ప‌్రైʹవేటుʹ ప‌రేషాన్‌

| సంభాషణ

ప‌్రైʹవేటుʹ ప‌రేషాన్‌

- కీసరి నర్సయ్య | 19.01.2017 12:35:03am


నేనొక చావు బ్రతుకుల మద్య ఊగిసలాడుతున్న మధ్యతరగతి మనిషిని. ప్రస్తుత పరిస్థితిలో జీవితం జీతాల పరుగుపందెంలో ఉన్నది. ఎందుకంటే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల రేట్లు... కనీస అవసరాలు అనుభవించే క్రమంలో పడుతున్న పాట్లు.. అంతా ఇంత కాదు. దానికి తోడు జీవితంలో పెరుగుతున్న పోటీత‌త్వం. కాలంతో పాటు ప‌రుగెత్తాల‌నే ఆరాటం. ఎంత ప‌రుగెత్తినా వ‌చ్చే అరా కొర జీతం ఆ వేగాన్ని అందుకోలేక‌పోపోతోంది. అవును... ప్ర‌భుత్వ రంగ సేవ‌ల‌న్నీ ప్రైవేటు ప‌ర‌మైపోయాక‌... స‌గ‌టు సామాన్యుడి జీవితం ప్ర‌శ్నార్థ‌కం కాక ఏమ‌వుతుంది?

పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఉంటుంది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలంటే సరి అయిన నాణ్య‌మైన విద్య అంద‌ద‌నే భ‌యం. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవాల్సిన పాలకులే తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు. ఇంకెందుకు పట్టించుకుంటారు దానికి తోడు మొత్తం ఎడ్యుకేషన్ ను ప్రైవేటీక‌ర‌ణ‌ చేయాలనే ఆలోచనతో అసేంబ్లీ లో మాట్లాడుతున్న పెద్దమనుషులను చూసి నవ్వొస్తుంది.

పిల్లలకు మంచి విద్యనూ అందివ్వాలనే కోరికతో కష్టపడుతూ ఐదేళ్లుగా R N shah అనే స్కూల్ లో పిల్ల‌ల‌ను చదివిస్తున్నాను. కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అనిపించినా పిల్లల భ‌విష్య‌త్తును గురించి ఆలోచిస్తూ కష్టపడి చదివిస్తన్నాము. ఈ సంవత్సరం ఎదో ఇంటర్నేషనల్ వారికి అమ్మేశాము మేనేజ్‌మెంట్ మారిందంటూ ఫీజులు ఒక్క‌సారిగా పెంచేశారు. ఈ భారం భ‌రించ‌లేక పిల్ల‌ల చ‌దువు మాన్పించ‌లేము. ఒకవైపు మింగలేక మరోవైపు కక్కలేని అన్న‌ట్లు మారింది ప‌రిస్థితి. పిల్లలకు మంచి చదువు చెప్పించలేకపోతున్నాననే దిగులు. అలా చేయాలంటే అడ్డదారులు తొక్కుతూ సంపాదించాలంటే మనసు ఒప్పుకోదు. ఇలా కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకోవడం తప్ప మరొకటి కళ్ళముందు మెదలడం లేదు.

తమ పిల్లలను ఒకవైపు ప్రభుత్వ పాఠ‌శాలల్లో చదివించలేక, మరోవైపు ప్రయివేటు పాటశాలల్లో చదివించే స్తోమతలేక వక్రమార్గంలో వెళ్లి డబ్బు సంపాదించాలనే ఆలోచనల్లో ఉన్న వాళ్ళను ఎంతోమందిని చూస్తున్నాము ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరిదీ? మనుషులు ఇంత స్వార్థపరులుగా మారుస్తుంది ఎవరు? ఇలా చేసేది ఎవరికోసం? అమాయక ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధి పేరుతో చేస్తున్న అరాచకాలు ఎందుకోసం?

విద్యారంగాన్ని ఫ్రీవేటీకరణ చేస్తే వాటిమీద వచ్ఛే ప‌న్నుల‌తో ప్రభుత్వం లాభపదుతుంది. అలా వచ్చిన ఆదాయంతో ప్రజలకు సేవచెయ్యొచ్చు అనే పాలకుల అలోచనలు ఎంతవరకు సమర్దించవచ్చు. ఇలాంటి ఆలోచన సరైనదని ఎవరైనా చెప్పగలరా? దీనివల్ల ఎవరికీ లాభం? ప‌్రైవేటు వాడికి వేల ఎక‌రాల భూమి క‌ట్ట‌బెట్టి, ప‌న్నులు మిన‌హాయించి ల‌క్ష‌ల్లో ఫీజులు వ‌సూలు చేసుకోమ‌ని అనుమ‌తి ఇచ్చి, పేద విద్యార్థుల‌కు చ‌దువు ద‌క్కకుండా చేసేందుకు సాగుతున్న కుట్ర‌కాదా? ఇది.

పెట్టుబడుల పేరుతొ చిల్లర డబ్భులు పెట్టి, శ్రమ దోపిడీ చేసి, పెద్దమొత్తంలో వచ్చిన డబ్బులో టాక్సెస్ పేరుతొ చిల్లరను ముష్టిగా పడేస్తున్న పెట్టుబడిదారులు, కష్టం చేతకాక ఏసీల్లో కూర్చొని వచ్చే చిల్లరే మహాభాగ్యం అనుకుంటూ పెట్టుబఢీ దారి విధానాన్ని ప్రోత్సహిస్తున్న పాలకవర్గం, అభివృద్ధి పేరుతో జరుగుతున్న అరాచకాలు ఇవే. ఒకవైపు make in india అంటూనే మరోవైపు విదేశీ పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తీరు అంతే. పేద వాడి నోటి కాడి కూడును కొల్ల‌గొట్టి పెద్దొడికి పెడుతుంది.

- కీసరి నర్సయ్య(KNR), ముంబై

No. of visitors : 710
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •