కవలలు

| సాహిత్యం | క‌విత్వం

కవలలు

- ఉద‌య‌మిత్ర‌ | 20.12.2016 11:35:38pm

అత్యంత అందమైన
నా జన్మభూమిపేరు
మూడక్షరాలు పలికితేచాలు
నాగుండె దెబ్బతిన్నపావురమై
గిలగిల కొట్టుకుంటది

పాలస్తీనా !!!
ఇక్కడ చలిరాత్రులు
మాప్రార్థనా మందిరాలు
దిగ్బంధనాలవుతుంటె
అక్కడ మీనగరాలుదగ్దమై
అగ్నికీలలు ఆకాశాన్నంటుతుంటాయి

అయితేనేమి ?
దుర్భరమైన కట్డడాలకావల
స్వాతంత్ర్య కాంక్ష రగులుతూ
సరిహద్దుల్ని సన్నద్ధంజేస్తుంది

***

పాలస్లీనా కాశ్మీర్ !
కాశ్మీర్ పాలస్తీనా !
ఒకతల్లికి పుట్టిన కవలల్ని
స్వాతంత్ర్య మాత
చరిత్ర ఊయలలొ ఊపుతున్నది

***

మానాయనమ్మ
తనరాట్నంమీద
కలలనువొడుకుతూ
ఎన్నిసార్లొ మిమ్మల్ని
తనపాటల్లోకి వంపుకున్నది
వాటిని నేను నాలుగేండ్లనుండే
గున్ గునాయించెదానిని

మీఆలివ్ఆకుల్ని
దేవుడిచ్చినవరంగా
మా అమ్మ భద్రంగ దాచిపెట్డేది
నేనెప్బుడూ వాటిని ముట్టే దానినిగాదు

***

ఎవరి ప్రగాఢ ఆకాంక్షలనెట్లకొలుస్తారు ?
నిముషాలు ,గంటలు
దశాబ్దాలు శకాలు యుగాలతోనా ?
కొలతలశాస్త్రమెప్పుడూ నవ్వుతెప్పించేదే !

కాని ఙ్నాపకమట్లాంటిదిగాదు
బాంబులకింద పేరిన
శిథిలాలకింద కూరిన
బాలుని బూటులాగ
నువ్వెప్పుడైనవెలిదీయవొచ్చు

ఙ్నాపకం ఓసజీవనది
దాన్ని కాలపుమట్టితొ పూడ్చలేం

***

పాలస్తీనా !
మంచుపెళ్ళల్లావిరిగిపడుతున్న
విధ్వంసకశకలాలమధ్య
నీపేరు ఉచ్చరించడానికి
నాపెదాలు వణుకుతున్నాయి
అయితేనేం !
కలలదారులవెంట
మనసు పరుుగులు దీస్తున్నవి

కలలొ మాదివంగతబాలలు
మమ్మల్ని ఓదారుస్తారు
"ఒకజాతికావల ఒకదేశం
ఒకదేశానికావల ఒకజాతి"అని
వాళ్ళ ముఖాలమీద
ఆలివ్ఆకులు గప్పుకొని
విచారంగ అడుగుతారు
"అన్నా ! మేమువాపసురాకపోతె
మాకోసం ఎదురుచూస్తారా ? "అని

***

స్వర్గంనుండిమోసుకొచ్చిన
ఉత్తరాలు చదువుతుంటె
వేలాది ఇంద్రధనుసులు
నాకనురెప్పలమీదవణుకుతాయి
మీతోటలనుండి
తెచ్చిన ఇంద్రధనుస్సులతొ
చిక్కుముడి వీడిన
నాతలంతాపరిమళభరితమౌతుంది

అప్రయత్నంగా నావేళ్ళు
నాకలల ప్రపంచాన్ని చిత్రీకరిస్తాయి
అద్భుతమైన వెలుతురెదొ
కిటికీ గుండా వెచ్చగ పలుకరిస్తుంది

మూలం::ఉజ్మా ఫలక్


No. of visitors : 471
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మాబిడ్డల్ని మానుంచి గుంజుకున్నరు

సుకన్య శాంత | 19.05.2018 09:39:48am

ఏప్రిల్ 24 నాడు, గ్రామస్తులు వెళ్లి తమ పిల్లలు కనబడకుండా పోయారని గడ్చిరోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమీ తెలియనట్టుగా నటించి, అన్ని వివర.....
...ఇంకా చదవండి

భావోద్వేగాలు

ఉద‌య‌మిత్ర‌ | 04.03.2017 09:42:24am

శాంతి అంటూ ఒకటుంటదా ఉంటది కాకపోతే వాళ్ళకు యుద్ధం తర్వాత శాంతి...
...ఇంకా చదవండి

ముఖద్వారం

ఉదయమిత్ర | 04.02.2017 12:56:50am

అడివిప్పుడి పెనుగాయం రాయని రాయకూడని గాయం లోలోపలసుళ్ళుతిరిగి పేగులకోస్తున్నగాయం దాపులేనిపచ్చిగాయం...
...ఇంకా చదవండి

నా సోదరి; నా ఆత్మబంధువు

కవితా లంకేష్ | 18.10.2017 06:43:06pm

గౌరి మూగబోవడమా!! హాహా!! పెద్దజోకు!! ఆమె పొద్దుతిరుగుడు పూవులా పగిలి ఎటు తిరిగితె అటు విత్తనాలజల్లి స్థలకాలాల దాటి ఖండాంతరాల చేరింది......
...ఇంకా చదవండి

అల్లరి విద్యార్థులు

ఉద‌య‌మిత్ర‌ | 16.08.2018 01:17:15am

కార్ల్ మార్క్స్ .. ఎప్పుడూ అసహనంగా కదుల్తుంటాడు విరామమెరుగని కాలంమీద ధనికులపై విప్లవ సంతకం చేయమంటాడు మదర్ థెరెసా నాకొ అర్థంగానిప్రశ్న టైము దొర్కితెచాలు ప్ర...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •