అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

| సాహిత్యం | వ్యాసాలు

అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

- సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

విశాఖ ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు. బాక్సైట్ నిక్షేపాల ద్వారా ప్రతి సంవత్సరం 8 వేల కోట్లు ప్రభుత్వానికి సమకూరుతాయని కూడా ప్రభుత్వ అంచనా. రెండు ద‌శ‌ల్లో ఆదివాసీ గ్రామాల‌ను ఖాళీ చేయించి బాక్సైట్ నిక్షేపాలు వెలికితీయాల‌నేది ప్ర‌ణాళిక‌. అదే జ‌రిగితే మొద‌టి ద‌శ‌లో 80, రెండో ద‌శ‌లో 185 గ్రామాల్లోని దాదాపు 26వేల మంది ఆదివాసీలు నిర్వాసితుల‌వుతారు. అడ‌వి మీదే ఆధార‌ప‌డి జీవ‌నం సాగించే ఆదివాసీ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ఈ యోచ‌న‌ను ఆది నుంచీ వ్య‌తిరేకిస్తున్నారు. తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న‌నూ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆ మ‌న్యం పోరులోని ఒకానొక ప‌ల్లే వాక‌ప‌ల్లి.

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌లు... క‌త్తులు జులిపిస్తాయి. స్కూలు నుంచి వ‌చ్చే పిల్ల‌ల్ని న‌క్స‌లైట్లంటూ నిర్భందిస్తాయి. వైద్యానికి వెళ్లే వృద్దున్ని మావోయిస్టు కేసులో నిందితుడిని చేస్తాయి. అవును.. మ‌న్యం అట‌వీ ప్రాంతంలో నెల‌కొన్న దుస్థితి ఇది. విశాఖ జిల్లా జి. మాడుగుల మండ‌లం, నుర్మతి గ్రామ పంచాయతీ పరిధిలో వాక‌ప‌ల్లి గ్రామం ఉంది. ఊర్లో పాతిక‌కు పైగా కుటుంబాలు జీవిస్తుంటాయి. వాళ్లంతా కోందు ఆదివాసీ తెగ‌కు చెందిన వాళ్లు. నిత్యకృత్యంగా మారిన పోలీసు ప‌ద‌ఘ‌ట్ట‌న‌ల న‌డుమ ఆ ప‌ల్లె ప్ర‌తిఘ‌టిస్తూనే ఉంది.

ప‌చ్చ‌ని అడ‌వి న‌డుమ ప‌రుచుకున్న ప‌ల్లె అది. కొండ కోన‌ల న‌డుమ క‌ట్టుకున్న గూళ్లు అవి. ప్ర‌కృతే ఆదెరువుగా జీవిస్తున్న ప్ర‌జ‌లు వాళ్లు. వాళ్లు.. క‌ల్మ‌ష‌మెరుగ‌ని ఆదివాసీలు. వాళ్ల జీవితాల్లో ఒక ఉద‌యం క‌ల్లోలం రేగింది. ఖాకీ బూట్ల చ‌ప్పుళ్ల‌తో తెల్లారింది ప‌ల్లె. ఎద‌పై తుపాకీ మోపి... ఆమెను వివ‌స్త్ర‌ను చేశారు. తోడేళ్ల‌లా ప‌డి అత్యాచారం చేశారు. ఒక్క‌రు కాదు... ఇద్ద‌రు కాదు.... ప‌ద‌కొండు మందిపై జ‌రిగిన అకృత్యం అది. క‌ట్టుకునే బ‌ట్ట‌లు, తిండి గింజ‌లు, భూమి ప‌ట్టాలు అన్నీ ధ్వంసం చేశారు. ఇళ్ల‌కు నిప్పు పెట్టారు.

2007 ఆగస్టులో నక్సలైట్ల కోసం కూంబింగ్‌ ‌వెళ్లిన పోలీసులు వాక‌ప‌ల్లి గ్రామంలో 11 మంది ఆదివాసీ మహిళలపై అత్యాచారానికి పాల్ప‌డ్డ ఘ‌ట‌న అది. మొత్తం దేశాన్నే క‌దిలించిన ఘ‌ట‌న. సాధార‌ణ వ్య‌క్తులు ఇలాంటి దురాగ‌తానికి పాల్ప‌డితే... పోలీసుల్ని ఆశ్ర‌యిస్తారు ప్ర‌జ‌లు. కానీ పోలీసులే నిందితులైతే ఎక్క‌డికెళ్తారు. అయినా... వాళ్లు మౌనం వ‌హించ‌లేదు. అడ‌వి నుంచి హైద‌రాబాదు దాకా వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌పంచం ముందు వెళ్ల‌గ‌క్కారు. అత్యాచారానికి పాల్ప‌డిన పోలీసుల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. కానీ కూంబింగ్‌ని అడ్డుకునేందుకే ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేపిస్తున్నారంటూ ఎదురు ఆ మ‌హిళ‌ల‌పైనే కేసులు మోపేందుకు య‌త్నించారు పోలీసులు. చివ‌ర‌కు అత్యాచారం జ‌రిగింది నిజ‌మో, కాదో తేల్చ‌డానికి వైద్య‌ ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించారు. అయినా... అధికారం, అంగ బ‌లం ముందు వాళ్ల గోడు ఎవ‌రికీ ప‌ట్ట‌లేదు.

బ‌డికి వెళ్లాల్సిన ప‌దిహేనేళ్ల కుర్రాడు క‌ళ్ల‌లో క‌సి నింపుకొని చూస్తున్నాడు. ఆడ‌బిడ్డ‌ల ఆర్త‌నాదాలు వింటున్నాడు. ఏమీ చేయ‌లేని నిస్సాహ‌య‌త‌. ఉబికిన క‌న్నీరు వెంటే క‌త్తులు మొలిచాయి. కొత్త‌దారేదో ఆహ్వానం ప‌లికింది. అటు వైపు ప‌డిన అడుగులు... మ‌ళ్లీ వెనుదిర‌గ‌లేదు. యుద్ధ‌గీత‌మాల‌పిస్తూ క‌దిలిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక్క వాక‌ప‌ల్లి కాదు... అలాంటి ప‌ల్లెలెన్నో త‌న‌ని ద‌రికి చేర్చుక‌న్నాయి. త‌ల్లులెంద‌రో ఒడికి చేర్చుకున్నారు. బ‌డిలో వ‌దిలిన పాఠాలు అడ‌విలో ప‌దునెక్కాయి.

ఆదివాసీల హ‌క్కుల కోసం ఆయుధం ఎత్తుకున్న ఆ న‌వ‌యువ‌కుడే డేనియ‌ల్‌. ఏఓబీ విప్ల‌వోద్య‌మంలో త‌న‌వంతు నెత్తురు దార‌పోసిన వాడు. ఎనిమిదేళ్ల త‌రువాత రామ‌గూడ అట‌వీ ప్రాంతంలో... శ‌త్రువుతో త‌ల‌ప‌డి హోరాహోరి పోరులో నేల‌కొరిగాడు. కానీ ఈ ఎనిమిదేళ్లు... త‌ను పోరాటంలో వీరుడిలా నిల‌బ‌డి ఉన్నాడు. అడ‌వి మీద హ‌క్కు త‌మ‌దే అని స‌గ‌ర్వంగా చాటుతూ ఆదివాసీ పోరున‌డిపాడు.

అక్టోబ‌ర్ 24న ఆంధ్ర - ఒర‌స్సా స‌రిహ‌ద్దులో జ‌రిగిన బూట‌క‌పు ఎదురుకాల్పుల్లో చ‌నిపోయిన మావోయిస్టుల్లో డేనియ‌ల్ కూడా ఉన్నాడు. టీవీల్లో వార్త‌లు చూసిన డేనియ‌ల్ త‌ల్లిదండ్రులు ఆ మ‌ర్నాడు మృత దేహాన్ని తీసుకునేందుకు మ‌ల్కాన్‌గిరి వెళ్లారు. ఎనిమిదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిన బిడ్డ‌ను ర‌క్త‌పు ముద్ద‌గా చూసిన త‌ల్లిదండ్రుల నోట మాట‌రాలేదు. చిద్రమైన దేహం... త‌లపై, య‌ద‌లో అతి ద‌గ్గ‌ర‌గా కాల్చిన గుర్తులు. విరిగి వేలాడుతున్న చేతులు. త‌మ చేతుల్లో పెరిగిన బిడ్డ‌ను మాంస‌పు ముద్ద‌గా చూసిన ఆ త‌ల్లి దండ్రులు బోరున విల‌పించారు. ఎట్ట‌కేల‌కు మృత‌దేహాన్ని తీసుకొని వాక‌ప‌ల్లికి ప‌య‌న‌మ‌య్యారు.

దారి మ‌ధ్య‌లో కాచుకు చూర్చున్న పోలీసులు. అంబులెన్సుకు అడ్డంగా వాహ‌నాలు పెట్టి, తుపాకులు గురిపెట్టారు. వెన‌క నుంచి ముప్పై మంది పోలీసులు వ‌చ్చి అంబులెన్సును చుట్టుముట్టారు. తుపాకులు పేల‌డ‌మే త‌రువాయి... అన్న‌ట్లు వాతావ‌ర‌ణం. త‌మ బిడ్డ మృత‌దేహాన్ని తెచ్చుకుంటున్నామ‌న్నా విన‌లేదు. ఊరు, పేరు, ఆధారాల పేరుతో హ‌డావిడి చేశారు. నానా తిప్ప‌లు ప‌డి... అర్థ‌రాత్రికి డేనియ‌ల్ మృత‌దేహాన్ని త‌మ స్వ‌గ్రామానికి తీసుకు వ‌చ్చారు. మ‌ర్నాడు వంద‌లాది మంది ప్ర‌జ‌లు విప్ల‌వ సాంప్ర‌దాయంతో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

కానీ డేనియెల్ ఆ ప‌ల్లె ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయాడు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తున్న పోరాటాన్ని అణిచి వేయడానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన ప్ర‌భుత్వం ఇక్క‌డ విప్ల‌వోద్య‌మాన్ని నిర్మూలించ‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని త‌ల‌చింది. అందుకే... కోవ‌ర్టు కుట్ర‌ల ద్వారా విప్ల‌వోద్య‌మంపై దొంగ దెబ్బ‌కు దిగింది. త‌మ కొడుకు పోలీసులు ప‌ట్టుకొని కాల్చిచంపార‌ని, డేనియెల్‌తో పాటు మ‌రో ముగ్గురు నిరాయుధులైన ఆదివాసీ మ‌హిళ‌ల‌ను సైతం పాశ‌వికంగా హ‌త్య చేశార‌ని డేనియ‌ల్ త‌ల్లిదండ్రులు చెబుతున్నారు.

కూంబింగ్ పేరిట పోలీసులు చేస్తున్న దాష్టికాల‌కు స‌జీవ సాక్ష్యం వాక‌ప‌ల్లి. అలాంటి ప‌ల్లెలు ఇవాళ అనేకం క‌నిపిస్తాయి మ‌ధ్యభార‌తంలో. బ‌స్త‌ర్‌లోని ప్ర‌తి ప‌ల్లె ఒక వాక‌ప‌ల్లి లాంటిదే. అత్యాచారాలు, హ‌త్య‌లు నిత్య‌కృత్య‌మైన స్థితి నేడు నెల‌కొంది. అయినా... వాళ్లు త‌మ పోరాటాన్ని వీడ‌డం లేదు. జ‌ల్ - జంగ‌ల్ - జ‌మీన్ - ఇజ్జ‌త్ కోసం గొంతెత్తూనే ఉన్నారు. ఏఓబీలోనూ... బాక్సైట్ వెలికితీసేందుకు ఒప్పుకోని ఆదివాసీలు ద‌శాబ్ధ‌కాలంపైగా పోరాటాలు చేస్తునే ఉన్నారు. ఈ పోరాటం మున్ముందు కూడా కొన‌సాగుతుంది. ఆ పోరాటాల్లో డేనియ‌ల్ స‌జీవం ఉంటాడు.





No. of visitors : 2672
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

అమ‌ర‌త్వ‌పు జాడ‌ల్లో...

ఫొటోలు : క‌్రాంతి | 22.07.2016 12:11:40pm

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ‌దినం సంద‌ర్భంగా జూలై 18న హైద‌రాబాద్‌లో జ‌రిగిన రాజ్య‌హింస వ్య‌తిరేఖ స‌భ దృశ్యాలు.......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఫిబ్రవరి -2018
    Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
    కలత నిద్దుర‌లోకి త‌ర‌చి చూస్తే
    బ్రాహ్మణీయ దాష్టికానికి, దళితుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం కోరేగాం భీమా
    హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు
    ఇప్పుడు
    నిలబడి తీరాల్సిన దారుల్లో...
    ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం
    ఈ పక్షం బుల్పికలు!
    హ‌క్కులపై ఉక్కుపాదం
    పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •