ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

- కెన‌రీ | 21.12.2016 07:07:28am

ఒక అందమైన ప్రేమ కథ - "జమీల్యా" సంప్రదాయ సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛగా ఎగిరిపోయే ప్రేమికుల కథ ఇది. ఉత్కంఠగా చదివే పాఠకులు, చివరికి హాయిగా ఊపిరి పీల్చుకొనే అపురూపమైన ప్రేమ కథ - "జమీల్యా"

కథలోకి ప్రవేశిస్తే-సోవియెట్ రష్యాలో ఒక గ్రామంలోని యువకులు సైనికులుగా యుద్ధంలోకి వెళ్లగా వాళ్ల ఇతర కుటుంబ సభ్యులు, భార్యలు గ్రామంలో నిర్వహింపబడే సమిష్టి క్షేత్రాల బాగోగుల బాధ్యతల్లో ఉంటారు.

ఈ కథలో కథానాయిక జమీల్యా ఆమె "చిట్టి మరిది" సయ్యద్, యుద్ధం నుంచి వచ్చిన దనియార్లే ప్రధాన పాత్రధారులు.

పెళ్లయిన కొద్ది నెలలకే యుద్ధంలోకి వెళ్లిన సాదిక్ భార్య జమీల్యా నిజాయితి, నిర్మొహమాటం, నిష్కల్మషం గల జమీల్యా మంచి అందగత్తె. హాస్యమంటే పడిచచ్చే జమీల్యా గాయకురాలు కూడా, ఎప్పుడూ ఏదో ఒక రాగం తీస్తూనే వుంటుంది. తన మనసుని ఇబ్బంది పెట్టిన వాళ్ళెవరికైనా, తగిన బుద్ధి చెబితేనే ఆమెకు ఊరట. ఆత్మాభిమానం గల జమీల్యా కోపాన్ని దాచుకోదు, సంతోషాన్ని ఆపుకోదు. అంతకుమించి, లోలో లావాలా బద్దలయ్యే ప్రేమనూ అణచుకోలేని అమాయకురాలు జమీల్యా.

కథకుడిగా పరిచయమయ్యే సయ్యద్ ను జమీల్యా "చిట్టి మరిది" అని ఇష్టంగా పిలుచుకుంటుంది. హుషారైన పదిహేనేళ్ల బాలుడు సయ్యద్కి సమవయస్కురాలైన వదిన జమీల్యా అంటే ఒకింత గర్వమూ అభిమానంతో పాటు తెలియని అనురాగం గూడుకట్టుకుంటుంది. జమీల్యా అందానికి ఆశర్యపోతాడు. ఆమె చురుకుదనానికి, సమయస్పూర్తికి ఆనందపడ్డాడు. జమీల్యాకు ప్రియమైన స్నేహితుడు గనుక ఆమెపై ఈగవాలితే భరించలేడు, బాధపడిపోతాడు. ఆమె వ్యక్తిగత అంగరక్షకుడిగా తనకు తాను ఊహించుకుంటాడు. పని వేళల్లో గుర్రపుబండిలో దాన్యం స్టేషనుకు తోలేటప్పుడు ఆమెకు తోడుగా వుండేవాడు.

ఒంటరి అనాధ జీవితం నుంచి అనేక ప్రాంతాలు తిరిగి వివిధ పనులు చేసి చివరికి సైన్యంలోకి వెళ్లి గాయపడి, స్వంత గ్రామంలోకి అడుగుపెడ్డాడు దనియార్, మితభాషి, అస్తమానం పరధ్యానంగా వున్నట్టేవుండేవాడు. కానీ తను చేయవలసిన పనుల్లో చాలా జాగ్రత్తగా వుండే దనియార్ సాయంకాల తీరిక సమయాల్లో నది ఒడ్డున ఏకాంతంలో గడిపేవాడు. అచంచల విశ్వాసాన్ని అఖండమైన ప్రేమను తన గొంతులో పలికించగల అద్భత గాయకుడు దనియార్.

జమీల్యా సయ్యద్, దనియార్ల పాత్రల వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా సృజియించిన ప్రముఖ సోవియట్ రచయిత చింగిత్ ఐత్మాతోవ్ "జమీల్యా" కథతో ప్రపంచ ప్రఖ్యాతిని సాధించాడు. కథానుగుణంగా తను సృష్టించిన పాత్రల సంఘర్షణలను, భావోద్వేగాల్ని ప్రకృతితో అనుసంధానం చేస్తూ ఒక అద్భుత భావచైతన్య ప్రపంచాన్ని దృశ్యమానం చేస్తాడు.

కథ ప్రారంభం నుండి చివరి పేజీ వరకు ఆధ్యంతమూ మంత్ర ముగ్దుల్ని చేసే ప్రాకృతిక మనోహరమైన వర్ణన, మనసుని హత్తుకునే సైప్ మైదానం పచ్చదనం, ముక్కుపుటాల్ని అదరగొట్టే పుప్పొడి పరిమళాలు, నదీనాదాలు,సెలయేటి రొదలు మనసుని ముప్పిరిగొంటాయి. నిస్సందేహంగా కథలోకి తీసుకు వెళ్తాయి.

పాత్రలు కాల్పనికమే ఐనప్పటికీ ఎక్కడా సహజత్వాన్ని వీడని సన్నివేశమూ ఏ భావోద్వేగాన్నీ వదలని సృజనాత్మక శైలీ రచయిత సమర్థతనూ సమయస్ఫూర్తినీ అడుగడుగునా ప్రతిఫలించడం చూస్తాం.

మొదట్నంచీ జమీల్యాతో సన్నిహితంగా మెలిగే సయ్యద్ ఆమెను గాఢంగా ప్రేమించే విషయం ఆమె వెళ్లిపోయే వరకు అతనికే తెలియదు. జమీల్యా తనతో ఉన్నంతవరకు పసితనంతోనే వుంటాడు. దనియార్తో వెళ్లిపోయినందుకే అతని పసితనము తనను విడిచిపోతుంది. జమీల్యా - దనియార్ జంటను చూసి మురిసిన సయ్యద్ తన జీవితానందం కళాకారుడిగా జీవించడంలోనే వుందని భావిస్తాడు. అందుకోసమే ప్రాంతం మారి కళాకారుడిగా తననుతాను వృద్ధి చేసుకుంటాడు. అయితే, ఎప్పటికీ ఆగష్టు రాత్రినీ ఆవేళ పరవశించిన ప్రేమికులిద్దర్ని మర్చిపోడు.

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సంధర్భంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే "జమీల్యా" కథ ఇవ్వాల్టి ఉద్యమాభిమానులకు ఒక ఊరట, ఒక ప్రేరణ.

సృజనపరులు, సాహిత్యోద్యమకారుల హృదయాల్ని అలవోకగా కొల్లగొట్టే "జమీల్యా" పాఠకుల‌ను స్పూర్తి సంద్రంలో ముంచెత్తకమానదు. ఆ అనుభవాన్ని ఆస్వాదించాలంటే "జమీల్యా"తో తప్పక సంభాషించాల్సిందే.

No. of visitors : 1458
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 24.11.2016 09:43:08pm

లాసాల్‌ ‌చెప్పేదాని ప్రకారం, కార్మిక సంఘాలు ఉత్పత్తి నిర్వహణను క్రమంగా తమ చేతుల్లోకి తీసుకుంటాయి. సార్వజనిక ఓటు హక్కును ప్రవేశపెట్టిన ఫలితంగా రాజ్యం ʹʹ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •