రోహిత్‌.. ఉప్పొంగే నినాదం

| సంపాద‌కీయం

రోహిత్‌.. ఉప్పొంగే నినాదం

- పాణి | 18.01.2017 10:34:19pm

ఏడాదైంది. రోహిత్‌ ఆత్మహత్య అనే హత్య జరిగి. ఆయన బాగా తెలిసినవాళ్లూ, తెలియనివాళ్లూ అప్పటి నుంచి ఆయన్ను తెలుసుకుంటూనే ఉన్నారు. మనది అసహజ మరణాల వ్యవస్థ. సహజ మరణాల జాబితా కంటే అర్ధాంతర మరణాలే ఎక్కువ. ఆయన హత్య లేదా ఆత్మహత్య జరిగినప్పటి నుంచి ఆయనకు సమాజం చేరువ అవుతోంది. హిందుత్వం, బ్రాహ్మణిజం, రాజ్యం మనుషులను రద్దు చేసే వ్యవస్థ మనది.

రోహిత్‌ మరణం అసహజ మరణాటపట్ల మనల్ని సెన్సిటైజ్‌ చేసింది. హిందుత్వను, దాని కన్నతల్లి బ్రాహ్మణిజాన్ని మరింత చర్చనీయాంశం చేసింది. ఈ ఏడాదిగా దేశమంతా రోహిత్‌ మరణానికి కారణమైన కులం గురించి ఆలోచిస్తోంది. ఉనాలాంటి అతి ముఖ్యమైన వ్యక్తీకరణ ముందుకు వచ్చింది.

ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవీ ప్రేమ, ప్రకృతి అని రోహిత్‌ అన్నాడు. తన తాత్వికత చాలా సరళమైందని కూడా ఆయన చెప్పాడు. పరమ మూర్ఖమైన, అత్యంత మలినమైన వాదాలు రెండు. మతం, జాతీయవాదం. యుగయుగాల నుంచి హింస రచనకి తిరుగలేని మార్గాలుగా రుజువైనవి. నేను ఏవగించుకొనే పెడ ధోరణులుాదురాశ, సంఘ బహిష్కారం, సామ్రాజ్యవాద, ఆధిపత్య లక్షణాలు. నేను నా ప్రాణాలను అర్పించి అయినా చూడాలనుకున్నవీ కారుణ్యం, చైతన్యం అని కూడా అన్నాడు. ఆయన తాత్వికత సరళమైందేగాక అది ప్రేమ, ప్రకృతి వలె చాలా శక్తివంతమైనది కూడా. మనుషులందరూ కలిసి నిర్మించుకోవాల్సిన ఒక మానవీయ సమాజానికి పునాదిగా ఉండవలసినవి అవి. సంఘపరివార్‌కు మావవీయత అంటేనే చుక్కెదురు.

రోహిత్‌ మరణం తర్వాత సంఘపరివార్‌ భావజాలం మన సమాజంలో ఎన్నెన్ని రూపాల్లో, ఎక్కెడెక్కడ ఎలా వ్యాప్తిలోకి వస్తుందో, ఉనికిలో ఉంటుందో తెలుసుకోవడంపట్ల అందర్నీ అప్రమత్తం చేసింది. అది విశ్వవిద్యాలయాల్లో, చట్టసభల్లో, రాజ్యంలో తలదాచుకొని వేయి ఏనుగుల బలం సంపాదించుకుంటుంది. ఎక్కడ భిన్నమైన ఆలోచనలు ఉన్నా అణిచివేస్తుంది.

అనేక విశ్వవిద్యాలయాల్లో దళిత, ప్రగతిశీల శక్తులకు-సంఘపరివార్‌కు మధ్య గీతపడిపోయింది. ఇదొక తీవ్రమైన సంఘర్షణ. తప్పనిది. సమాజమంతా విస్తరిస్తున్నది. రోహిత్‌ మరణం దగ్గరి నుంచి జాతీయత బోనులోనే ఉన్నది. అయినా దేశభక్తిని అడ్డం పెట్టుకొని పెద్దనోట్లను రద్దు చేశారు. హిందుత్వం, దేశభక్తి కేవలం సంఘపరివార్‌ పరమ భావనలే కావు. ఈ దేశ బూర్జువావర్గ ప్రయోజనాల కోసం ముందుకు తెచ్చిన గడ్డు వాస్తవాలు. దోపిడీ ఊసు లేకుండా దేశభక్తి ముందుకు వస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియకుండా జాతీయత మత్తుమందుగా ఆవహిస్తుంది.

రోహిత్‌ స్మరణలో కులాన్ని, మతాన్ని, దేశభక్తిని గురి చూడాలి. సంఘపరివార్‌ వ్యతిరేకంగా మానవతను ముందుకు తేవాలి. మానవ విలువలు సంఘపరివార్‌ పదఘట్టనల కింద నలిగిపోకుండా, దాని ఉచ్చులోపడి మలినపడకుండా కాపాడుకోవాలి. రోహిత్‌ కోసం ఎలుగెత్తే ప్రతి నిదానం కులం, మతం, రాజ్యముపై తిరగబడాలి.

No. of visitors : 978
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఆత్మీయ కలయిక
  కరవాలం చెప్పిన రహస్యం
  కాశ్మీరు మనది!
  మంచి కథ ఎప్పుడూ పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది
  అక్షర సాహసులకు చైతన్య స్ఫూర్తి విరసం
  విరసం తో నా అనుబంధం - అనుభవం
  కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •