సీమ ఉద్యమానికి దారి దీపం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

సీమ ఉద్యమానికి దారి దీపం

- పాణి | 07.12.2016 12:15:52pm

రాయలసీమ ప్రాంతీయ సమస్యలపైనేగాక ప్రత్యేక రాష్ట ఆవశ్యకత గురించి కూడా పరిశీలనాత్మక వ్యాసాలివి. దత్తమండలలాకు రాయలసీమ అనే పేరు రాక ముందు నుంచీ సీమ ప్రజలు ప్రాంత సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా ఈ సృహలోంచే దత్తమండలలాలకు రాయలసీమ అనే పేరు స్థిరపడింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న రోజుల్లోనే ప్రత్యేక రాష్టం కావాలనే భావన రాయలసీమ మేధావుల్లో రచయితల్లో కలిగింది. అయితే అది ఉద్యమరూపం తీసుకోలేదు. దీనికి రాయలసీమ ప్రాంత సామాజిక చరిత్రలోనే కారణాలు ఉన్నాయి.

అనేక కారణాల వల్ల మళ్లీ ఇటీవల ప్రత్యేక రాష్ట ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. ఇవి సామూహిక శక్తిగా, ఆందోళనారూపంగా, ఉద్యమంగా విస్తరించాల్సే ఉంది. దీని కోసం ఆలోచనారంగంలో జరుగుతున్న ప్రయత్నానికి ఈ వ్యాసాలు ఉదాహరణ. ప్రత్యేక రాష్టం కావాలనే కోరిక రాజకీయమైనది. కాబట్టి ప్రత్యేక రాయలసీమ రాష్టం కోసం పోరాడటమంటే రాజకీయ ఉద్యమానికి సిద్ధం కావడమే. అయితే అది బూర్జువా నినాదం. పార్లమెంటరీ మార్గంలో ప్రత్యేక రాష్ట్ర హెూదాలు ఏర్పడతాయి. దీనితోపాటు ఇలాంటి పోరాటాల్లో ఎన్నో ప్రజాస్వామిక డిమాండ్లు ముందుకు వస్తాయి. రాయలసీమ రాష్ట్ర ఉద్యమం కోస్తా పాలకవర్గాలకు, రాయలసీమ పాలకవర్గాలకు వ్యతిరేకంగా జరిగే ప్రజాస్వామిక ఆందోళన. రాయలసీమ రాష్ట్ర ఉద్యమానికి ఈ ప్రత్యేకత ఉంది.

అనేక చారిత్రక, రాజకీయార్థిక కారణాల వల్ల సామాజిక ప్రజాస్వామికీరణ అనే అతి ముఖ్యమైన కర్తవ్యం రాయలసీమ ముందుంది. దానికి కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రేరణ అవుతుంది. అయితే ప్రధానంగా ఒక ప్రాంతంగా సీమ ఎదుర్కొంటున్న సమస్యలకే ప్రత్యేక రాష్ట ఉద్యమంలో కొంత మేరకు పరిష్కారం ఉంటుంది. ఈ విషయంలో ఎవ్వరికీ సందేహం అక్కర్లేదు.

అయితే రాయలసీమ ఉద్యమం ఇంకా తనదైన ప్రజాస్వామిక కంఠస్వరాన్ని సవరించుకోవాల్సి ఉంది. కొందరు ఆలోచనాపరులు ఈ అవసరం గుర్తించారు. అందులో అరుణ్ ఒకరు. ఆ రకంగా రాయలసీమ ఉద్యమంలోని ఈ ప్రాథమిక దశలో అరుణ్ వ్యాసాలకు చాలా ప్రాధాన్యత ఉంది.

రాయలసీమకు జరిగిన గత వర్తమానాల విద్రోహ పరంపరను ఈ వ్యాసాలు సాధికారికంగా ఎత్తి చూపాయి. అంతే కాదు. ఈ విద్రోహాలకు, వివక్షలకు పరిష్కారం ఏమిటి? అనే కీలక ప్రశ్నకు సమాధానంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పంథాను అరుణ్ బలంగా ప్రతిపాదించారు. ఆంగ్ల సాహిత్యోపన్యాసకుడు, విప్లవ సాహిత్య సాంసృతికోద్యమ కార్యకర్త, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు అయిన అరుణ్ తానుగా ఎంచుకొని మరీ రాయలసీమ ఉద్యమ గోదాలోకి దిగారు. ఈ వ్యాసాల్లోని చాలా విషయాలతో, ముఖ్యంగా నీటిపారుదల విషయాలతో ఆయనకు అంతక ముందు ఎలాంటి పరిచయమూ లేదు. రాయలసీమ ఉద్యమం కోసమే తాను సీమ నీటిపారుదల రంగం గురించి తెలుసుకుంటూ, తెలియచెబుతూ, ఇతరుల తప్పుడు అభిప్రాయాలను, కూటవాదాలను ఎదుర్కొంటూ ఈ వ్యాసాలు రాశారు. ప్రాంతాల సమస్యలపై మార్మిస్టు లెనినిస్తులు అవగాహనను అరుణ్ రాయలసీమ వైపు నుంచి ఈ పుస్తకంలో వినిపించారు. అందువల్ల అన్ని వెనుకబడిన ప్రాంతాలపట్ల, అక్కడి పీడిత ప్రజల పట్ల అరుణ్ తీసుకున్న వైఖరి ప్రజాస్వామికవాదులందరికీ ఆమోదమవుతుంది.

రాయలసీమ ఉద్యమం అన్ని రకాలుగా తన శక్తులను, అందునా నూతన శక్తులను కూడగట్టుకోవాల్సి ఉంది. అరుణ్ వ్యాసాలను ఆక్రమంలో భాగంగా చూడాలి. అంతులేని ఆశలను, ఊహా స్వర్గాలను ప్రజల ముందు గుమ్మరించడం కాకుండా హేతబద్దమైన వాదన ద్వారా ఒక రాష్టంగా ఎందుకు ఏర్పడాలో, ఒక రాష్టంగా ఎలా మనుగడ సాధించగలదో చెప్పాల్సి ఉంది. దీని సారాంశం ఏమంటే ఒక బూర్జువా డిమాండ్ అయిన ప్రత్యేక రాష్టం వల్ల ఏ ఫలితాలు ఏమేరకు ఉండేదీ ముందునుంచే చెప్పడం. అరుణ్ వ్యాసాల్లో రాయలసీమ సమస్యల తీవ్రత ఉంది. వాటి కోసం పోరాడటం ఎంత న్యాయబద్ధతో ఉంది. ఆ సమస్యల కోసం ప్రత్యేక రాష్టం తప్ప పరిష్కారం లేదని గాఢంగా చెబుతూనే దాని పరిమితిని కొంత ప్రత్యక్షంగా, మరికొంత పరోక్షంగా ప్రస్తావించారు.

అరుణ్ గతంలో రాసిన కొన్ని వ్యాసాలతో అచ్చేసిన సీమమాటేమిటి? అనే పుస్తకాన్ని రాయలసీమ ఉద్యమ శ్రేణులు స్వాగతించాయి. ఈ పుస్తకం కూడా సీమ రాష్ట్ర ఉద్యమంలో పని చేస్తున్నవారికి తప్పక ఉపయోగపడుతుంది. ఒక ప్రజాస్వామిక అవగాహనను, హేతుదృష్టిని, వాదశక్తిని అందిస్తుంది.

No. of visitors : 650
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2018
  కత్తి మహేష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం
  కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
  రాజ్య హింసలో కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలతో తెలుగు ప్రభుత్వాలు కూడా సరిసమానమే
  వీళ్లు చేసిన నేరం ఏంటి?
  జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ
  కార్పోరేట్ కంపెనీల ఏజెంట్‌గా మోదీ స‌ర్కారు
  నెలవంక సందేశం
  The tree of the world
  వాళ్లు భూమి కలను నిజం చేసుకుంటారా?
  వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి
  రాజ్యం బరితెగింపు వెనక

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •