శిలలపై దుఃఖాన్ని చెక్కినారూ...

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

శిలలపై దుఃఖాన్ని చెక్కినారూ...

- ఉదయమిత్ర | 07.12.2016 10:32:05am

గత కొన్ని సంవ్సరాలుగా ఛత్తీస్‌ఘడ్‌లోకి జర్నలిస్టుల్ని నిషేధించడంతో, గోండులు తమ గాథల్ని ప్రకటించుకోవడాన్కి శిల్పకళను ఎంచుకున్నారు.

ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌ భారీ నిర్బంధంలో ఉంది. జర్నలిస్టులకు అక్కడ ప్రవేశం లేదు. అయితే తమ తమ బాధల్ని బయటివాళ్ళకు తెలియపర్చడం కోసం అక్కడి గోండులు తమ సాంప్రదాయసిద్ధమైన శిల్పకళను ఎంచుకున్నారు.

2016 ఫిబ్రవరి 4 నాడు సులేంగా గ్రామం (బీజాపూర్‌ జిల్లా) కు చెందిన హెద్మారాహను ఎన్‌కౌంటర్‌లో చంపివేసారు. ఆ ఊరివాళ్ళు తమ ఊరిలోని పెద్ద రాతిపలక (ప్లేక్‌) మీద ఆయన చావును చిత్రీకరించారు. మొదట ఆ రాతిపలక పై భాగంలో అతని పేరు రాసి పెట్టారు. ఆ తర్వాత ఆ రాతి పలకను మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగాన ఓ మనిషి (బహుశా హెద్మారామ్‌) ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా పశువుల మేపులూ కనబడ్తాడు. రెండో భాగంలో అతనిని మిలిటరీ పోలీసులు చుట్టముట్టినట్టు కనబడ్తుంది. ʹʹవాళ్ళు మిలిటరీ వాళ్ళని గ్రామస్తులు చెప్పగా విన్నానుʹʹ అంటాడు కమల్‌శుక్లా (జర్నలిస్టు) ఇక మూడో భాగాన (రాతిపలక చివరన) హెద్మారామ్‌ నిస్తేజంగా పడి ఉన్నట్టు కనబడ్తాడు. అతడిని మిలిటరీ వాళ్ళు లాక్కుపోతుంటారు. అక్కడున్న జంతువులన్నీ (మొసలితో సహా) బిక్కుబిక్కు మంటూ చూస్తూంటాయి..

తీవ్రమైన నిర్బంధంలో సైతం తమ తమ గాథల్ని విప్పడం కోసం గోండులు సాంప్రదాయిక గోండు కళ (శిల్పకళ)ను ఎంచుకున్నారు. భద్రతా దళాలు ఆదివాసీలను చంపకముందు జరిగిన ఘటనల్ని వాళ్ళు తమ మృతక్‌స్తావ్‌ (రాతిపలక) మీద ప్రతిభావంతంగా చిత్రీకరించడం చూస్తాం. ఎన్‌కౌంటర్‌ ఘటనల్ని స్వయంగా చూసిన గ్రామస్తులు తమ చిత్రాలలో జీవం ఉట్టిపడేట్టు చెప్పగలిగారు. అసలు కథలు చెప్పడంలో ఇదొక ప్రత్యేక కళ అనీ, ఇంట్లాంటిది తానెక్కడా చూళ్ళేదనీ అంటాడు కమల్‌ శుక్లా. ఆయన ఇప్పటికే కొన్ని రాతి పలకల చరిత్రల్ని సేకరించి ఉన్నాడు.

సాధారణంగా ఊళ్ళో ఎవరైనా చనిపోతే వాళ్ళ స్మారకార్థం గోండు ఆదివాసీలు ఒకటి రెండు రాతిపలకలను పెడతారు. అయితే వాటిని శ్మశానంలో కాకుండా అందరికీ కనబడేటట్టుగా ఊరికి దగ్గర ఖాళీస్థలంలో ఉంచుతారు. వాటికి చెట్ల నుండి సేకరించిన రంగు పూసి, ఎన్‌కౌంటర్‌ ఘటనల్ని రికార్డు (డాక్యుమెంట్‌) చేస్తారు...

సులెంగా రాతిఫలకం

ʹʹహెద్మారామ్‌ సోదరుడు ఓ నక్సలైటు. అతడిని పట్టివ్వమని పోలీసులు హెద్మారామ్‌ను బెదిరిస్తారు. ఫలితం లేకపోవడంతో, అతడి మీద తప్పుడు చార్జీలు మోపి, అరెస్టు చేసి, జనవరి చివర్లో విడుదల చేసారుʹʹ అంటాడు శుక్లా. అయితే విడుదలైన వారానికే మళ్ళీ అరెస్టు చేసి ʹʹనకిలీ ఎన్‌కౌంటర్‌ʹʹ లో చంపివేస్తారు. ఆ తర్వాత పోలీసులు అతడిని ʹప్రమాదకరమైన నక్సలైట్‌ʹగా ముద్రేవసి, అతడి తలకు ఒక లక్ష రూపాయలు వెల ఉన్నట్లు ప్రకటించేసారు.

ʹʹరెండు సంత్సరాలుగా జైల్లో ఉన్న ఓ మనిషి విడుదలైన వారం రోజులకే అత్యంత ప్రమాదకరమైన నక్సలైట్‌గా మారిపోవడమేంటి. అదే నిజమైతే అతడిని బేషరతుగా ఎందుకు విడుదల చేసినట్టు?ʹʹ అని ప్రశ్నిస్తాడు శుక్లా. ఇట్లాంటి కేసుల్ని పరిశోధించి, నిజాలు వెలికిదీస్తున్నందుకు ఆయనను కనిలీ ఎన్‌కౌంటర్లో చంపేస్తామని పోలీసులు అప్పటికే చాలాసార్లు బెదిరించారు.

దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌లో ఇపుడు ఎటు జూసినా పోలీసులే కనబడతారు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్‌లో భద్రతా దళాలు, ప్రజల మధ్య నిష్పత్తి 1:31గా ఉంది. దీన్ని స్వయంగా భద్రతాదళాలే ప్రకటించాయి కూడా. చిత్రమేమంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం తీవ్రదశలో ఉన్నప్పుడు సైతం, భద్రతాదళాలు, ప్రజల నిష్పత్తి 1:73 గా ఉందని, కాబూల్‌తో బాటు, వరల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఇండికేటర్స్‌ ప్రకటించి ఉన్నాయి.

ఇంత పెద్ద ఎత్తున భద్రతా దళాలు మోహరించిన చోట గత సంవత్సరం ప్రభుత్వ దమనకాండ విపరీతంగా పెచ్చరిల్లింది. అయితే దీనికి విరుద్ధంగా 2015-16 ను 2011 తో పోలిస్తే హింస ఐదు రెట్లు తగ్గిపోయిందని హోమ్‌ మంత్రిగారు తమ సాంవత్సరిక రిపోర్టులో సెలవిస్తారు. ప్రజలవాదన ఇక్కడ మరోలా ఉంది. నకిలీ ఎన్‌కౌంటర్లలో సాధారణ పౌరులు చనిపోతున్నపుడు వాటిని తొక్కిపెడతారని గ్రామస్తులంటున్నారు.

మరెన్నో రాతి పలకలు

హెద్మారామ్‌ మరణం తర్వాత సులెంగా గ్రామనికి పోవటానికి శుక్లా చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ ఛానెళ్ళు పోయినపుడు మాత్రమే, అతను ఆ గ్రామాన్ని దర్శించగలిగాడు.

సాధారణంగా నక్సలైట్లు గాని సామాన్యప్రజలు గాని ఎన్‌కౌంటర్‌లో చనిపోయినపుడు తమను అక్కడికి రానివ్యరని జర్నలిస్టులు ʹʹద హిందూʹʹతో వాపోయారు. ʹʹగతంలో జర్నిలిస్తులు సంఘటన జరిగిన లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి, వాళ్ళ ఫోటోలు తీసుకొని ఓ కాపీ వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. ఇపుడా పరిస్థితి లేకపోవడంతో ఆదివాసీలు తమ గోడు చెప్పుకోవడాన్కి ఇలా రాతి ఫలకాలను ఎంచుకున్నారుʹʹ అంటాడు శుక్లా. ఆయన జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల్ని నిరసిస్తూ, గతంలో ఒక టీమ్‌ను తీసుకొని ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను కలిసి వచ్చాడు.

ఇట్లాంటివే మరికొన్ని చరిత్రల్ని శుక్లా సేకరించాడు. మరొక రాతి పలకలో ఓ బాలుడి మరణం చిత్రీకరించబడింది. మొదటి భాగాలన ముగ్గురు బాలికలు కనబడ్తారు. ఓ స్కూల్‌ బిల్డింగు దాని కుడిపక్కన ఓ సైకిల్‌ కూడా కనబడ్తుంది. అంటే స్కూలు నుంచి సైకిల్‌ మీద వస్తున్నప్పుడో లేక పోతున్నప్పుడో ఆ విద్యార్థిని కాల్చి వేసారని అర్థమన్నమాట. ʹʹఆ బాలుణ్ణి పోలీసులే కాల్చేసారుʹʹ అంటాడు శుక్లా.

ʹʹఅయితే ఆ సంఘటన ఇప్పటిది కాదు. ఆ విద్యార్థిని ఇదే ప్రాంతంలో మూండేండ్ల క్రితం చంపేసారుʹʹ అంటాడాయన విశదీకరిస్తూ...

శుక్లా గారు ఇట్లాంటి రాతి ఫలకాల్ని మరిన్ని సేకరించాలను కుంటున్నాడు. ʹʹఒకసారి ప్రభుత్వానిక ఈ రాతిపలకల అసాధారణ కథనం తెలిస్తే, వాటిని కూడా నిషేధిస్తారేమోనని భయంగా ఉందిʹʹ అంటాడాయన.

No. of visitors : 748
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నువ్వేనా?అదినువ్వేనా?

ఉద‌య మిత్ర‌ | 02.11.2016 10:10:15am

అలలమీదదోగాడే వెన్నెలదీపమా! అడవిపూలమీదుగ వీచే మలయమారుతమా ! నువ్వేనా! అదినువ్వేనా ! మా కనుకొసలజారే అశ్రువులమీద అక్షర సంతకంజేసింది నువ్వేనా!...
...ఇంకా చదవండి

పేగు దుఃఖం

ఉద‌య‌మిత్ర‌ | 17.07.2016 12:47:48am

నెత్తురోడుతున్న వీధులు వేలాది చేతులమీద సాగిపోయే ఎలిజీలు తూటాల వర్షం కింద జల్లెడైన నా అందాల కాశ్మీరం...
...ఇంకా చదవండి

నీ గూడు యాడనే సిలకా !

ఉద‌య మిత్ర‌ | 01.08.2016 02:25:09am

ఇకముందూ వానలు పడతాయి కాని తడవడానికి మా ఇల్లుండదు చెట్ల ఆకుల జారి భూమినీ ముద్దాడి హొయలుబొయే వానజల్లుల సంగీత ఝరులుండవు......
...ఇంకా చదవండి

పేగుబంధం

ఉద‌య మిత్ర‌ | 03.09.2016 01:51:54am

రాధమ్మ వోణీకి నగిషీ సల్మాబేగం కుట్టిందనివిన్నా గానకచేరీలొ రఫీ రఘుపతిరాఘవను ఓలలాడించెవాడట.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •