ʹకాకుల్ని కొట్టి గద్దలకు వేయటమేʹ నోట్ల రద్దు

| సంపాద‌కీయం

ʹకాకుల్ని కొట్టి గద్దలకు వేయటమేʹ నోట్ల రద్దు

- సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 07.12.2016 10:19:08am

జాతీయవాద ముసుగులో సామ్రాజ్యవాద పెట్టుబడులకు సేవ చేస్తున్న నరేంద్ర మోది పెద్ద నోట్ల రద్దు ప్రకటన ద్వారా మరో సారి తన ʹ ప్రభు భక్తిని ʹ చాటుకున్నాడు . సాధారణ ప్రజానీకంపై యుద్ధాన్ని ప్రకటించాడు . తొలి వూపులో దేశ భక్తి పేరిట స్వాగతించిన ప్రజలు క్రమక్రమంగా చర్య తీవ్రతను అర్ధం చేసుకొని అసలు వాస్తవాలను గ్రహిస్తున్నారు . "నల్ల" ధనాన్ని వెలికి తీయటం , తీవ్రవాదులు ,మావోయిస్టుల మూలాలను దెబ్బతీయటం , అవినీతిని తొలగించటం అనే మూడు ప్రకటిత లక్ష్యాలకు , పెద్దనోట్ల రద్దుకు సంబంధం లేదన్న వాస్తవం కూడా ప్రజలకు తెలిసి వస్తోంది .

అయితే యీ మొత్తం వ్యవహారంలో మోది నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలేవీ సమస్య మూలాల్లోకి వెళ్లి , దాని వెనకవున్న భావజాలాన్ని ప్రజలకు తెలియనివ్వకుండా , నిర్ణయం మంచిదే గాని , అమలు సక్రమంగా లేదని ప్రచారం చేస్తున్నాయి . నిజానికి యీ దేశంలో అక్రమమార్గాల ద్వారా అటు రాజకీయ నాయకుల దగ్గిరా ,ఇటు దళారీ గుత్త పెట్టుబడిదార్ల వద్ద పోగైన "నల్ల"డబ్బు నోట్ల రూపంలో ఉండదనేది అందరికి తెలిసిన విషయమే! అలాంటి వాళ్ళు తమ ఆక్రమ సంపాదనని బంగారం రూపంలో ,షేర్ల రూపంలో , బినామీ స్థిరాస్తుల రూపంలో దాచుకుంటున్నారు . లేదా దేశ సరిహద్దుని దాటిస్తారు . ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి నోట్ల రద్దు ద్వారా , రాజకేయ అవినీతికి తెర పడుతుందని ప్రజల్ని నమ్మించ చూడటం పచ్చి మోసం వంచన .

రాజకీయ అవినీతైనా , గుత్త పెట్టుబడిదారీ అవినీతైనా నిర్మూలించటం , ప్రజల చైతన్యవంతమైన , క్రియాశీలక పోరాటాల ద్వారానే సాధ్యం . దాంతో పాటు ఆర్ధిక వ్యవస్థలో సరైన విలువలను ప్రవేశ పెట్టడం , సరకుల ఉత్పత్తి దశలోనూ , పంపిణీ , వినిమయం దశలలోనూ , పారదర్శకత్వంతో కూడిన చర్యల్ని చేపట్టడం ద్వారా మాత్రమే ఏ సమాజంలో అయినా అవినీతి నిర్మూలించటం సాధ్యమవుతుంది . ఇదంతా జరిగినప్పట్టికీ స్వంత ఆస్తి వ్యవస్థ వున్నంత కాలం అక్రమ సంపాదనకు అవకాశాలు వుండనే ఉంటాయి .

ప్రభుత్వం ఊహిస్తున్నట్లుగా , నోట్ల రద్దు మూలంగా , ప్రజల దగ్గర నుండి బ్యాంకులకు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు డబ్బు వచ్చి చేరితే అది ఎవ్వరి కోసం ఎందుకు ఉపయోగించబడుతుందనేది ఆలోచించాలి . దీన్ని అర్ధం చేసుకోవటానికి ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని గుర్తించాలి . మొండి బకాయలు పేరుతో ఇప్పటికి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులను రద్దు చేయటంతో బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది . ఈ స్థితి నుంచి బ్యాంకింగ్ రంగాన్ని కాపాడటానికి వెంటనే 1. 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమని అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థ "మూడీ " (MOODY) ప్రకటించింది . ఇప్పుడు ప్రజల నుండి బ్యాంకులకు ప్రవహిస్తున్న యీ డబ్బంతా ఎవరి జీవితాన్ని ఉద్దరించడానికి ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి . భారతీయ బ్యాంకులు ఇప్పటి వరకు అనుసరించిన ఋణ విధానాన్ని పరిశీలిస్తే అవి తమ వద్ద వున్న ప్రజాధనాన్ని అప్పుల రూపంలో గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు వాళ్ళు అడిగిందే తడువుగా అందజేస్తున్నట్లు తెలుస్తోంది . ఇప్పుడు కూడా జరగబోయేది అదే ! ఇదే ʹకాకుల్ని కొట్టి గద్దలకు వేయటమంటేʹ!

మరొక అంశం ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని పొదుపు ఖాతాల నుండి వినిమయ మార్కెట్లోకి మళ్లించడం . ఇది ఎప్పటి నుండో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆశిస్తున్నా చర్య . భారత దేశపు మార్కెట్లు ఇంకా సాంప్రదాయక మార్కెట్ గానే వుండిపోయిందనే దాని త్వరతగతిన ఆధునీకరించాలనే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శక్తులు ప్రభుత్వం మీద ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి . అంతే కాకుండా భారత దేశంలో నగదు రూపంలో కాకుండా , కార్డుల రూపంలో ఆర్ధిక లావాదేవీలన్నీ పెద్ద ఎత్తున జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం మీద అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి వుంది . దీన్నే మోది ,చంద్రబాబు క్యాష్ లెస్ ఎకానమీ అని అంటున్నారు .

ఈ పద్ధతుల్లో లావాదేవీలన్నీ జరిగితే అవినీతికి ఆస్కారమే ఉండదని పాలకులు ఊదరగొడుతున్నారు . దీనికి సంబందించి కూడా కొన్ని వాస్తవాల్ని తెలుసుకోవాలి . ఒక దేశపు జి.డి.పి . లో నోట్ల రూపంలోనూ , నాణాల రూపంలోనూ వుండే డబ్బు వట గురుంచి బ్యాంకు ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ ఇచ్చిన నివేదికలో ఇలావుంది. ప్రపంచం మొత్తం మీద క్యాష్ లెస్ వ్యవస్థ అమలులో స్వీడన్ మొదటి స్థానంలో ఉంది . జపాన్ జి.డి.పి లో డబ్బు శాతం 20.04% కాగా , బ్రెజిల్లో అది 4% మాత్రమే! ఈ లెక్కల ప్రకారం జపాన్ కంటే బ్రెజిల్లో ఆర్ధిక అవినీతి ఎంతో తక్కువుగా ఉండాలి . కానీ వాస్తవం దీనికి పూర్తి విరుద్దంగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. అంటే డబ్బు బదులు వివిధ కార్డుల ద్వారా ఆర్ధిక లావాదేవీలు జరిగినంత మాత్రాన అవినీతికి అడ్డుకట్ట పడదన్నమాట .

సిటీ బ్యాంకు 2014 లో ఒక దేశంలో డిజిటల్ డబ్బును ప్రవేశ పెట్టి క్యాష్ లెస్ ఆర్ధిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆయా దేశాల ప్రజలు సంస్కృతి ఆటంకంగా ఉంటుందని పేర్కొంది . ఆ సంస్కృతిని మార్చకుండా , డిజిటల్ డబ్బును బలవంతంగా రుద్దితే అస్తవ్యవస్థ పరిస్థితి ఏర్పడుతుందని , సాధారణ ప్రజలు జీవన స్థితికి అది పెను ప్రమాదమని నివేదిక పేర్కొన్నది .

అంటే నోట్ల రద్దు గాని , క్యాష్ లెస్ ఆర్ధిక లావాదేవీలు గాని మోది ,చంద్రబాబులు చెప్తున్నట్లు అవినీతిని నిలుపుదల చేయటానికి కాదు . భారత దేశపు మార్కెట్లపై , ప్రజలు డబ్బు పై ప్రజల వినిమయ సంస్కృతిపై సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్థల నియంత్రణను వాళ్ళు కోరుకున్నంతలో కేంద్రీకరింపచేయటమే పాలకుల నిర్ణయాల వెనుక వున్నా అసలు రహస్యం .

No. of visitors : 1206
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అమ్మభాషలో చదువుకోవడం ప్రజాస్వామిక హక్కు

సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ | 04.03.2017 08:44:40am

భాష ఒక జాతికి చెందిన ప్రజల అస్తిత్వానికి గీటురాయి. ప్రతిభాషా సమాజానికి తనదైన గొప్ప వారసత్వ సంపద సాహిత్య రూపంలోనూ, సంస్కృతి రూపంలోనూ వుంటుంది. అయితే ఆ సమాజంల...
...ఇంకా చదవండి

గొట్టిపాడు దళితులపై పడగ విప్పిన అగ్రకుల సర్పం

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 20.02.2018 12:09:16am

ఒకవైపు దళితులపై యింతటి అనాగరికమైన దాడులకు వత్తాసు పలుకుతున్న తెలుగుదేశం, జనవరి 26న దళిత తేజం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించటం సిగ్గుచేటు.....
...ఇంకా చదవండి

అంబేద్కర్‌ ఆర్టికల్‌ 370ను వ్యతిరేకించారా?

- రామ్‌ పునియాని | 16.09.2019 03:14:12pm

ʹకాశ్మీర్‌ ప్రాతినిధ్యానికి సంబంధించి ఎలాంటి చట్టం చేయడానికి పార్లమెంటుకు అధికారం లేదుʹʹ ఈ విషయంలో జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వానికే అధికారం వుందని కూడా ఆయన .....
...ఇంకా చదవండి

దళితుల పాటలు, సంగీతం ఎందుకు రాజ్య విద్రోహానికి గురవుతున్నాయి?

యోగేష్‌ మైత్రేయ | 02.12.2019 10:45:56pm

ఒక గాయకుడి పాటలను విద్రోహానికి గురిచేసినప్పుడూ, తమ రచనలకు గాను వారిని శిక్షించినప్పుడు అనేక సందర్భాలలో భారతదేశంలో ఒక కఠిన వాస్తవాన్ని అందరూ అకస్మాత్తుగా.....
...ఇంకా చదవండి

కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం

ముకుళిక. ఆర్‌. | 16.08.2019 08:28:10pm

జె.ఎన్‌.యు.లో హాస్టళ్ళ గోడలమీదా, తరగతి గదుల భవనాలమీదా, క్యాంటీన్‌లమీదా, లైబ్రరీలమీదా కనపడే రాడికల్‌ స్వభావం కలిగిన పోస్టర్లు, నినాదాలు, బొమ్మలు వైవిధ్యభరి.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •