పయనించిన పాట

| సంభాషణ

పయనించిన పాట

- పద్మకుమారి | 21.12.2016 12:01:15am

మొన్న 12న ప్రభాకర్‌ వాళ్లింటికి వెళ్లాను.

తను చనిపోయి ఒకటిన్నర నెల అయింది. ఆ రోజు మెదక్‌కు కామ్రేడ్‌ భారతి అంత్యక్రియలకు వెళ్లిన వాళ్లం ఆతృతగా హైదరాబాదు చేరుకున్నాం. ప్రభాకర్‌ అంతిమయాత్ర మధ్యలో చేరాం. ఆరోజు ప్రభాకర్‌ తల్లి రత్నమ్మను పలకరించానే తప్ప మాట్లాడలేకపోయాను. బిడ్డను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న తల్లితో అప్పుడు ఏం మాట్లాడగలం? మాట్లాడ్డం, పరామర్శించడం ఎవ్వరికీ చేతకాని సమయం కదా అది.

ఈ నెలన్నరగా అనేక ప్రయాణాలు. అంతులేని జ్ఞాపకాలు. తెలిసిన, తెలియని బెజ్జంకి అమరులందరి గురించిన మాటలు. అమరుల్లో ఏ ఒక్కరినీ విడిగా తల్చుకోలేదు. తెలిసిన వాళ్ల గురించి ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడుకోగలిగాం అంతే. వాళ్లు మనకు వ్యక్తులుగా వేర్వేరు కావచ్చు. కానీ వాళ్లందరూ ఒక పెద్ద ఉద్యమంలో భాగంగా అమరులవుతున్నవాళ్లు. సంస్మరణ సభలు, ధర్నాలు, పోలీసుల పోటీ ఆందోళనలు. ఈ అన్నిటిలో ప్రతిరోజూ అమరులందరితోపాటు ప్రభాకర్‌ జ్ఞాపకాలు, ఆదర్శాలు, ఆశయాలు కూడా తలపోసుకున్నాం. స్ఫూర్తిని పొందాం.

ఇన్ని పనుల మధ్యనే తీరిక చేసుకొని అమ్మతో మాట్లాడదామని ఇంటికి వెళ్లాను. లోపలికి వెళ్లగానే ఎదురుగా ప్రభా ఫొటో కనిపించింది. మౌత్‌పీస్‌ పట్టుకొని మాట్లాడుతున్న ఫొటో. తన అమరత్వం తర్వాత ఆ ఫొటో చాలా చోట్ల కనిపించింది. ఆ నల్లటి ముఖంలో తెల్లటి పలు వరుస, తన్మయంతో మాట్లాడుతున్న భావన ఆ ఫొటోలో అందరూ గమనించే ఉంటారు. అది మాటో, పాటో మరి. ఒక్కసారి ప్రభనే అడిగేస్తేపోదా అనిపించింది. అతనింకా ఉన్నాడనే అనిపిస్తోంది. ఎదురుగా మనిషి నిలబడ్డట్లే ఉంది. నిస్సత్తువగా అక్కడే ఉన్న చాప మీద కూర్చుండిపోయాను.

అంతలో అమ్మ వచ్చింది.

పలకరించి ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. ప్రభా చెల్లె సునీత వెళ్లి మంచినీళ్లు తీసుకొని వచ్చింది. పలకరింపుగా నవ్వింది. ఆ అమ్మాయిదీ ప్రభా పలువరుసే. అంతలోనే అక్క సువర్ణ వచ్చింది. చెల్లె కంటే అక్కలో తన పోలికలు మరీ ఎక్కువ.

బాగున్నావా? అంటూ చేతులు పట్టుకొంది.

ఆ మాట అంటున్నదే గాని ఆమెకు దు:ఖం ఆగలేదు.

ʹనాకేమన్నా అయితే పద్మక్క వచ్చి చెబుతుంది అన్నాడు. నీ కోసం వెతికానుʹ అన్నది అక్క ఏడుస్తూనే.

ఇంక ఆమె కొనసాగించలేకపోయింది.

ఏదైనా జరగరానిది జరిగితే అందరికీ తెలిసేదే కదా? అయినా ప్రభాకర్‌ అట్లా ఎందుకు చెప్పాడు? అన్ని దు:ఖాల్లాగే ఈ దు:ఖాన్నీ నేనే చేర్చాలని అనుకున్నాడా? నేను సొంత తమ్ముడిలా ఇష్టపడే ప్రభా తన అక్కకు అలా చెప్పి వెళ్లాడా?

నిజమే. నేను ఆ రోజు అక్కకు చెప్పలేకపోయాను. కానీ, మల్కాన్‌గిరిలో దేవేంద్రకు నేనే చెప్పాల్సి వచ్చింది. సన్నిహితుల చావు కబురును ఇలా చేరవేయడం ఎంత బాధాకరం. ఇది చాలా విచిత్రమైన, విషాదకరమైన బాధ్యత కదా? ఇది ఎప్పుడూ తప్పని స్థితే.

ఎందుకో ప్రభా అక్క ముఖంలోకి మళ్లీ మళ్లీ చూడాలనిపించింది. అలా చూస్తూ..

ʹవాళ్ళు సిద్ధపడి వెళ్లారు కదా. మనం ఏం చేస్తాం?ʹ అని ఓదార్చబోయాను. నా మాటలకు అమ్మ మరింతగా దు:ఖించడం మొదలుపెట్టింది.

రెండు నిమిషాలపాటు అక్కడంతా ఆ తల్లి దు:ఖమే ఆవరించింది. తేరుకున్నాక ఆమె ʹనా కొడుకును ఒక్కరోజు ఒక్క దెబ్బెయ్యకుండా పెంచుకున్నాను. ఒక రోజు ఏదో కోపమొచ్చి తలెంటుకలు పట్టుకున్నా. అప్పుడు వాడు అమ్మా నీకంటే రెండించులు ఎత్తుఉన్నా. ఇప్పుడు కొడతావా? అన్నాడు. కొడుకులు పెద్దగైతే ఎంత ఆసరా. కొడుకు చెయ్యెత్తు పెరిగిండని సంబరపడ్డా. వాల్ల చేతులు ఇరిగిపోను.. ఒక్క తూటేస్తే సచ్చిపోయేదానికి ఎందుకమ్మా నా బిడ్డను అట్ల కొట్టి కొట్టి చంపిన్రు? నా బిడ్డ అంత బాధను ఎట్ల తట్టుకున్నడో. తలుచుకుంటేనే గుండె చెరువు అవుతోంది. పడుకుంటే నుజ్జు నుజ్జు అయిన బిడ్డ మొకమే కండ్లల్ల మెదులుతాంది..ʹ

ఆమెను ఎట్ల ఓదార్చాలి? ఎవరికైనా చేతనవుతుందా?

ఏదో చెప్పబోయాను. ʹమొదటి తూటా దెబ్బకే చనిపోయి ఉంటాడు. అయినా కసికొద్ది కొట్టి ఉంటారు..ʹ అన్నాను.

ఆ మాటలు నాకే నచ్చలేదు.

వాళ్లు వీరోచితంగా పోరాడి చనిపోయినవాళ్లు. ప్రభాకర్‌ ప్రతిఘటిస్తూనే గాయపడ్డాడని, అతడ్ని తీసుకపోతూ ఉంటే తను ఇక బతకనని, తుపాకిని సహచరులకు ఇచ్చాడని వినికిడి. ఇంత ధీరత్వం ప్రదర్శించిన తన బిడ్డ మొదటి దెబ్బకే చనిపోయాడని బొంకబోయాను. అది తల్లి దు:ఖం కదా. పెంచడం భావ్యం కాదు. అట్లని వీరోచిత ప్రతిఘటనను దాచకూడదు కదా? ఎందుకంటే అప్పుడు కామ్రేడ్స్‌ అంతగా ఎదుర్కొన్నారు కాబట్లే మిగతా కామ్రేడ్స్‌ను, నాయకత్వాన్ని కాపాడుకోగలిగారు. ఇదో గొప్ప కమ్యూనిస్టు సంప్రదాయం. ఎదుటివాళ్ల కోసం తమ ప్రాణాల్ని ఎదురొడ్డడం ఎంత గొప్ప విలువ. అది కేవలం విప్లవకారులకే సాధ్యం. యవ్వన ప్రాయంలో ఉన్న కామ్రేడ్‌ మున్నా, డానియేల్‌, రూపీ, చిలక ఇతర ఆదివాసీ కామ్రేడ్స్‌ అందరూ వీరోచితంగా పోరాడి తమ సహచరులను కాపాడుకున్నారు. వీరందరి కోసం ఎంతో దు:ఖం కలుగుతుంది. అయితే అది చరిత్రలో వీరోచిత ఘటనే. గాయపడి శత్రువుకు చిక్కిన కామ్రేడ్స్‌ దారుణమైన హింసలు అనుభవించి మరణించి కూడా స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు.

0 0 0

అమ్మ, అక్క దు:ఖిస్తూనే ఉన్నారు. చెల్లెలు లోలోపల బాధపడుతోంది. కన్నీళ్లు కారుతున్నాయి. మిగతా పిల్లలు బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయారు.

నేను వాళ్లను ఓదార్చలేకపోయాను.

అమ్మ తనలో తను మాట్లాడుకుంటున్నట్లు.. ʹకొడుకు ఎక్కడో ఉండి అప్పుడప్పుడన్నా వచ్చేవాడు. కంటికి కనిపిస్తే తృప్తిగుండేది. రెండేళ్లయింది చూడక. ఓ రోజు ఉత్తరం వచ్చింది. నేనెందుకు పొయినంటే అని.. పార్టీలో ఎందుకు చేరాలో రాసిండు. ఆ రోజు నుంచి ఎక్కడ ఏం జరిగినా బయపడుతూనే ఉండేదాన్ని. కొడుకు మాంసం ముద్దలెక్క ఇంటికొచ్చిండు. ఈ చేతులతోనే కాటికి సాగనంపినా. అయినా నా జీవాత్మకు ఎందుకో కొడుకు వచ్చినట్లు, అమ్మా తలుపు తియ్యి అని పిలిచినట్లుగా అనిపిస్తుంది. ఉలిక్కిపడి లేస్తున్నా. నిద్రలోంచి లేచి తలుపు కొట్టింది వాడేనా? అని చూస్తున్నా. ఇంకెక్కడి కొడుకు? అని మీరు అనొచ్చు. కానీ నా మనసుకు ఇంకా వస్తడనే అనిపిస్తుంది. మల్లగిట్ట పిలుస్తడేమో అని నిద్ర పట్టక తెల్లార్లూ కూర్చుంటున్నా..ʹఆమె అదే ట్రాన్స్‌లో మాట్లాడుతున్నట్లుంది.

బిడ్డల గురించి తల్లులకు ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని ఆరాటాలు, ఎన్ని ఎదురు చూపులు. ఇవి తీరేవేనా? ఈ దు:ఖం ఆగిపోయేదేనా? ప్రభా తల్లి ఒక్కరే కాదు. అమరుల తల్లులు అందరూ అంతే. నలభైౖ ఏళ్ల కింద చనిపోయిన బిడ్డనూ ఈ రోజుకూ అదే తీరులో తల్చుకుంటున్న తల్లులున్నారు.

అమ్మను ఈ దు:ఖం నుంచి బైటికి తేవడానికని

ʹఅక్కా .. ఆరోజు ప్రభాకర్‌ శవాన్ని ఎక్కడ ఉంచారు?ʹ అని అడిగాను.

దానికి అక్క ʹకచేరు బండ దగ్గర ఉంచారు. జననాట్యమండలి వాళ్లు అక్కడ నాటకాలేసే వారు. వీడు చిన్న పిల్లోడు వాల్లతోపాటు ఆడిపాడేవాడు..ʹ అన్నది.

ఇంతలో ప్రభాకర్‌ గొంతు... జల్లుమంది గుండె.

ʹనేను తెలంగానోన్ని మాట్లాడుతున్న...ʹ అని ఎవరిదో ఫోన్‌ మోగింది. నివురుగప్పిన నిప్పు వీడియోలో ప్రభా మాట్లాడినదాన్ని రింగ్‌ టోన్‌గా పెట్టుకున్నారు. నాకెందుకో అక్కడ ఉండటం కష్టమనిపించింది. కళ్లలో నీళ్లుబికాయి. అదొక కంచు కంఠం. అది అమరులను కీర్తించిన కంఠం. శతృవును చండాడిన కంఠం. అతడు ఎంత అద్భుతంగా పాడి మనుషుల హృదయాలు దోచేయగలడు. ఇప్పుడు అమ్మ ఉన్న స్థితిలోకి నేను జారుకున్నాను. క్షణక్షణం మరీ మరీ భారమవుతోంది. ఇట్లా ఇక్కడ నేను ఉండగలనా? కానీ అమ్మవాళ్లు నేను ఇంకా ఉండాలనుకుంటున్నారు. నేనూ ఆ రోజంతా అక్కడ ఉండేందుకే వెళ్లాను. దు:ఖాన్ని భరించీ భరించీ రాటుదేలుతారని అంటారు. కానీ నేను దీనికి భిన్నంగా తయారయ్యానా? అనుమానం కలుగుతోంది.

అక్క ఇంకా ఆనాటి జ్ఞాపకాలు పంచుకుంటోంది.

ఆ మూల మలుపుల్లో, ఈ బడి దగ్గర ప్రభాకర్‌ చిన్నప్పుడు ఆడుకునేవాడు. ఆ చెట్టుకింద పాటలు పాడుకుంటూ గెంతులేసేవాడు.. ఇలా ఆమె ఆ పరిసరాలన్నిట్లో ప్రభాకర్‌ జ్ఞాపకాలను ఏరుకుంటోంది. ఎవరు ఏం మాట్లాడినా ఆమె అక్కడ తమ్ముడి జ్ఞాపకాలను వెతుక్కుంటోంది. అపురూపంగా ఆమె కళ్లలో వెలుగు. క్షణంలో దాని స్థానంలో కన్నీరు. ఆమెకు తెలిసిన ఈ బస్తీ అంతటా, అన్ని తావుల్లో, అందరి ఇండ్లల్లో ప్రభా అడుగులను, పాటలను, మాటలను ఆమె గుర్తు చేసుకుంటోంది. కానీ ఆమెకు తెలియని బస్తీల్లో, ఊళ్లల్లో, ఇండ్లల్లో, కూడళ్లలో ఎన్ని చోట్ల ప్రభా గొంతు మార్మోగి ఉంటుందో. ప్రభా పాదాలు ఆడి ఉంటాయో. ఈ హైదరాబాదు నుంచి తెలంగాణ నుంచి ఏవోబీ దాకా, బెజ్జంకి అడవుల్లో నెత్తురు చిందే దాకా పాడుతూనే ఉండి ఉంటాడు. వీచే గాలుల్లో, మోగే గజ్జల్లో, డప్పు, డోలక్‌ చప్పుళ్లలో ఎన్నటికీ ప్రభాకర్‌ జీవించే ఉంటాడు.

No. of visitors : 1431
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ శిరస్సు, స్తనాలు ఏమయ్యాయి?

పద్మకుమారి, కార్యదర్శి, అమరుల బంధుమిత్రుల సంఘం | 18.11.2016 11:48:02am

మర్మాంగాలను ఛిద్రం చేస్తున్న చోట, పాలిచ్చే వక్షోజాలను కోసి పారేస్తున్న చోట, తలెత్తి పోరాడమని ప్రజలకు నేర్పిస్తున్న వాళ్ల తలలు మాయం చేస్తున్నచోట, శవాన్ని ప...
...ఇంకా చదవండి

‌మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

పద్మకుమారి | 17.06.2016 10:57:58am

వాకపల్లి పాతపడిపోయింది. కొత్తగా భల్లుగూడ కూడా మన ముందుకు వచ్చిపోయింది. ఛత్తీస్‌ఘడ్‌లో రోజూ ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అన్నీ పోలీసులు, పారా........
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు

పద్మకుమారి | 15.05.2016 01:51:20pm

ʹఅమ్మా నువ్వే ఇట్లన్నవంటే.. వాల్లు ఇంకెట్లంటరో ఆలోచించు. అది చూడు ఎంత బాధపడుతున్నదో. ఇంతకూ బాబును వదిలి వెళ్లడానికి ధనాలు సిద్ధంగా ఉందా? దాన్ని ఒక్క మాట అడగ...
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు -2

పద్మకుమారి | 01.06.2016 10:37:59am

కమాండర్‌ వెనక్కి తిరిగి మనం దగ్గరికి వచ్చేశాం. ఇది మనకు బలమైన ప్రాంతం. ఇంకో అరగంటలో గ్రామం అంచులోకి చేరుకుంటాం. ప్రయాణం ఒక రోజు లేటైనా రెండో రోజు ఏపీటీకి...
...ఇంకా చదవండి

విప్లవ వ్యక్తిత్వం

పద్మకుమారి | 16.07.2019 08:07:17pm

భారతి అమరత్వం తర్వాత కలిసినప్పుడు శంకరన్న వాళ్లన్నయ్య దుబాషి యాదయ్య తన జ్ఞాపకాలు పంచుకున్నాడు. చిన్నారి యాదమ్మ ఆ కుటుంబంలో హక్కుల కోసం ఆమె పడిన ఘర్షణ......
...ఇంకా చదవండి

పాల్గుణ

ప‌ద్మ‌కుమారి | 11.05.2016 01:21:15pm

ఇప్పుడు పాల్గుణ అంటే మేఘ‌మే కురుస్తుంది త‌ప్ప పిడుగు రాల‌దు.పిడుగు రాలినా పిడుగంచు విద్యుత్ వెలుగై మ‌నసులోకి ఇంకుతుంది. ...
...ఇంకా చదవండి

త్యాగాల పరంపర

పద్మకుమారి | 17.07.2016 12:35:14am

కుప్పగా పోసిన శవాల్లో తమవాళ్లను గుర్తించి ఏరుకోవడం ఎంత హృదయ విదారకం. సృజన మనసు చాల సున్నితమైనది. పట్టుదలగల అమ్మాయి. మేము ఇలా ఎప్పుడో ఒకప్పుడు చూస్తామని......
...ఇంకా చదవండి

దారులు

ప‌ద్మ‌కుమారి | 15.05.2016 01:10:40pm

ఎక్కడివీ బాటలు ఎవరి జాడలు వెంట పరిగెడుతున్నాయి నీవేనా ? అవి నీవేనా ?...
...ఇంకా చదవండి

వాకపల్లి ఇప్పుడు ఎం చెబుతోంది?

పద్మకుమారి | 04.09.2017 08:58:57am

వాకపల్లి ఒక్కటే కాదు. విప్లవోద్యమ ప్రాంతాల్లో మహిళల రాజ్యం దారుణంగా దాడి చేస్తోంది. బైటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించీ వింటున్నాం. చిన్న ప...
...ఇంకా చదవండి

రమాకాంత్‌ వాళ్లమ్మ

పద్మకుమారి | 17.11.2019 10:25:42am

ʹఆ రోజు అన్నను చంపేసినప్పుడు మన సంగం లేదు కాబట్టి శవాన్ని చూడ్డానికి కూడా కాలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడికోపోయి మనోల్ల శవాలను తెస్తున్నారు. మన సంగం ఉండాలి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •