ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

- పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

ʹనారుమడి ʹ
( యెన్నం ఉపేందర్ కవితా సంపుటి పరిచయం )


`
కొన్ని పుస్తకాలకు మరణాలు వుండవు.చదివిన చాలా కాలం తర్వాత కూడా ఆ పుస్తకాలు మనల్ని వెన్నాడుతూనే వుంటే, ఆ పుస్తకాలలోని విషయమో, చెప్పిన పద్ధతో ,చదివినప్పటి అనుభూతో గుర్తొస్తూ ఉంటే-బహుశా ఆ పుస్తకం మంచి పుస్తకమో, గొప్ప పుస్తకమో అయి వుంటుంది.

ఈ కాలపు ఉరుకులు, పరుగుల మధ్యలో కొంచెం తీరిక చేసుకుని మన మన గ్రంధాలయాల ముందు నిలబడి అలా చుసామంటే వేలాది, వందలాది పుస్తకాల దొంతరలోంచి మనల్ని కొన్ని పుస్తకాలు అట్టే లాగేస్తాయి.కొన్ని పుస్తకాలపై మనం తొలిసారి చదివినప్పటి చేతివేళ్ళ ఆనవాళ్ళు , పుస్తకాల వాసనలు ఇంకా అలాగే ఉన్నట్లు అనిపిస్తాయి.

కథలు,నవలలు,అనువాదాలు,నాటకాలు,విమర్శా గ్రంధాలూ..ఎన్నో మళ్ళీ చదవమని మనల్ని తొందర పెడతాయి.వీతన్నిటి మాట ఎలా వున్నా ,కవిత్వం మరింత చనువుగా మనకు దగ్గరై మనల్ని అవహిస్తుందేమో!?

పుస్తకాల దొంతర లోంచి కవితా సంకలనాలు ,కవితా సంపుటాలు,అనువాద కవితలు,వార్షిక కవితా సంకలనాలు,కవితా మాస పత్రికలూ, ఉద్యమ నేపథ్యంగా వచ్చిన కవితాసంకలనాలు , మనల్ని విడిచి వెళ్ళిన ఇష్టమైన కవులు,కవయిత్రుల పుస్తకాలు..ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి.
ప్రతి మంచి కవితా ఏదో చెపుతుంది.ఏమిటో అడుగుతుంది,ఇంకేమిటో చేస్తుంది.కవిత్వం చదవటానికి ముందూ తర్వాత మనం ఏమిటో గమనిస్తే ఆ కవిత్వం ఎలాంటిదో,ఎంతటిదో తెలిసిపోతుంది. అలాంటి పుస్తకాల శక్తి, ప్రభావo పాఠకులకు బాగా తెలుసు.

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవిగా అందరికీ సుపరిచితుడే. ʹకర్రు పుట్టింది ʹ కవితా సంపుటి (2001 ), ʹఎండమావి ʹకథా సంపుటి (2003), ʹ నారుమడి ʹ కవితా సంపుటి (2010 ), ʹకొన్ని వెలుగు నీడలు ʹ కథా సంపుటి వీరి రచనలు.

స్థల కాలాలతో ప్రమేయం లేకుండా అనాదిగా ,సర్వత్రా మానవుడి దుఃఖ బాష ఒక్కటే. దళితుడి,పేదవాడి,సామాన్యుడి గొంతు, గుండె ఒక్కటే.మనిషి గురించి,మన పల్లెటూర్ల గురించి,మనిషి అస్తిత్వం, ఆకలి,పోరాటాల గురించిన తపన ఎక్కడైనా ఒక్కటే. మానవీయత కోసం,మానవీయ విలువలకోసం రచయితలు,కవుల తపనలే వారి రచనలు.

నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం గుమ్మదవెల్లి గ్రామానికి చెందిన ఉపేందర్ ఆనవాళ్ళు ఇంకా ఆ పల్లెటూరిలోనే సజీవంగా వున్నాయనడానికి సక్షమే అతడి తడి కవిత్వం.మైనింగ్ ఇంజనీర్ లో బంగారు పతకం,ఇండియన్ పోస్టల్ సర్వీసు ఉద్యోగం సాధించినా,వీటన్నిటిని మించి జనజీవన పోరాటాలను,సామాజిక సoఘర్షణలను కథలుగా కవితలుగా సజీవ దృశ్యాలుగా నిలపడంలోని శ్రద్ధ, ఆసక్తి వీరికి సాహిత్యం పట్ల గల మక్కువను తెలియ చేస్తాయి.

భార్య కలల్ని గుర్తు పట్టగలిగినవాడు,పిల్లల్ని అమ్మగా,నాన్నగా భావించే సహృదయత కలిగినవాడు కాబట్టే అతడి కవిత్వం లో మనిషి తనపు ఆనవాళ్ళు అడుగడుగునా కనిపిస్తాయి, కదిలిస్తాయి.

ʹకాలం కాని కాలమిది/ సమయమెరుగని గూబల కాలం/తెగి పడిన ఊర పిచుకలు/ఊరొక గర్భస్త పిండం/పొద్దునెవరో మింగారు/ఆడబిడ్డ అనుకున్నారేమో ʹ ( నెత్తురు బొమ్మ )

ʹ పల్లె ఒడ్డు లాంటిది/పడవ ఓ రైతు కూలి/ సముద్రం నేటి పట్నం /ఆకాశం ఓ కొయ్య గుర్రం / సముద్రం ఓ మైదానం / వెరసి ఓ పునరుక్తి ఎలిజీ ʹ ( కవలలు )

ʹ అమ్మా కల్లోలిత ప్రాంతమిది/ కూలిన తాటాకుల గుడిసెల మధ్య/నిన్నటి తాటి చెట్టులా నిలబడలేనుʹ ( అమ్మా ఆకలి )

ʹ ఎన్ని కులాలో ఈ దేశాన /ఆకలిది ఒకే కులం /ఆకలి కావడమే దురదృష్టం /ఆకలి ఓ కనిపించని నిప్పు ʹ( ఊరు మాట్లాడింది )

సూటిదనం స్పష్టత సాధారణ పదాలు ,వ్యావహారిక బాష, క్లుప్తత వీరి కవిత్వానికి బలాన్ని అందాన్ని చేకూర్చాయి.పాఠకులకు సందేశాలు ఇవ్వకుండా, సందేహాలు కలిగించకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని సరళంగా,సూటిగా చెప్పడాన్ని ఈ కవిత్వం లో గమనించవచ్చు.

చిద్రమైపోతున్న పల్లెటూర్లు , విధ్వంసం అవుతున్న నగరాలూ,సాంస్కృతిక పతనం,మాయమవుతున్న విలువలు,మానవ సంబంధాలు,సగటు మనిషి తాలూకు అవస్థలు,ఆదుర్దాలు, ఆశలు,సంఘర్షణలు , పల్లెటూరి ఆనవాళ్ళు,మమకారాలు,మంచితనాలు,మానవీయతను పరిరక్షించుకోవాలనే తపనలు , అనుబంధాలకు ప్రాధాన్యతలు ఈ కవితల నిండా వున్నాయి.

సామాజిక శాస్త్రాల అధ్యనం,సమాజ పరిశీలన, సమాజ పతనం వెనుక కొనసాగే కుట్రలు,పట్టణీకరణ ప్రభావాలు , కాలం తెస్తున్న మార్పులకు సంబందించిన అవగాహనలు ఈ కవిత్వాన్ని బాగా పదును తేల్చాయి.

ʹ నిన్నటి పల్లె గురుతులు/ వాడని వాసనల మల్లెలు/నేటి పట్న వాసనలు/ చెరిపినా చెరగని కిల్లీ మరకలు ʹ( మల్లెలు-మరకలు )అంటున్నా ,ʹ ఒక్కో ఓటు ఒక్కో తాళపు చెవి/అతడు అంగ వస్రాన్ని మిగులుస్తాడు/అయినా అతడు మనలో ఒకడు/ఇపుడు రాజకీయం ఓ ప్యూడల్ తత్త్వం/ సమస్త వృత్తుల బహుజనుల్లారా / రాజ్యమేలేదేప్పుడో?ʹ ( రహదారి ) అంటున్నా, కవి తన సొంత గొంతుతోనే మాట్లాడుతున్నాడని ప్రజా పక్షమే వహిస్తున్నాడని తెలుస్తుoది.

మనిషిని మనిషిల చూడటానికి,గుర్తించడానికి , గౌరవించడానికి సామాజిక వైషమ్యాలను బద్దలు కొట్టక తప్పదు.ప్రశ్నించే తత్త్వం తో బాటూ, పరిశోదించే ప్రజ్ఞ కూడా ఈ కాలపు కవికి అవసరం.సత్య దృష్టి, అంతర దృష్టి వున్నాయి కాబట్టే ఈ కవిత్వం లోని సజీవత ,స్వచ్ఛత చదువరులను వెంటాడుతాయి.

ʹ భూమి విశాలమే కావచ్చు/ నా కేరాఫ్ మా ఊరేʹ( కేరాఫ్ ) అనడం లోనే కవి తత్త్వం తెలుస్తోంది.

వ్యక్తిగత అనుభవం లోంచి పుట్టినా కవితా ఎలా సామాజిక కోణాన్ని సంతరించుకుందో చెప్పటానికీ వాళ్ళ నాన్న గురించిన భావ వ్యక్తీకరణ ఇలా వుంటుంది. కేవలం జ్ఞాపకం లేదా అనుభూతికే పరిమితం కాకుండా ʹ రాజ్యం సరళీకరంచబడింది కదా/ఉచ్చు బాగా బిగిసింది/పొగ రింగులా ఎగిరిపోయిన నాయినా/ నా ముఖం లో కూడా నువ్వు కనిపిస్తావా?/ గ్లోబల్ ముఖాన్ని భరించలేకున్నాను. ʹ ( పొగ రింగు )అనడం లోనే కవి తాత్వికత తెలుస్తోంది.

దశాబ్ది కవిత్వం ( 2001-2010 ) కవితా సంకలనం లోని ఉపేందర్ రాసిన ʹ ఆదివాసీ సంగీతం ʹకవిత అతడి సాహిత్య వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తుంది

ʹ ఇప్పుడిక అడవి వంతు/ అడవి కరెన్సీ గుట్టల్లా కనపడుతోంది./చింత పండు,తేనే,కుంకుడు కాయల దోపిడీతో మొదలు/బాక్సైట్,బొగ్గు,ఐరన్ వోర్ దోపిడీకీ తెర లేచింది/అడవి గర్భాన ఉబికిన చెలమ బాట/ఆదివాసి తెగ ఆరిపోబోతున్న ఆనవాలు/చీమల పుట్టల్లోకి పాముల చొరబాటు ʹ అంటూ ఆ కవితను ఇలా ముగిస్తాడు.

ʹ అడవి కొత్త పాఠం పాటగా చెప్పింది/మూలాల్ని మట్టుపెట్టే మర్మాన్ని విప్పమంది/మైదాన మృగాల్ని ఎదుర్కోమన్నది/ఓ ఆదివాసీఅడవి సంగీతాన్నికనుక్కోమన్నది. ʹ

ఆకలి విలువ, అన్నం విలువ ,మనిషి విలువ ,ప్రాణం విలువ తెలిసిన కవుల కవిత్వం మళ్ళీ మళ్ళీ చదువుకోవడం వల్ల జీవితం లోని సాంద్రత, కవిత్వo లోని ఘాడత మరోసారి అనుభవం లోకి వస్తాయనుకుంటాను.

( ʹనారుమడి ʹ డా!!.వెన్నం ( యెన్నం) ఉపేందర్ కవిత్వం. పాలపిట్ట ప్రచురణ 96 పేజీలు ,ధర 40/-)


No. of visitors : 1234
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

కథల గూటి లోని ఒక మంచి కథ నల్లూరి రుక్మిణి గారి "ఎవరిది బాధ్యత"

పలమనేరు బాలాజీ | 02.12.2019 11:35:29pm

థను శ్రద్ధగా చదివే వాళ్ళకి మానవ మనస్తత్వం లోని వైరుధ్యాలను, సంఘర్షణలను రాజీతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంపద పట్ల.....
...ఇంకా చదవండి

అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ

పలమనేరు బాలాజీ | 17.09.2019 08:46:21am

భారతదేశంలో స్థల కాలాలను బట్టి కులాన్ని బట్టి సామాజిక స్థితిగతులను బట్టి చావుకు అర్థం, విలువ మారిపోతూ ఉంటుంది. అంతో ఇంతో ఉన్నవాడి చావుకి ,గొప్ప వాడి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •