ఆ శిరస్సు, స్తనాలు ఏమయ్యాయి?

| సంభాషణ

ఆ శిరస్సు, స్తనాలు ఏమయ్యాయి?

- పద్మకుమారి, కార్యదర్శి, అమరుల బంధుమిత్రుల సంఘం | 18.11.2016 11:48:02am

చైనా విప్లవ నవల ʹఎర్ర మందారాలుʹలో చియాంగక్క అనే విప్లవకారిణి కొత్త ప్రాంతానికి బదిలీ అయి వెళుతుంది. ఆ నగరంలోకి ప్రవేశిస్తుండగా.. ఆ కోట గుమ్మానికి వేలాడుతున్న శిరస్సులు కనిపిస్తాయి. వాటిలో ఒకటి చియాంగక్క భర్తదే. విప్లవోద్యమంలో పని చేస్తున్న ఆయనను చంపేసి అలా వేలాడదీశారు.

అక్టోబ‌ర్ 24న ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలోని బెజ్జంకి దగ్గర జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్లో చనిపోయిన విప్లవకారుల శవాల స్వాధీనానికి మల్కాన్‌గిరికి వెళ్లాం. మావోయిస్టు భారతి మృతదేహం కోసం ఆమె కుటుంబ సభ్యులతో పాటు చైతన్యమహిళా సంఘం నాయకురాలు దేవేంద్ర వచ్చింది. అక్కడికి వచ్చాక గాని ఆమెకు తన జీవిత సహచరుడు ప్రభాకర్‌ కూడా ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని తెలియదు. అప్పుడు నాకు ఈ నవలలో పైన చెప్పిన సన్నివేశం గుర్తుకు వచ్చింది. 2003లో అమరుల బంధుమిత్రుల సంఘం ఏర్పడ్డప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అమరులైన విప్లవకారుల మృతదేహాల స్వాధీనానికి వెళుతున్నాం. ఇన్నేళ్లలో ఎన్నడూ కలగని విషాదకరమైన అనుభవం మల్కాన్‌గిరిలో కలిగింది. తల లేని మావోయిస్టు మృతదేహాన్ని మొదటిసారి అక్కడ చూడాల్సి వచ్చింది.

ఎన్‌కౌంటర్‌ జరిగిందని పోలీసులు అనేక మంది నాయకుల పేర్లు, కార్యకర్తల పేర్లు ప్రకటిస్తూ వచ్చారు. మొదటి రోజే 18 మంది పేర్లు ప్రకటించడంతో ఆ కుటుంబాల వాళ్లందరం కలిసి మల్కాన్‌గిరి వెళ్లాం. దాదాపు ఎనభై మందిమి ఉంటాం. తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా ఎన్‌కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను సాధారణంగా మార్చురీలో ఉంచుతారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోస్టుమార్టం నిర్వహించకపోవచ్చు, రక్త సంబంధీకులు వచ్చే వరకు మృతదేహాలు చెడిపోకుండా భద్రపరచకపోవచ్చు. మృతదేహాలతో అమానుషంగా ప్రవర్తించి, బంధువులకు ఇవ్వకుండా వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఒడిస్సా పోలీసులు ఈ మాత్రం పద్ధతులు కూడా పాటించదల్చుకోలేదు. ఎస్పీ ఆఫీసు ఆవరణలో ఉన్న షెడ్‌లో మృతదేహాలను ఉంచారు. పాత సామాన్లను పెట్టినట్లు చెక్క పెట్టెల్లో కుక్కి పెద్ద కంటెయినర్‌(పెద్ద ట్రక్కులో)లో పడేశారు. దాని తలుపు తెరవగానే దాదాపు ఇరవై పెట్టెలు బైటికే కనిపించాయి. వాటిలో తమ వాళ్ల శవాలు ఉంటాయని తెలిసి రక్త సంబంధీకులు గొల్లున ఏడ్చారు. మొదట ఫొటోలు చూపించి దానికి ఉన్న నెంబర్‌ ప్రకారం పెట్టెల్లో ఉన్న శవాలను తీసకపొమ్మన్నారు. రెండు రోజులుగా అనేక పేర్లు ప్రకటించడంతో తమ వాళ్లు ఉన్నారేమో అని వెతుక్కోడానికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇది సహించలేకపోయారు. అన్ని శవాలను అందరికీ చూపించాలని ఆందోళన చేయాల్సి వచ్చింది. రెండు రోజుల తర్వాత కూడా మృతదేహాలను చూసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో కుటుంబాల వాళ్లు ఆగ్రహించారు. దీంతో పోలీసులు విడత వారీగా కుటుంబాల వాళ్లను లోపలికి తీసికెళ్లి మృతుల ఫొటోలు చూపి పెట్టెలకు ఉన్న నెంబర్ల ప్రకారం శవాలను చూపించడం మొదలు పెట్టారు. అది కూడా కంటెయినర్‌లోంచి నెంబర్ల ప్రకారం పెట్టెలు కిందికి దించి మూత తీసి ముఖం వరకు మాత్రమే చూపించారు.

అలా మొదట గుర్తించిన ఆరు శవాలను కిందికి దించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరమణ(పాడేరు), దయ(నల్గొండ) శవాలు మాత్రమే చూడటానికి వీలుగా ఉన్నాయి. పాల్తీన్‌ కవర్లలో శవాలను చుట్టేసి, వరిపొట్టుపోసి, నాలుగు ఐస్‌ ముక్కలు వేసి పెట్టెల్లో కుక్కేశారు. అది కూడా మొదటి నాలుగైదు శవాలకే. మిగతా వాటి విషంలో ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేదు. ఐస్‌ ముక్కలు కరిగిపోవడంతో నీళ్లు, శరీరాల నుంచి కారిన రక్తం, పొట్టు కలిసి ముఖాలు కనిపించడం లేదు. ఆ నీళ్లు తోడేసి, పొట్టు తీసేస్తేగాని ముఖాలను పోల్చుకోలేకపోయాం. కొన్ని శవాలను చూపించి పోలీసులు ఆ దుర్గంధం భరించలేక పక్కకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కుటుంబాల వాళ్లే పెట్టెలు తెరిచి చూసుకోవాల్సి వచ్చింది.

ఎన్‌కౌంటర్లో చనిపోయిన మమత(శ్రీకాకుళం జిల్లా బాతుపురం) మృతదేహాన్ని తీసుకపోవడానికి ఆమె సోదరి కోమలమ్మ శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చింది. మమత సహచరుడు కూడా చనిపోయాడనే వార్తలు రావడంతో ఆయన అన్నదమ్ములూ వచ్చారు. మమత ముఖం చూసి గుర్తుపట్టిన కోమలమ్మ పాల్తీన్‌ కవర్‌ గుండెల దాకా తెరిచింది. శవం మీద మరో బట్ట కూడా లేదు. స్థనాలు కనిపించలేదు. రెండూ కోసేశారు. ఈ దృశ్యాలను మీడియా చిత్రీకరించింది.

ఇక్కడ పోస్టుమార్టం ఇలా చేస్తారా? అని పోలీసులను అడిగాం. అవి గాయాలని బుకాయించారు. ఆమెను హింసించడంలో భాగంగా స్తనాలు రెండూ కోసేశారని తెలుస్తూనే ఉంది. కోమలమ్మ ..ʹ నా చెల్లెల్ని కోసేసేరే..బిడ్డకు పాలిచ్చే రొమ్ములు కదా.. వీళ్లు తల్లిపాలు తాగలేదా?..ʹ అని ఏడవడం మొదలు పెట్టింది. ఇంక చూడలేక పాల్తీన్‌ కవర్‌ మూసేసింది. శవం మీద గుడ్డ కూడా కప్పకుండా అలా చుట్టేయడం ఆమె భరించలేపోకపోయింది. ʹఆడపిల్లను ఇంత మంది మగవాళ్ల ముందు ఇట్ల బట్టలు లేకుండా చూడాల్సి వచ్చింది. మనం మాత్రం బట్టలు కట్టుకోడం దేనికి? నేనెందుకమ్మా బట్టలు కట్టుకొనేది..ʹ అని భుజం మీది కొంగు కిందికి వదిలేసింది. ఆ తల్లి తన వంటి మీది బట్టలు ఎక్కడ తీసేస్తుందో అని నాకు అనిపించింది. ఆమెను ఒడిసిపట్టుకొని పక్కకు తీసుకొని వచ్చాను.

అంత దు:ఖంలో కూడా మణిపూర్‌ మహిళలు అక్కడి సైనికుల దురాగతాలకు వ్యతిరేకంగా నగ్న ప్రదర్శన చేయడం గుర్తుకు వచ్చింది. అప్పుడు కొందరం ఇలాంటి ప్రదర్శనలు చేయడం ఏమిటని అనుకున్నాం. మహిళలను రాజ్యం ఎందుకు ఈ స్థితికి తీసుకొని వస్తోంది?

భారతి(మెదక్‌) మృతదేహానికి కూడా ఒక స్థనం లేదు. మరో దాని మీద గాయం ఉంది. పోస్టుమార్టం కోసం కావచ్చు.. ఆమె తల దగ్గర తెరిచి మళ్లీ కుట్లు కూడా వేయకుండా అలాగే వదిలేశారు. ప్రజాకళామండలి నాయకుడు ప్రభాకర్‌ ముఖంలో సగభాగం లేదు. దంతాలు బైటికి పొడుకొని వచ్చాయి. భుజాలు వెనక్కి విరిచేయడంతో వక్షస్థలం ఎముకలు పైకి వచ్చాయి. డొక్కల్లో అనేక గాయాలున్నాయి. పేగులు బైటికి వచ్చాయి.

నాలుగైదు మృతదేహాలను మాత్రమే వరుసగా చూడగలిగాం. మనిషి గుండెకు తట్టుకునే శక్తి ఎంత ఉంటుంది? అలాంటి శవాలను ఎన్నని చూడగలం? ఇంతలో మా సంఘం సభ్యురాలు ఒకామె పరిగెత్తుకుంటూ వచ్చి ʹఅక్కా..అక్కడ ఇరవైయ్యో నంబర్‌ శవానికి తల లేదు..ʹ అని చెప్పింది. అసలు శవాలను నెంబర్లతో గుర్తుపట్టాల్సి రావడం ఏమిటి? వీళ్లంతా నిన్నటి దాకా సజీవమైన మనుషులు కదా? ఎన్నో కలలు, ఆదర్శాలు, విలువలు ఉన్న వాళ్లు కదా? అలాంటి వాళ్లను చంపేసి ఓ పెట్టెలో కుక్కేసి ఓ నెంబర్‌ ఇచ్చేశారు. మేం కూడా ఉదయం నుంచి నంబర్లతోనే వ్యవహరించక తప్పని స్థితి రాజ్యం కల్పించింది. శవాలను గౌరవించడం బతికి ఉన్నవాళ్ల సంస్కారానికి గుర్తు. తను చంపిన విప్లవకారుల శవాలపట్ల కూడా రాజ్యం కొన్ని పద్ధతుల పాటించాలని అమరుల బంధుమిత్రుల సంఘం కొట్లాడుతున్నది. ఆ మనుషుల విశ్వాసాలకు తగినట్లు మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు జరపడం ఒక బాధ్యతగా తీసుకున్నది. అలాంటి మేం కూడా అమరులను కేవలం ఒక అంకెతో వ్యవహరించాల్సి రావడం, నిర్జీవమైన ఫొటోలతో కుటుంబాలు గుర్తుపట్టాల్సి రావడమే విషాదం అనుకుంటుంటే శవానికి తల కూడా లేదని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాం. మా సంఘ కార్యకర్తలకు తల లేని శవాన్ని చూడ్డం అదే మొదటిసారి. తల లేదు కాబట్టి ఆ శవాన్ని గుర్తు తెలియని మృతదేహాల లిస్టులో పోలీసులు వేశారు. సాయంత్రం డిఐజీ షైనీ మిశ్రా దగ్గరికి వివిగారు వెళ్లి ఆ మృతదేహం శిరస్సు ఏమైందని ప్రశ్నించారు.

ఆమె నింపాదిగా ʹలేదేమో..ʹ అన్నది.

ʹతల లేకపోవడం ఏమిటి? అన్ని శవాలకు ఫొటోల్లో తలలు ఉన్నాయి కదా?ʹ అని ఆయన ఆడిగారు.

ఆమె ఒక్క క్షణం ఆగి ఏ ఫీలింగ్స్‌ లేకుండా నెమ్మదిగా ఎస్పీతో ʹ ఆ తల ఎక్కడైనా ఉండేమో కాస్త చూడండిʹ అని పురమాయించింది.

అది ఒక మనిషి తల కదా? ప్రభుత్వం వెల కట్టిన తల అది. అలా తలలకు వెల కట్టి పోలీసులను హత్యలకు ప్రోత్సహిస్తున్నది. మామూలు వాళ్లను ఆ తలల కోసమే కోవర్టులుగా మార్చుకుంటున్నది. ఆ తలలోని ఆలోచనలు, కలలు చూసే భయపడుతున్నది. అలాంటి విప్లవకారుల తల విలువ ప్రభుత్వానికి తెలియదా? తెలిసీ మాయం చేయడంలోని మర్మం ఏమనుకోవాలి? తల లేకుంటే శవానికైనా ఉనికి ఏమున్నది? ఏదో వస్తువు పడిపోయినట్లు ఆ అధికారి వెతకండి అనడం మామూలు మనుషులకు సాధ్యమయ్యే పనేనా? మనుషులు అనే మాటలేనా? ఇవి.

మర్మాంగాలను ఛిద్రం చేస్తున్న చోట, పాలిచ్చే వక్షోజాలను కోసి పారేస్తున్న చోట, తలెత్తి పోరాడమని ప్రజలకు నేర్పిస్తున్న వాళ్ల తలలు మాయం చేస్తున్నచోట, శవాన్ని పైకి ఎత్తితే జారిపోతున్న పేగులను తల్లులు మూటకట్టుకొని తెచ్చుకుంటున్న చోట, శవాన్ని కట్టేసిన పాల్తీన్‌ మూటను కదిలిస్తే చీమూ నెత్తురూ కలిసిన నీరు వరదలా పారుతున్న చోట జనం ఎలాంటి పోరాటం చేయాలి? ఏ పోరాట పద్ధతిని ఎంచుకోవాలి?

No. of visitors : 11414
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


‌మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

పద్మకుమారి | 17.06.2016 10:57:58am

వాకపల్లి పాతపడిపోయింది. కొత్తగా భల్లుగూడ కూడా మన ముందుకు వచ్చిపోయింది. ఛత్తీస్‌ఘడ్‌లో రోజూ ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అన్నీ పోలీసులు, పారా........
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు

పద్మకుమారి | 15.05.2016 01:51:20pm

ʹఅమ్మా నువ్వే ఇట్లన్నవంటే.. వాల్లు ఇంకెట్లంటరో ఆలోచించు. అది చూడు ఎంత బాధపడుతున్నదో. ఇంతకూ బాబును వదిలి వెళ్లడానికి ధనాలు సిద్ధంగా ఉందా? దాన్ని ఒక్క మాట అడగ...
...ఇంకా చదవండి

పయనించిన పాట

పద్మకుమారి | 21.12.2016 12:01:15am

బిడ్డల గురించి తల్లులకు ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని ఆరాటాలు, ఎన్ని ఎదురు చూపులు. ఇవి తీరేవేనా? ఈ దు:ఖం ఆగిపోయేదేనా? ప్రభా తల్లి ఒక్కరే కాదు. అమరుల ...
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు -2

పద్మకుమారి | 01.06.2016 10:37:59am

కమాండర్‌ వెనక్కి తిరిగి మనం దగ్గరికి వచ్చేశాం. ఇది మనకు బలమైన ప్రాంతం. ఇంకో అరగంటలో గ్రామం అంచులోకి చేరుకుంటాం. ప్రయాణం ఒక రోజు లేటైనా రెండో రోజు ఏపీటీకి...
...ఇంకా చదవండి

విప్లవ వ్యక్తిత్వం

పద్మకుమారి | 16.07.2019 08:07:17pm

భారతి అమరత్వం తర్వాత కలిసినప్పుడు శంకరన్న వాళ్లన్నయ్య దుబాషి యాదయ్య తన జ్ఞాపకాలు పంచుకున్నాడు. చిన్నారి యాదమ్మ ఆ కుటుంబంలో హక్కుల కోసం ఆమె పడిన ఘర్షణ......
...ఇంకా చదవండి

పాల్గుణ

ప‌ద్మ‌కుమారి | 11.05.2016 01:21:15pm

ఇప్పుడు పాల్గుణ అంటే మేఘ‌మే కురుస్తుంది త‌ప్ప పిడుగు రాల‌దు.పిడుగు రాలినా పిడుగంచు విద్యుత్ వెలుగై మ‌నసులోకి ఇంకుతుంది. ...
...ఇంకా చదవండి

త్యాగాల పరంపర

పద్మకుమారి | 17.07.2016 12:35:14am

కుప్పగా పోసిన శవాల్లో తమవాళ్లను గుర్తించి ఏరుకోవడం ఎంత హృదయ విదారకం. సృజన మనసు చాల సున్నితమైనది. పట్టుదలగల అమ్మాయి. మేము ఇలా ఎప్పుడో ఒకప్పుడు చూస్తామని......
...ఇంకా చదవండి

దారులు

ప‌ద్మ‌కుమారి | 15.05.2016 01:10:40pm

ఎక్కడివీ బాటలు ఎవరి జాడలు వెంట పరిగెడుతున్నాయి నీవేనా ? అవి నీవేనా ?...
...ఇంకా చదవండి

వాకపల్లి ఇప్పుడు ఎం చెబుతోంది?

పద్మకుమారి | 04.09.2017 08:58:57am

వాకపల్లి ఒక్కటే కాదు. విప్లవోద్యమ ప్రాంతాల్లో మహిళల రాజ్యం దారుణంగా దాడి చేస్తోంది. బైటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించీ వింటున్నాం. చిన్న ప...
...ఇంకా చదవండి

రమాకాంత్‌ వాళ్లమ్మ

పద్మకుమారి | 17.11.2019 10:25:42am

ʹఆ రోజు అన్నను చంపేసినప్పుడు మన సంగం లేదు కాబట్టి శవాన్ని చూడ్డానికి కూడా కాలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడికోపోయి మనోల్ల శవాలను తెస్తున్నారు. మన సంగం ఉండాలి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •