ఆది-అంతం

| సాహిత్యం | క‌విత్వం

ఆది-అంతం

- సు.దే.చె | 18.01.2017 11:01:43pm

పొంగ మంచు ఎముకలను కొరుకుతుంటే
పచ్చని చెట్లు నడుమ కీచకుని చేతిలో
చైతన్య శబ్ద తరంగాలు చనిపోతూ
మరో సమాజ స్థాపిత స్వప్నాని
నిశబ్దంగా గుండెల్లో రగిలిస్తుంటే
అవే వృక్షాల నీడలో
రాలిన ఆకులను పోగేసుకొని
మార్పు కొరకు
చెకుముఖి రాయిని-తోళ్ళు ముక్కను
రాపిడి చేస్తుంటే
నేలరాలిన అమరత్వ వేగుచుక్కల
ఎండిన రక్తకణాలు
భగభగ మండుతున్నాయి.
కళ్లల్లో తిరిగిన యేటిపాయ సుడులు
యాదికి తెచ్చెను
గజ్జెకట్టి ఉవ్వెతున్న గెంతుతూ పాడుకున్న
విషాద జాడల పాదముద్రలను.
కోయిల కూతలో
చావు కేకల రాగాలాపన ధ్వనిస్తుంది.
కానలో ఎమర్జెన్సీ అర్థం చేసుకున్న
తుమ్మెద
పుప్పొడి సేకరణకు సెలవు ప్రకటించింది.
అడివంటే పచ్చని సోయగమే కాదు
అందులోనే నిరంతరాయంగా
దోపిడీ వ్యవస్థకు ఫ్రిక్షన్ పుట్టుకొస్తుంది
అడవిలోనే అనంతమైన వాటికి
ఆది-అంతం రచింపబడతాయి.





No. of visitors : 981
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆలోచించడం నేరం..

సు.దే.చె | 02.01.2017 11:22:05pm

ఈ దేశంలో నడిచేటప్పుడు జాగ్రత్త నీవు నడిచిన త్రోవను తరుముకుంటూ వస్తారు నీ మేధస్సును తూనిక వేస్తారు...
...ఇంకా చదవండి

ఎలియాస్

సురేంద్ర | 04.02.2017 02:44:42am

ఒకానొక రోజు రేడియోలో ʹఉపగ్రహాలు నల్లమల అడవిలో ఖనిజాల సంపత్తిని తెలియపరిచాయి. వాటిని వెలికితీయడం కొరకు ప్రభుత్వం అధ్యాయన కమిటీని నియమించడం జరిగింది ʹ అంటూ .....
...ఇంకా చదవండి

నాలో నేనే తొంగిచూస్తే

సు.దే.చె | 05.04.2017 11:58:04pm

అప్పుడప్పుడు నాలో నేనే తొంగిచూస్తే గుండె లోగిలిలో మనస్సు పూతోట యోగక్షేమమును అడిగి తెలుసుకుంటుంటాను...
...ఇంకా చదవండి

సూధ్రుడెవడు?

సు.దే.చె | 04.05.2017 11:05:13am

వాడు వాడే సూధ్రుడిని అతిసూధ్రునిగా విభజించిన వాడే కదా.....
...ఇంకా చదవండి

రక్తం గోడపై...

సు.దే.చె | 18.03.2017 12:32:21pm

ఊసల వెనుక,గాఢమైన చీకటి గదిలో థర్డ్ డిగ్రీ లయబద్ధమైన చిత్రహింసలకు రక్తం గోడపై అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ గుర్తులు. సమసమాజ నిర్మాణం కొరకు సమస్తమూ వీడి అడవి బాట ప...
...ఇంకా చదవండి

ఎ(క)లక్షన్...

సురేంద్ర దేవ్ చెల్లి | 19.05.2018 08:29:31am

ఇకపై నోటుకు ఎన్ని ఓట్లు పడ్డాయో రేష్యో చెప్పాలి క్రికెట్ బెట్టింగ్ జోరున్న దేశంలో ఇంతకన్నా ఎట్లా చెప్పను?......
...ఇంకా చదవండి

చెరగనివి నీడలు మాత్రమే...

సు.దే.చె | 05.12.2017 11:49:32pm

నీడలు నల్ల రంగునే పూసుకుని మన మధ్య తిరుగాడడం ఎప్పటి మాటో! నీడలు వెలుగున్నప్పుడే పుడతాయని ʹఅంధకారంలో షాడో డైస్ʹ అని చెప్పినవాడు ఎటుపోయాడో? బహుశా కాకమీదున.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •