ప్లీజ్.. ʹనోట్ʹ దిస్ స్టోరీ!

| సాహిత్యం | క‌థ‌లు

ప్లీజ్.. ʹనోట్ʹ దిస్ స్టోరీ!

- బమ్మిడి జగదీశ్వరరావు | 07.12.2016 11:38:55am

ʹమంచి పని అయ్యింది..ʹ అంది మా అమ్మ. అమ్మ ముఖంలో చిన్నపిల్లలా ఆనందం!

ʹవంద రూపాయలిస్తే- రెండొందల సార్లు లెక్క అడుగు తారు కదా.. మీ నాన్న..ʹ అని అక్కసుగా అంది.

నాన్న తప్పు చేసినట్టు తలదించుకొని వున్నాడు. బాధపడుతూ కూడా వున్నాడు!

ʹనన్ను మీ నాన్న లెక్కలడిగినట్టు.. ఇప్పుడు గవర్నమెంటు మీ నాన్నని లెక్కలడుగుతోంది.. పైసాకి పదహారు ప్రశ్నలు వేస్తోంది.. కష్టపడి సంపాందించిన జీతం డబ్బుల్ని కూడా నల్లధనం కింద జమకట్టి బ్యాంకు ఖాతాలో జమ చెయ్యమంటోంది.. ఇంటి ఖర్చులతో సంబంధం లేకుండా యెంత సొమ్ము యిస్తే అంత నోరు మూసుకు తీసుకోవాలి.. మన సొమ్మే కదా అని అదనంగా అడగడానికి లేదు.. అదికాదు యిది అని అవస్థ చెప్పడానికి లేదు..ʹ నాన్న ముఖంలోకి అమ్మ తొంగి చూసింది.

సూర్యుడు తొంగి చూసాడు!

ʹమంచి పని అయ్యింది..ʹ అని మా నాన్న. నాన్న ముఖంలో చిన్నపిల్లాడిలా ఆనందం!

ʹనా బంగారం.. మా పుట్టింటివాళ్ళు పెట్టిన బంగారం.. వున్నది కాస్త వుంచారా.. పెళ్ళయి పదేళ్లయింది పరకెత్తు బంగారం కొన్నారా..?- అని రోజుకి పదిసార్లు మీ అమ్మ దెప్పుతుంది కదా..ʹ అని అమ్మ మాటల్నే నాన్న అక్కసుగా అన్నాడు.

అమ్మ తప్పు చేసినట్టు తలదించుకొని వుంది. బాధపడుతూ కూడా వుంది!

ʹనా బంగారం.. నా బంగారం.. అని రోజూ ఢిల్లీదాక గొప్పలు చెప్పేదిగా.. ఏమవుతుంది? మోడీ విన్నాడు. విన్నాక ఊరుకుంటాడా..? ఇప్పుడు చైన్ స్నాచర్ లా తెంపుకు పోతాడట, వీధిలో కాదు, ఎంచక్కా డైరెక్ట్ గా యింట్లోకి వచ్చి.. అది కూడా లెక్కా పత్రం చూసి.. బిల్లులు లేకపోతే మొత్తం వొలుచుకు పోతాడట. నేను మీ అమ్మకు బంగారం కొనకపోవడమే పనికొచ్చింది.. కొనలేదు కొనలేదు అని వో గోల చేసేదిగా? కొన్నా వొంటి మీద వుండేది కాదు..ʹ నాన్న అమ్మ ముఖంలోకి తొంగి చూసాడు.

చంద్రుడు కూడా తొంగి చూసాడు!

వెన్నెల దూరని చీకటి రాత్రి మా బామ్మ చీరలన్నీ భోషాణం పెట్టెలో దాచేస్తోంది. ʹనా చీరలు కూడా నేను దొంగతనంగా దాచుకోవాల్సి వస్తోంది..ʹ అని తెగ బాధపడిపోతోంది.

ఏమయ్యిందే- అంటే- ʹఇంకా యేమి కావాలి.. దొంగలు నిన్న మీ నాయన జేబుకి కన్నం వేసారు. ఇవాళ మీ అమ్మ కొంగుకు కన్నం వేసారు. రేపు నా చీరలకి కన్నం వెయ్యరని యేమిటి గ్యారంటీ..?ʹ అడిగింది బామ్మ. ʹబామ్మాʹ అనబోయి ʹవామ్మాʹ అన్నాను.

అర్ధరాత్రి నిద్రలో వుండగా చప్పుడయి లేచి చూసాను. మా చిన్ని తమ్ముడు దొంగలా లోపలి గదిలోకి దూరి ఆమూల ఈ మూల తిరిగి యేదో చేస్తున్నాడు. పట్టుకున్నాను. చాక్లెట్లు!

చెప్పాడు. ʹనా దగ్గర టెన్ చాక్లెట్స్ వున్నాయి..ʹ అని.

ʹవుంటే..?ʹ అన్నాను.

ʹఒక స్టూడెంటు దగ్గర టూ చాక్లెట్స్ కంటే యెక్కువ వుండకూడదంటే..?ʹ అడిగాడు.

నిజమే కదా?.. నాదగ్గర సమాధానం లేదు!

ʹనేను చాలా రోజులనుండి తినకుండా దాచుకుంటున్నాను..ʹ అని పేదగా ముఖం పెట్టి సంజాయిషీ కూడా యిచ్చాడు.

ʹముందా చాక్లెట్లు బ్యాంకులో డిపాజిట్ చెయ్యండిరా..ʹ తాతయ్య గుమ్మలోంచి నిద్రలో మాట్లాడుతున్నాడు!

పిచ్చిపట్టి- నిద్రపట్టక- యింట్లోంచి బయటకు వస్తుంటే తలుపు దగ్గర కూర్చొని చీకట్లో యెవరో యేడుసున్నారు!

ʹఎవరు..?ʹ అన్నాను.

ʹదొంగని..!ʹ అన్నాడు.

ʹఎందుకు యేడుస్తున్నావు..?ʹ అనడిగాను.

ʹనన్ను మించిన దొంగలు.. గజదొంగలు మీ యింట్లో పడ్డారు బాబూ..ʹ అంటూ మళ్ళీ గుక్కపట్టి యేడ్చాడు. ʹమా వృత్తి యిప్పుడు అందరూ చేసేస్తున్నారు.. మేం యెలా బతకడం..?ʹ అని కూడా కుళ్ళి కుళ్ళి యేడ్చాడు.

దొంగని వోదార్చడం నావల్ల కాలేదు! దెబ్బకి నింగిలోని చంద్రుడు జారిపడ్డాడు!

సూర్యుడు విధుల్లో చేరాడు!

ఊరూ వాడా నిద్రలేచారు!

ఊళ్ళోకి గజదొంగల గుంపు వొకటి దేశభాక్తుల్లా వూరేగుతూ వుద్దరించడానికన్నట్టు వచ్చింది. జాతిని వుద్దేశించి నీతిని చెప్పాడు ముఠా నాయకుడు. ఎప్పటిలాగే ʹదొంగలు.. దొంగలు..ʹ అని అరుచుకుంటూ పోయారు గజదొంగలు!

పొద్దున్నే మా యింటిల్లిపాదీ అందర్లాగే పోలీస్టేషనుకు వెళ్ళాం!

ʹమేం దొంగలం కాదు..ʹ అని నిరూపించుకోవడానికి మా దగ్గరున్న ʹఆధార్ʹలన్నీ చూపించాం. గుడ్డా గోచీ విప్పి మొలతాడు తెంపి దిసమొలలతో నిల్చున్నాం. మా పుట్టుమచ్చలు సయితం చూపించాం. లెక్క పెట్టుకున్నారు. లెక్కకు మిక్కిలిగా పుట్టుమచ్చలు వున్నాయని కొందరిమీద కేసులు కూడా పెట్టారు. గుడ్డాగోచీ కాదు కదా మొలతాడు కూడా తిరిగి యివ్వలేదు. వాళ్ళ దగ్గరే వుంచుకున్నారు.
గుడ్డా గోచీ గాళ్ళని యెందుకు?, యేకంగా పట్టుపీతాంబరాలు కట్టుకున్నవాళ్ళనే పట్టుకోవచ్చు కదా..? అని ఆందోళనగా ప్రశ్నించిన కొందరు దేశ ద్రోహులుగా ముద్రపడ్డారు.

ʹన్యూడ్ గా నిలబెట్టడం బ్యాడ్..ʹ అన్నాడు చిన్ని తమ్ముడు.

ʹఒక్కరు న్యూడ్ గా నిలబెడితే బ్యాడ్. అందరూ న్యూడ్ గా నిలబడితే.. అది న్యూ డ్రెస్ కోడ్..ʹ అని చెప్పి అర్థం చేయించాను. సిగ్గులేకుండా వెళ్ళి క్యూ లైన్లో నిల్చున్నాను!

వీటి వేటితో సంబంధం లేకుండా జాతీయపతాకం గర్వంగా తలెత్తుకొని యెగురుతోంది! ఒకచేత్తో మూసుకొని మరో చేత్తో సెల్యూట్ చేసాను!

No. of visitors : 1376
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పిట్ట కథ!

బమ్మిడి జగదీశ్వరరావు | 02.08.2017 01:12:03pm

ఇంతలో ఆకులు రాలాయి!? లేదు.. అవి ఆకులు కావు! పిట్టలు! పిట్టల్లా రాలుతున్నాయి! అతడు వొక పిట్టని చేతుల్లోకి తీసుకున్నాడు. సిద్ధార్థుడిలా నిమిరాడు. పైకి యెగరేసా...
...ఇంకా చదవండి

ఆల్ హేపీస్!

బమ్మిడి జగదీశ్వరరావు | 16.08.2016 12:46:29am

కొత్తగా యేర్పడిన రాష్ట్రం మాది. రెండేళ్ళే అయితాంది. అగ్గువచేసి అలుకగా చేసి చూడొద్దు తమ్మీ.. క్రిమినల్ మంత్రులను మేము ఎంకరేజు గట్లా చేస్తున్నం. అన్ని .......
...ఇంకా చదవండి

గణిత గుణింతము!

బమ్మిడి జగదీశ్వరరావు | 18.01.2017 11:16:33pm

ʹపవర్లో వుండి సంపాదించుకోకపోతే సంపాదించుకోవడం రాని యెధవ అని అనేస్తారు. చేతకాని దద్దమ్మ.. చవట అని కూడా అనేస్తారు. నాకు మాట పడడం అస్సలు యిష్టం లేదు. సరే, ఈ ల్...
...ఇంకా చదవండి

సమాన స్వాతంత్ర్యం!

బమ్మిడి జగదీశ్వరరావు | 18.08.2017 12:42:15pm

అన్నిప్రాంతాలకీ సమాన ప్రాతినిధ్యం యివ్వడమంటే స్వాతంత్ర దినాలు జరపడం కాదు, పోలీసు మిలటరీ కవాతులు జరపడం కాదు, తుపాకీలు తిప్పడం కాదు, బూట్ల కాళ్ళని నేలకు తన్నడ...
...ఇంకా చదవండి

పడగ కింద పండు వెన్నెల!

బమ్మిడి జగదీశ్వరరావు | 15.10.2019 05:41:11pm

చెదిరిన చీమలు పాముల్ని కరవబోయాయి! అంతే... ఫిరంగులు పేలాయి! మట్టి రేగింది! మూడురంగులుగా ముచ్చటగా! రాజు యెగరేసిన పావురం కత్తిరించిన రెక్కలతో యెగరలేక ఫల్టీకొట్...
...ఇంకా చదవండి

నిలబడిన జాతి గీతం!

బమ్మిడి జగదీశ్వరరావు | 04.09.2017 09:29:38am

పౌరుల్లో దేశభక్తి యింకా ప్రబలాలి! ప్రబలిపోవాలి! నార నరాన నాటుకు పోవాలి! అసలు పుట్టగానే వేసే టీకాతో కూడా మన దేశభక్తిని చాటుకోవచ్చు! టీకాగా అశోకచక్రం కలిగిన మ...
...ఇంకా చదవండి

కాశ్మీరు మనది!

బమ్మిడి జగదీశ్వరరావు | 02.10.2019 10:13:24am

ʹమేం కాశ్మీరుని చూడలేదు, కాశ్మీరు గురించి మాకు తెలీదు...ʹ చెప్పబోతే- ప్రధాన వుపాధ్యాయులవారు కల్పించుకొని ʹమీరు కాశ్మీరుని చూడకపోయినా పర్లేదు, కాశ్మీరు గురిం...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •