స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

- ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌
(1825-1864)

ʹ‌మన శత్రువుల శత్రువుʹʹ

ʹʹమన శత్రువుల శత్రువుʹʹ....ఇదీ ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌ని మార్కస్ అభివర్ణించిన తీరు. లాసాల్‌ 19‌వ శతాబ్ది మధ్యలో జర్మన్‌ ‌కార్మికవర్గ ఉద్యమ ప్రముఖుల్లో ఒకడు. సంఘటన రీత్యా స్వతంత్రమైన కార్మిక పార్టీ ఏర్పాటును ఆయన చరుకుగా సమర్థించాడు. కార్మికవర్గ ఉద్యమానికి ఆయన చేసిన మహత్తర చరిత్రాత్మక సేవ ఇదే. లాసాల్‌నీ, ఆయన కార్యకలాపాలనూ అభివర్ణిస్తూ ఎంగెల్స్ ఇలా పేర్కొన్నాడు : ʹʹలాసాల్‌ అసాధారణ ప్రతిభావంతుడూ, విస్తమీత విద్యావంతుడూ అయిన వ్యక్తి. ఎంతో శక్తి సంపన్నుడు, పాదరసం లాంటి బుద్ధి కలవాడు. ఆయన ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితిలో నిర్దిష్టంగా ఒక రాజీకయ పాత్ర నిర్వహించేందుకే సృజింపబడ్డాడన్నట్లు కనిపించే వాడు. అయితే ఆయన జర్మన్‌ ‌కార్మికవర్గ ఉద్యమ ప్రారంభకుడు గాని, మౌలిక చింతనాపరుడు గాని కాడుʹʹ.1

ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌ 1825 ఏ‌ప్రిల్‌ 11 ‌న బ్రెస్లా (ఇప్పటి పోలిష్‌ ‌నగరం వ్రోత్స్లవ్‌)‌లో జన్మించాడు. ఆయన తండ్రి ఒక సంపన్న వ్యాపారస్తుడు. ఆయన బంధువులందరూ వర్తకులు, బాంకర్లు లేక పరిశ్రమదారులు. తలిదండ్రులు ఆయన కూడా వర్తకుడవాలని కోరుకున్నారు. హైస్కూల్లో చదివే రోజుల్లో ఆయన ప్రత్యేక శ్రద్ధాళువైన విద్యార్థి కాడు. చాలా తరచుగా ఆయనకి తక్కువ మార్కులు వస్తూండేవి. తండ్రితో ఘర్షణలను నివారించేందుకుగాను ఆయన్ని లైప్జిగ్‌లోని అకాడెమీకి మార్చారు. కానైతే త్వరలోనే ఆ అకాడెమీ డైరెక్టరుకి ఆయన ఎన్నడూ సమర్థుడైన వ్యాపారస్తుడు కాడని విశ్వాసం కలిగింది. మరి అది నిజమే కూడా. ఆయన ఉత్సాహపూరితమూ, త్రిభావంతమూ అయిన స్వభావం వ్యాపార కార్యాలయపు నిస్తేజమైన జీవితంతో ఎన్నడూ సరిపట్టుకొని ఉండగలిగేది కాదు. ఆయన జర్మన్‌ ‌ప్రామాణిక గ్రంథాలను ఆబగా చదివాడు. హైనె రచనలు ఆయన్ని బాగా ఆకర్షించాయి. తమ స్వయంగా కవి కావాలని కలలు కన్నాడు. ఈలోగా, ఆయన చదువు నానాటికీ తీసికట్టుగా తయారైంది. ఆయన టీచర్లతో తరచు ఘర్షణ పడుతూ వచ్చాడు. చివరకు అకాడెమీని వదిలిపెట్టి పోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన బ్రెస్లౌకి తిరిగి వెళ్ళి, స్వయంకృషితో చదువు కొనసాగించాడు. మెట్రిక్యులేషన్‌ ‌పరీక్షకు హాజరై పాసయ్యాడు. అటు తర్వాత మొదట స్థానిక విశ్వవిద్యాలయం లోనూ, రెండేళ్ళు పోయాక బెర్లిన్‌ ‌విశ్వవిద్యాలయంలోనూ ప్రవేశం పొందగలిగాడు.

తాజా ఘటనలకు చటుక్కున ప్రతిస్పందించే సరభసమైన విశ్వవిద్యాలయ జీవితం లాసాల్‌ని ముగ్ధుణ్ణి చేసింది. ప్రతి ఒక్క చోటా హాజరయ్యేందుకూ, జరుగుతున్న ప్రతీదీ తెలుసుకునేందుకూ, బోలెడు చదివేందుకూ, కాలం చెల్లిపోయిన, ఛాందసమైన ప్రతిదాన్నీ ప్రతిఘటించేందుకూ సహజంగానే ఆయన ప్రయత్నించాడు. బ్రెస్లౌలో జరిగిన ఒక విద్యార్థి సభలో, అప్పటికి మొత్తం అభివృద్ధి నిరోధక జర్మనీ కత్తిగట్టి దుయ్యబట్టుతున్న ఫొయెర్‌బాఖ్‌ను సమర్థిస్తూ ఉద్రేకపూరితంగా ఆయన ఉపన్యసించాడు. ఆ ఉపన్యాసానికే మొదటి సాదదగా విశ్వవిద్యాలయపు కోర్టు విచారణకు లాసాల్‌ ‌గురాయ్యాడు.

విశ్వవిద్యాలయం నుంచి పట్టా తీసుకున్నాక లాసాల్‌ ‌పారిస్‌కి వెళ్ళాడు. అక్కడే ఆయనకి హైనెతొ పరిచయం అయింది. హైనె ఆమరణాంతం లాసాల్‌ని గురించి విశేషమైన ఉత్సాహంతో, అబ్బురపాటుతో ప్రస్తావిస్తూ ఉండేవాడు. లాసాల్‌ని ప్రశంసించినది హైనె ఒక్కడే కాడు. ఆయనకి ఉజ్వల భవితవ్యం ఉంటుందని చాలామంది జోస్యం చెప్పారు.

చదువు ముగిసన తర్వాత బోధనా వృత్తి చేపట్టాలని లాసాల్‌ ‌కలలు గన్నాడు. విశ్వవిద్యాలయంలో అధ్యాపక ఉద్యోగంలో చేరేందుకు బెర్లిన్‌కి సైతం వెళ్ళాడు. అయితే 1844లో ఆయన తన ఈ కోరికను వదులుకున్నాడు? పేరు పొందేందుకు ఒక అవకాశం అభించినప్పుడు దాన్ని ఆయన వదులుకోలేదు. ఆయన లాయరై, ఒక విడాకుల కేసులో హాత్స్‌ఫెల్ట్ ‌ప్రభ్వి తరఫున వాదించాడు. ఈ కేసు కాక్రమేణా భావోద్వేగపూరితమైన వివరాలతో నిండిపోయింది గాని, దాని సారాంశం ఏమిటంటే, తన భర్త వేధింపుకి గురైన ఆ ప్రభ్వి తన వివాహ బంధాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇది బహిరంగంగా, బాగా సాహసికంగా, ఉన్నత సమాజపు అబిప్రాయాన్ని లెక్క చెయ్యకుండా జరిగిన కారణంగా, తొమ్మిదేళ్ళ పాటు సాగిన ఆ విచారణ పెద్ద సంచలనాన్ని కలిగించింది. కానైతే, భర్త మొరటుతనం గురించీ, నిరంకుశత్వం గురించీ లాయరుగారు ఎన్ని రంగురంగుల్లో చిత్రించినప్పటికీ, ʹʹపాపం రక్షణలేనిʹʹ ఆ ప్రభ్విని ఎంతగా ఆకాశానికి ఎత్తినప్పటికీ ఆ మొత్తం వ్యవహారం ఓ చిన్న టీ కప్పులో తుపానే తప్ప మరేమీ కాదు. సందచలనాత్మకమైన ఆ ఉన్నత సమాజపు కేసు జర్మనీ అభివృద్ధి ప్రధాన పథాలకు చాలా దూరంగా ఉంద. అప్పట్లో అసలైన ప్రజాస్వామ్యవాదులు దేశపు ప్రజాస్వామిక అభివృద్ధి కోసం పోరాడారే గాని, భూస్వాముల, బూర్జువాల ఆర్థిక ప్రయోజనాల కోసం పోరాడలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు విప్లవం ద్వారా ప్రష్యన్‌ ‌రాజు నాయకత్వాన గల అనేకమంది జర్మన్‌ ‌రాజులను తుడిచిపెట్టి చరిత్ర చెత్త కుప్పమీదికి విసిరేసి, విడివిడి జర్మన్‌ ‌రాజ్యాల ఏకీకరణ కోసం పోరాడారు.

అయితే తన శక్తియుక్తులను విప్లవకర శక్తుల సమీకరణ కోసం వినియోగించేందుకు బదులు, లాసాల్‌ ‌ప్రజాస్వామం కోసం ఎవరైనా చేయగలిగిన అతి ముఖ్యమైనదాన్ని దాదాపుగా తను చేస్తున్నట్లు ఒక వైపున అందరికీ చెప్తూ, మరో వైపున కోర్టులో అభాండాలతో కూడిన ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ కేసు విచారణ క్రమంలో లాసాల్‌ ‌స్వభావంలోని పరస్పర విరుద్ధ పార్శ్వాలన్నీ నీటి తుంపరలో సూర్య కిరణం మాదిరిగా ప్రతిఫలించాయి. ఆయనలో శక్తి పెల్లుబుకుతూ ఉంది. ఆయన కృత నిశ్చయం కలిగినవాడు. ప్రతిభావంతుడైన జర్నలిస్టు మాదిరిగా, ఉజ్వల వక్తలా మాట్లాడాడు. అయితే అదే సమయంలో ఆయన ఒక మాదిరి పోజుల రాయుడు. ʹʹస్త్రీల మానవ హక్కులʹʹ సమర్థకుడుగా ఆయన కేసి చూస్తూ ఉత్సాహపూరితు రాండ్రైన మహిళలు ఆయన మీదకి పూలూ, ముద్దులూ విసిరితే ఆయన ఆనందానికి అవధి ఉండేది కాదు.

ఈ విడాకుల కేసులో లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది. సందర్భవశాత్తూ ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. ఆ కేసులో తను ఎంతగా నిమగ్నుడై ఉన్నప్పటికీ, జర్మనీ అంతటినీ క్రక్కదలించివేసిన 1848 నాటి విప్లవం పట్ల లాసాల్‌ ఉదాసీనత ప్రదర్శించలేదు. అధికారులను ఎదిరించమనీ, పన్నులు చెల్లించేందుకు నిరాకరించమనీ లాసాల్‌ ఇచ్చిన పిలుపులతో ఆయన నివాస స్థానమైన డుస్సెల్‌డోర్స్ ‌దద్దరిల్లిపోయింది. 1848 నవంబరులో ʹʹరాజాధికారాన్ని సాయుధంగా ఎదిరించవలసిందిగా పౌరులను రెచ్చగొడుతున్నʹʹ నేరారోపణపై- విధేయులైన బూర్జువాల దృష్టిలో దారున నేరారోపణపై- ఆయన జైల్లో పెట్టబడ్డాడు. లాసాల్‌ ‌తనని తాను సమర్థించుకొంటూ చేసిన ప్రసంగం సుస్పష్టమైన తర్కంతో, సమ్మోహనకరమైన వాగ్ధాటితో, తన కార్యకలాపాలు సరైనవన్న సుదృఢ విశ్వాసంతో ఈనాటికీ మనస్సుకి హత్తుకొనేలా ఉంటుంది. మార్కస్, ఎం‌గెల్సులు లాసాల్‌ అరెస్టులో రాజరిక దౌర్జన్యాన్ని చూసి ʹʹనోయోరైనిషె సైటుంగ్‌ʹʹ (ʹʹ‌రైన్‌ ‌కొత్త పత్రికʹʹ)లో ఆయన్ని సమర్థిస్తూ రాసారు.

లాసాల్‌ ‌విప్లవ కాలంలో సోషలిస్టు భావాల పట్ల ఆకర్షితుడయాడు. ఆయన సోషలిస్టు సాహిత్యం పట్ల ఆసక్తి చూపనారంభించి ʹʹనోయెరైనిషె సైటుంగ్‌ʹʹ‌ను జాగ్రత్తగా చదువుతూ, మార్కస్, ఎం‌గెల్సుతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాడు. అయితే ఈ ఇద్దరు ప్రముఖ చింతనాపరులతో, విప్లవకారులతో సాంగత్యం గాని, ʹʹకమ్యూనిస్టు పార్టీ ప్రణాళికʹʹ పఠనం గాని ఆయన అభిప్రాయాల్లో మౌలికమైన ఏ మార్పుకీ దారి తియ్యలేదు. మార్కస్, ఎం‌గెల్సులు శాస్త్రీయంగా తీర్చిదిద్దిన సిద్ధాంతాన్ని ఆయన సమర్థించలేదు. లాసాల్‌ ఒక పెటీ బూర్జువా ప్రజాతంత్రవాదిగానే ఉండిపోయాడు. ఆయన ప్రపంచ దృక్పథంలో వివిధ సిద్ధాంతాలూ, అభిప్రాయాలూ చిత్రాతి చిత్రమైన రీతిలో కలగూర గంపలా సమ్మిళితమై ఉన్నాయి. దానిలో ʹʹప్రణాళికʹʹలోని కొన్ని విడి సూత్రీకరణలు మొదలుకొని, ఉత్పాదక సంఘాల ఏర్పాటు కోసం ప్రూడన్‌ ఇచ్చిన పిలుపు దాకా అవి కలగాపులగమై ఉన్నాయి.

(ఇంకా ఉంది)

No. of visitors : 1129
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 24.11.2016 09:43:08pm

లాసాల్‌ ‌చెప్పేదాని ప్రకారం, కార్మిక సంఘాలు ఉత్పత్తి నిర్వహణను క్రమంగా తమ చేతుల్లోకి తీసుకుంటాయి. సార్వజనిక ఓటు హక్కును ప్రవేశపెట్టిన ఫలితంగా రాజ్యం ʹʹ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •