ఆలోచించడం నేరం..

| సాహిత్యం | క‌విత్వం

ఆలోచించడం నేరం..

- సు.దే.చె | 02.01.2017 11:22:05pm

ఈ దేశంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త
రుచించని నిజాలు మాట్లాడితే
తిరుగుబాటుదారుల జాబితాలోకి
నీ పేరు తక్షణమే చేరిపోతుంది.

ఈ దేశంలో మౌనంగా ఉండకూడదు
కారుకూతలకు నీ మౌనం అర్ధాంగీకారం
అంటూ మౌత్ పబ్లిసిటీ కధనాలు
వాయువేగమును అందుకుంటాయి.

ఈ దేశంలో నడిచేటప్పుడు జాగ్రత్త
నీవు నడిచిన త్రోవను తరుముకుంటూ వస్తారు
నీ మేధస్సును తూనిక వేస్తారు
అది రాజ్యం కంటే బలమైనది అయితే
నువ్వు నడవడానికి అనర్హుడివి.

ఈ దేశంలో ఆలోచించడం నేరం
నీ ఆలోచనలు ఓట్ బ్యాంక్ పొలిటిక్స్ కి
చరమాంకాన్ని రచిస్తే
నిన్ను మానసిక రోగుల వైద్యశాలలోకి విసిరేస్తారు
అది నీకు చెరసాలే కదా.

ఈ దేశంలో నవ్వేప్పుడు గుర్తుంచుకో
చిలికి చిలికి గాలి వాన పెనుతుఫానుగా
రూపాంతరం చెంది
నీ కులాని వర్గాని తెరమీదకు తెస్తాయి.

ఈ దేశంలో ఎడిచే సాహసం చెయ్యకు
నీ కన్నీళ్ళు చైతన్యానికి సంఘీభావం అంటారు
ఆ తరువాత క్రిమినల్ ప్రొసీడింగ్స్ నడుస్తంటాయి.

ఈ దేశం నువ్వు అనుకున్నంత స్వేచ్ఛను
ఇంకా సాధించలేదు
ఇక్కడ ఆపరేషన్ నామధేయంతో
అణ‌చివేత‌ సర్వసాధారణమే.

No. of visitors : 860
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆది-అంతం

సు.దే.చె | 18.01.2017 11:01:43pm

తుమ్మెద పుప్పొడి సేకరణకు సెలవు ప్రకటించింది. అడివంటే పచ్చని సోయగమే కాదు అందులోనే నిరంతరాయంగా దోపిడీ వ్యవస్థకు ఫ్రిక్షన్ పుట్టుకొస్తుంది...
...ఇంకా చదవండి

ఎలియాస్

సురేంద్ర | 04.02.2017 02:44:42am

ఒకానొక రోజు రేడియోలో ʹఉపగ్రహాలు నల్లమల అడవిలో ఖనిజాల సంపత్తిని తెలియపరిచాయి. వాటిని వెలికితీయడం కొరకు ప్రభుత్వం అధ్యాయన కమిటీని నియమించడం జరిగింది ʹ అంటూ .....
...ఇంకా చదవండి

నాలో నేనే తొంగిచూస్తే

సు.దే.చె | 05.04.2017 11:58:04pm

అప్పుడప్పుడు నాలో నేనే తొంగిచూస్తే గుండె లోగిలిలో మనస్సు పూతోట యోగక్షేమమును అడిగి తెలుసుకుంటుంటాను...
...ఇంకా చదవండి

రక్తం గోడపై...

సు.దే.చె | 18.03.2017 12:32:21pm

ఊసల వెనుక,గాఢమైన చీకటి గదిలో థర్డ్ డిగ్రీ లయబద్ధమైన చిత్రహింసలకు రక్తం గోడపై అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ గుర్తులు. సమసమాజ నిర్మాణం కొరకు సమస్తమూ వీడి అడవి బాట ప...
...ఇంకా చదవండి

సూధ్రుడెవడు?

సు.దే.చె | 04.05.2017 11:05:13am

వాడు వాడే సూధ్రుడిని అతిసూధ్రునిగా విభజించిన వాడే కదా.....
...ఇంకా చదవండి

ఎ(క)లక్షన్...

సురేంద్ర దేవ్ చెల్లి | 19.05.2018 08:29:31am

ఇకపై నోటుకు ఎన్ని ఓట్లు పడ్డాయో రేష్యో చెప్పాలి క్రికెట్ బెట్టింగ్ జోరున్న దేశంలో ఇంతకన్నా ఎట్లా చెప్పను?......
...ఇంకా చదవండి

చెరగనివి నీడలు మాత్రమే...

సు.దే.చె | 05.12.2017 11:49:32pm

నీడలు నల్ల రంగునే పూసుకుని మన మధ్య తిరుగాడడం ఎప్పటి మాటో! నీడలు వెలుగున్నప్పుడే పుడతాయని ʹఅంధకారంలో షాడో డైస్ʹ అని చెప్పినవాడు ఎటుపోయాడో? బహుశా కాకమీదున.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
  సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన
  Self mortality
  దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన
  నుల్క‌తోంగ్ నిజాలు
  అప్పుడు
  ఎలా కలవాలి ?
  నిన్న- నేడు - రేపు
  జాషువా సాహిత్యంలో , కులం - మతం సామాజిక దృష్టి
  ముందు బాక్సైట్‌ సంగతి చూడండి
  మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
  దేశద్రోహ నేరం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •