ‌ని అర్థం. కానీ అణ‌చివేత‌, అస‌మాన‌త్వం ఎక్క‌డ ఏరూపంలో ఉన్నా దాన్ని అంత‌మొందించాల‌నే ఆలోచ‌న గ‌ల మ‌న‌లాంటి సాధార‌ణ వ్య‌క్తులే ఉద్య‌మ‌కారుల‌య్యారు. వాళ్లూ.. నిన్నా, మొన్న‌టి దాకా మ‌నతో క‌లిసి న‌డిచిన వాళ్లే. మ‌నంద‌రి క‌ల‌ల్ని నిజం చేసేందుకు వాళ్లు త్యాగాల భాట‌ను ఎంచుకున్నారు. కానీ ఇవాళ వాళ్ల గురించి మాట్లాడానికి మ‌న‌కు నోరు పెక‌ల‌డం లేదు. ఇంత‌కు మించిన విషాద‌మేముంటుంది?

ఈ దేశ సంప‌ద‌ను కాపాడేందుకు పోరాడుతున్న ఆదివాసీలు, వాళ్లకు అండ‌గా నిలిచిన విప్ల‌వ‌కారులు.. భ‌విష్య‌త్తును క‌ల‌గంటున్నారు. అది మ‌న అంద‌రి భ‌విష్య‌త్తు. మ‌నంద‌రి క‌ల‌ల్ని చిదిమేస్తున్న రాజ్యం పై ప్ర‌శ్న‌ల కొడ‌వ‌ళ్లు ఎత్తాల్సిందే. పెట్టుబ‌డికి బ‌లిపెడుతున్న ప్రాణాల‌ను నిలబెట్టుకోవాలిందే. దోపిడీ లేని స‌మాజం కోసం.. నూత‌న మాన‌వుడిని ఆవాహ‌న చేయాల్సిందే. ఒక వేకువ కోసం... సంఘ‌ర్ష‌ణ సాగాల్సిందే.

No. of visitors : 1681
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


త‌ప్పిపోయిన క‌ల‌ల కోసం...

స్వేచ్ఛ‌ | 06.08.2016 10:30:14am

నిదుర నటిస్తున్న వేల రెప్పలకింద పారుతున్న నెత్తుటి వ‌ర‌ద‌ మంచు పొర‌ల‌పై రాలుతున్న పూల గాయం... నా క‌నుపాప‌ల్లోకి గుచ్చుకుంటున్న పెల్లెట్లు.....
...ఇంకా చదవండి

ఊయ‌ల‌లో కంటిపాప‌

స్వేచ్ఛ | 01.06.2016 11:36:35am

స్వప్నాల వెంట సాగే ప్రవాహమ‌యి ఆదివాసీ అడుగుల్లో ఆన‌వాల‌యి అడ‌విని ఆశ్వాదించే శ్వాస‌యి...
...ఇంకా చదవండి

క‌థువా - ఉన్నావో నుంచి చింత‌గుఫ వ‌ర‌కు అధికారులు ఎలా స్పందించారు?

నందిని సుంద‌ర్‌ | 17.04.2018 03:58:37pm

ఐనా.. స‌ల్వాజుడుం మొద‌లైన 2005 నుంచి ఏ ఒక్క హ‌త్య‌, అత్యాచారం కేసులో భాదితులు న్యాయానికి నోచుకోలేదు. మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్, మ‌హిళా క‌మీష‌న్, సుప్రీంకోర్టు...
...ఇంకా చదవండి

ఆకు రాలు కాలం

స్వేచ్ఛ‌ | 06.07.2017 12:32:21am

దుఃఖమొక వర్షం జల్లులో రెక్కలు తడిచి చెట్టు కౌగిలి కోసం...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
  అరుణ‌తార - జూన్ 2018 సంచిక‌
  కందికట్కూరు దళితుల దారుణహత్యను నిరసిద్దాం
  కామ్రేడ్ వరవరరావుపై కుట్ర ఆరోపణలను ఖండిస్తున్నాం
  న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు
  ఈ తీర్పు సారాంశమేమిటి?
  ఆధిప‌త్యంపై అలుపెర‌గ‌ని పోరాటం
  సీమేన్ - వ్యక్తి , ప్రకృతుల నిజదర్శనం
  ఈ దేశం మాకు యుద్ధాన్ని బాకీపడింది
  ఔను... వాళ్లు చామన ఛాయే!
  మునిపటికన్నా విప్లవాత్మకంగా కార్ల్ మార్క్స్
  గాలి కోసం, నీరు కోసం, ఈ భూమ్మీద బతుకు కోసం...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •