స్మార‌క స్థూపం మీది పేర్లు - ఔగుస్ట్ ‌బేబెల్‌

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఔగుస్ట్ ‌బేబెల్‌

- ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 27.12.2016 10:24:05pm

రెండ‌వ భాగం
ఔగుస్ట్ ‌బేబెల్‌
(1840-1913)

1875లో బేబెల్‌ ‌జైల్లో ఉన్నప్పుడు, విల్‌హెల్మ్ ‌లీబ్‌క్నెఖ్ట్ ‌లాసాలియన్ల నాయకులతో ఐక్యత కోసం ఏర్పాట్లు జరిపాడు. అయితే, అలా చెయ్యడంలో ఆయన తీవ్రమైన కొన్ని పొరపాట్లు చేసాడు: ముసాయిదా కార్యక్రమం రాసేటప్పుడు లాసాలియన్‌ ‌పిడివాదాల్లో కొన్నింటిని అందులో చిప్పించేందుకు అంగీకరించాడు. మార్కస్, ఎం‌గెల్సులు ఈ అవకాశవాద ముసాయిదాను నిశితంగా విమర్శించాడు. ఈ ముసాయిదా తన చేతికి అందినప్పుడు బేబెల్‌ ‌దాన్ని తీవ్రంగా ఖండించి, వేరే ముసాయిదా రాసేందుకు ప్రయత్నించాడు. కానైతే, బేబెల్‌ ‌జైలు నుంచి విడుదలై వచ్చాక, లీబ్‌క్నెఖ్ట్ , ఇతర పార్టీ కార్యకర్తల ఒత్తిడికి లొంగి, ఎత్తుగడల దృష్ట్యా గోతా కార్యక్రమ ఆమోదాన్ని వ్యతిరేకించలేదు. మార్కస్ ‌రాసిన ʹʹగోతా కార్యక్రమ విమర్శʹʹ బేబెల్‌ ‌దృష్టికీ, మొత్తం పార్టీ దృష్టికీ రాకుండా బుద్ధిపూర్వకంగా మరుగుపరచబడటంతో, బేబెల్‌కి దాన్ని గురించి ఏమీ తెలియలేదు.
గోతా కార్యక్రమం శాస్త్రీయ కమ్యూనిజానికీ, వర్గ పోరాటానికీ సంబంధించిన అనేక ముఖ్యమైన సూత్రీకరణలకు భిన్నంగా ఉంది. ఐక్య పార్టీకి లాసాలియనిజానికి చెందిన సైద్ధాంతిక, రాజకీయ పొరపాట్ల భారమైన పెద్ద గుదిబండ వారసత్వంగా సంక్రమించింది. అయినా కూడా ఈ ఏకీకరణ ఒక ముందడుగు. ఎందుకంటే, అది కార్మికవర్గ ఉద్యమంలో చీలికకు స్వస్తి చెప్పి, ఐక్య పార్టీలో మార్క్సిజం ప్రాబల్యాన్ని ఖాయపరిచింది.
ʹʹ1874 నుంచి 1876 దాకా జర్మన్‌ ‌రైహ్‌స్టాగ్‌, ‌జర్మన్‌ ‌శాసనసభల పార్లమెంటరీ కార్యకలాపాలుʹʹ అనే తన పుస్తకంలో బిస్మార్కు మీద అమానకరమైన దాడులు ఉన్నాయన్న ఆరోపణపై 1877 జూన్‌లో బేబెల్‌ను మరోసారి కోర్టులో విచారించి, తొమ్మిది నెలల జైలు శిక్ష విధించారు. అప్పీలు చేసుకున్న మీదట ఆ శిక్ష ఆర్నెలలకు తగ్గింపబడింది. ఈ మారు ఆయన శిక్షా కాలాన్ని బెర్లిన్‌ ‌జైల్లో గడిపాడు.
1878 అక్టోబరులో రైహ్‌స్టాగ్‌ ‌సోషలిస్టులకు వ్యతరేకంగా ఒక చట్టం చేసింది. దాని పేరు అసాధారణ లేక సోషలిస్టు వ్యతిరేక చట్టం. అది అన్ని పార్టీ శాఖల, సోషలిస్టు ట్రేడ్‌ ‌యూనియన్ల కార్యకలాపాలనూ, అన్ని సోషలిస్టు పుస్లకాల, పత్రికల ప్రచురణనూ నిషేధించింది. అలాగే అన్ని సభలనూ, సోషలిస్టు స్వభావం కలిగిన యూనియన్ల స్థాపననూ, వీటి కోసం ధన సేకరణనూ కూడా ఈ చట్టం నిషేధించింది.
పార్టీ క్లిష్ట పరిస్థితిలో పడింది. పార్టీ నాయకుల్లో కొందరు విభ్రాంతి చెందారు. కేంద్ర కమిటీ రహస్య శాఖలను ఏర్పాటు చేసేందుకు ఏ ప్రయత్నాలూ చెయ్యకుండానే పార్టీని రద్దు చెయ్యాలన్న నిర్ణయాన్ని ప్రకటించింది. మార్కస్, ఎం‌గెల్సులు ఇద్దరూ ఈ అవకాశవాద నిర్ణయాన్ని విమర్శించారు. బేబెల్‌, ‌లీబ్‌క్నెఖ్ట్‌లు తమ గందరగోళాన్ని అధిగమించి, స్వతంత్రంగా , తమ సొంత చొవరమీదనే రహస్య శాఖలను ఏర్పాటు చెయ్యపూనుకొన్న పార్టీ జన సామాన్యానికి నాయకత్వం వహించేందుకు తమ సలహాల ద్వారా మార్కస్, ఎం‌గెల్సులు తోడ్పడ్డారు. క్రమంగా పరస్పరం సంబంధం కలిగిన శాఖలు ఏర్పాటు చెయ్యబడ్డాయి. బేబెల్‌ ‌పార్టీని పదిలంగా కాపాడి, పటిష్ఠం చేసేందుకూ, వేధింపు నిర్బంధాల పరిస్థితిలో పార్టీ కృషిని విస్తమీతం చేసేందుకూ తీవ్రంగా కృషి చేసాడు.
1880 చివర బేబెల్‌ ‌లండన్‌కి వెళ్ళి, అక్కడ మొట్టమొదటి సాదిగా మార్కస్, ఎం‌గెల్సులను కలుసుకున్నాడు. కార్యక్రమం, ఎత్తుగడల సమస్యల మీదనే కాకుండా, జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ఉద్యమపు ఆనాటి వ్యవహారాల విషయంలో సైతం మార్కస్, ఎం‌గెల్సుల సూచనలు సరైనవన్న విషయంలో సైతం మార్కస్, ఎం‌గెల్సుల సూచనలు సరైనవన్న విషయంలో బేబెల్‌కి పూర్తి నమ్మకం కలిగింది. శ్రామికవర్గపు మహా నాయకులకు కూడా బేబెల్‌ ‌తమకు విశ్వాసపాత్రుడైన శిష్యుడనీ, సహయోధుడనీ పూర్తి నమ్మకం చిక్కింది. మార్కస్, ఎం‌గెల్సుల తోడ్పాటుతో జూరిహ్‌మ నుంచి విప్లవకర పార్టీ పత్రిక ʹʹసోషల్‌ ‌డెమెక్రట్‌ʹʹ ‌ప్రచరుణకు ఏర్పాట్లు జరిగాయి. ఆ పత్రిక పార్టీ సమరశీల వాణి అయింది.
నిరంతరాయంగా పోలీసుల వేధింపుకి గురి అవుతూ బెబెల్‌ ఎన్నడూ క్షణకాలం కూడా విప్లవోత్సాహాన్నీ, సోషలిజం విజయంలో వన అంచంచల విశ్వాసాన్నీ కోల్పోలేదు. సోషలిస్టు వ్యతిరేక చట్టం అమల్లో ఉన్న కాలంలో బహిరంగ, రహస్య కార్యకలాపాలను సంఘటితం చెయ్యడం ద్వారా పార్టీకి ఆయన అపారమైన సేవ చసాడు. తనని తానొక తెలివైన రహస్య కార్యకర్తగా, అత్యుత్తమ ఆర్గనైజరుగా, సాహసిక యోధుడుగా ఆయన నిరూపించుకున్నాడు. ʹʹబేబెల్‌ ‌తనని తాను సిసటె•న పార్టీ నాయకుడుగా నిరూపించుకున్నాడుʹʹ2 అని రాసాడు లెనిన్‌. 1880‌లో స్విట్జర్లండులో జరిగిన పార్టీ మహాసభలో, బేబెల్‌ ‌ప్రతిపాదన మేరకు, పార్టీ తన లక్ష్యాలను చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా సాధించుకొన ప్రయత్నిస్తుంది అనే మాటలు, పార్టీ సాధ్యమైన ఏవ పద్ధతుల ద్వారానైనా తన లక్ష్యాలను సాధించుకొన ప్రయత్నిస్తుంది అనే విధంగా మార్చబడ్డాయి.
అంతర్జాతీయ సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ఉద్యమపు పార్లమెంటరీ ఎత్తుగడలను రూపొందించడంలోనూ, కార్మికుల జీవిత పరిస్థితుల్లో ఏ కొద్దిపాటి మెరుగుదలను సాధించేందుకు లభించే ఏ స్వల్ప అవకాశాన్నైనా సరే చేజారిపోనవ్వకుండా, అదే సమయంలో సూత్రాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడకుండా, అంతిమ ఆశయ సాధనకే ఎల్లప్పుడూ ఉపలక్షిస్తూ ఈ ఎత్తుగడలను ఉపయోగించడంలోనూ బేబెల్‌ ‌ప్రముఖ పాత్ర వహించాడు.
బేబెల్‌ ‌చేసిన మరొక మహత్తర సేవ యేమిటంటే, 1889లో రెండవ ఇంటర్నేషనల్‌ ‌స్తాపనలో జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ భాగస్వామ్యం.
1890లో రైహ్‌స్టాగ్‌కి జరిగిన ఎన్నికలు సోషలిస్టు వ్యతిరేక చట్టప్రయోగం సోషలిస్టు శ్రేణులను బలహీన పరచకపోవడమే కాకుండా, వాస్తవానికి వాటిని దృఢపరిచి, విస్తమీతపరచాయన్న విషయాన్ని స్పష్టంగా నిరపపించాయి. ఈ చట్టం కార్మికవర్గ ఉద్యమాన్ని స్తంభింపజెయ్య లేకపోవడాన్ని చూసిన రైహ్‌స్టాగ్‌, 1890 అక్టోబరులో దాన్ని పొడిగించేందుకు నిరాకరించింది. ఆ చట్టం రద్దు చెయ్యబడ్డాక పార్టీ సభ్యత్వం గమనీయంగా పెరిగింది. రైహ్‌స్టాగ్‌లో పార్టీ ప్రతినిధుల సంఖ్య కూడా పెరిగింది. 1890లో పార్టీ ప్రతినిధుల సంఖ్య 35 కాగా, 1898లో ఆ సంఖ్య 56కి పెరిగింది. సోషల్‌ ‌డెమోక్రటిక్‌ అభ్యర్థులకు ఆ ఎన్నికల్లో పడిన మొత్తం ఓట్లలో నాల్గో వంతు వచ్చాయి.
అసాధారణ చట్టం రద్దు చేయబడ్డాక మొదటి బహిరంగ మహాసభ హార్లెలో 1890 అక్టోబరులో జరిగింది. దానిలో పెంపొందుతున్న అంతర్జాతీయ సోషలిస్టు, కార్మికవర్గ ఉద్యమాల సంఘీభావం వ్యక్తమైంది.
అయితే, 1891లో జరిగిన ఏర్‌ఫుర్ట్ ‌మహాసభకి జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక• పార్టీ అభివృద్ధిలో ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే, ఆ మహాసభలో మార్క్సిస్టు విప్లవకారులు పార్టీ లోపలి అవకాశవాదులపైన విజయం సాధించారు. ఏర్‌పుర్ట్ ‌మాహాసభలో ఆమోదింపబడిన ఒక తీర్మానంలో, తన సభ్యులు పార్టీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని, తక్షణ డిమాండ్ల కోసం జరిపే పోరాటాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా దృఢంగానూ, నిర్ణయాత్మకంగానూ వ్యవహరించాలనీ, పార్టీ పూర్తి, అంతిమ లక్ష్యాన్ని సదా మనస్సులో ఉంచుకోవాలనీ పార్టీ డిమాండు చేసింది. ఆ మహాసభలో బేబెల్‌ అనుచరుల పార్లమెంటును కార్మికులు వర్గ పోరాట ప్రయోజనాల కోసం వినియోగించే విప్లవాత్మక ఎత్తుగడను అనుసరించాడు.
ఆ మహాసభలో బేబెలూ, మార్క్సిస్టు మెజారిటీ ప్రతినిధులూ శ్రామికుల వర్గ పార్టీని పెటీబూర్జువా ధోరణిలో ముంచెత్తేందుకు సంస్కరణవాదులు చేసిన ప్రయత్నాన్ని బహిర్గతం చేసి ఖండించారు. పార్టీ లోపల శ్రామకవర్గ క్రమశిక్షణ మీదా, ప్రజాస్వామిక కేంద్రీకరణ సూత్రం మీదా చెయ్యబడే దాడులను వాళ్ళు తిప్పికొట్టారు. ఏర్‌ఫుర్ట్ ‌మహాసభలో ఆమెదింపబడిన కార్యక్రమంలో గరిష్ఠ, కనిష్ఠ కార్యక్రమాలు ఇమిడి ఉన్నాయి. గరిష్ఠ కార్యక్రమంలో బూర్జువా సమాజం గురించి జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ మౌలిక అభిప్రాయాలు ఇవ్వబడ్డాయి. పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించేందుకు శ్రామికవర్గం రాజకీయ ఆధిపత్యాన్ని సాధించుకోవడం అంతిమ లక్ష్యంగా నిర్వచింపబడింది.
19వ శతాబ్ది చివర్లోనూ, 20వ శతాబ్ది మొదట్లోనూ కార్మికవర్గ ఉద్యమం వెల్లువలా సాగుతున్న పరిస్థితుల్లో, సామూహిక రాజకీయ సమ్మెల వినియోగం విషయంలోనూ, ట్రేడ్‌ ‌యూనియన్ల పాత్ర విషయమంలోనూ పార్టీలో చర్చలు ప్రారంభమయాయి. ఆ చర్చల క్రమంలో ఈ కింది మూడు ధోరణులు తలెత్తాయి: రివిజనిస్టు లేక దక్షిణపక్ష అవకాశవాద ధోరణి: తన అవకాశవాదాన్ని విప్లవాత్మక పదజాలం మాటున మరుగుపరచే సెంట్రిస్టు ధోరణి: వామపక్ష ధోరణి- ఈ ధోణి ప్రతినిధులు కార్మికవర్గ ప్రయోజనాలను వ్యక్తం చేస్తూ, సైనికవాదాన్నీ, సామ్రాజ్యవాద యుద్ధాలనూ చురుకుగా వ్యతిరేకించారు.
జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ రివిజనిస్టులకు వ్యతిరేకంగా జరుపుతున్న భయంకర పోరాటం శిఖర స్థితిని అందుకున్న తరుణంలో ఎంగెల్స్ ‌లండన్‌లో మరణించాడు. తన మహా మిత్రడూ, బోధకుడూ అయిన ఎంగెల్స్ ‌మరణం ఔగుస్ట్ ‌బేబెల్‌కి తీవ్రమైన అఘాతం అయింది. తన రచనల, మార్కస్ ‌రచనల వారసత్వానికి సంబంధించిన తన వీలునామా అమలుదార్లలో ఒకడిగా బేబెల్‌ని ఎంగెల్స్ ‌పేర్కొన్నాడు. ఎంగెల్స్ ‌మరణించిన కొద్ది కాలం తర్వాత జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమెక్రటిక్‌ ఎడ్వర్డ్ ‌బెర్న్‌స్టైన్‌ ‌పార్టీ సంప్రదాయాలకు ద్రోహం చేసి, మార్క్సిజాన్ని నేరుగా సంస్కరించేందుకూ, కార్మికవర్గ పార్టీని సాంఘిక సంస్కరణలతో తృప్తి చెందే ఒక పెటీ బూర్జువా పార్టీగా మార్చేందుకూ ప్రయత్నించాడు. బేబెల్‌ ఆ ‌దాడిని గట్టిగా తిప్పికొట్టి, ఇతర మార్క్సిస్టులతో కలిసి విప్లవాత్మక సోషలిజం మూల సూత్రాలను సమర్థించాడు. 1899 అక్టోబరులో హన్నోవర్‌లో జరిగిన మహాసభలో పార్టీ సూత్రాలూ, ఎత్తుగడలూ చర్చింపబడ్డాయి. ఆ మహాసభలో రివిజనిస్టుల మీద నిర్ణయాత్మకమైన దెబ్బతీయబడింది. విషయాంశంలో ప్రగాఢం, రూపంలో ఉజ్వలం కూడా అయిన బేబెల్‌ ‌నివేదిక ఆరు గంటల సేపు పాగింది. జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ తన వెనకటి అసలు కార్మక్రమానికీ, వెనకటి అసలు ఎత్తుగడలకే కట్టుబడి ఉందని ప్రకటించే బేబెల్‌ ‌తీర్మానం కచ్చితమైన మెజారిటీతో (216:31) ఆమెదింపబడింది.
బేబెల్‌, ఆయన సమర్థకుల మార్క్సిస్టు వైఖరికి పారిశ్రామిక కార్మికవర్గపు, శ్రామిక జనాభాలోని ఇతర శ్రేణుల తోడ్పాటు లభించింది. 1903 జూన్‌ 16‌న జరిగిన రైహ్‌స్టాగ్‌ ఎన్నికల్లో జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ అపూర్వమైన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థులు 30 లక్షలకు పైగా ఓట్లు పొంది, 81 సీట్లు సంపాదించుకున్నారు.
రివిజనిస్టులు గణనీయమైన ఈ విజయాన్ని శ్రామికుల వర్గ పోరాట ఫలితంగా కాక, ʹʹపెట్టుబడిదారీ వ్యవస్థ సోషలిజంలోకి పరిణామం చెందడంʹʹగా పరిగణించి, పార్టీ ఎత్తుగడల్లో మౌలికమైన మార్పు తేవాలని డిమాండు చేసారు. 1903 సెప్టెంబరులో జరిగిన పార్టీ మహాసభలో ʹʹపార్టీ ఎత్తుగడలుʹʹ సమస్య మీద చర్చ జరిగింది. ఆ మహాసభ ప్రారంభోపన్యాసం ఇచ్చే గౌరవం బేబెల్‌కి దక్కింది. ఆయన ప్రతినిధులకు నిర్భీతిగా అతి తీవ్రమైన ఆపరేషను చెయ్యమని, అంటే చాలా కాలంగా పక్వమై మొనదేలిన రివిజనిజం అనే గడ్డలను కోసి తీసి పారెయ్యమని విజ్ఞప్తి చేసాడు. పాలక వర్గాలు ఇచ్చే చిల్లర రాయితీలతో తృప్తి పడుతున్నందుకూ, జనబాహుళ్యపు నిర్ణయాత్మక కార్యాచరణల పట్ల భయపడుతున్నందుకూ, జనబాహుళ్యపు నిర్ణయత్మక కార్యాచరణల పట్ల భయపడుతున్నందుకూ, రాజ్యపు వర్గ స్వభావాన్నీ, జనం పట్ల దాని శత్రుత్వాన్నీ మరుగుపరుస్తున్నందుకూ రివిజనిస్టులను బేబెల్‌ ‌విమర్శించాడు. ఆయన మార్క్సిస్టు అభిప్రాయాలను సమర్థించి, కార్మిక పార్టీ సిసలైన సోషలిస్టు స్వభావాన్ని నిలబెట్టేందు కోసం కృషి చేసాడు. బేబెల్‌ ఆమరణాంతం రివిజనిజానికి శత్రువుగా కొనసాగాడు.
1904లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్‌ ‌మహాసభలో ఇచ్చిన సవివరమైన ఉపన్యాసంలో, బూర్జువా ప్రభుత్వాల్లో సోషలిస్టుల భాగస్వామ్యానికి అనుకూలంగా ఉన్న రివిజనిస్టుల వాదనల్లోని బండారన్నిన బేబెల్‌ ‌బయటపెట్టాడు. వాళ్ళని ఆయన ద్రోహులుగా పరిగణించాడు. కానైతే, అంతర్జాతీయ సోషలిస్టు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన రెండవ ఇంటర్నేషనల్‌ ‌నాయకుడుగా, అవకాశవాదులతో తెగతెంపులు చేసుకొమ్మని బేబెల్‌ ‌పిలుపివ్వలేదు. సామ్రాజ్యవాదం కింద వర్గ పోరాట వ్యగ్రత కార్మికవర్గానికి నూతన పరిస్థితులను కల్పించిందన్న విషయాన్ని ఆయన గ్రహించడానికి ఇది అవరోధమైంది.
యేనాలో జరిగిన పార్టీ మహాసభలో ఆసన్న నిర్ణయాత్మక విప్లవకర పోరాటాలకు జనసామాన్యాన్ని సన్నద్ధం చెయ్యవలసిన ఆవశ్యకత గురించి బేబెల్‌ ‌మాట్లాడాడు. ఆయన ప్రతిపాదించగా మహాసభ ఆమోదించిన ఒక తీర్మానంలో సామూహిక రాజకీయ సమ్మెల విస్తమీత వినియోగం ఈ పోరాటంలో అతి శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటని పేర్కొనబడింది. కానైతే మాన్‌హైమ్‌ ‌మహాసభలో పార్టీలో శాంతి కోసం బేబెల్‌ అవకాశవాదులకూ, ట్రేడ్‌ ‌యూనియన్‌ ‌నాయకులకూ గణనీయమైన రాయితీలు ఇచ్చాడు. ఈ మహాసభలో ఆయన తీర్మానం ఆమోదించబడింది. అయితే సామూహిక సమ్మెలను గురించి గత మహాసభ చేసిన తీర్మానాన్ని రద్దుపరిచే ట్రేడ్‌ ‌యూనియన్‌ ‌నాయకుల సవరణలతో మాత్రమే అది ఆమోదించబడింది.
1905 నాటి రష్యన్‌ ‌విప్లవం బేబెల్‌ని విశేషంగా ప్రభావితుణ్ణి చేసింది. జర్మనీలోనూ, తదితర దేశాల్లోనూ జన సామాన్యాన్ని విప్లవీకరించడంలో దాని పాత్రను బేబెల్‌ అర్థం చేసుకున్నాడు.
రష్యన్‌ ‌విప్లవకారుల రహస్య కార్యకలాపాలు కూడా ఆయన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ విప్లవం జరిగిన రెండేళ్ళ తర్వాతాయన రష్యన్‌ ‌సోసల్‌ ‌డెమోక్రట్లు ఆ విప్లవంలో ప్రదర్శించిన మహత్తర కృతనిశ్చయాన్నీ, ఆత్మత్యాగానికి సంసిద్ధతనీ, స్వార్థ రాహిత్యాన్నీ చూసి తనకి అబ్బురపాటు కలిగిందని పేర్కొన్నాడు. జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రట్ల నాయకుడుగా బేబెల్‌ ‌రష్యన్‌ ‌విప్లవకారుల పట్ల సంఘీభావం ప్రదర్శించి, వారికి తోడ్పడవలసిందిగా అంతర్జాతీయ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసాడు.
1911 నవంబరు 9న రైహ్‌స్టాగ్‌లో ప్రసంగిస్తూ, జర్మన్‌ ‌సామ్రాజ్యవాదుల దుస్సాహసిక, దురాక్రమణపర విధానాన్నీ, జనానికి దాని విపత్కర పర్యవసానాలనూ బేబెల్‌ ‌నిర్దాక్షిణ్యంగా బహిర్గతం చేసి ఖండించాడు. బాల్కన్‌ ‌యుద్ధం సందర్భంగా బాసెల్‌లో 1912లో జరిగిన అసాధారణ అంతర్జాతీయ సోషలిస్టు మహాసభే బేబెల్‌ ‌హాజరైన చిట్టచివరి అంతర్జాతీయ మహాసభ. అప్పటికి ఆయన అస్వస్థుడుగా ఉన్నాడు. చివరి సమావేశంలో మాత్రమే ప్రసంగించాడు. మహాసభ శ్రోతలు దిక్కులు పిక్కటిల్లే సుదీర్ఘ కరతాళధ్వనులతో ఆయనకు స్వాగతం చెప్పారు. ప్రపంచ యుద్ధ ప్రమాదం గురించి చేసిన ఆయన ప్రసంగం చిన్నదే అయినా భావపూర్ణమైనది.
ఔగుస్ట్ ‌బేబెల్‌ ‌తన 70వ జన్మ దినోత్సవాన్ని 1910, ఫిబ్రవరి 22న జరుపుకున్నాడు. ఆ రోజున జర్మన్‌ ‌శ్రామికులూ, ప్రపంచమంతటి నుంచీ కార్మిక సోషలిస్టులూ తన యావజ్జీవితాన్నీ కార్మిక వర్గపు సాంఘిక విముక్తి కోసం పోరాడిన ఈ మహనీయ వ్యక్తికి తమ గౌరవాభివందనాలు తెలియజేసారు. అభినందనలూ, శుభాకాంక్షలూ ప్రపంచపు నాలుగు చెరగుల నుంచీ వచ్చాయి. వాటికి జవాబిస్తూ చేత్తో ఎర్ర జెండాను ఎత్తి పట్టుకొని, దాడి జరుపుతున్న జనసామాన్యపు మమ్మొనలో తను నడిచే రోజు చూసేదాకా జీవించి ఉండాలని తను కోరుతున్నట్లు బేబెల్‌ ‌రాసాడు. కాని 1913 ఆగస్టు 13న తన 74వ ఏట, యేనాలో జరగబోయే మహాసభ కోసం సన్నద్ధుడవుతూ, బేబెల్‌ ‌గుండెపోటులో ఆకస్మికంగా మరణించాడు. ఆయన వీలునామాలో పేర్కొన్న ప్రకారం, జూరిహ్‌లో ఖననం చెయ్యబడ్డాడు. జర్మనీలోనూ, ఇతర దేశాల్లోనూ అనేక పట్టణాల్లో సంస్మరణ సభలు జరిగాయి. అనేక యూరపియన్‌ ‌దేశాల సోషలిస్టు పార్టీలు జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతాప సందేశాలు పంపాయి.
లెనిన్‌ అప్పట్లో ఇలా రాసాడు :
ʹʹబేబెల్‌ ‌మరణంతో కార్మికవర్గంలో అత్యధిక పలుకుబడి కలిగిన, జనసామాన్యంలో అత్యంత ప్రజానురంజకుడైన జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌నాయకుణ్ణి మాత్రమే కాదు మనం కోల్పోయినది, తన అభివృద్ధి క్రమంలో తన రాజకీయ కార్యకలాపాల క్రమంలో అంతర్జాతీయ, జర్మన్‌ ‌సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ఉద్యమ జీవితంలోని ఒక మొత్తం చారిత్రక దశకు బేబెల్‌ ‌మూర్తీ భావంʹ

No. of visitors : 985
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •