దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ

| సంభాషణ

దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ

- -మాయా పలిత్ | 02.01.2017 11:54:34pm

నంగేలి అని కేరళ చేర్తల ప్రాంతానికి చెందిన ఎజావా మహిళ కథ మీకు గుర్తుందా? వెంటాడే ఆమె చిత్రం –రొమ్ములపై వేసిన పన్నును ధిక్కరిస్తూ స్తనాలను కోసి అరిటాకులో అధికారికి ఇస్తూ రక్తమోడుతూ చనిపోతుంది. అదొక స్థల పురాణం. అయితే ప్రాచీన చరిత్రకు సంబంధించిన అధికారిక రికార్డుల్లో అది కనిపించదు. ఆ కథ వెలికితీయబడి ఇటీవల కొన్నేళ్లుగా సాంస్కృతిక గుర్తింపు పొందింది. కానీ అంతలోనే అది మళ్ళీ విస్మృతిలోకి జారిపోయే ప్రమాదంలో పడింది. గగుర్పొడిచే ఆమె కథను బొమ్మలు వేసి చూపించిన కేరళ చిత్రకారుడు మురళి, భారతదేశ చరిత్రలో ఇంతటి వికృత కులసంబంధాల భయానక వాస్తవాలను అంత సులభంగా ఎలా మార్చిపోతారు అని అడుగుతాడు.

ʹతారీఖులు సరిగ్గా లేనందున నంగేలి బలిదానాన్ని గురించి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో బోధించలేము. దానికి మరిన్ని ఆధారాలు కావాలి. కానీ నా ʹఅమనʹ పుస్తకం చిత్రకళనుపయోగించుకొని ఆమె కథకు ప్రాణమిస్తుందిʹ అంటాడాయన.

అగ్రకుల దుర్మార్గాలను బలవంతంగా విస్మృతిలోకి లాగి పడేసే మరో చర్యకు ఇప్పుడు మనం సాక్షులుగా నిలుస్తున్నాం. ʹCaste, Conflict and Dress Changeʹ అనే అధ్యాయాన్ని 9వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుండి తొలగిస్తున్నట్లు సి.బి.ఎస్.ఇ (ఉన్నత పాఠశాల కేంద్రీయ విద్యా సంస్థ) డిసెంబర్ 19నాడు తన నిర్ణయాన్ని ప్రకటించింది. అభ్యంతరకరమైన భాగాలను తొలగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించిన ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పింది. ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తకం నుండి తొలగించబడిన ఈ అధ్యాయాన్ని సి.బి.ఎస్.ఇతో పాటు 15 రాష్ట్రాల స్టేట్ సిలబస్ లలో చదువుతున్నారు. తొలగించిన అధ్యాయం ఒక ప్రాచీన కుల కట్టుబాటు గురించి చెబుతుంది. ట్రావెన్ కోర్ సంస్థానంలో 1800ల తొలి సంవత్సరాల్లో నాడార్ స్త్రీ, పురుషులందరూ తమ శరీర పైభాగాన్ని వివస్త్రంగా ఉంచాలని నాయర్ కులానికి చెందిన పిడగైకార్ల జాతీయ కౌన్సిల్ కట్టడి చేసిన విషయాన్ని గురించి ఆ ఆధ్యాయం చర్చిస్తుంది. ఇది అగ్రకులాల పట్ల గౌరవాన్ని సూచించే చిహ్నంగా పరిగణించేవారు. ఒకవేళ నాడార్లు వాళ్ళ శరీరాలను కప్పుకోవాలని అనుకుంటే ములక్కారం అనబడే రొమ్ముల పన్ను కట్టాల్సి ఉంటుంది. 1822లో ఈ దురాచారానికి వ్యతిరేకంగా ʹమారు మరక్కల్ సమరంʹ, ʹచన్నార్ పోరాటంʹ వంటి తిరుగుబాట్లు చెలరేగాయి. నాడార్, ఎజావా సామాజిక వర్గాలకు చెందిన మహిళలు అగ్రకుల మహిళలతో సమానంగా దుస్తులు వేసుకునే హక్కును డిమాండ్ చేశారు. నాయర్ స్త్రీలవలె పై వస్త్రం వంటిది కాకుండా క్రైస్తవంలోకి మారిన మహిళలు కుప్పాయం (బ్లౌజ్ వంటిది) తొడుక్కోడానికి అనుమతించారు. ఈ విధమైన రాజీకి నాడార్ స్త్రీలు అంగీకరించపోవడం వల్ల 1958 దాకా పోరు కొనసాగింది.

ఈ పాఠ్యాంశం గురించిన వివాదం కొత్త కాదు. నాలుగేళ్ల క్రితం ఈ మహిళల గురించిన ప్రస్తావన పెద్ద ఆందోళనలకు దారితీసింది. అప్పటికే దాన్ని చేయవలసినంత గందరగోళం చేసేశారని వార్తలొచ్చాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు కొందరు రాజకీయ నాయకులు ఆ పాఠం పట్ల అభ్యంతరం చెప్పారు. అది నాడార్లు వలసవచ్చిన సమూహాలుగా చిత్రిస్తుందని, అది విద్యార్థులకు తప్పుడు అభిప్రాయం కలిగించి పక్కదారి పట్టిస్తుందని వాదించారు. (నాడార్లు కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఎప్పుడో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని చాలా మంది వాదిస్తారు.) నాడార్ కులానికి చెందిన అడ్వకేట్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ మద్రాస్ హైకోర్టులో దీనిపై ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ పాఠం అవాస్తవాలతో నిందాపూరితంగా ఉందని చెప్పింది.

ది లేడీస్ ఫింగర్ పత్రిక ఇంటర్వూలో మద్రాస్ ఐ.ఐ.టి హ్యూమానిటీస్ శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్.సంతోష్ సి.బి.ఎస్.ఇ తిరోగమన చర్యను ముఖ్యమైన చారిత్రక ఘట్టాలను పాఠ్యాంశాల నుండి తొలగించే ప్రమాదకర ధోరణిలో భాగమని చెప్పాడు. ʹపాఠ్యాంశాలను రూపొందించే ప్రక్రియలో కుల, మతపరమైన గ్రూపుల (ఇక్కడి వివాదంలో అన్నా డి.యం.కె, డి.యం.కె పార్టీలు) ఒత్తిళ్లకు ప్రభుత్వ విభాగాలు లొంగిపోయే ఘటనలు ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇది వాటికి మరో చేర్పు. ఇటువంటి సంస్థలన్నీ శుద్ధి చేయబడిన చరిత్రను తరగతి గదుల్లో బోధించాలని కోరుకుంటాయి. ఆయా సామాజిక వర్గాల వైభవోపేత చరిత్రను, ఆట్లాగే భారతదేశపు ఉజ్వలమైన గతాన్ని నిర్మించుకోవాలనే ధోరణిలో భాగమిది. ఈ క్రమంలో చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను తుడిచేయడం జరుగుతుంది. భారతదేశంలో కులం, స్త్రీ పురుష సంబంధాల చారిత్రక పరిణామాలను అర్థం చేసుకునే లోతైన చారిత్రక పరిశీలనా పద్ధతిని కోల్పోతాం. తరగతి గదుల్లో చరిత్రను నిష్పాక్షికంగా నేర్చుకునే అవకాశాన్ని నిరాకరించడం ఒక ప్రభుత్వం విద్యార్థులకు చేయగల అత్యంత తీవ్రమైన అన్యాయం. ప్రభుత్వం చేయవసింది విద్యార్థులు విమర్శనాత్మకంగా ఆలోచించగలిగేలా ప్రోత్సహించి, సమకాలీన వాస్తవాలను లోతైన చారిత్రక దృష్టితో అర్థంచేసుకునే విధంగా వారిని అభివృద్ధి చేయడం.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే సి.బి.ఎస్.ఇ కాస్త శ్రద్ధ పెట్టి ఆ పాఠాన్ని పునఃపరిశీలించి సరిచేయాలా లేక మొత్తంగా తొలగించాలా అని. చరిత్రకారులు, మేధావులు ఈ పాఠాన్ని తొలగించడం వెనక ఉన్న ఉద్దేశాల గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తిరువనతపురం సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ స్టడీస్ కు చెందిన చరిత్ర పరిశోధకురాలు జె. దేవిక ʹనాడార్ మహిళల తిరుగుబాటు విద్యార్థులకు ఎందుకు ముఖ్యమైనదంటే ఇక్కడ స్త్రీల మానం అనే విషయం కన్నా కులం, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఉంది కాబట్టిʹ అంటుంది. ʹపాఠ్యాంశాల నుండి దీన్ని తొలగించడం విద్యను చెడగొట్టి, కులవ్యతిరేక పోరాటాన్ని చరిత్ర నుండి తుడిచేసే ఉద్ధేశంతో చేసిన వెర్రిమొర్రి చర్యʹ అని ఆమె అంటారు. హిందూ నాడార్లరోని ఒక వర్గానికి తమ గత చరిత్రను గురించి చర్చిండం ఇష్టం లేదు. తమ సామాజిక వర్గం పైకి ఎగబాకడానికి వాళ్ళకు వాళ్ళు ఒక ప్రాచీన చరిత్రను సృష్టించుకోవాలనుకుంటారు. రొమ్ములపై బట్ట కప్పుకోవడం కోసం చేసిన పోరాటంలో అటు బ్రిటీష్ వాళ్ళను ఇటు స్థానిక అగ్రకుల పెత్తందార్లను ఎదిరించింది మహిళలు. ఈ చరిత్రను తొలగించడం మరీ ఘోరం. ఒక సమూహపు ఆత్మగౌరవానికి సంబంధించిన దాన్ని చెరిపేసి బ్రాహ్మణీయ, వలసవాద నీతికి దాసోహమవడం విషాదం.

మొత్తంగా తీసేయడం కన్నా కాస్త సున్నితంగా విశ్లేషణ చేస్తూ ఈ విషయంపై నాడార్ సామాజిక వర్గానికి భిన్నాభిప్రాయముందని విద్యార్థులకు బోధించవచ్చు. ఇటువంటి ఒక చరిత్రను తెలుసుకునే అవకాశాన్ని రద్దు చేయడం వల్ల తక్కువ ప్రాతినిధ్యం పొందే సామాజికవర్గం మరింత అదృశ్యమయ్యే ప్రమాదం ఉంటుంది. చెన్నై డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్, ఇండియా రెసిస్ట్స్ అనే ఆన్ లైన్ వార్తా పత్రిక సంపాదకవర్గానికి చెందిన అమృతరాజ్ స్టీఫెన్ ʹమన గర్వాతిశయం కోసం మన చరిత్రను మనమే మూసి పెట్టేస్తున్నాంʹ అంటాడు. ʹపైచదువులకు పోయే కొద్దీ ఉత్తర భారతదేశం గురించి, పానిపట్ వంటి చారిత్రక ప్రదేశాల చరిత్ర గురించి చాలా ఎక్కువ చెప్తారు. మన గురించి మనం అర్థం చేసుకోడానికి అది ఏమాత్రం ఊపయోగపడదు. కన్యాకుమారి జిల్లాలో క్రైస్తవులు ఎక్కువగా ఉండటానికి కారణం నాడార్ పోరాటాలు, దాని వెంట వచ్చిన సామాజిక అశాంతి. లెక్కలేనంత మంది స్త్రీలు లైంగిక వేధింపులకు గురయ్యారు. అప్పటి మిషనరీలు జోక్యం చేసుకోవడం వల్ల ఎంతో మండి నాడార్లు క్రైస్తవ మతంలోకి మారారు. 1859లో రాజు చాటింపు వేశాడు. సవర్ణ స్త్రీల లాగ నాడార్ స్త్రీలు దుస్తులు వేసుకోకూడదు అని. మన చరిత్రను మనకు ఎప్పుడూ చెప్పరెందుకని?ʹ

నేను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తులు పదే పదే ʹగర్వాతిశయంʹ (ఫాల్స్ ప్రైడ్) అని చెప్పారు కానీ అసలు సమస్య సి.బి.ఎస్.ఇ దాని పాఠ్యాంశాన్నిఅది సరిచేయాల్సిన బాధ్యత పట్ల నిర్లక్ష్యం చూపడం. పరిశోధన చేసి తప్పులను సవరించే పని చేయొచ్చు. ఉదాహరణకు నాడార్లు వలసవచ్చిన వారు అనే విషయం గురించి పునఃపరిశీలించవచ్చు. భారతదేశంలో కులపోరాటాలకు సంబంధించిన కీలక చరిత్ర అధ్యాయాన్ని ఏకంగా ఎత్తేసి చేతులు దులుపుకోకూడదు.

అనువాదం: మిసిమి
(ది లేడీస్ ఫింగర్ సౌజన్యంతో)


No. of visitors : 1773
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తెలుగువారి ముంగిట్లోకి ప్రపంచం

మిసిమి | 17.06.2016 11:09:21am

విశ్వ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన మనిషి గురించి, ఆ మనిషి సృష్టించుకున్న ప్రపంచం గురించి ఆలోచించినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, కవిగా శ్రీశ్రీ పొందిన ఉద్వేగా...
...ఇంకా చదవండి

దేవతా - దెయ్యమూ

మిసిమి | 03.09.2016 12:53:20am

ఆ అమ్మాయి పదిహేనేళ్ల వయసులో చాలా అందంగా ఉండేదట. ఆ ఊరి భూస్వామి ఆమె మీద మోజుపడి, కుట్రపన్ని ఆమె తండ్రిని హత్య చేసి ఆమెను చేరదీసి చేసి ఇంట్లో బంధించి........
...ఇంకా చదవండి

చదివిన వారిని ʹపాల్గుణʹ ఆవహిస్తాడు!

మిసిమి | 16.07.2016 12:56:55pm

పాల్గుణ మట్టివేళ్ళ నుండి రూపొందిన విప్లవకారుడు. సింగరేణి గని కార్మికుడిగా అత్యంత సహజంగా కార్మికోద్యమానికి దగ్గరై, కార్మికవర్గ రాజకీయాలను సొంతం చేసుకున్న......
...ఇంకా చదవండి

మాయమైన నజీబ్ మాట్లాడే సంగతులు

మిసిమి | 05.04.2017 09:43:48pm

దేశంలో అసహనం (ఉన్మాదం అనవలసినదాన్ని) గురించి రచయితలు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు మూకుమ్మడి నిరసన తెలిపినప్పుడు మన ప్రభుత్వం వెటకారం చేసిన విషయం ఎంత.......
...ఇంకా చదవండి

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన

| 01.10.2018 10:37:48pm

సమాజంలో బలహీనవర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులపై రాజ్యం తీవ్రవాద వ్యతిరేక చట్టాలను సరైన ఆధారం లేకుండా ప్రయేగించేటప్పుడు అది కూడా ఒక రకమైన టెర్రర్... ...
...ఇంకా చదవండి

చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ

రాహుల్ మాగంటి | 22.09.2018 11:48:04pm

ఆంధ్రప్రదేశ్ లోని ఆ తీర ప్రాంత గ్రామంలో పారిశ్రామిక కాలుష్యం చేపల్ని చంపేసాక మత్యకారులు ఏమయ్యారు? సముద్రమంత గతానికి అనిశ్చిత భవిష్యత్తుకు మధ్య పెనుగులాడు.....
...ఇంకా చదవండి

మానవహక్కులను వెటకారం చేసే ద్వేషభక్తులు అర్థం చేసుకోలేనిది.

మిసిమి | 17.03.2019 09:38:24am

జెనీవా ఒప్పందం గురించి ఎంత ప్రచారం జరిగింది! పట్టుబడిన యుద్ధ ఖైదీని, అది సివిల్ వార్ అయినా సరే మానసిక శారీరక హింసకు గురిచేయకుండా ఎట్లా చూసుకోవాలో సోషల్ మీ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •