ఎలియాస్

| సంభాషణ

ఎలియాస్

- సురేంద్ర | 04.02.2017 02:44:42am


చుట్టూ పచ్చని అటవీ సోయగము, ఒకవైపు ఆదివాసీ తండా మరొకవైపు అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న పల్లెటూరు. ఈ కుడియెడమలను చీలుస్తూ కొండల్లోంచి ప్రవహించే యేటిపాయ. ఆదివాసీ తండా వైపు సంతలో సంవత్సరం మొత్తం సంత జరుగుతుంది, అందులో లభించే స్వచ్ఛమైన అడవి సంపద కోసం పల్లెటూరి జనం తెప్పల సహాయంతో ఆ యేటిపాయను దాటి కొనుగోలు చేస్తుంటారు. దానికి బదులుగా గ్రామస్థులు పండించే బియ్యం పప్పులు ఇచ్చి తెచ్చుకుంటారు. ఈ పల్లెటూరి యేటి గట్టున వొక టీ కొట్టు ఉంది, అందులో తొలితరం రేడియో ప్రపంచం నలుదిక్కులా జరుగుతున్న విశేషాలు ఈ మారుమూల ప్రదేశానికి చేరవేస్తుంది.

ఒకానొక రోజు రేడియోలో ʹఉపగ్రహాలు నల్లమల అడవిలో ఖనిజాల సంపత్తిని తెలియపరిచాయి. వాటిని వెలికితీయడం కొరకు ప్రభుత్వం అధ్యాయన కమిటీని నియమించడం జరిగింది ʹ అంటూ వార్త ప్రసారమయ్యింది. ఈ వార్త అక్కడ కూర్చున్న వారిలో పెద్ద చర్చకు దారితీసింది. రెండు రోజులు తిరగకముందే అధ్యాయన కమిటీ వాళ్ళు ఉపగ్రహాలు గుర్తించిన అడవి భాగంలో క్షేత్రస్ధాయి పర్యాటనకు వచ్చారు, వారి వెంబడి అటవిశాఖ అధికారులతో పాటు సెంట్రల్ ఫోర్స్ కూడా వచ్చాయి. అధునాతన పరికరాలతో ఖనిజాలు నిక్షిప్తమైన ప్రదేశాని గుర్తించారు భూగర్భ శాస్త్రవేత్తలు, అది ఆదివాసీ తండా క్రిందనున్నట్లు నిర్ధారణకి వచ్చారు. దాంతో అటవీశాఖను ఆ భూమిని సంరక్షించవలసిందిగా కమిటీ సూచించింది. ఇందుచేత అటవీ పరిరక్షణ అంటూ ʹఈ భూమిలో విలువైన దేశ ఖనిజ సంపద ఉంది, కావున మీ తండా ఖాళీ చెయ్యవలసిందిగా ఆదేశిస్తున్నాముʹ అని తెలియజేసారు. ఈ చట్టాల గూర్చి అవగాహన లేని తండా ఆదివాసీలు దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు.

ఎప్పటిలాగే రోజూ అటవీ సంపద కొరకు సంతకు వెళ్ళేవాళ్ళను సిబ్బంది యేటిపాయ దాటడానికి అనుమతించడం లేదు, దాంతో వర్తకులు గ్రామపెద్దకు సమాచారం ఇచ్చారు. ఆయన యేటి గట్టు దగ్గరకు చేరుకున్నారు, ʹఅక్కడ ఆ భూభాగం చుట్టూ ప్రభుత్వం కంచెను నిర్మిస్తున్నదిʹ అని గ్రామపెద్ద ఆ విషయాన్ని గ్రహించి అటవీ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చెయ్యగా ʹపెద్దగారు మా చేతుల్లో ఏమీ లేదు, అంతా ప్రభుత్వ ఆదేశాలు..మా పని చేసుకుపోనివ్వండిʹఅంటూ వాళ్ళు చెప్పారు. ʹమీరందరూ రచ్చబండ దగ్గరకు రండి...ʹఅని పెద్ద అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ʹఅయ్యా...ఇంక ఆదివాసీలు అక్కడ నివసించే వీళ్ళులేదా?ʹ అంటూ వొక గ్రామస్తుడు అడిగాడు. ʹతాతల తరం నుండి మనం వాళ్ళ సంతలో అడవి ఉత్పత్తుల మీద ఆధారపడుతున్నాం..మరి ఇప్పుడు ఏంటి ఈ ఘోరం?ʹ అని మరొక గ్రామస్తుడు అన్నాడు. ʹఈ సమస్య మనకి మనం పరిష్కరించుకునేది కాదు...మన చేతుల్లో కూడా లేదుʹ అంటూ గ్రామపెద్ద తన నిసహాయతను వ్యక్తపరిచాడు.

ఆ రోజు సాయంత్రం పట్టణం వెళ్ళి తిరిగివచ్చిన ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాష్టారు రామమూర్తి గారికి విషయం తెలిసి, మాట్లాడడానికి గ్రామపెద్ద ఇంటికి వెళ్ళారు. ʹనేను విన్నది నిజమేనా పెద్దగారు?ʹ అని రామమూర్తి మాష్టారు అడిగారు. ʹమన చేతుల్లో ఏముంది అంతా పై వాడి ఆట మాష్టారు ʹ అని గ్రామపెద్ద సమాధానం ఇచ్చారు. ʹసరే..రేపు ఆ తండా మనుషులను పిలిచి మాట్లాడండి, మనకి చేతనైనంత సహాయం చేద్దాంʹ అని మాష్టారు వెళ్ళిపోయారు. ఎప్పుడూ లేనిది చీకటిపడ్డాక ఆ తండా దిక్కు నుండి తుపాకీ శబ్దాలు వినిపించాయి, దాంతో ఊరంతా ఉలిక్కిపడి లేచింది. మాష్టారు చేతిలో లాంతరు సహాయంతో యేటి గట్టు దగ్గరకు వెళ్ళి చూసారు, అప్పటికే అక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకుని సిబ్బంది పహారాకాస్తున్నాయి. దాంతో పరిస్థితి అర్థంచేసుకున్న మాష్టారు తిరిగి ఊరిలోకి వెళ్ళిపోయారు. ఇంటికి తిరిగి వచ్చి ఆయన కూర్చుని మౌనంగా ఆలోచించడం మొదలుపెట్టారు.

ʹప్రభుత్వం మూర్ఖత్వంగా వ్యవహరిస్తుంది, అడవిబిడ్డలను అడవి నుండి దూరం చేసే కుట్రను రచిస్తుందిʹ అంటూ మాష్టారు తీవ్రంగా ఆలోచించారు. ఈ సమయంలోనే ఆయనకి తన స్నేహితుడు మహేంద్ర గుర్తుకువచ్చి, ఫోన్ లో జరుగుతున్న అమానుషం గురించి వర్ణించారు. ʹఅయితే నేను ముఖ్యమైన కేసు పనిమీద బయట ఊరికి వెళ్తున్నాను ...మరేం భయం లేదు నా శిష్యురాలుని రేపు పంపిస్తాను ʹ అంటూ పట్టణంలో ప్రముఖ జర్నలిస్టు మహేంద్ర మాష్టారుకి వాగ్దానం చేసారు. ఆ మరుసటిరోజు మొదటి బస్సుకు ఆమె గ్రామానికి చేరుకున్నది. ʹఅమ్మ ...మీరు మా మహేంద్ర పంపిన వ్యక్తి కదాʹ అంటూ మాష్టారు ఆమెను అడిగారు. ʹఅవును అండి...ʹ అని ఆమె మాష్టారుకి నమస్కరించింది. వాళ్ళిద్దరూ ఊరిలోకి నడవసాగారు, అటుగా వెళ్తున్న వాళ్ళు ʹమాష్టారు ...ఎవరీ పట్టణం పిల్ల..?ʹ అంటూ అడగసాగారు. ʹమా బంధువు ఊరు చూడడానికి వచ్చింది ʹ అని మాష్టారు ఆమె వచ్చిన పని గూర్చి దాచిపెట్టారు. ʹమాష్టారు ...మనం ఎప్పుడు ఆ తండానికి వెళ్దాం ʹ అని బంధువు కానీ బంధువు అడిగింది. ʹఎవరిని అనుమతించడం లేదు కావున రాత్రికి ప్రయత్నం చేద్దాం ʹ అంటూ ఆమెకు చెప్పి మాష్టారు స్కూల్ కి వెళ్ళిపోయారు. రాత్రికి వాళ్ళిద్దరూ అడ్డదారి వెంబడి యేటి గట్టు దగ్గరకు చేరుకున్నారు. యేటిపాయ ఈది ఆదివాసీ తండా వైపుకు చేరుకున్నారు.

ఎటుచూసినా అమానుషమే, ఆదివాసీ ఆడపిల్లలను నగ్నంగా నృత్యం చేయిస్తున్నారు,తిరగబడిన ప్రతీ వాడిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.రాక్షస ఆనందం కొరకు పిట్టలను కాల్చిన్నట్లు కాల్చి చంపుతున్నారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అనూహ్యంగా కవ్వింపు తూటాలు చెట్ల చాటున నిలుచున్న వారి ఇరువురిలోంచి దూసుకుపోయాయి. తెల్లవారుజామున సిబ్బంది శవాలను గుర్తించి చేతులు దులుపుకునేందుకు ʹవారి ఇరువురు కూంబింగ్ చేస్తున్నప్పుడు ఎదురుపడిన నక్సలైట్లుʹ అంటూ ఎలియాస్ స్టేంప్ వాళ్ళ మీద వేసి అసలు సమస్యను భూస్థాపితం చేసారు.

No. of visitors : 1005
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆలోచించడం నేరం..

సు.దే.చె | 02.01.2017 11:22:05pm

ఈ దేశంలో నడిచేటప్పుడు జాగ్రత్త నీవు నడిచిన త్రోవను తరుముకుంటూ వస్తారు నీ మేధస్సును తూనిక వేస్తారు...
...ఇంకా చదవండి

నాలో నేనే తొంగిచూస్తే

సు.దే.చె | 05.04.2017 11:58:04pm

అప్పుడప్పుడు నాలో నేనే తొంగిచూస్తే గుండె లోగిలిలో మనస్సు పూతోట యోగక్షేమమును అడిగి తెలుసుకుంటుంటాను...
...ఇంకా చదవండి

ఆది-అంతం

సు.దే.చె | 18.01.2017 11:01:43pm

తుమ్మెద పుప్పొడి సేకరణకు సెలవు ప్రకటించింది. అడివంటే పచ్చని సోయగమే కాదు అందులోనే నిరంతరాయంగా దోపిడీ వ్యవస్థకు ఫ్రిక్షన్ పుట్టుకొస్తుంది...
...ఇంకా చదవండి

రక్తం గోడపై...

సు.దే.చె | 18.03.2017 12:32:21pm

ఊసల వెనుక,గాఢమైన చీకటి గదిలో థర్డ్ డిగ్రీ లయబద్ధమైన చిత్రహింసలకు రక్తం గోడపై అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ గుర్తులు. సమసమాజ నిర్మాణం కొరకు సమస్తమూ వీడి అడవి బాట ప...
...ఇంకా చదవండి

సూధ్రుడెవడు?

సు.దే.చె | 04.05.2017 11:05:13am

వాడు వాడే సూధ్రుడిని అతిసూధ్రునిగా విభజించిన వాడే కదా.....
...ఇంకా చదవండి

ఎ(క)లక్షన్...

సురేంద్ర దేవ్ చెల్లి | 19.05.2018 08:29:31am

ఇకపై నోటుకు ఎన్ని ఓట్లు పడ్డాయో రేష్యో చెప్పాలి క్రికెట్ బెట్టింగ్ జోరున్న దేశంలో ఇంతకన్నా ఎట్లా చెప్పను?......
...ఇంకా చదవండి

చెరగనివి నీడలు మాత్రమే...

సు.దే.చె | 05.12.2017 11:49:32pm

నీడలు నల్ల రంగునే పూసుకుని మన మధ్య తిరుగాడడం ఎప్పటి మాటో! నీడలు వెలుగున్నప్పుడే పుడతాయని ʹఅంధకారంలో షాడో డైస్ʹ అని చెప్పినవాడు ఎటుపోయాడో? బహుశా కాకమీదున.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •