ఫిడెల్ అలజాండ్రో కాస్ట్రో రుజ్

| సాహిత్యం | క‌విత్వం

ఫిడెల్ అలజాండ్రో కాస్ట్రో రుజ్

- వెంకటకృష్ణ | 18.01.2017 11:08:43pm

నిర్మించిన వెలుతురు ను
ఏ పెరగాలీ ఆర్పకుండా
వేలచేతులై కాసినవాడు
నేడు నిదురించెను సుఖనిద్ర
తరతరాల చీకటి తన యెదుటా
తరగని చీకటి తీరం యెదుటా
కత్తులు దూసిన క్షణాలను వెంటాడిన వాడు
నేడు నిదురించెను వీరనిద్ర
ఆరువందల నలవై సార్లు
కత్తివాదర మీద నడచీ
బోనుకు సవాలై నిలిచిన క్యూబా సింహం
నేడు నిదురించెను సాహస నిద్ర
క్రాంతి ని కలగన్న గ్రాన్ మా దండులా
బటిస్టా అంధకారంపై వాలిన భానుకిరణాల్లా
శాంటియాగో డీ క్యూబా ప్రస్థానాన్ని
హవానా లో ముగించిన విప్లవ నౌక
నేడు నిదురించెను ధీర్ఘ యుధ్ధనిద్ర
కల్లోల కరేబియన్ జలధి పై
స్వేచ్ఛా ఛాయలు పరచాలన్న
తన కలే చారల డేగ డొక్క లో బళ్లెమైన
వాడి, నేడు నిదురించెను శాశ్వత నిద్ర
చరిత్ర చీకటి కోణం మీద
ప్రతిఘటన ల రంగులద్దిన కాస్ట్రో
ఈస్ట్ అండ్ వెస్ట్ యిండియన్ హృదయం పై
నిలిచిన లైట్ హౌస్ యీ ఫిడెల్
వర్తమాన సామ్యవాద ఆచరణలో
వాస్తవికతాధార యీ అలెజాండ్రో
దక్షిణ అమెరికా స్థానీయ సార్వభౌమత్వానికి
ప్రతీక కదా యీ రుజ్ రెడ్ స్టార్
నిదురించనీ నిదురించనీ శాంతనిద్ర.





No. of visitors : 752
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఫిబ్రవరి - 2020
    తెర ముందు కథ!
    షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
    హిబా కోసం
    నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
    సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
    షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
    విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
    అరెస్టు - అన్‌టచబులిటీ
    విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
    నిర్బంధ ప్రయోగశాల
    అరుణతార జనవరి - 2020

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •