స్మార‌క స్థూపం మీది పేర్లు - ఔగుస్ట్ ‌బేబెల్‌

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఔగుస్ట్ ‌బేబెల్‌

- ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 20.12.2016 08:01:43pm

ఔగుస్ట్ ‌బేబెల్‌
(1840-1913)

‌మనం కలలు కనవలసింది దీని కోసమే!

1901లో పార్టీని నెలకొల్పేందు కోసం కార్యక్రమాన్ని తయారుచేస్తూ, లెనిన్‌ ‌తన ʹʹఏం చెయ్యాలి?ʹʹ లో ఇలా రాసాడు: ʹʹఈ మొత్తం నిర్మాణ చట్రపు నిచ్చెనల మీదా, పరంజా మంచెల మీదా, మన విప్లవకారుల మధ్య నుంచి సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌జెల్యాబొవ్‌లూ, మన కార్మికుల్లోంచి రష్యన్‌ ‌బేబెల్‌లూ అభివృద్ధి చెంది, ముందుకొస్తారు. వీళ్ళు సమీకృత సైన్యపు మమ్మొనలో తమ స్థానాన్ని ఆక్రమించి, రష్యా కళంకాన్నీ, శాపాన్నీ అంతం చెయ్యవలసిందిగా యావన్మంది ప్రజలనూ జాగృతం చేస్తాచు!
మనం కలలు కనవలసింది దీని కోసమేʹʹ.1
ఫెర్డినాండ్‌ ఔగుస్ట్ ‌బేబెల్‌ ‌కొలోన్‌ ‌నగర శివారులో 1840 ఫిబ్రవరి 22న జన్మించాడు. ఆయన తొలి బాల్య స్మమీతులలో పడక గదిగా, భోజనాల గదిగా, డ్రాయింగ్‌ ‌రూముగా, వంట గదిగా, స్టోర్‌ ‌రూముగా వినియోగించిన ఒక చీకటి గది స్మమీతి మిగిలింది. ఆయన తండ్రి ప్రష్యన్‌ ‌సైన్మంలో నాన్‌కమిషన్డ్ ఆఫీసరుగా పనిచేసాడు.జీతం అతి స్వల్పం. నగరరక్షక దళానికి చెందిన సైనికుల కోసం ఆయన తల్లి పెట్టిన అంగడి వల్ల ఏమంత ఆదాయం లభించేది కాదు. నిత్యకొరతలూ, అర్ధ పస్తులే చాలా ఏళ్ళపాటు బేబెల్‌ ‌నిరంతర సహచరులుగా ఉంటూ వచ్చాయి.
1844 వేసవిలో ఆయన తండ్రి మరణించాడు. దానితో ఆ కుటుంబం దుర్భర దారిద్య్రానికి గురైంది. ముగ్గురు చిన్న పిల్లలతో, ఏ జీవనాధారమూ లేని తల్లి నగర రక్షక సైనిక నివాసగృహం ఖాళీ చేయవలసివచ్చింది. బిడ్డల పినతండ్రి ఆ విధవరాల్ని పెళ్ళిచేసుకొని, ఆ బిడ్డలకు పితృత్వం వహించి, ఆ కుటుంబం నశించిపోకుండా కాపాడాడు. అతను బ్రౌవెలేర్‌లోని రిఫర్మేటరీ జైల్లో వార్డరుగా పనిచేస్తూంఏవాడు. అక్కడి కాఠిన్యాన్ని తలచుకొని బేబెల్‌ ‌తన తరీయ దశలో సైతం కంపించిపోయేవాడు. ఆయన బాల్య జీవితంలో కెల్ల గ్రామ స్కైల్లో గడిపిన కొద్ది గంటలు మాత్రమే సంతోషదాయకంగా ఉండేవి.
పెద్ద కొడుకైన ఔగుస్ట్‌కి కేవలం ఆరేళ్ళు వచ్చేసరికల్లా మారుటి తండ్రి చనిపోయాడు. సాపేక్షంగా మెరుగుపడబోతున్న బేబెల్‌ ‌కుటుంబపు ఆర్థిక స్థితి మరో సారి కుదేలైపోయింది. బేబెల్‌ ‌తల్లి పిల్లల్ని నిరుపేద తనం నుంచి కాపాడేందుకుగాను తను పుట్టిన చిన్న పట్టణం వెట్జ్‌లార్‌కి వెళ్ళిపోయింది. బీదరికమూ, అతి శ్రమా ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీయగా 1853లో ఆమె మరణించింది. ధనికురాలూ, నీటిమిల్లు యజమానురాలూ అయిన బేబెల్‌ ‌పినతల్లి ఆ పిల్లల్ని చేరదీసింది. బేబెల్‌ ‌స్కూలుకి హజరవుతూ, తన విరామ సమయంలో ఆ మిల్లులో పనిచేస్తూండేవాడు. అత్యుత్తమ విద్యార్థుల్లో తను ఒకడుగా పరిగణిపబడుతూ ఉండినట్లు తన స్కమీతుల్లో ఆయన పేర్కొన్నాడు. ఉపాధ్యాయుడు ఆయన పట్లా, మరో ఇద్దరు విద్యార్థుల పట్లా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లెక్కలు, రేఖా గణితం, ఉన్నత స్థాయి గణితశాస్త్రం కూడా నేర్పుతూ ఉండేవాడు. తన పధ్నాల్గవ ఏట స్కూలు పూర్తి చేసి, ఆయన ఒక నిపుణ లేతు కార్మికుడి దగ్గర సహాయకుడుగా కుదిరాడు. పనిదినం పధ్నాలుగు గంటలు. ఈ విధంగా బేబెల్‌కి జర్మన్‌ ‌కార్మికులు ఈ రోజుల్లో అనుభవిస్తూ ఉండిన కష్టాలు కడగళ్ళను గురించి స్వానుభవం ద్వారా తెలుసు. అలాంటి పరిస్థితిలో సైతం సాయంవేళల్లో పుస్తకాలు చదివేందు కోసం ఆయన కొంత వ్యవధి చిక్కించుకొనేవాడు.
పద్దెనిమదేళ్ళ వయస్సుల చేతివృత్తి పనివాడి దగ్గర పని నేర్చుకొని, స్వతంత్ర జీవితం ప్రారంభించాడు. ఆయన పని కోసం వెతుక్కొంటూ దేశం తిరిగాడు. అలా రెండేళ్ళకి పైగా ఆయన మొత్తం దక్షిణ జర్మనీ, ఆస్ట్రియాలలో తిరిగి తిరిగి, చివరకు 1860లో లేతు పనిలో సహాయకుండిగా లైప్జిగ్‌లో స్థిరపడ్డాడు. జర్మనీలోని అతి పెద్ద పారిశ్రామిక, సాంస్కమీతిక కేంద్రాల్లో ఒకటైన లైప్జిగ్‌తో చాలా సంవత్సరాల పాటు ఆయన జీవితం ముడిపడి ఉంది. అక్కడ ఆయనకి స్థిరమైన పని దొరికింది. అక్కడ ఆయన పోలీటెక్నికల్‌ ‌సొసైటీ బృందాల్లో ఒక దానిలో చేరాడు.
ఉదారవాద లిబరల్‌ ‌ధోరణి కలిగిన ఆ బృందం బేబెల్‌ ‌సోషలిస్టు ప్రపంచ దృక్పథం అభివృద్ధి చెందేందుకు దోహదం చెయ్యలేకపోయింది. అయనప్పటికీ, సాహిత్యంలోనూ, ఆ బృందం తన సభ్యులకు నేర్పుతూ వచ్చిన ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలతోనూ పరిచయం జర్మన్‌ ‌శ్రామిక వర్గపు భావి నాయకుడి ప్రపంచ దృక్పథాన్ని విస్తమీతం చేసేందుకు ఉపయోగపడింది. ఆ సంవత్సరాల్లో బేబెల్‌ ‌కార్మికవర్గం పట్లా, సోషలిస్టు ఉద్యమం పట్లా ఆసక్తి ప్రదర్శించాడు.
లాసాల్‌ ‌రాసిన ʹʹలైప్జిగ్‌లో అఖిల జర్మన్‌ ‌మహాసభ సన్నాహక కేంద్ర కమిటీకి బహిరంగ సమాధానంʹʹ 1863 మార్చిలో ప్రచురింపబడింది. ఒక సంఘం ఏర్పాటు చేసుకొని, బూర్జువావర్గం నుంచి తమని తాము రాజకీయంగా వేరుజేసుకొమ్మనీ, సార్వజనీన, సమాన, ప్రత్యక్ష, రహస్య ఓటు హక్కు కోసం జరిగే పోరాటంలో చేరమనీ లాసల్‌ ‌దానిలో జర్మన్‌ ‌కార్మికులకు విజ్ఞప్తి చేసాడు. 1864 మొదట్లో లైప్జిగ్‌ ‌లోని వర్కర్స్ ఎడ్యుకేషనల్‌ ‌సొసైటీకి చెందిన ఒక బృందం లాసల్‌తో చేరింది. ఆ బృందంలో బేబెల్‌ ఒకడు. బేబెల్‌ ‌ప్రపచం దృక్పథం పెటీ బూర్జువా డెమోక్రట్ల దృక్పథానికి సన్నిహితంగా ఉన్నప్పటికీ, లాసాల్‌ ‌భావాల్లో చాలా వాటి పట్ల అప్పటికే ఆయనకి సందేహాలు ఉన్నాయి. దరిమిలా బేబెల్‌ ‌సోషలిస్టు అయినప్పుడు, కార్మికుల కీలక ప్రయోజనాలను బూర్జువావర్గ ప్రయోజనాలకు లోబరచేందుకు లాసాలూ, ఆయన అనుచరులూ జరిపిన ప్రయత్నాలన్నింటినీ బేబెల్‌ ‌వ్యతిరేకించాడు.
1860 దశకపు మొదటి అర్ధ భాగంలో జర్మనీని భారీ సమ్మెల వెల్లువ ముంచెత్తింది. బేబెల్‌ ఆ ‌ఘటనలను శ్రద్ధగా గమనిస్తూ, వర్కర్స్ ఎడ్యుకేషనల్‌ ‌సొసైటీకి చెందిన ఉదారవాదులూ, లాసాల్‌ అనుచరులూ సూచించే కార్యక్రమాలు కార్మికులకు ప్రయోజనమేమైనా చేకూరుస్యాఆ అని శ్రద్ధగా పరిశీలిస్తూ వచ్చాడు. పీడిత శ్రామిక వర్గానికి తోడ్పడాలన్న చిత్తశుద్ధితో కూడిన ఆకాంక్ష, జీవితాన్ని గురించి పుస్తకాల ద్వారా లభించినది కాక ప్రగాఢమైన జీవిత అనుభవం, మార్కస్ ‌రచనలతో బాటు సోషలిస్టు సాహిత్యంతో పరిచయం బేబెల్‌ అభిప్రాయాల్లో తీవ్రమైన మార్పుకి దారితీసాయి. ఆయన ఉదారవాద బూర్జువా అభిప్రాయాలను వదిలించుకొని, సోషలిస్టు శిబిరంలో చేరాడు. విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్‌తో బేబెల్‌కి 1865లో ఏర్పడిన పరిచయం ఈ మార్పులో సానుకూల పాత్ర వహించింది. అప్పుడే కార్మికవర్గ ఉద్యమంలో వారి సంయుక్త కృషికి నాందీ ప్రస్తావన జరిగింది. లీబ్‌క్నెఖ్ట్ ‌బేబెల్‌ ‌కంటె వయస్సులో పెద్దవాడు, రాజకీయంగా మరింత అనుభవజ్ఞుడు, అధిక విద్యావంతుడు, ఆయన 1848 నాటి జర్మన్‌ ‌విప్లవంలో పాల్గొన్నాడు, చాలా సంవత్సరాలు ఇంగ్లండులో ప్రవాస జీవితం గడిపాడు.
1867 ఫిబ్రవరిలో, సాక్పనీ ఐక్య కార్మిక సంఘాల నాయకుడైన ఔగుస్ట్ ‌బేబెల్‌ ఉత్తర జర్మన్‌ ‌సమాఖ్య రైహ్‌స్టాగ్‌ (‌పార్లమెంటు) డెప్యూటీగా ఎన్నికయ్యాడు. ఆయన మొదటి కార్మిక డెప్యూటీ, ఏప్రిల్‌లో ఉత్తర జర్మన్‌ ‌సమాఖ్య ముసాయిదా రాజ్యాంగ చట్టాన్ని చర్చించేందుకు బెర్లిన్‌లో జరిగిన సమావేశానికి ఆయన హాజరయాడు. రైహ్‌స్టాగ్‌ ‌వేదిక మీదినుంచీ, కార్మికులకు తానిచ్చిన ఉపన్యాసాల్లోనూ నూతన ప్రష్యా-జర్మనీ ప్రజావ్యతిరేక రాజ్య నిర్మాణాన్ని బట్టబయలు చేసాడు.
1867 అక్టోబరులో బేబెల్‌ ‌రైహ్‌స్టాగ్‌లో ప్రసంగిస్తూ నిర్బంధ సైనిక కొలువు ముసాయిదా చట్టాన్ని ఖండించి, సైనిక కొలువు కాలాన్ని తగ్గించవలసిన ఆవశ్యకతను నిరూపించాడు. పరిశ్రమలకు సంబంధించిన నూతన నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటు చెయ్యబడిన ఒక కమిషన్‌ ‌కార్యకలాపాల్లో కూడా ఆయన పాల్గొన్నాడు. పని కంట్రాక్టుల రద్దుకి సంబంధించిన సమస్యల పరిశీలన విషయంలో కొర్టుల హక్కులను సమర్థిస్తూ, ఫాక్టరీల్లో పిల్లల శ్రమ వినియోగాన్ని ఖండిస్తూ రైహ్‌స్టాగ్‌లో ప్రసంగించాడు.
బేబెల్‌కి పార్లమెంటరీ కృషికి గాని, సాంఘిక కార్యకలాపాలకి గాని ఒక్క పైసా ముట్టలేదు. తనకీ, తన కుటుంబానికీ తిండి తిప్పల కోసం బేబెల్‌ ‌రోజూ చాలా గంటలు లేతు దగ్గర పని చెయ్యవలసి వచ్చేది. ఆయన కుటుంబ పరిస్థితి మరింత హీనంగా ఉండేది. బెర్లిన్‌కి ప్రయాణాలకూ, రైహ్‌స్టాగ్‌ ‌సమావేశాల్లో హాజరయ్యేందుకూ కడా ఆయనకి చాలా ఖర్చయ్యేది. శ్రామిక ప్రజల ప్రతినిధులు రైహ్‌స్టాగ్‌కి చేరకుండా ఆటంకాలు కల్పించేందుకుగాను ఎన్నుకోబడిన డెప్యూటీలకు జీవన వ్యయం చెల్లింపులకు వీలు కల్పించే చట్టం ఆమోదింపబడకుండా పాలక వర్గాలు అవరోధాలు కల్పిస్తూండేవి. బీద సాక్సన్‌ ‌నేత పనివాళ్ళు తమ ప్రతనిధికి ఏ ఆర్థిక సహాయమూ చెయ్యలేకపోయేవారు.
అయితే ఇదంతా బేబెల్‌కీ, ఆయన సహచరులకీ ఆటంకం కాలేదు. 1868లో న్యూరెన్‌బెర్గ్‌లో జరిగిన కార్మిక సంఘాల మహాసభలో ఔగుస్ట్ ‌బేబెల్‌, ‌విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్‌ల చురుకైన కార్యకలాపాల ఫలితంగా, బూర్జువా ప్రతినిధులు ఎంతగా వ్యతిరేకించినా కూడా, మొదటి ఇంటర్నేషల్‌ ‌కార్యక్రమాల్ని ఆమోదిస్తూ తీర్మానించబడింది. దీని తర్వాత, వర్గ పోరాటాన్ని దాని అన్ని రూపాల్లోనూ చైతన్యపూరితంగా సంఘటితం చెయ్యగలిగిన ఒక శ్రామికవర్గ పార్టీని నెలకొల్పవలసిన ఆవశ్యకత విషయంలో బేబెల్‌ ‌విశ్వాసం నానాటికీ దృఢతరం కాసాగింది. లీబ్‌క్నెఖ్ట్‌తో కలిసి, స్వతంత్రమైన ట్రేడ్‌యూనియన్‌ ఉద్యమ నిర్మాణం కోసం ఆయన విశేషంగా కృషి చేసాడు. ట్రేడ్‌ ‌యూనియన్లలోనే కార్మికులు వర్గ చైతన్యాన్ని సంతరించుకుంటారనీ, పెట్టుబడి అధికారానికి వ్యతిరేకంగా పోరాటం ఎలా జరపాలో నేర్చుకుంటారనీ, ట్రేడ్‌యూనియన్ల చారిత్రక ప్రాముఖ్యం దీనిలోనే ఉందనీ ఆయన రాసాడు.
రాజరిక స్పెయిన్‌లో విప్లవోధృతి, సంక్షోభాల సందర్భంగా 1868లో బేబెల్‌, ‌లీబ్‌క్నెఖ్ట్‌లు ʹʹస్పానిష్‌ ‌ప్రజలకుʹʹ ఒక విజ్ఞప్తి చేసారు. దానిలో వారు సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌రిపబ్లిక్‌ను నెలకొల్పవలసిందిగా పిలుపిచ్చారు. దీనికిగాను సాక్సనీ ప్రభుత్వం వారిద్దరిలో ఒక్కొక్కరికి మూడు వారాల జైలు శిక్ష విధించింది. ప్రష్యన్‌-‌జర్మన్‌ ‌రాజరికపు జైళ్ళను బేబెల్‌ ‌యాత్రలకు ఇదే మొదలు.
లాసాల్‌ ‌నాయకత్వాన గల అఖిల జర్మన్‌ ‌కార్మిక సంఘ సభ్యులను తన పక్షానికి తిప్పుకొనేందుకు బేబెల్‌ ‌విశేష కృషి చేసాడు. 1869లో లాసాల్‌ ‌సంఘంలోని అత్యుత్తమ శక్తులు ఏక కార్మిక పార్టీ స్థాపన విషయంలో బేబెల్‌, ‌లీబ్‌క్నెఖ్ట్‌లను సమర్థించాయి. 1869 ఆగస్టులో ఐసెనాఖ్‌లో జరిగిన సంస్థాపక మహాసభలో సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌కార్మిక పార్టీ నెలకొల్పబడింది. పార్టీ కార్యక్రమాన్నీ, నిబంధనావళినీ రూపొందించే బాధ్యత బేబెల్‌, ‌లీబ్‌క్నెఖ్ట్‌లకు అప్పగించబడింది. వారు తయారు చేసిన ముసాయిదాలను కొద్ది మార్పులతో మహాసభ ఆమోదించబడింది. ఆ కార్యక్రమం ఉత్పత్తి సాధనాలపై వ్యక్తిగత స్వామ్యాన్ని అన్ని రకాల బానిసత్వానికీ ప్రాతిపదికగా పరిగణించి, పెట్టుబడిదారీ స్వామ్యాన్ని నిర్మూలించాలనీ, వర్గ ఆధిపత్యపు అన్ని రూపాలనూ రద్దు చెయ్యాలనీ విజ్ఞప్తి చేసింది. కార్మికులు రాజకీయాధికారాన్ని సాధించుకోవడమే పార్టీ లక్ష్యంగా చాటబడింది.
ఈ తరుణ పార్టీ మొదటి మహాసభ 1870లో ష్టుట్‌గార్ట్‌లో జరిగింది. వ్యవసాయ సమస్యపై సోషలిస్టుల వైఖరిని గురించి బాసెల్‌ ‌మహాసభలో (1869) మొదటి ఇంటర్నేషనల్‌ ‌చేసిన తీర్మానాన్ని ఆమెదింపజేసే క్రమంలో గణనీయమైన వ్యతిరేకతను బేబెల్‌ అధిగమించ వలసి వచ్చింది. భూమిని ఉమ్మడి ఆస్తిగా చెయ్యలనీ, అప్పుడు ప్రభుత్వం దాన్ని వ్యవసాయ సహకార సంఘాలకు కౌలుకు ఇవ్వగలుగుతుదనీ, ఆ సంఘాలు భూమిని శాస్త్రీయ పద్ధతుల్లో సాగుచేసి, మొత్తం ఉత్పాదితాన్ని తమ సభ్యుల మధ్య పంచుతాయనీ సాగుచేసి, మొత్తం ఉత్పాదితాన్ని తమ సభ్యుల మధ్య పంచుతాయనీ పేర్కొనే తీర్మానాన్ని బేబెల్‌ ‌ప్రతిపాదించాడు. మహాసభ దాన్ని ఆమోదించింది.
1867 నుంచి 1871 దాకా ఉత్తర జర్మన్‌ ‌రైహ్‌స్టాగ్‌లో మార్క్సిస్టు పంథాను అనుసరించే సోషలిస్టులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు- బేబెల్‌, ‌లీబ్‌క్నెఖ్ట్. ఆ ‌దశలో బేబెల్‌ ‌కార్మిక పార్లమెంటేరియన్‌గా అభివృద్ధి చెందాడు. రైహ్‌స్టాగ్‌ను ఆయన సోషలిజం భావాల ప్రచారానికి ఒక వేదికగా వినియోగించుకున్నాడు. బేబెల్‌, ‌లీబ్‌క్నెఖ్ట్‌లు ఇద్దరూ బిస్మార్క్ ‌విధానాన్ని వ్యతిరేకించి, యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రసంగించారు.
ఫ్రెంచి-ప్రష్యన్‌ ‌యుద్ధపు తొలి రోజుల్లో బేబెల్‌, ‌లీబ్‌క్నెఖ్ట్‌లు రైహ్‌స్టాగ్‌లో యుద్ధ రుణాల ప్రతిపాదనపై ఓటింగు జరిగినప్పుడు ఓటింగులో పాల్గొనకుండా ఉండిపోయారు. బేబెల్‌ ‌రైహ్‌స్టాగ్‌లో చదవవలసిన ఒక ప్రత్యేక ప్రకటన రాసాడు. లీబ్‌క్నెఖ్ట్ ‌కూడా దానిమీద సంతకం పెట్టాడు.
1870 నవంబరులో యుద్ధ నిర్వహణ కోసం మరికొన్ని నిధులు కావాలన్న ప్రతిపాదనపై జరిగిన చర్చ క్రమంలో, ప్రభుత్వం పాలక వర్గాలు రక్షణ యుద్ధం కాక దురాక్రమణపర యుద్ధం సాగిస్తున్నాయనీ, జర్మన్‌ ‌స్వాతంత్య్రం కోసం కాక, ఫ్రెంచి జాతిని లోబరచుకునేందుకు యుద్ధం చేస్తున్నాయనీ బేబెల్‌ ఆరోపించాడు. ఆల్సేస్‌, ‌లొరైన్‌ల ఆక్రమణను ఆయన గట్టిగా ఖండించి, యుద్ధ నిధుల మంజూరీ ప్రతిపాదనను తిరస్కరించాలని డిమాండు చేసాడు.
గత పదేళ్ళలో జరిగిన యుద్ధాలన్నీ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైనవనీ, ప్రజలు ఈ విషయాలన్నీ గ్రహిస్తారనీ, దీనికి ఒక్కటే పర్యవసానం ఉండగలదనీ, అది రాజరికం నిర్మూలన, రిపబ్లిక్‌ ‌స్థాపనేననీ రైహ్‌స్టాగ్‌లో ఆయన ప్రకటించాడు. ఫ్రెంచి-ప్రష్యన్‌ ‌యుద్ధ కాలంలో జర్మన్‌ ‌కార్మికవర్గం అంతర్జాతీయవాద వైఖరి వహించింది. అది దాని చరిత్రలో ఘనమైన ఒక పుట. దానిలో బేబెల్‌, ‌లీబ్‌క్నెఖ్ట్ ‌లకు విశేష పాత్ర ఉంది.
1870 డిసెంబరులో బేబెల్‌ అరెస్టు చెయ్యబడి, లైపిగ్జ్ ‌జైల్లో ఏకాంత నిర్బంధంలో ఉంచబడ్డాడు. అయితే మార్చిలో ఆయన అఖిల జర్మన్‌ ‌పార్టమెంటె•న రైహ్‌స్టాగ్‌ ‌డెప్యూటీగా ఎన్నుకోబడిన కారణంగా ఆయన్ని విడుదల చెయ్యక గత్యంతరం లేకపోయింది. లీబ్‌క్నెఖ్టూ, లాసాలియన్లూ ఎన్నికల్లో ఓడిపోయినందున, ఈసారి బేబెల్‌ ‌రైహ్‌స్టాగ్‌లో ఏకైక సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీకి చెందిన ఈ ప్రతినిధి ఒం•రిగా పారిస్‌ ‌కమ్యూన్‌ ఆశయాన్ని సమర్థించవలసి వచ్చింది. యావత్తు జర్మన్‌ ‌బూర్జువా వర్గమూ కమ్యూనార్డులకు వ్యతిరేకంగా కత్తి కట్టి, వాళ్ళని గురించి అబద్ధాల దుమారం లేవగొడుతున్న దృష్ట్యా, ఈ బాధ్యతా నిర్వహణ సులభమేమీ కాదు.
యుద్ధకాలంలో విప్లవకర కార్యకలాపాలు సాగించినందుకుగాను 1872లో బేబెల్‌, ‌లీబ్‌క్నెఖ్టలు అరెస్టు చెయ్యబడ్డాడు. ʹʹదేశద్రోహకర సంకల్పాలుʹʹ కలిగి ఉన్నారన్న ఆరోపణ మీద లైప్జిగ్‌ ‌కోర్టులో వారిపై విచారణ జరిగింది. వాళ్ళ ఉపన్యాసాల మూలంగా ఆ కోర్టు విచారణ ఆచరణలో సోషలిస్టు భావాల వ్యాప్తికీ, కార్మికుల్లో పార్టీ ప్రతిష్ఠ పెరిగేందుకూ తోడ్పడింది. వాళ్ళిద్దరికీ రెండేళ్ళ ఖైదు శిక్ష విధించబడింది.
దరిమిలా బేబెల్‌ ఆ అదనపు జైలువాసం తన ఆరోగ్యం కోలుకునేందుకు దోహదం చేసి, తన ప్రాణాన్ని కాపాడిందని తరచు వ్యంగ్యంగా చెప్తూండేవాడు. పార్లమెంటు సభ్యుడిగా నిర్విరామ కృషి మూలంగా ఈయన ఆరోగ్యం బాగా దెబ్బతిని పోయింది. ఆయన జైల్లో పడ్డప్పుడల్లా ఆయన మిత్రలు సానుభూతి వ్యక్తం చేస్తూండేవారు. కానైతే ఆయన తనకి ఎలాగూ విశ్రాంతి అవసరమే కదా అని వేళాకోళంగా సమాధానం ఇస్తూండేవాడు.
బేబెల్‌ ‌జైల్లో తను గడిపిన సంవత్సరాలను తన విద్యా పరిపూర్తికి వినియోగించుకున్నాడు. అంతకు ముందు పార్టీ కార్యకలాపాల మూలంగా ప్రగాఢమైన అధ్యయనానికి ఆయనకి ఎక్కువ తీరిక చిక్కేది కాదు. కాని ఇప్పుడీ జైల్లో ఆయన తన యావత్కాలాన్నీ గ్రంథపఠనకు వినియోగించ గలిగాడు. ఈ సందర్భంగా కార్ల్ ‌లీబ్‌క్నెఖ్ట్‌కి బేబెల్‌ ‌రాసిన ఆసక్తికరమైన ఒక లేఖని పేర్కొనవలసి ఉంది. అప్పుడప్పుడే తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభిస్తున్న కార్ల్ ‌లీబ్‌క్నెఖ్ట్ ‌కూడా అప్పుడు జైల్లో ఉన్నాడు. బేబెల్‌ ‌తన ఆ ఉత్తరంలో, జైల్లో గడిపే కాలాన్ని స్వయం శిక్షణకి వినియోగించుకోమని లీబ్‌క్నెఖ్ట్‌కి సలహా ఇచ్చాడు.
జైల్లో ఉండగా బేబెల్‌ ‌మార్కస్ ʹʹ‌పెట్టుబడిʹʹ మొదటి సంపుటాన్నీ, అర్థశాస్త్రం, చరిత్రలపై ఈ కింది పుస్తకాలనూ చదివాడు : మార్కస్ ‌రచించిన ʹʹలూయీ బోనపార్ట్ ‌బ్రుమేర్‌ ‌పద్ధెనిమిదవ తేదీʹʹ, ʹʹఫ్రాన్సుతో అతర్యుద్ధంʹʹ ఎంగెల్స్ ‌రచించిన ʹʹఇంగ్లండులో కార్మికవర్గ పరిస్థితిʹʹ, ʹʹకమ్యూనిస్టు పార్టీ ప్రణాళికʹʹ, శాస్త్రీయ కమ్యూనిజం మూల పురుషులు రాసిన తదితర పుస్తకాలు. ఆయన తత్వ, అర్థ, ప్రకృతి విజ్ఞాన శాస్త్రీయ గ్రంథాలు చదివాడు. ఆయన కార్మికుల కోసం ʹʹజర్మనీలో రైతు యుద్ధంʹʹ అనే సులభ గ్రాహ్యమైన పుస్తకం రాసింది కూడా అక్కడే. రైతు యుద్ధాలను అభివృద్ధి నిరోధకమైనవిగా పరిగణించిన లాసాలియన్ల మాదిరిగా కాకుండా, బేబెల్‌ ‌జర్మన్‌ ‌రైతుల విప్లవాత్మక సంప్రదాయాలను గురించి వక్కాణించి చెప్పాడు. దీనికతోడు బేబెల్‌ ʹʹ‌స్త్రీ, సోషలిజంʹʹ అనే తన పుస్తకాలని సమాచారం సేకరించుకున్నాడు, క్రీస్తుమతం గురించి ఫ్రెంచి పండితులు రాసిన పుస్తకాలను అనువదించాడు.
ʹʹజర్మనీలో రైతు యుద్ధంʹʹకి తొలి పలుకులలోనూ, ʹʹచార్లస్ ‌ఫోరియర్‌. ఆయన జీవితం, సిద్ధాంతాలుʹʹకు ముందుమాటలోనూ బేబెల్‌ ‌చరిత్రకి సంబంధించిన తన భౌతికవాద దృక్పథాన్ని వివరించాడు. వాటిలో ఆయన నియమ పాలిత చారిత్రక క్రమం గురించి మౌలికమైన అభిప్రాయాలను విపులీకరించి, సమాజపు విప్లవాత్మక పరివర్తన అనివార్యమనే నిర్ధారణకు వచ్చాడు.
ʹʹగతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో స్త్రీʹʹ లేక ʹʹస్త్రీ, సోషలిజంʹʹ అనే ఆయన పుస్తకం 1879లో వెలువడింది. అది ఆయనకి రచయితగా ప్రపంచ వ్యాపితమైన ప్రసిద్ధిని తెచ్చిపెట్టింది. అది సోషలిస్టు వ్యతిరేక చట్టం ఇంకా అమల్లో ఉన్న జర్మనీలో రహస్యంగా ప్రచురింపబడింది. అక్కడ సైతం 15 వేలకాపీలు అమ్ముడుపోయాయి. చాలా కాలంపాటు జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రాట్ల చేత అత్యంత విస్తమీతంగా పఠింపబిన రాజకీయ సైద్ధాంతిక పుస్తకం ʹʹస్తీ, సోషలిజమేʹʹ. అది విదేశీ భాషల్లో అనేక ముద్రణలు పొందింది. శాస్త్రీయ కమ్యూనిజం రంగంలో అది ఈనాటికీ విలువైన మార్గదర్శిగా వినియోగపడుతోంది.
దాన్ని చదివితే బేబెల్‌ ‌మార్క్సిజాన్ని కూలంకషంగా జీర్ణించుకున్నాడనీ, దాన్ని సృజనాత్మకంగా ఒక కొత్త రంగానికి అన్వయించాడనీ తెలియవస్తుంది. శతాబ్దాలుగా సాగుతున్న స్త్రీల అణచివేతను ఆయన ఖండించాడు. చారిత్రక భౌతికవాద పద్ధతిని వినియోగించి, ఈ పీడనకి సాంఘిక రాజకీయ మూల కారణాలను బయటపెట్టాడు. మార్కస్, ఎం‌గెల్సుల రచనలను ఆధారంగా తీసుకొని, విస్తమీత సమాచారాన్ని సాధారణీకరించి, మొత్తం చరిత్ర క్రమమంతట్లోనూ సామాజిక సంబంధాలతో సజీవమైన బంధంలో స్త్రీల పరిస్థితిని బేబెల్‌ ‌వర్ణించాడు. ఆచరణలో స్త్రీల సమానత్వ సాధనకు ఆ పుస్తకం విశేషంగా తోడ్పడింది. బేబెల్‌ ‌బూర్జువా నీతుల కాపట్యాన్ని నిర్దాక్షిణ్యంగా బహిర్గతం చేసి, వ్యభిచారం పెట్టుబడిదారీ వ్యవస్థ ఉత్పాదితమనీ, స్త్రీ శరీరపు అమ్మకం స్వతహాగా అమ్మకం, కొనుగోళ్ళ మీద ఆధారపడినబూర్జువా సమాజంలో మాత్రమే ఉండగలదనీ నిరూపించాడు. బూర్జువావర్గం బేబెల్‌ని విశృంఖల ʹʹస్వేచ్ఛా ప్రేమʹʹ సమర్థకుడుగా పరిగణించింది. అయితే వాస్తవంలో ఈయన పరస్పర ఆకర్షణ, ప్రేమల మీద ఆధారపడిన స్వేచ్ఛాయుతమైన వివాహాన్ని ధైర్యంగా సమర్థించిన నిజాయితీపరుడు.
మొత్తం మీద బేబెల్‌ ఆరేళ్ళ జైలు జీవితం గడిపాడు. సైద్ధాంతిక దృష్ట్యా, జైల్లోనే ఆయన తన ప్రధాన, అతి ముఖ్య రచనలు చేసాడు. వెనకటి లేతు కార్మికుడు కార్యశీలి మాత్రమే కాకుండా, విప్లవోద్యమపు సంశ్లిష్ట, సమస్యలను సూత్రీకరించి, పరిష్కరించే సత్తా కలిగిన సిద్ధాంతవేత్త కూడా అని ఆయన నిరూపించుకున్నాడు.
1870లో సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌కార్మిక పార్టీ నెలకొల్పబడింది. అయితే అంతమాత్రాన జర్మన్‌ ‌కార్మికవర్గ ఉద్యమంలో చీలిక అంతరించిపోలేదు. లాసాల్‌, ఆయన అనుచరుల అవకాశవాద సూత్రాలు నిజంగా విప్లవాత్మకంగా ఉండే, కార్మికవర్గ ఉద్యమాన్ని నిజంగా ఐక్యం చేసే పార్టీ ఏర్పాటుకు గణనీయమైన అవరోధాలు, అందుకనే బేబెల్‌ ‌వాటిని బహిర్గతం చేసి ఖండించే విషయంలో విశేషమైన శ్రద్ధ చూపాడు.

(ఇంకా ఉంది)

No. of visitors : 466
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  స్టాలిన్‌ వ్యతిరేకత?
  ప్ర‌జ‌ల‌పై యుద్ధం; జ‌న‌త‌న స‌ర్కార్ పాఠ‌శాల‌ల ధ్వంసం
  NO TO WAR!
  TISS విద్యార్థుల పోరాటానికి విరసం సంఘీభావం
  అరుణతార ఫిబ్రవరి -2018
  Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA
  ప్రపంచాన్ని ప్రేమిస్తున్న మనిషి!!
  సీమ రైతుల స్వప్నం,కేసి కాలువ జీవనాడి-గుండ్రేవుల రిజర్వాయర్
  వర్ణమూ, కులమూ రెండు విభిన్న ఉత్పత్తి విధానాలకు సంబంధించినవి
  ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
  ఆన్ లైన్ బుట్ట‌
  వీఆర్‌యే విధుల్లో సాయిలు చనిపోలేదా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •