గణిత గుణింతము!

| సాహిత్యం | క‌థ‌లు

గణిత గుణింతము!

- బమ్మిడి జగదీశ్వరరావు | 18.01.2017 11:16:33pm

ʹప్రజలంటే ప్రభుత్వం.. ప్రభుత్వం అంటే ప్రజలు..ʹ అన్నారు మంత్రిగారు.

ʹప్రజల్ని యెప్పుడూ వోట్లుగా చూసే నాయకుల్నే చూసాను గాని.. ప్రజలంటే ప్రభుత్వం అనే మీలాంటి వాళ్ళని ఈ కళ్ళతో కనలేదు.. ఈ చెవులతో వినలేదు.. నా జన్మ ధన్యమైంది..ʹ తడిచిన కళ్ళని తుడుచుకున్నారు రియలెస్టేట్ పాపారావు గారు. ఆయన యీ మధ్యనే మంత్రిగారి చలువ వల్ల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా అవతారం యెత్తారు.

కారు దూసుకుపోతోంది.. కనుచూపు మేరలో వున్న భూమిని చూసి ʹయింత విశాలమైన భూమి వుండి కూడా మనిషి భూమి కోసం వెతుక్కోవడమే విషాదం..ʹ అన్నారు మంత్రిగారు.

ʹబూమ్ గదండీ..ʹ అన్నారు వంత పలుకుతూ పారిశ్రామిక వేత్త పాపారావు గారు. ʹభూమి గదండీ..ʹ అన్నట్టుగా కొత్త పియ్యేగారు అర్థం చేసుకొన్నారు.

ʹఈ భూమి అంతా యెవరిదో..?ʹ మంత్రిగారన్నారు.

ʹప్రభుత్వ భూమే..ʹ అని- మళ్ళీ అంతలోనే సర్దుకొని- ʹమనʹ ప్రభుత్వ భూమే..ʹ రియలెస్టేట్ పాపారావు గారన్నారు. సారీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త పాపారావుగారు.

ʹఅంటే మనదే..!ʹ చిద్విలాసంగా అన్నారు మంత్రిగారు.

ʹతవరిదే..ʹ అన్నారు పారిశ్రామిక వేత్త పాపారావు గారు.

కొత్త పియ్యేగారికి అర్థం కాక బిత్తరి చూపులు చూసారు.

మంత్రిగారికి అందరి జాతకాలూ.. అదే ఫేస్ రీడింగూ తెలుసు. న్యూస్ పేపరు చదివినట్టు యిట్టే చదివేస్తారు. కొత్త పియ్యేని కూడా అలాగే చదివేసారు. హోం మినిస్టరు సతాయింపుకి సర్లే అని పియ్యేగా పెట్టుకోక తప్పలేదు. ప్రైమ్ మినిస్టరుకన్నా పెళ్ళాలు ముఖ్యమని కూడా మంత్రిగారికి తెలుసు. అలవాటు అయ్యేదాకా మనమే అర్థం చేయించాలి.. తరువాత యీ కొత్తలూ లేతలూ యీళ్ళే మాంచి ముదుర్లయిపోతారు.. నీట్లో నీటుగా ఈదే చేపలయిపోతారు.. అని మంత్రిగారు సరిపెట్టుకున్నారు.

ʹప్రభుత్వం అనేది విడిగా వుండదు.. మనమే ప్రభుత్వం. ప్రభుత్వమే మనం. ప్రభుత్వాన్ని నిలదియ్యడమంటే మనల్ని నిలదీస్తారు. ప్రభుత్వాన్ని అభినందించడమంటే మనల్ని అభినందించడమే. ప్రభుత్వం రద్దు అంటే మనం రద్దయి సీటు నుండి దిగిపోవాలి. తొలగిపోవాలి. మనం చేస్తే ప్రభుత్వం చేసినట్టు. మనం చెయ్యకపోతే ప్రభుత్వం చెయ్యక పోయినట్టు. మన యింటిని నడుపుకున్నట్టే మన ప్రభుత్వాన్ని నడుపుకుంటాం. మన యింట్లో మనకు స్వేఛ్చ వుండదా? మనం తినాలంటే వొకరి పెర్మిషను కావాలా..?ʹ మంత్రిగారు చెపుతూనే వున్నారు.

ʹఆహా.. ప్రభుత్వాన్ని సొంత కుటుంబంగా చూసే మీలాంటి వారిని నేను చూడలేదు, యిది నా పూర్వజన్మ సుకృతం..ʹ చెమర్చిన కళ్ళని వొత్తుకున్నారు రియలెస్టేట్.. సారీ సారీ పారిశ్రామిక వేత్త పాపారావు గారు.

కొద్ది కొద్దిగా అర్థం చేసుకున్నట్టు కొత్తపియ్యేగారు గుటకలు మింగారు.

ʹసొంత లాభం కొంత చూసుకోవాలోయ్.. పొరుగువాడికి కొంత సాయపడాలోయ్..ʹ మంత్రిగారు పూర్తి చెయ్యక ముందే ʹమీ పోరుగువాడిగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం..ʹ వల వల కన్నీరు కార్చారు పారిశ్రామిక వేత్త పాపారావు గారు. అంతలోనే ఫోనొస్తే ʹసెటిల్మెంటు చేసేసారా? ఒప్పుకున్నాడా? మంచిది.. వాడికింకా భూమి మీద నూకలున్నాయ్.. గుడ్.. సార్ తోనే వున్నా, శంకుస్థాపన చేయిద్దాం.. ఆ.. సార్ తోనే..ʹ పాపారావుగారు అటు మాట్లాడి యిటు ʹసారీʹ చెప్పారు.

ʹపవర్లో వుండి సంపాదించుకోకపోతే సంపాదించుకోవడం రాని యెధవ అని అనేస్తారు. చేతకాని దద్దమ్మ.. చవట అని కూడా అనేస్తారు. నాకు మాట పడడం అస్సలు యిష్టం లేదు. సరే, ఈ ల్యాండుకు సర్వే నెంబర్లు వేయించి వెంచరు స్టార్ట్ చేయండి.. కొత్త పియ్యేగారి వైఫ్ పేర రిజిష్టర్ చేసేద్దాం..ʹ మంత్రిగారి మాటలకు పారిశ్రామిక వేత్త పాపారావుగారి మాదిరి కళ్ళు చెమర్చి కన్నీళ్లు పెట్టుకున్నారు కొత్త పియ్యేగారు.

కారు ఆపించి దిగిన మంత్రి ఉచ్చ పోసారు.

ʹఇంక ఇక్కడ పెట్రోలై మండుతుంది.. కొత్త వెంచరు వెంటనే స్టార్ట్ చేస్తాను సార్..ʹ పారిశ్రామిక వేత్త పాపారావు గారు మంత్రిగారికి జిప్పు పెట్టబోయారు. కాస్త ఆలస్యమై ఆ అవకాశం మిస్సయ్యారు. అందుకు నొచ్చుకున్నారు కూడా.

మంత్రిగారు కాస్తపక్కకు వెళ్ళగానే ʹఅన్ బిలీవబుల్..ʹ అన్నారు కొత్త పియ్యేగారు.
ʹనువ్వు కొత్త పియ్యేవి మాత్రమే కాదు, కొత్త బినామీవి.. సార్ నిన్ను నమ్మారు..ʹ బోధపరిచారు పారిశ్రామిక వేత్త పాపారావుగారు.

ʹథాంక్యూ..ʹ అన్నారు కొత్త పియ్యేగారు. తన పేరునా తన బంధుగణం పేరునా తన కులపోళ్ళ తరుపునా పెద్దనోట్లని మార్పించి యిచ్చిన సేవాభావం వొత్తినే పోలేదు అనుకున్నాడు. ʹఆయనేదో మీకు వీలునామా రాసి యిచ్చేసినట్టు ఫీలవుతున్నారే..ʹ అని భార్య అంటున్నట్టు లేని గొంతు వినిపించింది. ఇదివరకటి అనుభవాలవల్ల అలా అనిపించింది. ʹరాయక్కర్లేదు, నీడని కూడా నమ్మని యీ రోజుల్లో నమ్ముతున్నారంటే అది మామూలు విషయం కాదు..ʹ అని ఆ కొత్త పియ్యేగారు సరిపెట్టుకున్నారు.

సరిపెట్టుకున్నా యేదో సరిపోవడం లేదు. అదేదో తెలీడం లేదు. ʹఈ వెంచర్ నాది. కాదు. నా పెళ్లానిది. కాదు. నా పెళ్ళాం పేరు మీద వున్నది నాది. పేరే నాది. నా పెళ్లానిది. పేరే. ఊరు? మంత్రిదే!ʹ పరిపరి విధాలా పోయింది కొత్త పియ్యేగారి ఆలోచన. కాని ʹవీడు చస్తే వెంచరు నాదే..ʹ అని కూడా అనుకున్నాక, మనసు కుదుట పడింది. చచ్చిపోయి సొంతమయితే బాగుణ్ణు అని అనుకోవడంలో యెంతో ఆనందం కలిగింది. ʹఈ రియలెస్టేట్ గాడు కూడా పోతే బాగుణ్ణు.. సాక్ష్యం లేకుండా వున్ను.. యిద్దరూ వొకేసారి పోతే బాగుణ్ణు.. వొకేసారి యాక్సిడెంట్లో పోతే బాగుణ్ణు..ʹ అని కోటి సార్లనుకున్నాక తధాస్తు దేవతలు తధాస్తు అనక చస్తారా? అని కూడా నమ్మకంగా అనుకున్నాక, దేవుళ్ళకి మొక్కుకున్నాక, మనసుకేదో తృప్తిగా మరింత స్వాంతన కలిగింది.

కొత్త పియ్యేగారి లాగే బినామీలు అంతా భగవంతుణ్ణి ప్రార్ధించారు. ఎక్కడెక్కడో ప్రార్దిస్తూనే వున్నారు. అన్నలైనా లేపేస్తే బాగుణ్ణు.. అనికూడా అనుకున్నారు. ఆశ పడ్డారు. ఇన్ని పాపాలు చేస్తున్న వీడిని చంపకుండా అడవిలో కూర్చొని అన్నలు యేమి చేస్తున్నట్టో అర్థం కావడం లేదని కూడా గింజకున్నారు. కోట్లకు పడగలెత్తి అమరావతి భూములు మొత్తం మేసేసిన యిలాంటి వాళ్ళని చంపకుండా విప్లవం యెలా వస్తుందని కూడా తిట్టుకున్నారు. అప్పటిలా అన్నలు యిప్పుడు లేరు అని కూడా నిందించారు.

కొత్తపియ్యేగారు ఆశల పల్లకీ దిగి ఆలోచనలను మోసుకుంటూ తిరిగి కారెక్కారు.
మంత్రిగారూ పాపారావుగారూ మాటల్లో పడ్డారు. ఏ మంత్రి యెంత సంపాదించుకున్నాడో దారి పొడుగునా.. ఆ భూమి పొడుగునా మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటూనే వున్నారు. మంత్రిగారు పేపరు తీసి చూసారు. చదువుతూ ʹరైతులూ ఆదివాసీలూ భూపోరాటాలు చేస్తారట.. చేస్తూనే వున్నారు. వీళ్ళ వెనక వాళ్ళ సపోర్టు వుంది. మనుషులు చాలా ఆటవికమై పోతున్నారు.. నాగరిక సమాజం అనుకుంటున్నారో యేమనుకుంటున్నారో?ʹ మంత్రిగారు మధనపడి పోయారు. అది చూసి పారిశ్రామిక వేత్త పాపారావుగారు ʹఅప్పటికీ మొన్నటికి మొన్న ముప్పై యిద్దర్ని వొరిస్సా బోర్దరులో వేసేసినా యెక్కన్నుంచి పుట్టుకోస్తున్నారో..?ʹ అని తెగ బాధ పడిపోయారు.

ʹప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనివాళ్ళు యిలాంటివి చేసి అమాయకుల్ని రెచ్చగొడతారు.. నిజంగా చిత్తశుద్ది వుంటే పబ్లిక్ గా రావాలి.. ఎలక్షన్లలో నిలబడి ప్రజాసేవ చేసుకోవాలి.. ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు నడిపితే యెలా..?ʹ అని మీటింగులో మాట్లాడినట్టు చాలా సందేశాత్మకంగా మంత్రిగారు మాట్లాడుతున్నారు.

ʹఎలక్షన్స్ అంటే గుర్తొచ్చింది.. రెండేళ్ళే వుంది.. ప్రతిపక్షం వాళ్ళు పోయిన సారికన్నా బాగా ఖర్చు చేస్తారు..ʹ పారిశ్రామిక వేత్త పాపారావు చెప్పక ముందే ʹమనమేనా చెయ్యంది..?ʹ మంత్రిగారన్నారు. ʹఅంతకంతా ఖర్చు పెడదాంʹ అన్నారు. ఆమాటకి ʹఓటరు నాకొడుకులు కూడా బాగా రేట్లు పెంచేశారు..ʹ కసిగా తిట్టి చీదరించుకున్నారు పాపారావుగారు.

ʹగవర్నమెంటులో వున్నప్పుడే సొమ్ము చేసుకోవాలి..ʹ అని కూడా అన్నారు. అయినదానికీ కానిదానికీ తల వూపుతూనే వున్నారు కొత్త పియ్యేగారు.

మళ్ళీ భూమి కనిపించింది. కారాపి దిగారు. మంత్రిగారు ఉచ్చ పోసారు. ʹపెట్రోలే..ʹ నవ్వుతూ పారిశ్రామిక వేత్త పాపారావుగారు చూసారు. కొత్తపియ్యేగారు అప్పటికప్పుడు పాతబడినట్టు అర్థం చేసేసుకున్నారు. అభినందన పూర్వకంగా చూసారు.

మంత్రిగారి కనుసైగతో రియలెస్టేట్ పాపారావు గారు కుక్క పిల్లలా పరిగెత్తుకు దగ్గరకు వెళ్ళారు.
గౌరవంగా దూరంగా నిలబడ్డ కొత్తపియ్యేగారు మంత్రిగారి వంక చూసారు. చూస్తూనే వున్నారు. చూడగా చూడగా అతగాడికి- మంత్రిగారికి వున్న వయసూ వ్యసనాలూ రోగాలూ- కూడికలూ తీసివేతలూ గుణింతాలూ భాగాహారాలూ చేయగా శేషం పదేళ్లకు మించి రాలేదు. ʹఈ నాకొడుకు అంతకన్నా యెక్కువ బతికితే యెక్కువే..ʹ అని అతని బుద్దీ జ్ఞానం సహకరించిన మేరకు అనుకోకుండా వుండలేకపోయారు కొత్తపియ్యేగారు.

ʹమధ్యలో వాళ్ళు చంపేస్తే..?ʹ, ʹఅంత అదృష్టమా..?ʹ ప్రశ్నా తనదే. సమాధానమూ తనదే. కొత్త పియ్యేగారి ముఖంలో సంతోషం. ʹఈ నాకొడుకులు చస్తే.. నీకొండకొచ్చి తలనీలాలు సమర్పించుకుంటాను స్వామీ..ʹ అని యేడు కొండలు యెక్కేసి మొక్కేసి మరీ దిగిపోయారు పియ్యేగారు.

మళ్ళీ అంతా కారెక్కారు.

ధన్ మని పెద్ద శబ్దం!

కారు తిరగబడింది. కొత్త పియ్యేగారు క్షణ కాలమే వులిక్కి పడ్డా ప్రమాదం నుండి బయటపడి చూసారు. ఛ.. మందుపాతర కాదు. టైర్ పంక్చరయ్యింది. వుస్సురుమని చూసారు కొత్త పియ్యేగారు. మంత్రిగారూ- పారిశ్రామికవేత్త పాపారావుగారూ బతికి బట్టకట్టారు. ʹపాపి చిరాయువుʹ అని అనుకోకుండా వుండలేకపోయారు పాపం కొత్త పియ్యేగారు. ముగ్గురం పోయుంటే బాగుణ్ణు.. అని కూడా బాధ పడ్డారు.

లేచి దులుపుకున్న కొత్త పియ్యేగారు.. మనసులో అనుకుంటే.. పదే పదే అనుకుంటే.. ప్రకృతి కూడా సహకరిస్తుందని.. అభీష్టం యివాళ కాకపోతే రేపయినా నెరవేరుతుందని.. నమ్మిందే అనుకున్నారు. అతను అలా అనుకున్నవి జరిగాయి. కొన్ని ఆలస్యం కావచ్చు. కాకుండా అయితే వుండదు.. నవ్వుతూ చూసాడు.

కొత్తపియ్యేని చూసి ʹపిచ్చానాకొడుకు..ʹ అని తిట్టుకున్నారు మంత్రిగారు.
ʹనీ కంటేనా..?ʹ అని కొత్త పియ్యేగారు మళ్ళీ నవ్వుతూ చూసారు!

No. of visitors : 1051
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ప్లీజ్.. ʹనోట్ʹ దిస్ స్టోరీ!

బమ్మిడి జగదీశ్వరరావు | 07.12.2016 11:38:55am

ʹమేం దొంగలం కాదు..ʹ అని నిరూపించుకోవడానికి మా దగ్గరున్న ʹఆధార్ʹలన్నీ చూపించాం. గుడ్డా గోచీ విప్పి మొలతాడు తెంపి దిసమొలలతో నిల్చున్నాం. మా పుట్టుమచ్చలు సయితం...
...ఇంకా చదవండి

పిట్ట కథ!

బమ్మిడి జగదీశ్వరరావు | 02.08.2017 01:12:03pm

ఇంతలో ఆకులు రాలాయి!? లేదు.. అవి ఆకులు కావు! పిట్టలు! పిట్టల్లా రాలుతున్నాయి! అతడు వొక పిట్టని చేతుల్లోకి తీసుకున్నాడు. సిద్ధార్థుడిలా నిమిరాడు. పైకి యెగరేసా...
...ఇంకా చదవండి

ఆల్ హేపీస్!

బమ్మిడి జగదీశ్వరరావు | 16.08.2016 12:46:29am

కొత్తగా యేర్పడిన రాష్ట్రం మాది. రెండేళ్ళే అయితాంది. అగ్గువచేసి అలుకగా చేసి చూడొద్దు తమ్మీ.. క్రిమినల్ మంత్రులను మేము ఎంకరేజు గట్లా చేస్తున్నం. అన్ని .......
...ఇంకా చదవండి

సమాన స్వాతంత్ర్యం!

బమ్మిడి జగదీశ్వరరావు | 18.08.2017 12:42:15pm

అన్నిప్రాంతాలకీ సమాన ప్రాతినిధ్యం యివ్వడమంటే స్వాతంత్ర దినాలు జరపడం కాదు, పోలీసు మిలటరీ కవాతులు జరపడం కాదు, తుపాకీలు తిప్పడం కాదు, బూట్ల కాళ్ళని నేలకు తన్నడ...
...ఇంకా చదవండి

పడగ కింద పండు వెన్నెల!

బమ్మిడి జగదీశ్వరరావు | 15.10.2019 05:41:11pm

చెదిరిన చీమలు పాముల్ని కరవబోయాయి! అంతే... ఫిరంగులు పేలాయి! మట్టి రేగింది! మూడురంగులుగా ముచ్చటగా! రాజు యెగరేసిన పావురం కత్తిరించిన రెక్కలతో యెగరలేక ఫల్టీకొట్...
...ఇంకా చదవండి

నిలబడిన జాతి గీతం!

బమ్మిడి జగదీశ్వరరావు | 04.09.2017 09:29:38am

పౌరుల్లో దేశభక్తి యింకా ప్రబలాలి! ప్రబలిపోవాలి! నార నరాన నాటుకు పోవాలి! అసలు పుట్టగానే వేసే టీకాతో కూడా మన దేశభక్తిని చాటుకోవచ్చు! టీకాగా అశోకచక్రం కలిగిన మ...
...ఇంకా చదవండి

కాశ్మీరు మనది!

బమ్మిడి జగదీశ్వరరావు | 02.10.2019 10:13:24am

ʹమేం కాశ్మీరుని చూడలేదు, కాశ్మీరు గురించి మాకు తెలీదు...ʹ చెప్పబోతే- ప్రధాన వుపాధ్యాయులవారు కల్పించుకొని ʹమీరు కాశ్మీరుని చూడకపోయినా పర్లేదు, కాశ్మీరు గురిం...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •