సామాజిక కార్యకర్తలపై హత్యానేరం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

సామాజిక కార్యకర్తలపై హత్యానేరం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

- విరసం | 10.11.2016 07:56:11pm

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్, జె.ఎన్.యూ ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్, సి.పి.ఐ(ఎం) ఛత్తీస్ ఘఢ్ రాష్ట కార్యదర్శి సంజయ్ పరాటే, సి.పి.ఐ సభ్యుడు, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (IPTA)కు చెందిన వినీత్ తివారి, మంగల్ రామ్ కర్మ(సి.పి.ఐ), సుక్మా జిల్లా గుఫిడి గ్రామ సర్పంచ్ మంజు కవాసిల తదితరులపై ఛత్తీస్ ఘడ్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం సోమ్ నాథ్ బఘల్ అనే వ్యక్తిని పోలీసు ఇన్ఫార్మర్ అని మావోయిస్టులు చంపేశారు. దీనిపై నమోదు చేసిన కేసులో పోలీసులు సామాజిక కార్యకర్తలను కూడా ఇందులో చేర్చారు. ప్రొఫెసర్లపై, సామాజిక కార్యకర్తలపై పబ్లిక్ సెక్యూరిటీ చట్టం, ఐ.పి.సి సెక్షన్ 302 (హత్య), 120బి (నేరపూరిత కుట్ర), 147, 148 (దాడులకు పాల్పడటం, మారణాయుధాలు ధరించి ఉండటం) కింద కేసులు నమోదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ జనరల్ కల్లూరి స్వయంగా మీడియాతో చెప్పారు.

ప్రజాస్వామిక హక్కుల మీద ఇది బరితెగించిన దాడి. ఛత్తీస్ ఘడ్ కొంత కాలంగా హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై దాడులు, వేధింపులు, తప్పుడు కేసుల గురించి వార్తల్లో ఉంది. ఆదివాసులపై పోలీసు బలగాలు చేస్తున్న అకృత్యాల గురించి మాట్లాడుతున్నందుకు గత కొన్ని సంవత్సరాల నుండి సామాజిక కార్యకర్తలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నమోదైన ఈ తప్పుడు కేసు నేపథ్యం కూడా అదే. వీళ్ళంతా నిజనిర్ధారణ బృందంగా బస్తర్ వెళ్ళి బూటకపు ఎన్ కౌంటర్లు, ప్రజలపై దాడులు, ఆదివాసీ మహిళలపై పోలీసు బలగాల అత్యాచారాల గురించి మాట్లాడటమే కాదు, పోలీసు ఇన్ఫార్మర్ ను మావోయుస్టులు చంపిన ఘటనను గురించి కూడా మాట్లాడారు. వీళ్ళేవరూ మావోయిస్టు రాజకీయాలను సమర్థించేవారు కూడా కాదు.

పోలీసుల ఎన్ కౌంటర్ హత్యలను, ఆదివాసులపై రాజ్యం చేసే అకృత్యాలను, దండకారణ్యంలో ప్రభుత్వం తలపెట్టిన ప్రజలపై యుద్ధాన్ని, కార్పొరేట్ కంపెనీల కోసం అడవిని నాశనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నవారు. మావోయిస్టులని చెప్పి చట్టం, జైలు, బెయిలు, వంటి వాటికి అర్థాలే తెలియని వేలాది మంది ఆదివాసీలను తప్పుడు ఆరోపణలతో సంవత్సరాల తరబడి నిర్బంధించి హింసిస్తున్న వైనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. ఈ విషయాలు ఎవరు మాట్లాడినా ఇప్పుడు మావోయిస్టులే. పబ్లిక్ సెక్యూరిటీ చట్టం కింద వాళ్ళను అరెస్టు చేయొచ్చు. డా.బినాయక్ సేన్ లాగా, ప్రొ.సాయిబాబా లాగా వాళ్ళను జైల్లో పెట్టొచ్చు. సంవత్సరాల పాటు చీకటి కొట్లో ఒంటరి నిర్బంధానికి గురిచేయవచ్చు. హక్కుల గురించి మాట్లాడితే శాంతి భద్రతలకు ముప్పు అని పోలీసు భాషలో రాజ్యం బెదిరిస్తున్నది. ప్రజాస్వామ్యం అంటే ఎవరి శాంతి, ఎవరి భద్రత? రాజ్యాన్ని ప్రశ్నించే గొంతుకలను దుర్మార్గంగా అణిచివేసే ఈ నియంతృత్వ పోకడలను ప్రజాస్వామికవాడులందరూ నిరసించాలని విరసం విజ్ఞప్తి చేస్తున్నది. నందినీ సుందర్, అర్చనా ప్రసాద్, సంజయ్ పరాటే, వినీత్ తివారి, మంగల్ రామ్ కర్మ, మంజు కవాసిల తదితరులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.





No. of visitors : 676
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సామాజిక న్యాయభావనను, భావప్రకటనా హక్కును కాలరాస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

విరసం | 08.07.2017 06:06:09pm

కురుక్షేత్ర సభపై నిర్బంధం అప్రజాస్వామికం. సభలకు, నిరసనలకు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలనడమే అప్రజాస్వామికం.ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదో......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
    ఇక యాక్షన్‌ ప్లాన్‌ 2018

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •