సీమ పోరాడాల్సింది... ప్రత్యేక హోదాకై కాదు- నికరజలాలు, నిధులకై

| సాహిత్యం | వ్యాసాలు

సీమ పోరాడాల్సింది... ప్రత్యేక హోదాకై కాదు- నికరజలాలు, నిధులకై

- అరుణ్ | 04.02.2017 12:52:07am

మరోక్కమారు రాష్ట్రంలో సంధి ప్రేలాపనలు మొదలయ్యాయి. ʹ ప్రత్యేక హోదాʹ అంటూ అప్పుడే స్పృహ వచ్చిన మనిషి నీళ్ళకోరకు అరచినట్టుగా,మరొక్క సారి రాజకీయ పార్టీలన్నీ అరవడం మొదలెట్టాయి. ఎంతో చరిత్రగలదని చెప్పుకొనే పార్టీలు,పోరాటమే తమ ఊపిరి అని చెప్పుకొనే పార్టీలు,దివంగత మహానేతను తప్ప చెప్పుకొనే చరిత్ర లేని పార్టీలకు యిప్పుడు, అప్పుడప్పుడు పైత్యం రోగిలాగా ప్రజలగురించి మాట్లాడే సినిమా నటుని ఆసరా కావాల్సి రావడం విషాదం. మధ్య మధ్య ప్రజల గురించి ట్వీట్లు చేస్తూ, సినిమా షూటింగ్ల మధ్య కాలక్షేపంగా ప్రజలవద్దకు వచ్చే ఆయనకు, తమిళనాడు ప్రజల జల్లికట్టు ఉద్యమం ప్రేరణ కల్గించడం ఒక విశేషం. ఈయనకు . ప్రజాగాయకుడు గద్దర్ తో పాటు,. విప్లవ కారుడు చేగువేరా కూడా ఆదర్శమట. అంతేకాదు ఈ ʹపవర్ స్టార్ʹ కు ఫాసిస్టు,కరడుగట్టిన హిందుత్వవాది,దేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్న మోడీ కూడా మంచి స్నేహితుడు.

ప్రజలకోరకు పోరాటం చేయడం అంటే గబ్బరసింగ్ లో నటన కాదని ఈయనగారు ఎప్పుడు తెలుసుకుంటారో.. చేగువేరా ఆశయాలకు,మోడీ లక్ష్యాలకు,అంతెందుకు ఈయనగారి మిత్రుడు చంద్రబాబు విధానాలకు మద్య వున్నది. మిత్రవైరుధ్యాలు కావని,అవి శత్రు వైరుధ్యాలని చరిత్ర తెలిసిన వారికెవరి కైనా అవగతమవుతుంది. అవి పరిష్కరించడం ఎలాగో దేశంలో ప్రజలకోసం పోరాటం చేస్తున్ననేటి భగత్సింగ్ ల నుండి ఈయన తెలుసుకుంటే మంచిది.

అన్నిటికన్నా అత్యంత విషాదకరమైనది, నేటి యువత,మరీ ముఖ్యంగా రాయలసీమయువత, ఈయన పిలుపుకు స్పందించడం. యిది నేటి యువతలోని తప్పుడు చైతన్యాన్ని స్పస్టపరుస్తూంది. దీన్నిబట్టి రాష్ట్రంలో భావజాలదాస్యం ఎంత తీవ్రంగా వుందో మనం అంచనా వేయవచ్చు.

ప్రత్యేక హోదా పొందేందుకు ప్రాతిపదికలు

ప్రత్యేకహోదా అనే అంశం 5 ఆర్ధిక సంఘం కాలం లో గాడ్గిల్ ఫార్ములా కింద ,వెనుకబడిన రాష్ట్రాలకు ఆర్ధిక సహాయాన్నిఅందించేందుకు నిర్దేశించబడింది.ఒక రాష్ట్రం ప్రత్యేకహోదా పొందాలంటే ఈ కింది ప్రాతిపదికలు రాష్ట్రాలు పొంది వుండాలి.1)పర్వతాలు,గుట్టలు కల్గివుండి,సమతల ప్రదేశం లేని ప్రాంతం.2)జనసాంద్రత తక్కువ కల్గిన ప్రాంతం 3)గిరిజనుల జనాభా ఎక్కువగా వున్నది.4)సరిహద్దు ప్రాంతం5)ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం.

పై ప్రాతిపదికన యిప్పటి మన? రాష్ట్రం ఒక్క 5 వ ప్రాతిపదికను మాత్రమే కల్గి వుంది. అందువల్ల ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదా పొందే అర్హత లేదు. అయితే రాజకీయ కారణాలతో యివ్వకూడదా అంటే,దానికి జవాబు లేదు.గతంలో NDAప్రభుత్వం ఉత్తరాఖండ్ కు ఎవరి సిఫారసు లేకుండా యిచ్చింది కూడా. యిప్పుడూ ఏలినవారు దయతలుస్తే నియమ నిబంధనల తోసిపుచ్చి యివ్వనూ వచ్చు.. కాని యితర రాష్ట్రాలూ అదే డిమాండ్ చేస్తే? అయితే నేడు ప్రత్యేక అర్హత లేదని చెబుతున్న కేంద్రం గతంలో ,2014, జూలై 31 న నాటి కేంద్ర మంత్రి ఇంద్రజీత్ సింగ్ పార్లమెంట్లో ఆంద్రప్రదేశ్ కుʹ ప్రత్యెక హోదాʹ యిచ్చే విషయాన్ని ప్రణాలికా సంఘం పరిశీలిస్తున్నదని చెప్పడం గమనార్హం. మరి ఆ పరిశీలనా ఏమయ్యింది, ప్రణాలికా సంఘం తోసి పుచ్చిందా? వెంకయ్య నుండి జవాబు రావల్సివుంది, వెంకయ్య నాయుడు,అతని సహచరులూ 14వ ఆర్ధికసంఘం అంగీకరించడం లేదని ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రత్యెక హోదాకు ఆర్ధికసంఘానికి సంబంధం లేదనే నిజాన్ని కప్పివుంచలేదు అయినా ʹప్రత్యెక హోదాʹ కల్పనలో ఆర్ధికసంఘ సిఫార్సుల ద్వారా కలిగే లబ్ది కేవలం ఒక ఫార్శమే. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఫథకాలు ,మరియు విదేశీ సంస్థల ఆర్ధిక సహాయంతో నడిచే పథకాలు- వీటి ద్వారా మాత్రమె ʹ ప్రత్యెక హోదాʹ కల్గిన రాష్ట్రాలుభారిగా లబ్ది పొందేది. ʹ ప్రత్యెక హోదాʹ వల్ల ప్రయోజనం లేదా అంటే ఖచ్చితంగా వుందని చెప్పవచ్చు,

ʹకేంద్రం రాష్ట్రాలకు యిచ్చే మొత్తం సహాయంలో 30% ʹప్రత్యేకహోదా ʹ పొందిన రాష్ట్రాలకు,మిగిలిన అన్నిటికీ 70% ఆర్ధిక సహాయం అందుతూంది.

కేంద్ర పథకం ʹ ప్రత్యెక హోదాʹ కల్గిన రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలు

సాధారణ కేంద్ర సహాయం 90% గ్రాంట్లు 30%గ్రాంట్లు

విదేశీ రుణాలు 90% గ్రాంట్లు ʹ 10% గ్రాంట్లు

ప్రత్యెక ప్రణాలికాసహాయం 90% గ్రాంట్లు 30%గ్రాంట్లు

AIBP పథకం 90% గ్రాంట్లు 25% గ్రాంట్లు

కాపిటల్ కాంపోనేంట్ 90% గ్రాంట్లు 25% గ్రాంట్లు

INCENTIVE COMPONENT 90% గ్రాంట్లు 25% గ్రాంట్లు

యింతేగాక,EXCISE,CUSTOMSTAXES,INCOME TAX LAKU 100% మినహాయింపు వస్తూందని అందువల్ల లాభాలులు ఇబ్బడి-ముబ్బడిగా వస్తాయని అంచనా. ʹప్రత్యేకహోదా ʹ సంజీవిని కాదని వాదించే గల్లలూ,సృజనాలను తమ వేల,లక్షల కోట్ల పెట్టుబడులను ఆ హోదా కల్గినా రాష్ట్రాలలోనే ఎందుకు పెట్టారని గల్ల పట్టుకొని అడగవచ్చు.అయితే అంధ్రప్రదేశ్ కు ఆ అర్హత లేదని తెలిసీ,రాదని తెలిసీ అందుకై ప్రజల్ని పురికొల్పుతున్న పార్టీలనూ నిలదీయాలి. రాయలసీమ ప్రత్యెక రాష్ట్రం గా ఏర్పడినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా కలిగే అర్హత వస్తుంది.

ʹ ప్రత్యేక హోదాʹ ఎండమావుల వెంట ప్రజల్ని పరుగేట్టించేందుకు తమిళనాడు జల్లికట్టు ఉద్యమం ప్రేరణ కల్గించడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు,ఉభయ కమ్యూనిస్టులతో సహా, తలలూపడం ఆయా పార్టీల బావదారిద్రానికి పరాకాష్ట. ʹ ప్రత్యేక హోదాʹ పొందడానికి సంబంధించిన ఏ నియమనిబంధనలు మన రాష్ట్రానికి వర్తించవని తెలుసు. అది రాదనీ అందరికీ తెలుసు.( నాడు రాష్ట్రం విడిపోక తప్పదని తెలిసీ ప్రజల్ని తప్పుదోవ పట్టించిన పార్టీలే నేడు ʹప్రత్యెక హోదాʹపిలుపు నివ్వడం యాదృచ్చికమేనా)! కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకోసం ,రేపు రాబోయే ఎన్నికలలో లబ్ది పొందేందుకై పడుతున్న తాపత్రయం తప్ప ఈ డిమాండులో ఏ పస లేదు. అంతో,యింతో తార్కికంగావిన్పిస్తున్న ఒకే ఒకే వాదన ఎన్నికలోల్లో BJP,కాంగ్రెస్, టిడిపి లు యిచ్చిన హామీలు, నాటి క్యాబినెట్ తీర్మానం. దేశ చరిత్రలో ఏనాడూ, ఏ పార్టీ, పదవి లోకి వచ్చాక ,వాటిని అమలు పరచిన దాఖలాలు లేవు. నిజంగా హామీల అమలుపై వుద్యమించాలంటే మన యువతకు బతుకుతెరువు నిచ్చే యింటికో వుద్యోగం ,లేక నిరుద్యోగభ్రుతి గురించి ఎందుకు ఉద్యమాలకు పిలుపు నివ్వరు?

విభజన చట్టంలో లేని ʹ ప్రత్యేక హోదాʹ కై అంగలారుస్తూ, యువతను రెచ్చగొడుతున్న రాజకీయ బేహారులు, చట్టంలో స్పష్టంగా పేర్కొన్న హంద్రీ- నీవా,గాలేరు-నగరినిర్మాణాలు,కడప ఉక్కు కర్మాగారపు ఏర్పాటు గురించి ఎందుకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వరు. ఈ విషయం లో వివిధ పార్టీల కోస్తా నాయకత్వం అంగీకరించదని భయమా?, ,నాడు 120 జి.ఓ. తెచ్చి సీమ ప్రాంత ఆడపిల్లల నోట్లో మన్ను కొట్టి పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీ సీట్లను, కోస్తాకు కట్టబెట్టినపుడు,సీమకు తొలుత కేటాయించిన కేంద్ర సంస్థలను, తర్వాత కోస్తాకు తరలించినపుడు,నేడు హోదా గురించి చెవులు గింగుర్లు తిరిగేలా అరుస్తున్న పవన్ కళ్యాన్ ది,యితర రాజకీయ నాయకులదీ గొంతుక పెగల లేదే? అతను సరే, మిగతా రాజకీయ పార్టీలూ నోరు విప్ప లేదే! ఏం రాయలసీమ ప్రజలు, ప్రజలు కారా?

అసలు యింత హడావుడి చేస్తున్న ʹ ప్రత్యేక హోదాʹ వల్ల రాయలసీమకు వోరిగేదేమిటి. రాయితీల వాళ్ళ పరిశ్రమలు వస్తాయని వూదరగోడుతున్న వాళ్ళు,గత సం. విశాఖ సదస్సులోఅంగీకరించిన MOUలలో , సీమలో ప్రతిపాదించినది కేవలం 4% పెట్టుబడులేనని తెలుసా.పరిశ్రమలు రావాలంటే కేవలం రాయితీలే కాదు,దానికి తగిన మౌలిక సదూపాయాలు ,రవాణ సౌకర్యం, నీటిలభ్యత కావాలనే విషయం ఈ రాజకీయనాయకులకు తెలియదా? తాగడానికే నీళ్ళు లేని చోటా పరిశ్రమలు వస్తాయని ఆశించడం ,ఎండమావుల్లో దాహం తీర్చుకోవడం కాదా! అయినా కోస్తా రాజకీయనాయకుల కబంధ హస్తాలు దాటి, పదిమందికి ఉపయోగపడే ఏ రాష్ట్ర,కేంద్ర సంస్థలూ కోస్టల్ కారిడార్ దాటి రావని చరిత్ర చేపుతూందికదా. యింకా వాళ్ళను నమ్మి మోసపోవడమంటే చరిత్ర నుండి ఏమీ నేర్చుకొని అజ్ఞానులగా,మూర్ఖులుగా మిగిలి పోవడమే

సీమకు కావాల్సింది ఏమిటీ.


దేశం లో అత్యంత వెనుబడిన 52 జిల్లాలో సీమ 4 జిల్లాలు వున్న విషయం సీమ యువతకు తెలుసా. దేశంలో ఎక్కువ రైతంగపు ఆత్మహత్యలలో రెండవ స్థానం అనంతపూర్ జిల్లాదనే విషయం తెలుసుకుంటే మనకేం కావాలో అవగతమవుతూంది. మనకేం కావాలి. నీరూ,నీరూ,నీరూ.మనకున్న వ్యవసాయ యోగ్యమైన భూమిలో కేవలం 13.67% మాత్రమె నీటి సదూపాయ ముండగా(వాస్తవంలో అందులో గత దశాబ్దాలుగా అందుతున్నది కేవలం 7% కే అనేది మరో విషయం)దక్షిణా కోస్తాలో 63.23% భూములకు నీరందుతుంది.. యిక గొప్పగా ప్రచారంచేసుకున్న జలయజ్ఞం పూర్తయ్యాక కూడా, సీమలో వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీరందేది కేవలం30.48% మాత్రమె అని తెలుసుకుంటే మన ప్రాదాన్యతలేమో అర్థమవుతాయి.( 1983 లో ప్రారంబించిన SRBC,తెలుగు గంగ ప్రాజక్టులు యింకా పూర్తి కాలేదంటే, మన పాలకులు, ఏ పార్టీ వారైనా, సీమపట్ల చూపిన ,చూపిస్తున్న వివక్షత అర్థమవుతూంది.) పరిస్థితి అలావుంటే మనమేమో జలదోపిదీ చేస్తున్నట్టు . కృష్ణా జలనిర్వాహణ బోర్డులో తెలంగాణా, మన( సీమ అందులో భాగమేనా?)రాష్ట్రం కలసి కే.సి. కాలువకు కేటాయించిన నీటికంటే ఒక చుక్క నీటిని ఎక్కువగా విడుదల చేయకూడదని తీర్మానం చేసారు. అలా ఎక్కువగా వాడుకున్నట్లయితే అయితే కడప జిల్లా రైతుల పంటలకు ఎందుకు నీరంధడం లేదు?.

నిజంగా జలదోపిడి చేస్తున్నదేవరు?


తెలుగుదేశం ప్రభుత్వపు నోటిముక్క (అదేనండీ,mouthpiece) ఈనాడు ప్రకారమే 2014 లో శ్రీశైలం డాం నుండి సాగర్ కు వదిలినది 859tmcలుకాగా,సాగర్ కు కేటాయించినది కేవలం 263 tmc లు మాత్రమె. ఎవరు జలదోపిడీ చేస్తున్నవారు. అంతెందుకు గత 31 సం.లలో, శ్రీశైలం డాం నుండి కిందికి వదిలినది సగటున సం.నికి 982.32 tmc లు కాగా, బచావత్ కమిటీ ప్రకారం వదలవలసినది (సాగర్ కు 263tmc+కృష్ణా డెల్టా కు 80tmc) 343 tmc లు మాత్రమె. అంటే కృష్ణా, సాగర్ డెల్టాలు, తమకు కేటాయించిన నీటికన్న సం.నికి సగటున 639.32tmc లు ఎక్కువగా వాడుకుంటున్నాయన్నమాట. అందులో యిప్పుడు పట్టిసీమనుండి కృష్ణా డెల్టాకు 80tmcల నీటిని అందించడంతో కృష్ణాడెల్టాకు శ్రీశైలం డాం నుండి నీరు వదలాల్సిన అవసరం లేదనే వాస్తవాన్ని వారు అంగీకరిస్తారా? తదనుగుణంగా సంబంధిత ఉత్తర్వులలో మార్పు చేయాలని, పై రాజకీయ పార్టీలు ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాయా?

శ్రీశైలండాం నుండి కిందికి వదిలే నీరు కృష్ణా, సాగర్ డెల్టా రైతాంగం 3 రెట్లు అధికంగా వాడుకోగా ,యింకా 500 tmc లు ప్రతి సం.సగటున సముద్రంలో కలసి పోతున్నాయి కదా. అంతే కాదు,అత్యాశతో పంటభూములనూ నాశనం చేస్తూ ,చేపల చేరువల నింపుతారే గాని సీమకు గుక్కెడు తాగు నీరు యివ్వడానికి ఈ రాజకీయ పార్టీ వుద్యమించదేందుకు? యిక్కడ అనంతపూర్, కర్నూల్ పశ్చిమ ప్రాంతం మండలాలు, కడప ,చిత్తూర్ జిల్లాలలో కొన్ని మండలాలలో తాగు నీరు లేక లక్ష్యకు పైగా ప్రజలు వలస పోతుంటే ʹ ప్రత్యేక హోదాʹకై రకరకాల విన్యాసాలు చేస్తున్న పై రాజకీయ పార్టీలు ఎన్నడూ సీమ తాగు నీటికి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు సరికదా, కనీసం సీమ ప్రాంతం లో దీర్గకాలిక ఉద్యమాలు నిర్వహించాలేదే! అలా వృధాగా సముద్రం లో విడిచే నీటికి కారణమై, సీమప్రాజక్టు లైన SRBC,తెలుగంగ లకు కేటాయించిన నికర జలాలనూ వాడుకోకుండా అడ్డుకుంటున్న,సీమకు మరణశాషనమైన జి.ఓ.69 రద్దుకు ఈ రాజకీయ పార్టీలు విజయవాడ లో పత్రికా సమావేశం లో డిమాండ్ చేయగలవా?

కృష్ణా నీటినే కాదు వారు మన తుంగభద్రా నీటిని స్వాహా చేస్తున్న విషయం ఎంతమందికి తెలుసు. బచావత్ కమిటీ కృష్ణకు కేటాయించిన తుంగభద్ర నీరు. అదీ సుంకేసుల నుండి21.5+ సుంకేసుల దిగువనుండి తుంగభద్ర- కృష్ణా సంగమం (మల్యాల) వరకు తుంగభద్రలో చేరిన వర్షపు నీరు 10 tmcలు= కేవలం 31.5tmc లు మాత్రమె. అయితే గత 31 సం. లలో, సం.నికి సగటున 166.22tmc ల తుంగభద్ర నీరు సుంకేసులనుండి,మల్యాలవద్ద కృష్ణలో చేరుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు తెల్పుతున్నాయి. అంటే సీమ కోల్పోతున్న తుంగభద్ర నీరు సం.నికి 144.76 tmc లు. ఇప్పటికైనా ,సీమలో నీటినిల్వకై రిజర్వాయర్లు (ఉదాహరణకు గుండ్రేవుల, సిద్దేశ్వరం అలుగు లాంటివి) నిర్మించుకొనేందుకు ఎవరు అడ్డు పడుతున్నారో ప్రత్యేకించి చెప్పాలా?.

ఈనాడు సీమకు నీటి ప్రాముఖ్యత ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు .కళ్ళ ముందు నీరు జలజలా పారుతున్నా,అవి కృష్ణలో కలసి సాగారార్పణమైనా ఏ పార్టీ పట్టించు కొని దుస్థితికి ,మనం కోస్తా(గుంటూర్,కృష్ణా జిల్లాల ) వాళ్ళ తోక పట్టుకొని వేల్లాలడం కారణం కాదా!

గొప్పగా ప్రచారం చేసుకుంటున్న హంద్రీ- నీవా,గాలేరు-నగరి లకు నికర జలాలు లేవనీ, బచావత్ కమిటీ మన రాష్ట్రానికి కేటాయించిన మిగులు జలాలు బ్రిజేష్ కుమార్ అన్ని రాష్ట్రాలకు పంచాడనీ ఎంత మందికి తెలుసు. రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పు నోటిఫై అయితే పై రెండు ప్రాజక్టులకు చుక్క నీరు అందదనీ తెలుసా. అంతెందుకు ఈ నెల 1 7 తేదీ నుండి 4 రోజులు కృష్ణా బోర్డ్ సభ్యులు కర్నూల్ నగరం లో వున్న కాలంలో మల్యాల నుండి హంద్రీ- నీవా కు ఎత్తిపోతల నిలిపివేయడం దేనికొరకంటారు? ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం కాలువ తవ్వకాలకై ఖర్చు చేసి రేపు నికరజలాలు లేక నీరు పారక పోతే దీనికి ఎవరిని నిందించాలి? 2012 లోనే హంద్రీ- నీవా మొదటి దశ పూర్తయ్యిన దంటూ టాం టాం వేసుకొని కర్నూల్ జిల్లా మల్యాల నుండి అనంతపూర్ జిల్లా జీడిపల్లి వరకు నాటి కాంగ్రెస్ మంత్రులు ,చోటా ,బడా నాయకులూ పాదయాత్ర చేసిన విషయం తెల్సిందే కదా. అయితే హంద్రీ- నీవా మొదటి దశ లో అందించాల్సిన నీరెంత. ఆ దశ పూర్తయ్యిందని చెప్పిన 4సం. ల తర్వాత అందించిన సాగు నీరెంత తెలుసా! మొదటి దశ లో అందించాల్సింది 1 లక్షా 98 వేల ఎకరాలుకాగా, పూర్తయ్యిందని డబ్బా కొట్టుకున్న 4 సం. తర్వాత కూడా సాగు నీరందిన ఆయకట్టు కేవలం 13 వేల ఎకరాలు మాత్రమె! యిదీ సీమ ప్రాజక్టుల స్థితి. ఏపార్టీ చరిత్ర చూసినా ఏముంది గర్వ కారణం అన్నట్టు,,నాడు కాంగ్రెస్ పార్టీ చేసిన జిమ్మిక్కులకే నేడు తెలుగుదేశం తలపెడుతూంది. జీడిపల్లి నుండి కుప్పం కు ప్రధాన కాలువ త్రవ్వి కుప్పం లో పిడికెడు నీళ్ళు పోసి రెండవ దశ పూర్తయ్యిన్ధంటూ ప్రచారమ్ చేసుకొని 2019 ఎన్నికలలో వోట్లు కొల్లగొట్టే ప్రయత్నమిది. ప్రధాన కాలువకు పంట కాలువలు లేవు, సాక్షాత్తు ఉప ముఖ్య మంత్రి నియోజక వర్గం లో 106 చెరువులు నింపుతామని చెప్పి సం. గడచినా అతీ గతీ లేదు. పోగా ఆ ప్రతిపాదనలను తిరస్కరించి పంపారు కూడా? అయినా సీమ మంత్రులకు బుద్దివోస్తున్దంటారా? అంతేకాదు పంటలు ఎండి పోతూంటీ గాజులదిన్నె ప్రాజక్టుకు నీరు అందించారని సీమ ఇంజనీర్లపై ఆగ్రహించిన ఇంజనీర్-ఇన్-చీఫ్, అదేవిధంగా తమకు కేటాయించిన నీటి కంటే 3రెట్లు అధికంగావదలినా సాగర్, కృష్ణా డెల్టాల ఇంజనీర్లను ప్రశ్నించే దమ్ము పై ఇంజనీర్-ఇన్-చీఫ్ కు వుందా అని ప్రశ్నిస్తున్నాం. యిక నిదులాంటావా! హంద్రీ నీవపూర్తి కావడానికి దాదాపు 4 వేల కోట్ల రూ. అవసరమైతే 2015-16 బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.212 కో. మాత్రమె. 1983 లోనే ప్రారంబించిన SRBC, తెలుగుగంగా నీటి ఫథకాలు,23సం.గడిచినాపూర్తిగాకపోవడానికి రాష్ట్రాన్ని పాలించినా అన్ని రాజకీయ పార్టీలూ.ప్రశ్నించని ప్రతిపక్ష పార్టీలూ కారణం కాదా?

గాలేరు-నగరి గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. 38tmc లతో 2ల 60 వేల ఎకరాలకు నీరంధించాల్సిన ఈ పథకం నవంబర్1988 నుండి నత్త నడక నడుస్త్తోనే వుంది.యింకా 5వేల 250 కో.రూ. అవసరమైన దీనికి 2015-16 లో కేటాయించినది కేవలం170 కో.రూ. మాత్రమె.ఇప్పటికే ముక్కారు పంటలూ. చేపల ,రొయ్యల చెరువుల తో కళకళలాడుతున్న కృష్ణా డెల్టా కు 5 వ స్తిరీకరనకై రూ.1600 కోట్లతో సం. లోనే పట్టిసీమ పూర్తిచేసి గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు కు గుక్కెడు నీళ్ళను నోచుకొని సీమ ప్రాజక్టులంటే ఎంత నిర్లక్ష్యమో ? కేవలం తమ పార్టీ MLA గడ్డం తీసియ్యడానికో, తన ప్రత్యర్థిని కించపరిచెందుకో తాత్కాలికంగా గండిపేటలో నీళ్ళు పోసి ఎవర్ని మోసం చేయాలనుకుంటున్నారు? అవి గాలేరు-నగరి నుండి వచ్చినవి కాదనీ, SRBC నుండి పారించినవని ప్రజలకు తెలియదను కుంటున్నాడా?

అసలు విభజన సమయంలో సీమప్రజల్ని మభ్యపెట్టి,కోస్తావాళ్ళు పోలవరాన్ని, విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా పెంపుదల,విశాఖ లో IT హబ్ ను కేంద్రంతో హామీ పొందారుతప్ప అప్పటికే 500 కో.రూ.లు ఖర్చు చేసిన,రాయలసీమ కు 165tmc లు నీరందించే దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టైల్ పాండ్ సాగునీటి పథకాన్ని మాత్రం కేంద్రం పూర్తీ చేయాలనే హామీ పొంద లేదు. యిక్కడేకోస్తా నాయకుల కుతంత్రం,సీమప్రాంత నాయకుల తాబెదారుతనం వెల్లడయ్యింది. రెండు ప్రాజక్టులనూ కేంద్ర జాబితాలో చేరిస్తే తమకు ప్రయోజనం చేకూర్చే పోలవరం కు ప్రాధాన్యత తగ్గుతుందనీ, తగినన్ని నిధులు రావనీ సీమ కుపయోగ పడే దుమ్ముగూడెం ను బలిచేసారు. యివన్నీ తెలిసీ సీమ ప్రజలు యింకా వారివెంట నడవడం ఆత్మహత్యా సదృశం గాక మరేమవతుంది.

కేటాయింపులు లేని హంద్రీ- నీవా, గాలేరు-నగరి లకు నికరజలాలను కేటాయించాలని ఉద్యమం చేపట్టే బదులు ,సీమకు ఏమాత్రం పనికిరాని ప్రత్యేక హోదా కై కోస్తా నాయకత్వం వెంట పరుగెత్తడం సీమ బిడ్డలుగా మనకు అవమానం కాదా. సీమ ప్రాంత హక్కులను హరించి వేస్తున్న వారితో, సీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను తమ రాజకీయ ప్రయోజనాలకై కోస్తాకు తాకట్టు పెడుతున్న వారితో, చేతులు కలిపి సీమకు ద్రోహం చేయడం తమకు తప్పుగా తోచడం లేదా అని సీమ యువతరాన్ని ప్రశ్నిస్తున్నాం.

సీమ ప్రజల్ని ప్రత్యేక హోదా ఉద్యమం లో పాలు పంచుకొమ్మని పిలుపునిస్తున్న వారిని ఈ కింది సీమ డిమాండ్లకైమనతో చేతులు కలిపి ఉద్యమం చేపట్టమనండి.

అసలు కోస్తా వాళ్ళతో కలసి వుండాలంటే 1936 లో వారితో మనకు జరిగిన శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలనే డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తవుద్యమానికి పిలుపునివ్వమని పవన్ కల్యాణ్ ను, జగన్ ను, మిగతా రాజకీయ పార్టీలను,విద్యార్థి JAC నాయకులను డిమాండ్ చేయండి. పవన్ ను ట్వీట్లకే పరిమితమయి యువతను రెచ్చేగొట్టే బదులు ఉద్యమంలో ప్రత్యక్షంగాఉద్యమాలలో పాల్గొనమని నిలదీయండి.

అమరావతిని ఫ్రీ జోన్ చేయడమే గాక, యింతవరకు అక్కడ చేసిన నియామకాలను రద్దుచేసి ,జనాభా ప్రాతిపదికన రాయలసీమ కు 40% ఉద్యోగాలు కేటాయించాలి.

విభజన చట్టలో పొందు పరచిన హంద్రీ-నీవా ,గాలేరు-నగరీలకు నికర జలాలు కేటాయించి కేంద్ర నిధులతో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి.

విభజన చట్టలో పేర్కొన్న కడప ఉక్కు కర్మా గారాన్ని వెంటనే చేపట్టాలి.

రాష్ట్రం లో ఏర్పాటు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల కార్యాలయాలో, వైద్య,విద్యా సంస్థలో (రాయలసీమలో జనాభా ప్రాతిపదికన) 40% రాయలసీమలో ఏర్పాటు చేయాలి

గోదావరి జలాలను కృష్ణ కు మళ్ళించడం వల్ల మిగిలిన అదనపు జలాలు (పట్టిసీమ 45tmc లు, పులిచింతల 54tmc లు,చింతలపూడి 34tmc లు)మరియూ శ్రీశైలం కు కేటాయించిన 60 tmc ల కారీ ఓవర్ జలాలను రాయలసీమ ప్రాజక్టులకు నికర జలాలుగా కేటాయించాలి.

ఇప్పటికే DPR తయారు చేయబడి ప్రభుత్వానికి సమర్పించిన గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం వెంటనే చేపట్టాలి.

SRBC,తెలుగు గంగ లకు కేటాయించిన నికరజలాల వినియోగం కై 2013 లోనే ముగ్గురు Enginners-in-chief సిపార్సుచేసిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలి.

కరువు పీడిత అనంతపూర్ జిల్లాలను ఆడుకొనేందుకుకై HLC సమాంతర కాలువ నిర్మాణానికై కర్నాటక ప్రభుత్వం తో సంప్రదింపులు జరపాలి.

కర్నూల్ జిల్లా క్షిమ ప్రాంత ప్రజల అవసరాలను తీర్చేతుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టుదారులకు కేటాయించిన 29.5TMCల నీటిని అందించేందుకై వేదవతి పై ఎత్తిపోతల పథకం చేపట్టాలి.

తుంగభద్ర నుండి వృధాగా కృష్ణలో కలుస్తున్న వరద జలాల వినియోగంకై RDS వరద కాలువను నిర్మించాలి.

సినీ నటుల మత్తులోపడి, స్వార్థ పూరిత రాజకీయ నాయకుల మాయమాటలకు మోసపోయి మీ కాలాన్ని, శక్తిని వృధా చేయొద్దనీ. రాయలసీమ ప్రయోజనాలకై కలసి పోరాడుడాలనీ. మసీ.నీటివాటాకై ,ఉద్యోగ వాటాకై పోరాడాక పోతే భవిష్యత్తు మనల్ని క్షమించదని సీమ యువతీ యువకులు అర్థం చేసుకోవాలనే ఆకాంక్షతో.

No. of visitors : 985
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వీళ్లు చేసిన నేరం ఏంటి?

అరుణ్ | 16.06.2018 10:29:00am

హిందూ ఫాసిజం నగ్నంగా ప్రజల హక్కుల అణచివేస్తున్నప్పుడు, మనవరకు రాలేదు కదా అని మౌనం వహిస్తే ఏం జరుగుతుందో హిట్లర్ పాలన గురించి వీ ముల్లెర్ చెప్పిన మాటలు వాస్...
...ఇంకా చదవండి

ప్రత్యేక హేళన

అరుణ్ | 21.03.2018 10:49:23am

అవును మరిచాను మీడియా తన స్వామి భక్తిని చాటుకుంటూనే వుంది వలసల ,ఆత్మహత్యల తో సీమ దాహం, దాహం అంటూ అంగలారుస్తూనేవుంది, ఆకాశం వైపు చూస్తూనే వుంది అమరావతి నుండి ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •