పని చేసేవాడికి అదెక్కడ ఊడుతుందోనని భయం
అది లేనివాడికి ఎప్పటికీ దొరకదేమోనని భయం
ఆకలి భయం లేనివాడికి అమ్మో తినాలా అని భయం
బండి నడిపేవాడికి నడిచేవాళ్లంటే భయం
పాదచారులకేమో వాడెక్కడ గుద్దేస్తాడోనని భయం
గతమంటే ప్రజాస్వామ్యానికి భయమున్నట్టే
మాట్లాడాలంటే భాషకూ చచ్చే భయం
ఫౌజీ అంటే పౌరులకు భయం
సరిపడా ఆయుధాలు లేవని ఫౌజీకి భయం
అయ్యో యుద్ధాలు తగ్గిపోయాయని ఆయుధాలకు భయం
ఈ కాలం నిండా చుట్టేసుకొన్న ఒకటే భయం..భయం
వీళ్లెక్కడ చంపుకుతింటారోనని ఆడవాళ్లకు భయం
భయంలేని ఆడవాళ్లంటే మగవాళ్లకు మహా భయం
దొంగలంటే భయం, పోలీసులన్నా మరి భయమే
తాళాలు లేని తలుపులంటే భయం
గడియారాలు తిరగని కాలమంటే భయం
టీవీ ముఖం ఎరుగని పిల్లలంటే భయం
నిద్రమాత్రలు లేని రాత్రంటే భయం
మేల్కొల్పే బిళ్లలు లేని పగళ్లంటే భయం
గుంపులంటే భయం, ఏకాంతమన్నా భయమే
ఏమిటోనని భయమే..ఏమయి ఉంటుందోనని భయం
చావాలంటే భయం..బతకాలన్నా భయం..భయం..
Type in English and Press Space to Convert in Telugu |
మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన : రివేరా9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన పై రివేరా ఉపన్యాసం....... |
చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..పుస్తకాల సంచిని గిరాటేసి
రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం
వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు
స్నేహితుల భుజాలపైనుంచి
నవ్వుతూ చూడటమే చివరిచూపు....... |
ఏప్రిల్ పండు II రివేరాపిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,... |
రెప్పని కప్పని నిద్దురఒకే రాత్రిని కప్పుకొన్న మనకి
ఒక్క నిద్దుర చాలదా?
చుక్క కలని పొదువుకోడానికి
ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?... |
నో, ఐ డోన్ట్ లైక్ టమాటటమాట రంగు సరే,
రసాలూరే సరస్సులేమీ..
కొంచెం కరిచిపట్టుకొన్న
మిలమిలా మీనాలేమీ..
పైకి కిందకి మునకలేసే
గత్తరబిత్తర గోళాలేమీ....... |
సాయంకాలం వాన!దుప్పటి కింద, దిండు అడుగున
పిల్లలు చూడకుంటా కప్పెట్టుకొన్న
వరదగూడుని మెలిపెడతావేమో... |
అద్గదీ...అటో ఇటో వేటో పోటో పడిపోవాల్సిందే!
పాలకులంతా ప్రజాస్వామికవాదులై
ప్రజలేమో నియంతలైతే ఏమి చేస్తాం?... |
ఈ రాక్షస గీతి వింటారా?మనం నిలబడిపోయిన చోట నుంచే
మన నడకలను మోసుకెళుతున్నారు
మనం ఆపేసిన రాగాలనే
తీగలుగా సాగిపోతున్నారు
మన గొంతునీ, మన వంతునీ
మనక్కిచ్చేసి వెళుతు... |
సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరావిప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే....... |
యంత్ర భూతమైన ప్రేమలు పత్ర హరితాలు కావాలని..సామాన్యులను అసామాన్య కథానాయకులను చేస్తున్న కాలం ఇది. ఇరాక్, నికరుగువా, పాలస్థీనాల్లో పాల ఫ్యాక్టరీలపై బాంబులు వేస్తున్నవాడినీ, మన గిన్నెల్లో విష క్షీరాలన... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |