అక్కడ అడవి నెత్తురోడుతోంది. నిత్యం ఎవరో ఒకరు ప్రాణం వదులుతూనే ఉన్నారు. ఈ సారి... అది సోమరు వంతయ్యింది. ఆటపాటల్లో మురిసిపోయే పసివాడు ఉట్టన్నట్టుండి నక్సలైటయ్యాడు. కసిగా గుచ్చుకున్న బయోనెట్ మొన వాడి మొర ఆలకించలేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాలు మరో చిరునవ్వును చిదిమేశాయి.
ఎమర్జెన్సీ కాలంలో మెదక్ జిల్లా గిరాయిపల్లి అడవుల్లో సూరపనేని జనార్థన్‌తో పాటు నలుగురు విప్లవకారులను చెట్లకు కట్టేసి కాల్చిచంపారు పోలీసులు. ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం నియమించిన జస్టిస్ భార్గవ కమీషన్ ఆ చెట్లపై ఉన్న తూటా గుర్తులను సాక్ష్యాలుగా పరిగణించింది. ఇప్పుడా దమననీతిని పట్టపగలు బహిరంగంగా ప్రజలపై ప్రయోగించే వరకు ఎదిగాయి పాలక వర్గాలు. పొత్తిళ్లలో పసికూనను సైతం ఎన్కౌంటర్ చేయగల సమర్థత రాజ్యానిది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే సోమరు హత్య.
చత్తీస్ఘడ్ రాష్ట్రం, బీజాపుర్ జిల్లాలో గత నెల 16వ తేదిన మెటపల్ అటవీ ప్రాంతంలోని గంగలూర్ గ్రామంలో 13 సంవత్సరాల బాలుడిని పోలీసులు ఎన్కౌంటర్ పేర హత్య చేశారు. ఎదురుకాల్పుల్లో గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందాడంటూ ప్రకటించారు. 16వ తేది ఉదయం ఇంట్లో ధాన్యం నూర్పిడి చేసిన అనంతరం వంట కోసం చీమల తుట్టెను తెచ్చేందుకు మిత్రులతో కలిసి వెళ్లాడు సోమరు. ఇప్ప పూల చెట్ల వద్ద చీమల తుట్టెను వెతుకుతుండగా భద్రతా దళాలు తరసపడ్డాయి. వారిని చూడగానే సోమరు మిత్రులు గ్రామంలోకి పరుగెత్తారు. సోమరు కాళ్లకు చెట్ట కొమ్మలు గీరుకోవడంతో తను పరుగెత్తలేకపోయాడు. దీంతో భద్రతా దళాలు సోమరును పట్టుకొని చెట్టుకు కట్టేశారు. మావోయిస్టు అంటూ చిత్రహింసలు పెట్టారు. తుపాకీ బయోనెట్ తో దేహాన్ని పొడిచి... అనంతరం అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఇదంతా స్థానిక ప్రజల సమక్షంలోనే జరగడం గమనార్హం. ఈ హత్యకు పాల్పడిన వారిలో పోలీసు అధికారులతో పాటు మాజీలు కూడా ఉన్నారు. చి త్రహింసలకు గురిచేసి చంపేసిన వారిలో సన్ను పూనెం, మంగళ్, మనీష్‌లను, పోలీసుల అధికారి పాండేలను సైతం గ్రామస్థులు గుర్తించారు. నోరున్న మనుషులు మాట్లాడలేని స్థితి... నోరులేని చెట్టు సాక్ష్యం చెప్పలేని స్థితి. చెప్పినా... అధికారం ముందు న్యాయం గెలుస్తుందా? అనే ప్రశ్న. ఇప్పుడదే జరుగుతోంది.
ఈ హత్యపై సిట్ చే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సోమరు తండ్రి జమీల్ పొట్టం హైకోర్టును ఆశ్రయించాడు. తన కొడును చెట్టుకు కట్టేసి చంపేసిన తరువాత మావోయిస్టుల దుస్తులు తొడిగి, పక్కన 12బోర్ తుపాకీ ఉంచి ఫొటో తీశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామంటూ గ్రామస్థులను బెదించారని తన పిటీషన్లో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన చత్తీస్ఘడ్ హైకోర్టు సోమరు బాడీకి మళ్లీ పోస్టు మార్టం నిర్వహించాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యార్థులతో కూడిన 7గురు సభ్యుల టీడీఎఫ్ బృందం చత్తీస్‌ఘడ్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు డిసెంబర్ 24న హైదరాబాద్ నుంచి బయలుదేరింది. నిజ నిర్థారణకు వెళ్లిన వారిలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కార్యదర్శి, హైకొర్టు న్యాయవాది బల్ల రవీంద్రనాథ్, టీడీఎఫ్ కన్వీనర్ దుర్గా ప్రసాద్, కుల నిర్మూలన పోరాట సమితి ఆంధ్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నజీర్, రాజేంద్రప్రసాద్, రమణాల లక్ష్మయ్య ఉన్నారు. వీరిని 25వ తేది ఉదయం ఖమ్మం దుమ్ముగూడెం వద్ద అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు సాయంత్రానికి చత్తీస్ఘడ్ పోలీసులకు అప్పగించారు. స్థానిక పోలీసులు చత్తీస్ఘడ్ స్టేట్ స్పెషల్ పబ్లిక్ సెక్యురిటీ యాక్ట్‌లోని 8(1), 8(2), 8(3), 8(5) సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. సరిగ్గా ఒక రోజు తేడాతో జగదల్‌పుర్ లీగల్ ఎయిడ్ గ్రూప్ సభ్యురాలు శాలినీ గేరాపై మావోయిస్టుల కోసం పాత కరెన్సీ మార్పిచేస్తోందంటూ అక్రమ కేసుమోపారు.
శాలినీ గేరా శాలిని జగదల్ పూర్ లీగల్ ఎయిడ్ గ్రూప్ ఫౌండర్ మెంబర్. 2013 నుంచి స్థానిక ఆదివాసీలకు న్యాయ సహకారం అందిస్తోంది. ప్రస్థుతం పొట్టం సోమరు తల్లిదండ్రుల పక్షాన హైకోర్టులో కేసును వాదిస్తోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సోమరు మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించే వరకు బీజాపుర్‌లో ఉన్న శాలిని సాయంత్రానికి జగదల్ పూర్ సమీపంలోని గోయల్ ధర్మశాలకు చేరుకుంది. ఉన్నపళంగా ధర్మశాలపై దాడిచేసిన పోలీసులు ఆమె వద్ద రద్దయిన కరెన్సీ ఉందంటూ కేసు బనాయించారు.
ఒక సత్యాన్ని దాచేందుకు రాజ్యం ఎంతకైనా తెగిస్తుందనడానికి ఇదే ఉదాహరణ. నిజనిర్థారణ కోసం వెళ్లిన టీడీఎఫ్ సభ్యుల అరెస్టు, శాలినీ తదితరులపై అక్రమ కేసు బస్తర్‌లో జరుగుతున్న వాస్తవాలు బయటి ప్రపంచానికి తెలియకుండా దాచేందుకే. ఇలాంటి దారుణాలు చత్తీస్‌ఘడ్‌లో నిత్యకృత్యమయ్యాయి. ప్రశ్నకు చోటులేని యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతోంది రాజ్యం.
Type in English and Press Space to Convert in Telugu |
అక్కడ డేనియల్ ఉన్నాడుఅక్కడ బాల్యం భయంలో... యవ్వనం నిర్బంధంలో గడిచిపోతుంది. ఇంటి నుంచి బయటకెళ్లిన పిల్లలు తిరిగి వస్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక... |
బోధనా హక్కు కోసం మరో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్.సాయిబాబా1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట... |
దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజంసామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........ |
మరో ఆదివాసీ యువకుడు...17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువకుడిగా తప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జవాన్లు చనిపోవడానికి కారణమైన అంబులెన్స్ ........ |
పొట్టకూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారుతాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్టయ్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన మనోహర్ శవమై తిరిగి వచ్చాడు. "ఎన్కౌంటర్" కథ రిపీట్ అయ్యింది.... |
సంతకు వెళ్లిన వాళ్లు.. శవాలై వచ్చారుఏకంగా ఇరవై రోజుల నుంచి మృత దేహాలను ఖననం చేయకుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఈ విషయంలో స్పందించకపోవ... |
అధికారం నీడలో.... అంతులేని హింస మోదీ ప్రభుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ సహజ వనరులను వేదాంత, ఎస్సార్, టాటా, జిందాల్ వంటి బహుళజాతి సంస్థలకు కట్టబెడుతోంది. అందుకు...... |
ఆరని మంటలు...2011 మార్చిలో చత్తీస్‌ఘడ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జరిగిన మారణహోమం పోలీసుల పనే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెషల్ పోలీస్... |
హక్కుల కార్యకర్తలను మోటారు వాహనాలతో తొక్కిస్తాడట హక్కుల కార్యకర్తలను రోడ్డు మీద వాహనాలతో తొక్కించాలంటూ వ్యాఖ్యానించడం హంతక రాజ్యం నగ్నంగా ఊరేగుతోందనడానికి నిదర్శనం. ... |
అమరత్వపు జాడల్లో...అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావదినం సందర్భంగా జూలై 18న హైదరాబాద్‌లో జరిగిన రాజ్యహింస వ్యతిరేఖ సభ దృశ్యాలు....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |