నిండు జుట్టుతో వెళ్లినవాడిని
బట్టతలతో తిరిగి వస్తున్నా
వీధి మలుపులో చూస్తావో లేదో
నేను చేసి పోయిన
కాలిగోటి గురుతుల కోసం
వెతుకుతున్నావా..వద్దులే
పంటి తీపుల కోసం
తడుముతున్నవా..వదిలే
కొన్ని దీర్ఘ శ్వాసల తరువాత..
వొంగిన ఆకాశాన్ని వెంటేసుకొని
లొంగిన మేఘాల కింద కలుస్తున్నా..
గుర్తుపడతావో లేదో
దుప్పటి కింద, దిండు అడుగున
పిల్లలు చూడకుంటా కప్పెట్టుకొన్న
వరదగూడుని మెలిపెడతావేమో
నేనేమయిపోతానోనని
మా అమ్మ కళ్లతో పొగిలిన
శీతల దిగుళ్లని ఎత్తిపట్టుకొని
ముఖంలో ముఖం పెట్టి చూస్తావేమో
మెసిలే ఏ రాత్రో, పేవ్మెంటో
రోడ్డుపై వినిపిస్తున్న సైకిల్ బెల్లో
నిద్రాభంగమైన కుక్క అరుపో
కాదన్నాయని..
ముందుకేసిన కాళ్లని కూడా
చప్పున వెనక్కి లాగేసుకొంటావేమో..
ఏమో...నీ దాకా వచ్చినా
తాకుతావో లేదో సాయంకాలం వానని
గుర్రం కాలుతో వెళ్లిన వాడిని
కొయ్య కర్రేసుకొని వస్తున్నా
ఆ చప్పుడు నీదాకా చేరుతుందో లేదో
నీ ప్రేమలో పడినప్పుడు కొరికిన
నేరేడు వాసన ఏదంటావేమో..వయసైపోలా
పోతూ పోతూ నీకిచ్చిపోయిన
అద్దంలోకి సూరీణ్ణి పట్టమంటావేమో..అలసిపోలా
కొన్ని దీర్ఘ శ్వాసల తరువాత..
వొంగిన ఆకాశాన్ని వెంటేసుకొని..
లొంగిన మేఘాల కింద కలుస్తున్నా
గుర్తుపడతావో లేదో!
06-12-16
Type in English and Press Space to Convert in Telugu |
మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన : రివేరా9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన పై రివేరా ఉపన్యాసం....... |
చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..పుస్తకాల సంచిని గిరాటేసి
రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం
వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు
స్నేహితుల భుజాలపైనుంచి
నవ్వుతూ చూడటమే చివరిచూపు....... |
ఏప్రిల్ పండు II రివేరాపిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,... |
సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరావిప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే....... |
ఈ రాక్షస గీతి వింటారా?మనం నిలబడిపోయిన చోట నుంచే
మన నడకలను మోసుకెళుతున్నారు
మనం ఆపేసిన రాగాలనే
తీగలుగా సాగిపోతున్నారు
మన గొంతునీ, మన వంతునీ
మనక్కిచ్చేసి వెళుతు... |
రెప్పని కప్పని నిద్దురఒకే రాత్రిని కప్పుకొన్న మనకి
ఒక్క నిద్దుర చాలదా?
చుక్క కలని పొదువుకోడానికి
ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?... |
భయం చుట్టూ భయం..వీళ్లెక్కడ చంపుకుతింటారోనని ఆడవాళ్లకు భయం
భయంలేని ఆడవాళ్లంటే మగవాళ్లకు మహా భయం
దొంగలంటే భయం, పోలీసులన్నా మరి భయమే
తాళాలు లేని తలుపులంటే భ... |
నో, ఐ డోన్ట్ లైక్ టమాటటమాట రంగు సరే,
రసాలూరే సరస్సులేమీ..
కొంచెం కరిచిపట్టుకొన్న
మిలమిలా మీనాలేమీ..
పైకి కిందకి మునకలేసే
గత్తరబిత్తర గోళాలేమీ....... |
అద్గదీ...అటో ఇటో వేటో పోటో పడిపోవాల్సిందే!
పాలకులంతా ప్రజాస్వామికవాదులై
ప్రజలేమో నియంతలైతే ఏమి చేస్తాం?... |
యంత్ర భూతమైన ప్రేమలు పత్ర హరితాలు కావాలని..సామాన్యులను అసామాన్య కథానాయకులను చేస్తున్న కాలం ఇది. ఇరాక్, నికరుగువా, పాలస్థీనాల్లో పాల ఫ్యాక్టరీలపై బాంబులు వేస్తున్నవాడినీ, మన గిన్నెల్లో విష క్షీరాలన... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |