రెండవ భాగం
ఒక తత్వశాస్త్రవేత్తగా ఆయన హేగెల్ భావవాద బోధన సమర్థకుడుగా ఉండిపోయాడు. ఆయన చారిత్రక క్రమాన్ని ʹʹస్వీయ చైతన్యపు అంతరిక అభివృద్ధిʹʹగా, ʹʹఆత్మ స్వీయాభివృద్ధిʹʹగా వివరంచాడు. ఈ ʹʹఆత్మʹʹ, ʹʹస్వేచ్ఛ దిశగా మానవ జాతి అభివృద్ధిʹʹని నడిపిస్తుంది. లాసాల్ తన భావాలను ʹʹసంచిత హక్కుల వ్యవస్థʹʹ అనే పుస్తకంలో వివరించాడు. ఒక అర్థశాస్త్రవేత్తగా మాట్లాడుతూ, ఆయన ఈ నిర్థారణను బూర్జువా అర్థశాస్త్రవేత్తల పూజు ప్రతిమ అయిన వ్యక్తిగత స్వామ్యాన్ని దాని పీఠం నుంచి తొలగించేందుకు వినియోగించాడు. అయితే ఆయన పెట్టుబడిదారీ వ్యక్తిగత స్వామ్యాన్నే తప్ప, మొత్తంగా వ్యక్తిగతస్వామ్యాన్ని వ్యతిరేకించడు. లాసాల్ ప్రూడన్ని అనుసరించి, సోషలిజంస్వామ్యాన్ని తుదముట్టించదనీ, తద్విరుద్ధంగా అది శ్రమాధారితమైన స్వామ్యాన్ని ప్రవేశపెడుతుందనీ ఉద్ఘాటిస్తాడు.
స్థిరమైన విప్లవాత్మక విశ్వాసాలు లేకపోవడం లాసాల్ని రాజకీయ దుస్సాహసిక చర్యలకి పురిగొల్పింది. 1862లో సాయుధ తిరగుబాటుకి సంబంధించిన తన బృహత్తర పథకంతో లాసాల్ గారిబాల్డీని సమ్మోహ పరిచాడు. ఇటలీ జాతీయ వీరుడు వసంత కాలంలో దాల్మాటియాలో ప్రవేశించి, అక్కడొక తిరగుబాటును లేవదీసి, బుడాపెస్ట్ దిశగా సాగిపోవాలి. కుట్రదారుల పథకం ప్రకారం గారిబాల్డీ దళాల రాక వియన్నాలో తిరుగుబాటుకి దారితీస్తుంది. ఈలోగా లాసాల్ జర్మనీలో కార్మికులను తిరుగుబాటుకు ప్రేరేపిస్తాడు. సహజంగానే, విప్లవకర పరిస్థితి లేనప్పుడు ఇలాంటి ప్రయత్నం శుద్ధ దుస్సాహసం తప్ప మరేమీ కాదు.
1869 దశకపు మొదటి సంవత్సరాల్లో, కార్మికవర్గ ఉద్యమం ఒక వెల్లువలా సాగుతున్న పరిస్థితుల్లో, తన పేరును చిరస్మరనీయం చేసిన పనికి లాసాల్ పూనుకున్నాడు; జర్మన్ కార్మికవర్గాన్ని రాజకీయంగా సంఘటితం చెయ్యాలని ఆయన ప్రచారం చేసాడు. వస్తుపరంగా చూసుకంటే, రాజకీయ సంఘం ఏర్పాటు చాలా ముఖ్యమైన వ్యవహారం. ఎందుకంటే, అది కార్మికవర్గ ఉద్యమాన్ని బూర్జువా ప్రభావం నుంచి విముక్తం చేస్తుంది. అయితే అదే సమయంలో లాసాల్ కార్మిక వర్గపు విప్లవకర పోరాటాన్ని తిరస్కరించి, ʹʹశాంతియుతʹʹ, పార్లమెంటరీ పద్ధతులను సమర్థించాడు. సార్వజనిక ఓటు హక్కు కార్మికుల చేతుల్లోకి అధికారాన్ని తెచ్చిపెడుతుందనీ, ʹʹస్వేచ్ఛాయుత ప్రజారాజ్యంʹʹ ఏర్పడేందుకు తోడ్పడుతుందనీ భావించాడు. లైప్జిగ్ కార్మికులకు ఒక బహిరంగ లేఖలో సార్వజనిక ఓటు హక్కు కోసం శాంతియుతంగా ఆందోళన చేసేందుకు గాను అఖిల కార్మిక యూనియన్ని నెలకొల్పుకోవలసిందిగా లాసాల్ సిఫారసు చేసాడు.
1862 వసంతంలో ఆయన బెర్లిన్లో మూడు బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చాడు: ʹʹఫీహ్టె తాత్వి అభిప్రాయాల గురించిʹʹ, ʹʹరాజ్యాంగ చట్టపు సారాంశం గురించిʹʹ, ʹʹనేటి చారిత్రక దశకీ, కార్మిక తరగతి భావానికీ మధ్య ప్రత్యేక సబంధం గురించిʹʹ, ఆయన ఈ మూడింట్లో చివరి ఉపన్యాసాన్ని ʹʹశ్రమజీవి కార్యక్రమంʹʹ అనే శీర్షికతో చిన్న పుస్తకంగా ప్రచురించాడు. అది ఆయనకు విస్తారమైన కీర్తిని తెచ్చిపెట్టింది. జర్మనీలో చాలా ఏళ్ళలో మొట్టమొదటి సారి, ఉదారవాద స్తబ్దత, బూర్జువావర్గ ప్రయోజనాలూ, కార్మికవర్గ ప్రయోజనాలూ ఒకటే అనే బోధనల వాతావరణంలో, కార్మికవర్గపు ప్రత్యే చారిత్రక కర్తవ్యాలను గురించీ, తన సమయం ఆసన్నమైంది గనుక, కార్మికవర్గం స్వతంత్ర కార్యచరణకు పూనుకోవాలనే మాటలు మార్మోగాయి.
ఆయన ఉపన్యాసాల్లోనూ, పుస్తకంలోనూ కార్మికుల కార్యాచరణకూ, తీవ్ర రాజకీయ కార్యకలాపాలకూ పిలుపు ఇవ్వబడింది. సంఘటిత రాజకీయ పోరాటానికి హేతుబద్ధమైన డిమాండ్లు నిర్వచించబడ్డాయి. లాసాల్ ప్రచారాత్మక రచనల్లోకెల్ల ʹʹశ్రమజీవి కార్యక్రమంʹʹ అత్యుత్తమమైనది. అది కార్మికవర్గ ఉద్యమానికి ఊపునిచ్చింది. కాని, సోషలిస్టు భావం వెనకపట్టు పట్టినట్లయింది. ʹʹవర్గʹʹ భావన స్థానంలో లాసాల్ ʹʹతరగతిʹʹ భావాన్ని ప్రవేశపెట్టాడు. బూర్జువావర్గ ప్రయోజనాలకూ, కార్మికవర్గ ప్రయోజనాలకూ మధ్య పొసగమినీ, వర్గ పోరాటపు అనివార్యతనీ ఆమోదించేందకు బదులు, లాసాల్ కార్మికులకు సార్వజనిక ప్రత్యక్ష ఓటు హక్కు కోసం పోరాడమని మాత్రమే పిలుపు ఇచ్చాడు.
1863 ఫిబ్రవరిలో జర్మన్ కార్మికుల మహాసభ సన్నాహక కమిటీ నుంచి ఒక లేఖ వచ్చింది. దానిలో ఆయన పుస్తకం కార్మికుల్లో విస్తమీతమైన సానుభూతిని రేకెత్తించిందని పేర్కొనబడింది. ఈ లేఖకు ʹʹలైస్టిగ్లో అఖిల జర్మన్ మహాసభ సన్నాహక కేంద్ర కమిటీకి బహిరంగ సమాధానంʹʹ పేరిట ఆయన సమాధానం ఇచ్చాడు. కార్మికులు తమ సొంత, ప్రత్యేక, రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవాలన్నదే లాసాల్ కేంద్ర భావం. ప్రభుత్వ రుణాలతో, ప్రభుత్వ అజమాయిషీ కింద కార్మికుల స్వతంత్ర ఉత్పాదక సంఘాలను నెలకొల్పే ప్రాతిపదిక మీద కార్మిక తరగతి తన సొంత పరిశ్రమదారు అవాలని ఆయన ప్రతిపాదించాడు. కార్మికులను ʹʹవేతనాల ఉక్కు నియమంʹʹ కాడి నుంచి విముక్తం చేసే మార్గం ఇదొక్కటేనని ఆయన పరిగణించాడు.
లాసాల్ మార్గం ఆవిష్కణలో ఈ నియమం ఒకటి. మాల్తుస్ అభివృద్ధి నిరోధక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని, సగటు వేతనం ప్రాణాన్ని నిలిపేందుకూ, సంతానోత్పతిత్తకీ అవసరమైన కనీస మొత్తాన్ని ఎన్నడూ మించదన్న నిర్ధారణకు లాసాల్ వచ్చాడు. సైద్ధాంతికంగా పొరపాటె•న ఈ సూత్రీకరణ బూర్జువా వర్గంతో తమ కీలక హక్కుల కోసం కార్మికవర్గం జరిపే సంఘటిత పోరాటం విఫలం కాక తప్పదన్న ఆచరణాత్మకంగా తప్పుడు నిర్ధారణలను చేసేందుకు ఆయన్ని నడిపించింది. లాసాల్ ʹʹఆవిష్కరణʹʹను ఖండిస్తూ, ఈ నియమం ʹʹవేతానాల సాధారణ చలనాన్ని నియంత్రితం చేసే నియమాలను, లేక కార్మికవర్గానికీ-అంటే మొత్తం శ్రమ శక్తికీ-మొత్తం సమిష•ఇట పెట్టుబడికీ మధ్య నిష్పత్తిని, శ్రామిక జనాభాను వివిధ ఉత్పత్తి రంగాలకు పంచే నియమాలతో గందరగోళ పరుస్తుందిʹʹ అని మార్కస్ పేర్కొన్నాడు.2 వేతనాల స్థాయి కార్మికుడి ప్రాణాన్ని నిలిపి ఉంచేందుకు అవసరమైన తిండికీ, బడ్డలకీ అయ్యే ఖర్చుమీద మాత్రమే ఆధారపడదనీ, అది కార్మికుల రాజకీయ, సాంస్కమీతిక అభివృద్ధి స్థాయి మీదా, వాళ్ళ విప్లవకర చైతన్యం మీదా, మేలైన సంఘటన మీదా, పెట్టుబడిదారులను ప్రతిఘటించడంలో వాళ్ళకి ఉన్న సామర్థ్యం మీదా ఆధారపడి ఉంటుందనీ నిరూపితమైంది.
1891లో ఏర్పుర్ట్లో ʹʹజర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ కార్యక్రమంʹʹ ఆమోదింపబడ్డాక, జర్మన్ కార్మిక పార్టీ, కార్మికవర్గ ఉద్యమాల సైద్ధాంతిక సూత్రీకరణల్లో ʹʹవేతనాల ఉక్కు నియమంʹʹ ప్రసక్తి లేకుండా పోయింది.
రాజ్యం విషయంలో లాసల్కి ఉన్న అభిప్రాయాలు కూడా బాగా పొరపాటెనవే. బూర్జువా రాజ్యపు వర్గ స్వభావాన్ని లాసాల్ అర్థం చేసుకోక, రాజ్యం నిరుపేద వర్గాల ఒక గొప్ప యూనియన్ అని కార్మికులను సూచించాడు. ప్రభుత్వ రుణాల సాయంతో కార్మికులు కార్మికుల ఫాక్టరీలను నెకొల్పుకోవాలని ఆయన ప్రతిపాదించాడు. లాసాల్ చెప్పేదాని ప్రకారం, కార్మిక సంఘాలు ఉత్పత్తి నిర్వహణను క్రమంగా తమ చేతుల్లోకి తీసుకుంటాయి. సార్వజనిక ఓటు హక్కును ప్రవేశపెట్టిన ఫలితంగా రాజ్యం ʹʹకార్మిక రాజ్యంʹʹగా మారిపోతుంది.
లాసాల్ దృష్టిలో రాజ్యయంత్రాన్ని వశం చేసుకోవడానికి అర్థం, ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని యధాతథంగా ఉంచడమే. ఎందుకంటే, రాజ్యమే ʹʹప్రజాʹʹ రాజ్యం అయిపోతుంది. దీనికి సార్వజనిక, ప్రత్యక్ష, సమాన ఓటు హక్కు అవసరం. ఆయన ఉద్దేశంలో, తనీగా శాంతియుత, చట్టబద్ధ పద్ధతులను ఉపయోగిస్తూ, ప్రధానంగా హేతుబద్ధమైన ప్రజాభిప్రాయానికి విజ్ఞప్తి చేయడం ద్వారా దాన్ని సాధించాలి. రాజుకి బూర్జువా వర్గంతో కంటే సామాన్య జనంతో చాలా ఎక్కువ ఉమ్మడి అంశాలు ఉన్న మేరకు, సార్వజనిక ఓటు హక్కును రాజుకి వ్యతిరేకంగా ఉన్ముఖం చేయనక్కర్లేదని ఆయన భావించాడు.
1869 దశకం మొదట్లో లాసాల్ తన కాలంలో ఎక్కువ భాగాన్ని అఖిల జర్మన్ కార్మిక సంఘాన్ని నెలకొల్పేందుకు వినియోగించాడు. ఒక విప్లవకర పార్టీని నెలకొల్పడం ఆయన సంకల్పం కాదు గనుక, సంఘంలో చేరాలన్న వాంఛను తెలిపిన ఏ కార్మికుడైనా దానిలో సభ్యుడు కావచ్చు. కార్మికేతరులు సంఘపు సూత్రాలనూ, లక్ష్యాలనూ ఆమోదించవలసి ఉంటుంది. బోర్డు ఆమోదిస్తే మాత్రమే వాళ్ళకి సభ్యత్వం లభిస్తుంది. సంఘం కచ్చితమైన కేంద్రీకరణ ప్రాతిపదిక మీద ఏర్పాటు చెయ్యబడింది. అధ్యక్షుడితో బాటు 24 మంది సభ్యులతో కూడిన ఒక బోర్డు దానికి నాయకత్వం వహించింది. రాష్ట్రాల్లో దాని ప్రతినిధులు ఉన్నారు. 1863 మేలో లాసాల్ ఐదేళ్ళ కాలానికి సంఘపు అధ్యక్షడుగా ఎన్నుకోబడ్డాడు. లాంఛనప్రాయంగా అధ్యక్షుడు బోర్డు అధికారానికి లోబడి ఉండాలి. కాని బోర్డు సభ్యులు వేర్వేరు పట్టణాల్లో ఉన్నారు, వాళ్ళు సమావేశమవడం కష్టం. కనుక పార్టీ క్రమశిక్షణకి అత్యధిక ప్రాముఖ్యాన్ని ఆపాదించాడు. ప్రతి సభ్యుడూ మారుమాట చెప్పకుండా అధ్యక్షుడి మాటను శిరసా వహించాలి. సంఘం ఆచరణలో అభివృద్ధి చెందనారంభించాక, ఒకవైపున విస్తమీత కార్మిక సంఘానికి సంబంధించిన భావానికీ, మరో వైపున సంకుచిత కేంద్రీకృత సంఘానికీ మధ్య వైరుధ్యాలు పైకి పొక్కడానికి ఎక్కువ కాలం పట్టలేదు.
అది పెద్ద సంఘమేమీ కాదు. మూడు నెలలు గడిచేసరికి దాని సభ్యత్వం కేవలం 900 మాత్రమే ఉంది. మరింత ఎక్కువ మంది సభ్యులను ఆకిర్షంచేందుకు గానిఉ లాసాల్ సభ్యత్వ చేర్పింపు కార్యక్రమానికి పూనుకున్నాడు. వేలమంది శ్రోతల సమక్షంలో ఆయన కార్మికులను ఉద్దేశించి ఉపన్యసించాడు. ఆయన ప్రత్యర్థులు అభ్యంతరాలు లేవదీసి, ఈలలు వేస్తూ ఆయన ఉపన్యాసాలకు అవాంతరాలు కల్పించారు. కొన్ని సార్లు ఈ అల్లర్లు ఘర్షణల్లో ముగిసేవి. ఇవన్నీ ఎలా ఉన్నా కూడా, లైప్జిగ్, ఫ్రాంక్ఫుర్ట్, బెర్లిన్లలో ఆయన ఉపన్యాలకు అపూర్వ విజయం లభించింది. ఒక్క ఏడాదిలో ఇది యావత్తు జర్మన్ కార్మికవర్గాన్నీ సంఘంలోకి తీసుకురావడంలో తను విజయం సాధిస్తానని లాసాల్ ఉద్ఘాటిస్తూ విచ్చాడు.
లాసాల్ ప్రచార కార్యక్రమ విజయానికి చాలా వరకు ఆయన వ్యక్తిగత లక్షణాలే కారణమని చెప్పుకోవచ్చు: ఆయన తన శ్రోతల మనోస్థితికి అనుగుణంగా ఉపన్యసించగల, అవసరమైన సందర్భాల్లో కోపం ప్రదర్శించగల లేక కన్నీళ్ళు పెట్టించగల చక్కటి వక్త. అయితే ఇది కాదు ప్రధాన విషయం. అప్పట్లో లాసాల్ ఉపన్యాసాలకు కార్మికుల ప్రతిస్పందన ఏకీకరణ పట్ల జర్మన్ కార్మికవర్గపు అపార కృషికీ, తమ ప్రయోజనాల కోసం రాజకీయ పోరాటానికి దాని సంసిద్ధతకీ సాక్ష్యం. లాసాల్ సాధించిన విజయాలకు కారణం సరిగ్గా దీనిలోనే ఉంది.
బూర్జువా రాజ్య సారం గురించిన పొరపాటు భాష్యం తార్కికంగా లాసాల్ని ప్రష్యన్ ప్రభుత్వ అధినేత బిస్మార్కుతో సంప్రతింపులకి దిగాడు. రాజుని సాంఘిక నియంతృత్వపు సహజ నాయకుడుగా పరిగణించేందుకు కార్యికులు అభిముఖంగా ఉన్నట్లు బిస్మార్కుకి నచ్చజెప్పేందుకు లాసాల్ ప్రయత్నించాడు. ఆయన ʹʹప్రత్యేక సౌకర్యాలు కలిగిన తరగతుల రాజరికం నుంచి సాంఘిక, విప్లవాత్మక రాజరికంగా పరివర్తనʹʹ చెందవలసిందిగా విజ్ఞప్తి చేసాడు. రైహ్స్టాగ్లో ఉదారవాద ప్రతిపక్షంతో బిస్మార్క్ ఘర్షణ సంగతి బాగా తెలిసి ఉన్న లాసాల్ ఈ కింది ఒప్పందాన్ని ప్రతిపాదించాడు: మాకు సార్వజనిక ఓటు హక్కు ఇవ్వండి, అఖిల జర్మన్ కార్మిక సంఘం మన ఉమ్మడి శత్రువైన బూర్జువా వర్గం మీద దూకుతుంది.
నిపుణుడైన రాజకీయవేత్తా, కుట్రదారూ అయిన, కొద్ది ఏళ్ళ పాటు ఘాతుకమైన సోషలిస్టు వ్యతిరేక చట్టాన్ని అమలు జరిపిన బిస్మార్క్ ప్రతిపక్షంతో తన ఘర్షణలో కార్మికవర్గాన్ని తన పక్షానికి తిప్పుకోవడం, లేక కనీసం దాని తాటస్థ్యాన్ని సంపాదించుకోవడం సాధ్యమని అంచాన వేసుకున్నాడు. అందుకని, ప్రష్యన్ ప్రభుత్వ అధినేత తన విధానం మార్చుకుంటాననీ, సార్వజనిక ఓటు హక్కును ప్రవేశపెడతాననీ, జనంతో పొత్తు పెట్టుకుంటాననీ ధారాళంగా వాగ్దానాలు చేసాడు. సహజంగానే, ఈ ఘర్షణ పరిష్కారం కాగానే బిస్మార్క్ తాను లాసల్కి ఇచ్చిన వాగ్దానాలను గురించి పూర్తిగా మరచిపోయాడు.
1864 మేలో లాసాల్ మరో సారి ప్రచార యాత్ర మొదలుపెట్టాడు. యాత్రా క్రమంలో ఆయన లైప్జిగ్, సోలింగెన్, బ్రేమెన్కొలోన్, వెర్ముల్కిర్హెన్లకి వెళ్ళాడు. మే 22న అఖిల జర్మన్ కార్మిక సంఘ స్థాపన వార్షికోత్సవం రోన్స్డోర్ఫ్లో జరిగింది. సంఘపు అధ్యక్షుడికి మహోత్సాహంగా స్వాగతం పలికారు. లాసాల్ తన ఉపన్యాసాన్ని ప్రత్యేకించి సంఘపు విజయాలకి కేటాయించాడు. రోన్స్డోర్ఫ్లో తన ప్రసంగం తర్వాత, తన ఉపన్యాసాల్లో ఒకదానికి వ్యతిరేకంగా చెయ్యబడిన ఫిర్యాదుకి కోర్టులో సంజాయిషీ చెప్పేందుకు లాసాల్ డుస్సెల్డోర్ఫ్కి వెళ్ళాడు. కోర్టు ఆయనకి ఒక ఏడాది జైలు శిక్ష విధించింది. అప్పీలు చేసుకున్న మీదట శిక్ష ఆర్నెల్లకి తగ్గించబడింది. రాబోయే జైలువాసం ఆయన్ని కుంగదీసింది. ఆ నిరుత్సాహంలో రాజకీయాలకు స్వస్తి చెప్పి, తన కాలాన్ని విజ్ఞానశాస్త్రానికి వెచ్చించాలని లాసాల్ అనుకున్నాడు.
1864 వేసవిలో విశ్రాంతి కోసం, వైద్య చికిత్స కోసం ఆయన స్విట్జర్లండ్కి వెళ్ళాడు. అక్కడ ఆయన తన ప్రధాన ఆర్థిక రచన అయిన ʹʹడేలిచ్ నుండి బస్తియత్ షుల్జెగారు, ఆర్థిక జూలియన్, లేక పెట్టుబడి, శ్రమʹʹ మీద కృషి ప్రారంభించాడు. ఈ రచన కార్మికుల్లో బూర్జువా ఆర్థిక అభిప్రయాలను చురుకుగా వ్యాపింపజేస్తున్న షుల్జె- డేలిచ్ (డేలిచ్ నుండి వచ్చిన హెర్మన్ షుల్జె లేక షుల్జే-డేలిచ్) ఆర్థిక సిద్ధాంతాలను ఖండించేందుకు ఉద్దేశింపబడింది.
బూర్జువా పత్రికల చేత ʹʹసాంఘిక రంగంలో రాజుʹʹగా అభివర్ణింపబడిన షుల్జె-డేలిచ్ మిత వ్యయాన్నీ, పొదుపునూ పాటించవలసిందిగా కార్మికులకూ, చేతి వృత్తుల వాళ్ళకూ విజ్ఞప్తి చేసాడు. ఎందుకు? మానవుడికి ఉత్పత్తిలో తప్పనిసరి అవసరమూ, అసలైన సహాయకారీ అయిన పెట్టుబడి నిర్మాణానికట. షుల్జె చెప్పేదాని ప్రకారం, పెట్టుబడి పెరుగుదల శ్రమకి భారీ డిమాండునూ, వేతనాల్లో పెరుగుదలనూ కల్పిస్తుంది. కార్మికులకు పెట్టుబడి అవసరం, పదార్థాలనూ, నిథులనూ పొదుపు చెయ్యడం ద్వారా వాళ్ళు పెట్టుబడిని సమకూర్చుకోగలుగుతారు. దానితో వాళ్ళు స్వతంత్ర పారశ్రామిక సంస్థలను నెలకొల్పుకోగలుగుతారు. షుల్జె సిద్ధాంతం చాలామంది చేతి వృత్తులవాళ్ళనూ, చిన్న తరహా స్వతంత్ర కార్ఖానాదారులనూ ఆకర్షించింది. భారీ పరిశ్రమకు వ్యతిరేకంగా వాళ్ళు జరిపే పోరాటంలో అతని పరపతి, ముడి పదార్థాల ʹʹస్వయం సహాయʹʹ సొసైటీలు కొంత తోడ్పడ్డాయి.
ప్రభుత్వ సహాయ భావన కలిగి, ʹʹవ్యక్తిగత పెట్టుబడిʹʹని పరిమితం చేసే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా బాహాటంగా నేరారోపణ చేసే లాసాల్కి అలాంటి వైఖరి ఆమెదయోగ్యమైనది కాదు. ఆయన షుల్జెని ఘాటుగా విమర్శించాడు. లాసాల్ అతని ʹʹస్వయం సహాయʹʹ సిద్ధాంతాన్ని బహిర్గతం చేసి ఖండించాడు (అదే సమయంలో తన ప్రభుత్వ సమాయ సిద్ధాంతం గురించి ప్రచారం చేసుకున్నాడు) త్వరలోనే ఆర్థిక వినాశానికి గురవుతారు సుమా అని చేతివృత్తుల వాళ్ళను హెచ్చరించాడు. అయితే, షుల్జెని ఆయన మార్క్సిజం దృష్ట్యా విమర్శించలేదు. ఆయబిన గతితార్కిక ప్రజ్ఞాన పద్ధతితో సుసజ్జితుడు కాలేదు. అందుకే ఆయన విమర్శ వైవిధ్యపూరితమైన పదజాలంతో పొదగబడినప్పటికీ తేలిపోయింది. పైపెచ్చు, లాసాలూ, ఆయన ప్రత్యర్థీ కూడా బూర్జువా సంస్కరణవాద సమర్థకులే. దాన్ని ఎలా అమలు జరపాలన్న సమస్యమీద మాత్రమే వాళ్ళ అభిప్రాయాలు విభేదించాయి.
షుల్జెకి వ్యతిరేకంగా రాసిన పుస్తకం లాసాల్కి ఉత్సాహం కలిగించలేదు. విస్తమీత కార్మికజన బాహుళ్యాన్ని తన వైపుకి తిప్పుకోవడంలో తనకి విజయం లభించదని ఎప్పుడైతే నమ్మకం కలిగిందో, రాజకీయ కార్యకలాపాల విషయంలో ఆయనకి నానాటికీ మరింత నిరుత్సాహం కలిగింది. ఆయన్ని అలసట భావం, ఖిన్నతా అలముకున్నాయి.
ఆయన మరణం విషాదకర పరిస్థితుల్లో సంభవించింది. 1862లో ఆయనకి ఒక బవేరియన్ దౌత్య ఉద్యోగి కూతురు హెలెన్ ఫన్ డ్యోన్నిగేస్తో పరిచయం అయింది. ఆయన స్విట్జర్లండులో ఉన్న కాలంలో వాళ్ళిద్దరూ మరోసారి కలుసుకున్నారు. అందమైన, మనోమోహకమైన హెలెన్ లాసాల్ మనస్సును వివశం చేసింది. అయితే, ఆమెకు అప్పటికే యాంకోఫన్ రకొవిట్జ్ అనే ఒక రుమేనియన్ ధనికుడితో ప్రధానం జరిగింది. పర్యవసానంగా 1864 ఆగస్టు 31న లాసాల్కీ, రకొవిట్జ్కీ మధ్య ద్వంద్వయుద్ధం జరిగి, దానిలో లాసల్ మరణించాడు.
ఆయన ఆకస్మిక మరణం జర్మనీలో చాలా మందికి- ఆయన కార్మికవర్గ సమర్థకులకే కాక, ఆయన ప్రత్యర్థులకి కూడా-ఒక ఆఘాతమైంది. 1864 సెప్టెంబరు 4న మార్క్సుకి ఎంగెల్స్ ఇలా రాసాడు: ʹʹఈ వార్త నన్నెంత విభ్రాంతుణ్ణి చేసిందో నువ్వు ఊహించుకోగలవు. వ్యక్తిగా, రచయితగా, పండితుడిగా లాసాల్ ఎలాంటి వాడైనప్పటికీ, రాజకీయాలకు సంబంధించినంతవరకు ఆయన నిస్సందేహంగా జర్మనీలోని అతి ముఖ్య వ్యక్తుల్లో ఒకడు. మనకి ప్రస్తుతం ఆయన చాలా మటుకు ఆధారపడదగని మిత్రుడు, భవిష్యత్తులో అతి కచ్చితమైన శత్రువు. అయితేనేం, తీవ్రవాద పార్టీలోని కొద్దిగొప్పల్లో సమర్థులైన వాళ్ళందర్నీ జర్మనీ ఎలా నిర్మూలిస్తోందో చూసినప్పుడు ఎవరికైనా బాధ కలుగక మానదు. జర్మనీలో ఒక్క లాసాల్ అంటేనే భయపడేవాళ్ళేమో, కార్ఖానాదారులకీ, కుహనా ప్రగతివాదులకీ ఈ రోజున ఎంత పండుగలా ఉంటుందోʹʹ.
Type in English and Press Space to Convert in Telugu |
నక్సల్బరీ నీకు లాల్సలాంఅమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర....... |
స్మారక స్థూపం మీది పేర్లు - కార్ల్ మార్క్స్పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ....... |
స్థూపం చెప్పిన విజయగాథమహత్తర బోల్షివిక్ విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. ....... |
సాధారణ సోషలిస్ట్ వాస్తవాలుమా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని....... |
స్మారక స్థూపం మీది పేర్లు - కార్ల్ మార్క్స్రష్యన్ విప్లవకారులతో మార్క్స్ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా..... |
స్మారక స్థూపం మీది పేర్లు - ఫ్రెడరిక్ ఎంగెల్స్మార్క్స్ మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్ సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి...... |
బెజ్జంగి అమరుల స్ఫూర్తితో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దాంఅమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ... |
ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ...... |
స్మారక స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్ లాసాల్లాసాల్ పాత్ర మార్కస్, ఎంగెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్డోర్ఫ్ కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........ |
స్మారక స్థూపం మీది పేర్లు - ఫ్రెడరిక్ ఎంగెల్స్తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ శాస్త్రీయంగా ....... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |