సహ్యాద్రి సూరీడు దేవరాజ్‌

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

సహ్యాద్రి సూరీడు దేవరాజ్‌

- అభయ్‌ | 04.02.2017 02:04:13am

విప్లవోద్యమం మరో ఆదర్శవంతమైన భావి భారత విప్లవనేతను కోల్పోయింది. సీపీఐ(మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రమేష్‌ అలియాస్‌ యోగేష్‌ అలియాస్‌ రాయన్నగా సుప్రసిద్ధులైన కొప్పు దేవరాజ్‌ మరణం భారత విప్లవోద్యమానికి తీరని లోటు. కేంద్రంలోని బ్రాహ్మణవాద హిందూ ఫాసిస్టు ప్రభుత్వం, కేరళలోని సోషల్‌ ఫాసిస్టు ప్రభుత్వాలు ఉమ్మడిగా నాలుగు దశాబ్దాలుగా విప్లవోద్యమంలో పనిచేసిన దేవరాజ్‌ అలియాస్‌ యోగేష్‌ (62 ఏళ్ళు), మరో సీనియర్‌ కార్యకర్త అజిత (52ఏళ్ళు)ను గత డిసెంబర్ 24 తేదీన బూటకపు ఎన్‌కౌంటర్‌ చేయించాయి. ప్రజా ఉద్యమాల్లో నిస్వార్థంగా పనిచేస్తున్నవారిని క్రూరంగా హత్యలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ చర్యల్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని మావోయిస్టు పార్టీ పిలుపు ఇస్తోంది.

నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైన రైతాంగ ఉద్యమంలో కోగనూరు దోణప్ప మరణం చాలామంది మేధావుల్ని కదలించి, ఆలోచింప చేసింది. దశాబ్ద కాలం తర్వాత విడివిడిగా విప్లవ భావాలతో ఉన్నవారిని పార్ట్‌టైం యాక్టివిస్టులుగా వివిధ పార్టీ సెల్స్‌గా ఆంధ్రప్రదేశ్‌ పీపుల్స్‌వార్‌ పార్టీ సంఘటితం చేసింది. 1980లో ఇలాంటి పార్టీ సెల్‌లో సభ్యుడిగా దేవరాజ్‌ అలియాస్‌ యోగేష్‌ తన విప్లవ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అణగారిన దళిత కులంలో జన్మించి, ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేస్తున్న దేవరాజ్‌ విప్లవ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించే క్రమంలో ఆయన ఇల్లు ఒక కేంద్రంగా మారింది. పర్యవసానంగా 1985లో పూర్తి కాలం విప్లవ కార్యకలాపాన్ని నిర్వహించేందుకు సిద్ధపడిన 8 మంది వృత్తి విప్లవకారుల్లో సాకేత్‌ రాజన్‌, దేవరాజ్‌లు ప్రముఖులుగా నిలిచారు. చెరుకూరు రాజ్‌కుమార్‌ అలియాస్‌ అజాద్‌ నేతృత్వంలో సాకేత్‌ రాజన్‌, దేవరాజ్‌లతో సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ నైపుణ్యాల్లో సారూప్యతతో ఏర్పడిన ఈ బృందం కర్ణాటక విప్లవోద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. 1985లో పీపుల్స్‌వార్‌ పార్టీ కేంద్ర కమిటీలో ఏర్పడిన సంక్షోభంలో పార్టీలోని అవకాశవాద ముఠాను ఎదుర్కొనడంలో ఈ బృందం కృషి చరిత్రాత్మకమైనది.

1987లో కర్ణాటక రాష్ట్ర కాన్ఫరెన్స్‌లో అజాద్‌ రాష్ట్ర కార్యదర్శిగా, సాకేత్‌ రాజన్‌, కుప్పు దేవరాజ్‌లు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ మహాసభ తీర్మానాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సమీపంలోని ఉత్తర కర్ణాటక ప్రాంత గ్రామీణ ప్రాంతాలైన బీదర్‌, రాయచూర్‌ విప్లవోద్యమ నిర్మాణం దేవరాజ్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగింది. బీదర్‌, రాయచూర్‌, చిత్రదుర్గ, షిమోగా, ధార్వాడ్‌ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు సాగాయి. కైగా అణువిద్యుత్‌ కేంద్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో విద్యార్థులు, మేధావులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వెనుక దేవరాజ్‌ కృషి ఉంది. 1985–87లో పార్టీ అంతర్గత సంక్షోభ కాలంలో ఆవరించిన స్తబ్దతను బద్ధలు చేసి, పార్టీ సభ్యుల్ని రాజకీయంగా, సైద్ధాంతికంగా నిలబెట్టి, తిరిగి అక్కడ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో దేవరాజ్‌ కృషి మరువలేనిది. అదే విధంగా 1991లో తిరిగి దేశవ్యాప్తంగా పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభంలో మైనారిటీ గ్రూప్‌ రాజకీయ, సైద్ధాంతిక, నిర్మాణపరమైన తప్పుడు ధోరణులపై కర్ణాటక రాష్ట్ర కమిటీ డాక్యుమెంట్‌ రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. జాతుల సమస్యపై కర్ణాటక పార్టీలో కన్నడిగుల స్వయం నిర్ణాయాధికార సమస్యపై జరిగిన లోతైన చర్చ పర్యవసానంగా ఒక సంస్థ ఏర్పాటు అయింది. 1995లో కర్ణాటక రాష్ట్ర కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర కమిటీ కార్యదర్శిగాను, పార్టీ ఆల్‌ ఇండియా స్పెషల్‌ కాన్ఫరెన్స్‌లో కేంద్ర కమిటీ ప్రత్యామ్నాయ సభ్యుడుగా దేవరాజ్‌ ఎన్నికయ్యారు. 1997లో ఆయన పూర్తి స్థాయి కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు.

2001లో జరిగిన పీపుల్స్‌వార్‌ పార్టీ 9వ కాంగ్రెస్‌లో కేంద్రకమిటీ సభ్యుడిగాను, నైరుతి ప్రాంతీయ బ్యూరో (ఎస్‌డబ్ల్యూఆర్‌బీ) సభ్యుడిగాను ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే విప్లవోద్యమ నిర్మాణ కేంద్రాన్ని ఉత్తర కర్ణాటక నుంచి మార్చాలనే కర్ణాటక రాష్ట్ర కమిటీ ప్రతిపాదిత డాక్యుమెంట్‌ నిర్మాణంలోనూ, కేంద్రకమిటీలో దాని ఆమోదింప చేయడంలో దేవరాజ్‌ కీలక పాత్ర పోషించారు. మధురై, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు విప్లవోద్యమ కేంద్రం మారింది. 2007లో పార్టీ ఐక్యతా కాంగ్రెస్‌ (9వ కాంగ్రెస్‌)లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర విప్లవోద్యమ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. 2011లో కర్ణాటక, తమిళనాడు, కేరళ–మూడు రాష్ట్రాల కూడలి(త్రి జంక్షన్‌)లోని అటవీ ప్రాంత ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ఏర్పాటు చేసి సదరన్‌ కారిడార్‌ ఏర్పాటును వేగవంతం చేయడంలో దేవరాజ్‌ కీలక భూమిక పోషించారు. పశ్చిమ కనుమల్లో విప్లవోద్యమ పురోగమనానికి దేవరాజ్‌ చేసిన కృషి మరువలేనిది. ఇంగ్లీషు, మలయాళం, తమిళం, కన్నడ, ఆదివాసీ భాషల్లో ఆయనకు మంచి ప్రవేశం ఉంది. పార్టీ అంతర్గతంగా ఆయన భావజాలపరంగా, సిద్ధాంతపరంగా తీవ్ర పోరాటం చేశారు. అనుభవం, నైపుణ్యం, లోతైన సైద్ధాంతిక అవగాహన తగినంతగా లేని స్వీయాత్మక శక్తులతో పడమటి కనుమల్లో గెరిల్లా జోన్‌ నిర్మించేందుకు పూనుకోవడం ఆయన సాహసానికి, దృఢ సంకల్పానికి ప్రతీక. తన నిరాడంబర జీవితంతోను, ఆదర్శవంతమైన వ్యక్తిత్వంతోను, సైద్ధాంతిక, రాజకీయ ముందుచూపుతోను క్యాడర్‌ విశ్వాసాన్ని చూరగొన్న విప్లవ నేత. దేవరాజ్‌ రాజకీయాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడమే ఆయనకు మనమిచ్చే నివాళి.

అభయ్‌, కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి, మావోయిస్టు పార్టీ





No. of visitors : 2051
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    సాహ‌సోపేత జీవితం
    నలబై వసంతాల దండకారణ్యం
    అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
    తారకంగారంటే..
    సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
    అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
    హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
    అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
    దేశీయుడి కళ
    మీరొస్తారని
    బందీ
    ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •