నా ప్రియమైన... విప్లవమా !

| సాహిత్యం | క‌విత్వం

నా ప్రియమైన... విప్లవమా !

- రాంకీ | 07.12.2016 11:56:35am

విప్లవమా విప్లవమా
నీవు లేకుండా మాకు ఊపిరి ఏదీ
ఊపిరి సలపని యాతన గా
ఊపిరి సలపని తొక్కిడిగా
ఉన్న ఈ జీవితానికి
నీవేగా ఆలంబన ఆశ్వాసనా ..
నీవు లేకుండా
ఈ పాటి బతుకైనా
మాకు సాధ్యమేనా...
నువ్వున్నావనే కదా
ఈ పాటి నిశ్చింత
ఎన్ని కన్నీళ్ళని నీలో ఇముడ్చుకుని
అనంతంగా అనిపించిన
దుఖాన్ని నీ చేతులారా నిమిరి
వెచ్చగా భుజాన్ని తట్టాకే కదా.. ఈ ధైర్యం
గుండెలకు హత్తుకుని
నీ మునివేళ్ళ తో
అనునయంగా తాకి
ʹతిరగబడి తీరందే
జరుగుబాటు లేదʹ ని
నూరి పోసింది నీవేగా...
మాలోకి నీవు ఒంపిన భరోసానే కదా
మా ఉనికి .. కొనసాగింపు ...

విప్లవమా నీవు చూడని
లోతులూ అగాథాలూ
ఎక్కని కొండలూ శిఖరాలూ
నడవని ముళ్ళ బాటలు
దాటని నదులూ సముద్రాలూ ఉన్నాయా
ఎన్ని నిదురలేని రాత్రులు
ఎన్నెన్ని ప్రశ్నలు
విమర్శలు స్వీయవిమర్శలు
ఎన్ని ఎదురు చూపులు
ఎంతటి నిరీక్షణ
ఎంత నడక మరెంత ప్రయాణం
వసంతాలు , హేమంతాలే కాదు
గ్రీష్మ శిశిరాలెన్నో
దాటి వచ్చావు కదా
కాయలు కాసిన
గాయపడిన నీ
మట్టి పాదాలను
నేను కూడా నా
కన్నీళ్ళతో కడుగుతున్నాను...

విప్లవమా, నా ప్రియమైన
ప్రియాతి ప్రియమైన విప్లవమా...
నా స్నేహమా.. నా మార్గ దర్శీ
వాడు అంతా అయిపోయిందనుకున్న
చోటల్ల నీవు
మరింత పదునైన ప్రశ్నలతో
మరింత పదునైన ఆచరణతో
పీడితుల గుండె చప్పుడుగా
మొలకెత్తుతూనే ఉన్నావు ..
విప్లవమా తాత్కాలికంగా
నీవు గాయపడి ఉండ వచ్చు ...
కానీ నీ త్యాగాల పరిమళాలు
నూతన మానవుల సృష్టి కోసం
ఈ గాలిలో పరివ్యాప్తమయిపోయాయి..
విప్లవమా నిజమే ...ముమ్మాటికి నిజమే..
నీది ఒక ఊరు కాదు
ఒక పేరు కాదు
నువ్వొక సర్వనామం
పీడిత ప్రజలంతా
నీ చిరునామా...





No. of visitors : 1073
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


గాంధేయవాది మావోయిస్టు అయ్యాడు !

గజేంద్రి | 02.08.2017 10:38:04am

తన జీవితం, ప్రేమ అన్నీ సమాజం లోని ప్రజలకోసమేనని, ఆ ప్రేమ కేవలం నీకు, కుటుంబానికి పరిమితమయ్యేది కాదని" చెప్పాడు..అది తన అంకిత భావం ఆ మాటను తను చనిపోయే......
...ఇంకా చదవండి

ఆట - నీతి

రాంకీ | 18.03.2017 12:19:38pm

దోపిడి మర్మాన్ని విప్పి చెప్పే ఆటలు ఇప్పుడిక కనుగొందాం కొత్త తరాలకు ఉగ్గుపాలతో నేర్పిద్దాం శ్రమ చేస్తున్న మనుషులు ఇంకా ఊరవతలే ఉన్నారని ఆడదంటే ఆట బొమ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
    ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
    అరుణతార నవంబర్ 2019
    నరʹసింహం!ʹ
    విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
    ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
    గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
    వెల్తుర్ధ్వని - మెహమూద్
    జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
    In memory of comrade Pratap (Uday Kumar)
    పాలపుంతల దారిలో..
    టార్చిలైటు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •