తెలుగు సాహితిలోకానికి ఆత్మకథ అంతగా పరిచయం లేని ప్రక్రియ. ఇటీవల బాగా తగ్గిపోయాయి కూడా. శ్రీశ్రీ అనంతం తెలుగు నాట బాగా ఇష్టపడి చదివిన ఆత్మకథ. జీవితచరిత్రలు ఇష్టపడే వారికీ, అన్ని సాహిత్య ప్రక్రియలను చదివే అలవాటున్న వాళ్ళందరికీ ఆనంద పరిచే ఆత్మకథ తలపుల తోవ. ఇది ఉర్దూలో షౌకత్ ఆజ్మీ రాసిందానికి తెలుగు రూపం. ఎన్. వేణుగోపాల్ అనువాదం.
పాత్రికేయుడూ, వ్యాఖ్యాత, కవి అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్. వేణుగోపాల్ అనువందించిన పుస్తకం కాబట్టి దానికదే ప్రత్యేకమైన అంశం. పాఠకుడి మనసుకీ, మెదడుకీ చైతన్య పరిచే సాహిత్యం అందజేయడంలో అయనది అందెవేసిన చేయి. ఆయన సొంత రచనలతో పాటు అనేక జాతియ అంతర్జాతీయ రచనలను తెలుగు పాఠకులకు అందజేస్తూనే ఉన్నారు. నేటి ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులకి అనువైనది కాని రచనతో వేణుగోపాల్ ముందుకు రాడు కాబట్టి షౌకత్ ఆజ్మీ గురించి తెలియని వాళ్ళకైనా ఈ రచన గురించిన బాగోగుల భయం అక్కరలేదు.
యాభై ఏళ్ళ జీవితం చరిత్ర దృష్టితో చూచినపుడు పెద్ద సమయం కాదు. కానీ మార్పనేది ఆగే ప్రక్రియ కాదు కాబట్టి దానికి తగ్గ ప్రభావం జీవితం మీద పడి, జీవితం చరిత్ర మీద వేయదగ్గ ప్రభావం ఖచ్చితంగా వేస్తుంది. ఈ కోణం నుంచి షౌకత్ ఆజ్మీ జీవితం సామాజిక పరిణామ క్రమంలో భాగమై ఆ కాల ప్రవాహంలో ఆమె పడ్డ ఘర్షణ దానికదే ఓ అభివృధ్ధి రూపంగా అనిపిస్తుంది.
కైఫీ ఆజ్మీ సాధరణమైన పేరు కాదు ఉర్దూ కవిత్వమూ సినీ సాహిత్యమూ వామపక్ష రాజకీయాల గురించి ఏ మాత్రం పరిచయమున్న వారికైనా సుపరిచితమైన పేరే. ఉర్దూ కవిగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా కైఫి ముద్ర చిన్నది కాదు. అంత లబ్ధ ప్రతిష్టుడి భార్యగా షౌకత్ పంచుకున్న ప్రధాన ఘట్టాల కూర్పే ఈ పుస్తకం.
నిజానికి కైఫీ షౌకత్ లు రెండు విభిన్న ప్రపంచాల నుంచి వచ్చిన వారు. అయినా అంత సుదీర్ఘ కాలం వారిని కలిపి ఉంచిన అంశం ఏమిటీ. ఒకరి పట్ల ఇంకొకరికి అంత ఘాఢమైన డివోషన్ ఎలా ఏర్పడింది. దాని కోసం వారివురు ఎటువంటి త్యాగాలు చేశారో చెప్పే రచన ఇది. పట్టుకున్న పది పుటలలోపే మనం ఓ మహిళా మూర్తి కల్లోల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నామని అర్థమై పోతుంది. ఓ ఉద్యమ కార్యకర్తతో జీవన ప్రయాణం ఏమాత్రం సులువైనది కాదు దారి నిండా ముళ్ళకంపల్ని ఏరుకోవాల్సిన స్థితి ఒకటి వస్తుందని తెలిసీ సగటు ముస్లీం వెల్ ఆఫ్ సంప్రదాయ కుటుంబం నుంచి దానికి పూర్తి విభిన్నమైన సామాజిక నేపధ్యం నుంచి వొచ్చిన కైఫీతో జీవితం పంచుకోవాలనుకోవడం పెద్దసాహసం. ఆ సాహసాన్ని షౌకత్ ఎన్ని అననుకూల, నిర్ధాక్షిణ్య పరిస్థితుల మధ్య చేసిందో చదివినపుడు ఆమె మీద గౌరవం అమాంతంగా పెరిగి పోతుంది. ఆమె సగటు మహిళ నుంచి ఓ కాలంతో అసాధారణ పోరాటం చేసిన ధీరోదాత్తగా మలుచుకున్న ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు లెక్కలేనన్ని. ఈ పుస్తకం తన సొంత భాషలో తనే రాసుకున్నందుకేమో రచన అంతా కళాత్మకంగా సాగింది.
ఆమె మనిషిగా అనుభవించిన ప్రతి ఉద్వేగాన్ని పాఠకుడు అనుభవించేలా రాయగలడంలోనే ఈ రచన గొప్పతనం ఉంది . చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే చూపు తడికాక తప్పదు. అందుకే ఈ పుటలు జీవంతో తొణికిసలాడాయి. ఆమె వివాహ ఆరంభదినాలూ ముఖ్యంగా యవ్వనం అంతా కష్టాలలోనే గడిచింది. కానీ ఆమె ఎక్కడా సంవయవనం కోల్పోయినట్టు గానీ తన జీవితం పట్ల నిరాశ నిస్పృహలకు లోనైనట్టుగాని కానీ అనిపించదు. తన తండ్రి ఒప్పుకోలు తప్ప మిగతా కటుంబంతో ధిక్కరించి తను కోరుకున్న షియా కైఫీతో జీవితం పంచుకోవాలన్న నిర్ణయం ఆమెని ఓ విశిష్ట మహిళగా తిర్చిదిద్దింది. ముగ్గురు పిల్లల తల్లి (మొదటి సంతానం చనిపోయినా)గా ఆమె ఆర్థిక లేమిని అధిగమించి పిల్లల్ని మంచి జీవితం ఇవ్వగలిగింది.
ప్రఖ్యాత సినీ నటి మానవహక్కుల కార్యకర్త షబానా ఇమె సంతానమే. ఇంకో విశిష్టమైన అంశం ఏమంటే తనకవసరమైన ఆర్థిక అవసరాల కోసం ఆమె కైఫీ మీద ఆధారపడకపోగా తనే చాలా సందర్భాల్లో కైఫీకి అండగా నిలబడింది. అతి తక్కువ వనరులతో తన జీవితానికి కళాత్మకతను ఆమె అద్దింది. జీవితం పెట్టిన చాలా పరీక్షా సందర్భాల్లో ముక్కలైపోయే అవకాశం ఉన్నా గట్టిగా నిలబడింది. ఈ నేపధ్యంలో చాలా గొప్పవాళ్ళతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
వాళ్ళంతా ఎంత గొప్ప వాళ్ళంటే వారి వారి రంగాలకి అంకితమైపోయిన కళాకారులు. తమ కళల ద్వారా సమాజానికి ఎంతో కొంత చేద్దాం అనే తలంపు ఉన్నవారే. వాళ్ళందరి ప్రభావం, స్పూర్తి నాటక కళాకరిణిగా సినిమా నటిగా గొప్ప పేరు సంపాదించుకొడానికి బాగా ఉపయోగపడ్డాయి. సంప్రదాయ ముస్లీం కుపుంబంలో పుట్టిన మహిళలు ఎంత మంది షౌకత్ లా ఉండగలరూ? ఇలానే ఆమె వ్యక్తిత్వాన్ని ప్రత్యేకతను కాపాడుకుంది. కైఫి కొండ పక్కన ఓ చిన్ని కొండగా ఆమె నిలబడింది కానీ అతని నీడలో ఒదిగిపోయిన గుట్టకాదు షౌకత్ !తను కైఫీ కి సరైన జోడినని నిరూపించుకుంది. కర్చలే హం ఫిదా జానో తన్ సాథియో అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో అని కైఫీ రాసిన పాట వాళ్ళ జీవితాలకు కూడా వర్తిస్తుంది. ఓ కవిగా కార్యకర్తగా కైఫీ చేయగలిగిందంతా చేశాడు ఓ భార్య గా కైఫీ చుట్టూ ఓ అధ్ఫుతమైన (కవన)ప్రపంచం సృష్టించడానికి ఓ కవి కవిగా మిగలడానికి షౌకత్ చేయగలిందంతా చేసింది.
ఉర్దూ సాహిత్యానికి షౌకత్ అందించిన కానుక కైఫీ ఆజ్మీ. ఆ పరిపూర్ణ జీవితాల నుంచి మనం చాలా నేర్చుకోవలసి ఉంది. ఈ చారిత్రక సందర్భంలో మొత్తం కమ్యూనిస్టు ఉద్యమం ఎంతో కొంత ఒడిదుడుకులను తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న మలుపుల్లో ఎన్నిత్యాగాలకు సిధ్ధపడాలో బహుశా ఈ పుస్తకం నేర్పే అతి పెద్ద పాఠం. ఈ పుస్తకం చదవడం వల్ల స్వాతంత్ర్య ఫోరాట మలినాళ్ళ సామాజిక పరిస్థితులూ, పాక్షికంగానైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రా భారత రాజకీయాల్లో యాభై అరవై దశకంలో పార్టీ లో కొనసాగిన ఎత్తుపల్లాలూ తెలుస్తాయి. ఈ పుస్తకం చదవడం పాఠకులకు గొప్ప అనుభవం అవుతుంది ఎందుకంటే ఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన కావడమే. ఇందులోని ఘట్టాలు ఏ పటాటోపాలకు పోకుండా చరిత్రను రికార్డు చేశాయి ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితంగా తన తలపుల్లో మిగుల్చుకుంటుంది. అంతేకాక ఇది ఎక్కడా అనువాదం అనే అనుమానం రానీయని వేణుగోపాల్ రచనా శైలి పాఠకుణ్ణి కట్టిపడేస్తుంది. ఆ తలపుల తోవ లోకి అందరికీ స్వాగతం.
Type in English and Press Space to Convert in Telugu |
అలుగు నేత్రంఒకరి కన్నుల తడి
ఇంకొకరి కన్ను మోస్తున్న ఈ దివ్య
సందర్భం కంటున్న కల ఒకటి కావడం
ఎంత కాకతాళీయం... |
డ్రాక్యులా నీడదశాబ్దాల దాహపు రెక్కలు విచ్చుకొని
ఎడారి దేహం
ఒయాసిస్సుల తడి కోసం
వెదుకులాడుతుంది
ఇసుక పరదాల మధ్య స్వప్న కళేబరాల విస్ఫోటన ఉక్కపోతలో జీవితం ఉడికిపోతుంది... |
వారిద్దరూకాలాన్ని
మండించాలి
లేదా
మనమే
మంటలమవ్వాలి... |
సజీవ జ్ఞాపకమై…వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే
తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు
నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన
గాలి... |
డెన్ ఆఫ్ లైఫ్వాళ్ళ పాటల్నీ మాటల్నీ నృత్యాల్నీ అడవినీ అడవి జీవితాన్నీ
ప్రేమించడం నేర్చుకోవాలి
కార్చిచ్చులకు ఆజ్యం పోస్తున్న రాజ్యాన్నీ
రాజ శాసనాల్ని అదే కార్చిచ్చులకు కాన... |
పరిమళభరిత తావుల్లోంచినీకోసం నేను ఎదురుచూసేది
ఓ కొత్త యుధ్ధ వ్యూహం కోసమే కాదు
కొత్త జ్ఞానం పొందడం కోసమే కాదు
సహచరీ!
నీ నవీన జీవన ఆవిష్కరణల్లో
నన్ను నేను భాగం చేసుకుందామని.... |
చూపులుఒక సామూహికత ఎర్రజెండాల ఎగరేసుకొని
ఒకవిప్లవాన్ని నా చూపు
కలగా ధరించింది
... |
బందిష్ప్రతిఘటన ఊపిరిగా నిలబడిన కాశ్మీరంలో
నిషేదాజ్ఞల మధ్యే నినాదాలు పదునెక్కుతాయి
మంచుకోనల్లోంచి లావాలు పెల్లుబుకుతాయి
... |
ఇంతెహా ఇంతెజార్ కీ..నింగి మీద పొడిచిన ఆ నెలవంక
వంపులో ఏదో వెలుతురు కబురు
అతడు
పంపాడేమో
లేకుంటే
ఎందుకలా వెన్నెల ఆమె కప్పుకున్న చాదర్లా
ఆమె పలికే దువాలా ఇలపై వర్షిస్తుంది... |
వెల్తుర్ధ్వనినీవెపుడూ నాకు దూరం కావు
నీ కంటిరెప్పలు గీసిచ్చిన అరణ్య కవాతులు
నీ సాంగత్యాన్ని గుర్తు చేసే స్నేహవీచికలు….... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |